గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఇద్దర్నీ కూర్చమంటూ సైగచేశాడు ఇంద్రమిత్ర.
అందులోంచి ఎల్లో కవర్, రెయిన్ కోటు తీసి ఇంద్రమిత్ర టేబుల్ మీద వుంచి అడిగాడు_
"ఇది ఎవరిదో మీరు గుర్తించగలరా?"
అది తనదేనన్న విషయం గుర్తించిన ఇంద్రమిత్ర ఆశ్చర్యంగా అడిగాడు_
"అరే!ఇది నాదే! మీ దగ్గరకి ఎలా వచ్చింది?"
ఫెర్నాండెజ్ అడిగాడు.
"మేం అడిగుతావుమ్ది కూడా అదే! ఈ కోటు హతుడి శరీరం మీదకి ఎలా వచ్చింది?" ఇంద్ర మిత్ర ఆశ్చర్యంగా అడిగాడు_
"అంతే సాదూరాం హత్య చేయబడ్డాడా?"
చిదంబరం ఇంద్రమిత్ర కళ్ళలోకి చూస్తూ సీరియస్ గా అడిగాడు_
"మేం సాదూరాం చనిపోయాడని చెప్పాం అంతేకాని హత్యచేయబడ్డాడు అనలేదే! ఏం అతడిని మర్డర్ చేస్తారని మీకు ముందే తెలుసా?"
ఆ మాటతో ఇంద్రమిత్రకు కోపం ముంచుకొచ్చింది. అయినా తమాయించుకుని చెప్పాడు_
"రెయిన్ కోట్ మీదరక్తం మరకులున్నాయి. పైగా మీరు హతుడి శశ్రీరం మీద ఆ కోటు చూసామంటున్నారు. సాదూరాం నా పేషెంట్. నిన్న సాయత్రం అతడు నా దగ్గరకి వచ్చాడు. తిరిగి వెళ్లేముందు వాన ప్రారంభమవడంతో అతడికి నా రెయిన్ కోట్ యిచ్చాను. కనక సాదూరాం హత్యకి గురై వుంటాడనుకుంటున్నాను"
సర్కిల ఫెర్నాండెజ్ జేబులోంచి ఓ కలర్ ఫోటో బయటకి తీశాడు. దాన్ని ఇంద్రమిత్రకు అందించి చెప్పాడు_
"మీరు చెప్పే సదూరాం యితడేనా?"
అది సాదూరాం మరణించిన తర్వాత తీసిన ఫోటో.
ఫోటోలో అతను కళ్ళు మూసుకుని వున్నాడు. కింద పడడంవల్ల నుదుటికి దెబ్బ తగిలిన చోట రక్తంగడ్డకట్టింది.
ఫోటోవైపు చూస్తూనే ఇంద్రమిత్ర అతడే సదూరాం అన్నట్లు తల వూపాడు.
పెర్నామ్దేజ్ వరసగా ప్రశ్నలు వేయసాగాడు.
"సాదూరాం మేకు ఎలా తెల్సు?"
"అతడు న పేషెంట్.. దాదాపు సంవత్సరం క్రితం అతను నా దగ్గరకి ఒక ప్రాబ్లం తో వచ్చాడు. నేను అతనికి ట్రీట్ మెంట్ చేయడం ప్రారంభించాను. అతనికి వ్యాధి పూర్తిగా నాయమతిమ్ది. నిన్న నా దగ్గరకి వచ్చినప్పుడు ఇక అతడు రావలసిన అవసరం లేదనీ, అతడి మనస్సు యిప్పుడు పూర్తిగా నార్మల్ స్టేజిలో వుందని చెప్పాను."
"ఇంతకూ అతడి ప్రాబ్లం ఏంటీ?"
"సారీ! నేను ఒక మానసిక వైద్యుణ్ణి. నా దగ్గరికి రకరకాల పేషెంట్స్ వస్తారు. తన స్వంత తల్లితండ్రులకు, భార్యకు, స్నేహితులకు కూడా చెప్పుకోలేని సమస్యలు నకు తెలియచేస్తుంటారు. వాటిని కాపాడటం వైద్యుడిగా నా ధర్మం. పైగా న దగ్గరకి వచ్చిన ప్రతి పేషెంట్ కూ అలా అని నేను మాటకూడా యిస్తుంటాను. దయచేసి ఈ విషయంలో నన్ను వత్తిడి చేయకండి."
ఫెర్నాండెజ్ పట్టు విడవకుండా అడిగాడు_
"ప్లీజ్ డాక్టర్! మమ్మల్ని అర్ధం చేసుకోండి.మీరు చెప్పే ప్రతి విషయం మా పరిశోధనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు చెప్పడానికి నిరాకరించే వివరాలలో కేసును మలుపులు తిప్పడానికి, అసలు హంతుకుడిని పట్టుకోవడానికి వుపయోగించే క్లూ మాకు దొరకవచ్చు."
"పరిశోధనకు ఉపకరించే విషయం తెలిసీ దాచి పెట్టడం నేరమనే విషయం గుర్తించుకోండి."
ఆ మాటతో ఓ నిశ్చయానికి వచ్చినట్లు చెప్పాడు ఇంద్రమిత్ర_
"సాదూరాం హొమోసేక్స్ వల్. పెళ్ళికి ముందు అతడకి అనేక మంది మగవాళ్ళతో సంభందం వుంది. పెళ్ళయిన తర్వాత కూడా అతడు సంబంధాల్ని కొనసాగించాడు. తాను హొమోసెక్స్ వల్ నుంచి హిట్రో సెక్స్ వల్ _ అంటే ఆడవాళ్ళతో మాత్రమే సెక్స్ సంభందాలు కొనసాగించే మనిషిగా మరెందుగా ట్రీట్ మెంట్ కోసం నాదగ్గరకి వచ్చాడు."
ఫెర్నాండెజ్ అడిగాడు_
"అసలు సాదూరాం హొమోలా ఎందుకు మారాడు?" తనకు సాదూరాం చెప్పే విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ కొనసాగించాడు ఇంద్రమిత్ర.
సాదూరాంని అతడి తల్లితండ్రులు హాస్టల్ లో చదివించారు. అతను పదో తరగతిలో వుండగా అతడి హాస్టల్ వార్డెన్ తో హొమో సెక్స్ అలవాటయింది. బ్రహ్మచారి అయినా వార్డెన్ హాస్టల్ లో చదువుకునే పిల్లలతో సెక్స్ సంభందాలు కొనసాగించేవాడు. అలా అయిన అలవాటు పెళ్ళి అయి పిల్లలు పుట్టేవరకూ సదూరం మానలేదు."
ఫెర్నాండెజ్ అన్నాడు_
"పోనీ అతడి హొమో ఫ్రండ్స్ వల్ల అతడికి ప్రాణ ప్రమాదం జరిగే అవకాశం వుందా?"
ఇంద్రమిత్ర అర్డంకానట్టు చూశాడు.
"ఐమీన్... మీ దగ్గరకి వచ్చిన తర్వాత సాదూరాం పూర్తిగా మారిపోయాడు. అతడు హొమోలకు దూరమయ్యాడు. ఈ కారణంగా అతనిమీద కక్ష పెంచుకుని,అతని స్నేహితులు అతడ్ని హత్య చేసే అవకాశం లేదా?"
ఇంద్రమిత్ర తల అడ్డంగా వూపుతూచెప్పాడు_
"ఏమాత్రంలేదు. సాధూ తన అలవాట్లు మానుకుని ఆర్నెల్లకు పైగా అయిపోయింది.ఏదన్నా హత్యాప్రయత్నం జరిగితే అర్నేల్లల్లోనే జరిగి వుండేది అంతేకాక అతడు తన స్నేహితుల గురించి కూడా వివరించాడు. అతడు వివరించిన వివరాల్ని బట్టి క్రిమినల్ బి హేవియర్ వున్న స్నేహితులెవరూ అతనికిలేరు. పైగా అతడు బాగా డబ్బున్న వ్యక్తి కూడా కాదు. అతడిని డబ్బుకోసం హత్య చేశారనుకోవడానికి."
