Previous Page Next Page 
లవ్ స్టోరి పేజి 14

అ ఆడదాన్ని ఓ మగాడా  కనక నగ్నంగా చూస్తే ఇక వాడే ఆమెకు కాబోయే భర్త  అనే విషయం. ఇపుడు దీక్షితులు  తనను పూర్తీ నగ్నంగా చూస్తే ఇక వాడే ఆమెకు కాబోయే భర్త అనే విషయం, ఇపుడు దీక్షుతులు తనను పూర్తీ నగ్నంగా చూశాడా లేక సగమే చూశాడా అనే అనుమానం బుర్రను తినేయ సాగింది. పైగా నన్ను చూసి పరుగెత్తి వెళ్ళి పోయిన దీక్షితులు వారందాకా నా కళ్ళ బడలేదు. ఆ తర్వాత ఓ రోజు మా వూరి చెరువులో స్నానం చేయడానికి వచ్చిన దీక్షుతుల్ని పట్టుకున్నాను.
నన్ను చూడగానే దీక్షితులు ముఖం ఎర్రగా అయిపోయింది. అతడు గబగబ చెరువువైపు  అడుగులు వేయసాగాడు. నేను వేగంగా వెళుతున్నా దీక్షుతులుకిఅడ్డంగా నిలబడి "ఏయ్ దీక్షుతులూ! నీతో మాట్లాడాలి."
అని అతడి చెయ్యి పట్టుకుని పక్కనే వున్న మర్రిచెట్టు వెనక్కిలాగాను. దీక్షుతులు తలవంచుకుని నిలబడ్డాడు.
"దీక్షితులూ! చెప్పు ఆ రోజు నువ్వు మంచే కిందకి ఎప్పుడు వచ్చావు?"
దీక్షుతులు మెల్లిగా అన్నాడు_
"నువ్వు పున్నాగచెట్టు తొర్రలోంచి అద్దం తీస్తున్నప్పుడు అక్కడే వున్నా."
"అంతే నన్ను అంతా చూసేశావన్నమాట."
దీక్షుతులు  తలవూపి చెప్పాడు.
"ఆ తర్వాత వానపడింది కదూ!  అపుడు నువ్వు మంచే కిందకి వెళ్ళావు. అపుడు..."
"అఁ! అప్పుడు?"
"మొత్తం చూసేశావా?"
నేను భయంగా అన్నాను.
"దీక్షుతులూ !"
అన్నాను.
దీక్షుతులు చెప్పాడు_
"మన వూరి కట్టుబాటు  ప్రకారం ఒక మగాడు ఇంకో  ఆడదాన్ని అట్లా చూస్తే ఆమెను వాడు పెళ్ళి చేసుకోవాలి."
 భయంగా చెబుతున్న దీక్షుతుల్నీ చూసిన నాకు తర్వాత నవ్వు ముంచుకువచ్చింది.పచ్చిముక్కలాంటి పడుచుపిల్లను ముందు వుంచుకుని నీళ్ళు నములుతూ నిలబడ్డా అతడి భయానికి నవ్వోంచింది.
నేను నవ్వూతూ దీక్షితులు దగ్గరకి వెళ్ళి అతని పెదాలకు నా పెదాలు అందించాను. దీక్షితులు చేతులు అసంకల్పితంగా నా నడుమును పెన వేసుకున్నాయి.
నా జీవితంలో అది మొదటి ముద్దు. నాకు దీక్షుతులు కనిపించటం కూడా అదే చివరిసారి. మ ఇద్దరి సంగతి దీక్షుతుల్నీ వాడి బామ్మర్దివూరికి పంపించేశాడని తెలిసింది.
ఈ సంఘటన జరిగి నాలుగు సంవత్సరాలు అయింది. ఇప్పుడు నాకు మరో వ్యక్తితో పెళ్ళి సంభందం జరిగింది. లగ్గాలు కూడా పెట్టికొవడం పూర్తయింది. ఇంకో నేలరోజుల్లోనా పెళ్ళి.
ఊరి కట్టు బాట్లు ప్రకారం నన్ను నగ్నంగా క్క్ష్హోసిన దీక్షుతులే నాకు అసలయిన భర్త. ఇప్పుడు నేను మరో వ్యక్తిని అన్యాయం చేయలేను"
చివరి మాటలు అమ్తునప్పుడు ఆమె గొంతు దుఃఖంతో వణికింది.
ఆమె సమస్య మొత్తం విన్న ఇంద్రమిత్రకు ఓ విషయం అర్దమయింది. వూరికి కట్టుబాటుగా తనకు తెలిసిన విషయమే నిజం అనుకుంటోంది. అది కేవలం మూర్ఖత్వమూ కట్టుబాటు అనే విషయం ఆమెను నమ్మించగలిగితే చాలు ఆమె మనస్సులోని అపరాధ భవం తొలగిపోతుంది.
తిరిగి మామూలు మనిషి అవుతుంది.
"రెండు మూడు నెలల్లో మీరు మామూలు మనిషి అవుతారు. మీ మనస్సులో ప్రశాంతత చోరవడుతుంది. మీరు మళ్ళీ వచ్చే శుక్రవారం ఓ సారి కలవండి."
గాయత్రి తలవూపి బయటకి నడిచింది. గాయత్రి వెళ్ళిపోయాక ఇంద్రమిత్ర ఐరిస్ ను కాంటాక్ట్ చేశాడు. తనకోసం వెయిట్ చేస్తున్న సర్కిల్ ఫెర్నాండెజ్, ఎస్సై చిదంబరాన్ని లోపలకి పంపమని చెప్పాడు.  
                                                    *    *    *    *   
సర్కిల్ ఫెర్నాండెజ్, ఎస్సై చిదంబరం డాక్టర్ ఇంద్రమిత్ర కన్సల్టింగ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యారు.
ఎస్సై చిదంబరాన్ని ఇంద్రమిత్ర మొదట చూపులోనే గుర్తించాడు. చిదంబరం కూడా ఇంద్రమిత్రను గుర్తించినట్లు కనిపించాడు.
"హాలో డాక్టర్! మనం కలవటం సెకండ్ టైం అనుకుంటా" అన్నాడు చిదంబరం.
ఇంద్రమిత్ర తల వూపాడు.
అతడికి గతంలో జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది.
చిదంబరం తమ్ముడు ఏకాంబరం కానిస్టేబుల్ గా పనిచేస్తుండేవాడు. ఇద్దరూ ఓకే ఫోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసేవారు ఒకసారి నైట్ డ్యూటీ లో వున్న ఏకాంబరం సైకిల్ మీద ఇంటికి పోతుండగా రజాక్ అనే వ్యక్తి అకస్మాత్తుగా దాడిచేసి  ఏకాంబరాన్ని లావుపాటి బండరాయితో తల పగలగొట్టి చంపేశాడు.
చుట్టుపక్కల జనం రజాక్ ను పట్టుకుని  ఫోలీసులకు అప్పగించారు.
గత మూడునెలలుగా సిటీలో రోడ్డు ప్రక్కన నిద్రించే భిచ్చగాళ్ళను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి లావుపాటి బండరాళ్ళతో తలలు పగలకొట్టి చంపుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగా ప్రవేశం చేసినా ఫలితం లేకపోయింది. పైగా అది ఎండకాలం అవడంతో జనం చల్లగాలికి యిల్ల బయట రోడ్డుమీద నిద్రించటం మానేశారు. అదృశ్య హంతుకుడిమీద రక రకాలా పుకార్లు జంటనగారాల్లో షికారు చేశాయి. చివరికి బండరాతి హంతకుడు రజాక్ అనే విషయం పోలీసుల ఇంటరాగేషన్ లో బయటపడింది. రజాక్ న్యాస్థానానికి వచ్చినప్పుడు రంగప్రవేశం చేశాడు ఇంద్రమిత్ర. రజాక్ పిచ్చివాడంటూ వాదించిన లాయర్ వాదనను పరిగణంలోకి తీసుకుంటూ కోర్టు ఇంద్రమిత్రని రజాక్ ని పరిశేలి౦చమని కోరింది.
ఆ సమయంలో పోలీసు డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిన వత్తిడిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఇంద్రమిత్ర తన అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించాడు. రజాక్ మతి స్థిమితం లేనివాడినీ,అతడికి ఏదయినా ట్రీట్ మెంట్ యిస్తే మామూలు మనిషి అవుతాడనీ ఇంద్రమిత్ర తన మెడికల్ రిపోర్ట్లో పేర్కొన్నాడు. కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఫలితంగా మరణశిక్ష పడవలసిన రజాక్ ని ట్రీట్ మెంట్ కోసం మెంటల్ హాస్పిటల్ కు పంపించారు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS