"చేశాను."
"ఎక్కడ భోజనం చేశారు?"
"ఇంటివద్ద నుంచి పెరుగన్నం తీసుకు వచ్చాను. అదే తిన్నాను."
"ఎక్కడ నిద్రపోయారు?"
"కారు సీట్లోనే నిద్రపోయాను."
"శ్రమగా లేదూ?"
"అలా అనుకుంటే జరుగుతుందా, మరి?"
అని ముందున్న అద్దం వైపు చూశాడు బాల్కి. అందులో ఆమె ప్రతిబింబం కనిపించదనే నమ్మకంతోనే చూశాడు. కాని అద్దం చూడగానే దిగ్భ్రమ చెందాడు. అద్దంలో తన ముఖం పడేలా ఆమె చోటు మార్చుకుని కూర్చుంది. అంతేకాదు, తన వంక జాలిగా చూస్తుంది. నవ నాగరికత లో మునిగి తేలే ఈమేనా తనను జాలిగా చూస్తుంది అని అనుకున్నాడు .
మరొక నాడు--
ఆరోజు కవితను ఒకతను నైట్ క్లబ్బు కి ఆహ్వానించాడు. మామూలు ప్రకారం కారులో ఆమెను అక్కడ దించాడు బాల్కి. తరవాత కారుని ఒక పక్కగా ఉంచి, అతను ఒకచోట కూర్చున్నాడు.
క్షణాలు గడిచే కొద్ది ఒక్కొక్క కారుగా ఎన్నో కార్లు వచ్చాయి. పెద్ద మనుషులు కొంతమంది ఒంటరి గానూ, కొందరు స్త్రీలతో నూ కార్లో లోంచి దిగారు. కొంతసేపటి కల్లా తలుపులు మూసి ఉన్నా, మెల్లమెల్లగా పాశ్చాత్య సంగీతం బయటికి వినిపిస్తుంది. బాల్కి ఆలోచనలో పడ్డాడు. 'లోపల ఈ పాటప్పుడు కవిత ఒక్కొక్కరితోనూ డాన్సు చేస్తూ ఉంటుంది. ఆమె ఎందుకిలా చెయ్యాలి? జీవితాన్ని ఇంత నీచంగా ఎందుకు తయారు చేసుకుంది? ఎందుకిలా....?'
"బాల్కి..." అనే పిలుపు విన వచ్చింది. అతను తల పైకెత్తాడు. కవిత వచ్చేస్తుంది. ఆమె అంత త్వరగా బయటికి రావడం చూసి అతను ఆశ్చర్య పోయాడు.
తలుపు తెరిచి ఆమె కారులో కూర్చుంది.
"సరాసరి ..." అని మధ్యలో ఆగింది.
"ఇంటికేనా?" అడిగాడు బాల్కి.
"కాదు. ఇంటికి వెడితే , ఎందుకింత త్వరగా వచ్చావని అమ్మ అడుగుతుంది. లోపల నాకు నచ్చలేదు. వచ్చేశాను."
బాల్కి 'ఎక్కడికి?' అన్నట్టు ఆమె వైపు తిరిగి చూశాడు.
"సరాసరి ఏదన్నా ఒక దియేటర్ కి పద. సినిమా చూసి ఇంటికి వెళదాం."
కారు కదిలింది.
"అయన లోపల తాగి తందనా లాడుతున్నాడు. నాకు నచ్చలేదు. అందుకనే వచ్చేశాను."
కవిత తనతో అలా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు బాల్కి. ఆ రోజు రాత్రి సినిమా చూడమని అతన్ని అర్ధించింది. అతను కింది తరగతి టిక్కెట్టు కొనుక్కుని లోపలికి వెళ్లాడు.
ఆ తరవాతి వారం మళ్లీ అరుణ్ ఆహ్వానం వచ్చింది! కారులో కవిత నేక్కించుకుని ఆమెను గ్రామ ప్రాంతం లోని ఆ బంగళా లో దింపాడు బాల్కి. తరవాత మామూలు ప్రకారం రాముల వారి గుడికి వెళ్లి తిరిగి వచ్చాడు. కారుని అనుకుని నిలబడ్డాడు.
"బాల్కీ!" కవిత పిలుపు వినిపించడంతో అతను వెనక్కి తిరిగాడు.
కారుకి మరో పక్క ఆమె నిలబడి ఉంది. ఆశ్చర్యపోతూ అతని వైపే కొంచెం సేపు చూపు నిలిపింది. ఆమె కళ్ళలో ఏదో భావం లీలగా గోచరించింది.
"కొంచెం ముందు మీరిక్కడికి వెళ్లారు?' అని కవిత అడిగింది.
"ఆ గుడి వరకూ వెళ్లి వచ్చాను" అన్నాడు బాల్కి.
"నాకు తెలుసు."
"చూశారా?"
"అవును" అంది ఆమె. "గుళ్ళో ఏం చేశారు?"
"ప్రార్ధన చేశాను."
"ఎవరి కోసం ?"
"నాకోసం."
ఆమె తటపటా యించింది. అతని వంక చూసింది.
"కవిత కోసం ప్రార్ధన చేశారా?"
"ఈ ప్రశ్న అతనికి కొత్తగా కనిపించింది. "మీరా ఇలా అడిగారు!' అనే భావంతో ఆమెను చూశాడు.
"అవును. కవిత కోసమే. ఆమె గుణవంతు రాలు కావాలని ప్రార్ధన చేశారా?"
"మీరు మంచివారే."
"నేను నమ్మడం లేదు?."
అతనేమీ మాట్లాడలేదు.
"పదేళ్లయింది. నేను గుడికి వెళ్లి! మా అమ్మ పంపించలేదు." అంది ఆమె నిట్టురుస్తూ.
"ఇప్పుడు రండి."
ఇద్దరూ గుడికి బయలుదేరారు. భయభక్తులతో రాముల వారికి నమస్కరించింది కవిత. బాల్కి ఉప్పొంగి పోయాడు. "ఇంత మంచిదా ఈమె!" అనుకున్నాడు.
బయటికి వచ్చిన తరవాత "నన్ను గురించి నలుగురూ ఏమను కుంటున్నారు, బాల్కీ? నిజం చెప్పండి" అని అడిగింది కవిత.
"నలుగుర్ని గురించి మీరెందుకు దిగులు పడతారు? మీరు మంచివారనే నా అభిప్రాయం."
ఆమె పెదవుల మీద మందహాసం కనిపించింది. కళ్ళలో ఒక బొట్టు నిలిచింది.
ఆ తరవాత వాళ్ళిద్దరూ తరుచుగా ఆ గుడికి వస్తూ పోతూ ఉండేవారు. ఏకాంతంగా మాట్లాడుకునే వాళ్లు. అరుణ్ పిలిచాడని అబద్దం కూడా ఆడి కవిత బాల్కీ తో బయలుదేరేది. అతని మాటలలోని నైర్మల్యం ఆమెకు నచ్చింది. మొట్టమొదటి సారిగా మానవ జాతిలోని ఒక మంచి గుణాన్ని తాను తెలుసుకున్నట్టుగా భావించింది. అంతేగాక బాల్కీ లోతైన భావాలు గల మంచి మనిషిగా ఆమెకు కనిపించాడు.
ఆ రోజు అరుణ్ తో కలిసి కవిత నైట్ క్లబ్బు కు వెళ్ళాలి. కాని ఆమె కది నచ్చలేదు. అరుణ్ ని , నైట్ క్లబ్బు ని తలుచుకుంటేనే ఆమెలో ఒక ద్వేష భావం బయలు దేరింది. కారు ఎక్కిన తరవాత కారుని సరాసరి బీచికి పోనిమ్మని చెప్పింది కవిత.
"మీ అమ్మగారు కోప్పడతారే మో" అన్నాడు బాల్కీ.
"అఘోరించింది లే. ఇక నుంచీ నేనా నైట్ క్లబ్బు కి వెళ్ళను" అంది ఆమె.
కారు బీచి వైపుగా వెళ్ళింది.
"రేపు అరుణ్ ఏమన్నా అంటే....?"
"అననీ! ఇక నేను దేనికీ భయపడను."
కారు బీచి రోడ్డు మీద ఒక పక్కగా ఆగింది. చీకటి నలుమూలలా వ్యాపించింది.
బాల్కి బయట నిలబడ్డాడు. ఆమె కారు లోపలే కూర్చుంది. కొంచెం సేపటి కల్లా ఆమె ఏడుస్తున్న సవ్వడి వినిపించింది. అతను నిర్ఘాంత పోయాడు. వెంటనే కారులోకి తొంగి చూశాడు. వెంటనే సీటు మీద ఆనించి ఆమె ఏడుస్తూ ఉంది.
"ఏమిటిది? ఎందుకు ఏడుస్తున్నారు?" అని అడిగాడు, ఒక పక్క తలుపు తెరుస్తూనే.
ఆమె కొంచెం సేపు ఏడ్చింది. తరవాత ఇలా అంది.
"నేనెలా జీవించింది తలుచుకుంటున్నాను. ఏడుపు వస్తుంది, బాల్కీ."
"ఎలా జీవించాలో ఇప్పుడెందుకు తలుచుకోవడం?"
"ఇక ఎలా జీవించాలో అదీ ఆలోచిస్తున్నాను. ఇన్నాళ్ళూ ఎలాగో జీవించి ఇక మరో విధంగా జీవించడానికి వీలవుతుందా అని అనుకుంటున్నాను."
"మీరనుకుంటే వీలవుతుంది."
"అవుతుందా?"
"అవుతుంది."
"నేను మంచిదాన్నిగా మారుతానా?"
"ఇప్పుడూ మీరు మంచివారే."
"ఎలా?"
"మంచిదాన్ని కావాలని హృదయ పూర్వకంగా అంటున్నారుగా! ఆ భావమే మిమ్మల్ని మంచిదాన్ని గా మారుస్తుంది."
కృతజ్ఞతపూర్వకంగా ఆమె అతన్ని చూసింది.
"మీరు నన్ను 'మంచిదా' న్నని చెప్పడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను, బాల్కీ."
"నేను మామూలు మనిషిని. నా మాటను మీరు గొప్పగా భావిస్తున్నారా?"
"కాదు, బాల్కీ. మీరు మామూలు మనిషి కారు. మిమ్మల్ని చూసే నన్ను నేను దిద్దుకోడం మొదలు పెట్టాను. భగవంతుణ్ణి కాక మరొకర్ని ఈ లోకంలో నేను తలుచు కుంటున్నా నంటే ఆ వ్యక్తీ మీరే!" గద్గద కంఠం తో చెప్పింది.
బాల్కి దిగ్భ్రమ చెండాడు. "కవితేనా ఇలా మాట్లాడుతుంది!' అనుకున్నాడు. 'నన్నా తలుచు కుంటుంది! కవిత నన్నా తలుచు కుంటుంది! ఆమెను నేనా సరిదిద్దింది?....' అలా అనుకుంటూ ఉండగా అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"లోపల కూర్చోండి , బాల్కీ" అంది ఆమె. అతను మాట్లాడలేక పోయాడు. లోపల కూర్చుని స్టీరింగ్ మీద తల ఆనించాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి.
"ఏడవకండి బాల్కీ" అంటూ కవిత తన చేతి రుమాలు ని అతనికి అందించింది.
నెలలు గడిచాయి. కవితకూ, బాల్కీ కీ మధ్య ఒక సంబంధం ఏర్పడసాగింది. ఇద్దరి విచారాలను ఇద్దరూ తెలుసుకో గలిగారు. అలా తెలుసుకోవడం వల్ల ఏర్పడ్డ అనుకంపతో ఒకరి నొకరు ఓదార్చు కున్నారు. ఈ ప్రేమ, అనుకంప, పరితాపం-- వీటి మధ్యనే వాళ్ళిద్దరి లోనూ ఒక ప్రణయ భావం ఉదయించి వికసించింది. అది స్వచ్చమైన ప్రేమ! "మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాని ఇతరులకు నా శరీరం మీదనే ప్రేమ!" అంటూ ఆమె బాల్కీతో చెప్పింది.
ఇంకా రెండు నెలలు గడిచాయి.
అరుణ్ వద్ద నుంచి అషకు లభించే మొత్తాలు తగ్గు ముఖం పట్టాయి. ఆమెకు గుండె గతుక్కుమంది. కారణమేమిటో కనుక్కుంది. అరుణ్ తో కవిత గడిపిన రోజులు చాలా కొద్దివని తేలింది. కవితను పిలిచి అడిగింది. డొంకతిరుగుడు జవాబులు చెప్పింది కవిత. అషకు ఎక్కడలేని కోపం వచ్చింది. కవిత దేన్నో మభ్య పెడుతుందని ఆమె గ్రహించింది. కవిత -- బాల్కీ లను గురించి ఆమెకు కొంచెం సందేహం లేకపోలేదు. వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా మెలుగు తున్నారని కూడా ఆమె తెలుసుకుంది.
ఒకనాటి సాయంకాలం...,మసక చీకటి పడుతుంది. బయటికి వెళ్లి ఆష లోపలికి వచ్చేసరికి అక్కడ కవిత కనిపించలేదు. "కవితా!" అంటూనే ఇల్లంతా వెతికింది. తరవాత దొడ్డి వైపు వెళ్లి తలుపు తెరిచి చూసింది. తోటలో మొక్కల మధ్య నిలబడి కవిత బాల్కీ మహా సారస్యంగా మాట్లాడు కుంటున్నారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకున్నారు.
"కవితా!" కోపం కొద్దీ బిగ్గరగా పిలిచింది ఆష.
వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగారు. ఆమెను చూచీ చూడడంతో బాల్కీ తోట దోవగుండా వెళ్ళిపోయాడు.
కవిత ను చరచరా లాక్కుంటూ లోపలికి వచ్చింది ఆష. ఒక సోఫా మీదికి కవితను తోసేసింది. "నువ్వేమను కున్నావే" అని ఒక పొలికేక పెట్టింది.
బాధపడుతూ లేచింది కవిత. అషను ఒక్కసారి చూసింది.
"అమ్మా! ఇక నా దగ్గరికి వచ్చావో జాగ్రత్త! నేను బాల్కీ నే పెళ్లి చేసుకుంటాను."
"ఎప్పటి నుంచే ఈ నిర్ణయం?'
"ఇప్పుడు -- ఈ క్షణం నుంచి."
"ఓసి పాపిష్టి డానా! నీ బుద్ది బుగ్గయి పోయిందటే!"
"నీ బుద్దే బుగ్గయింది. ఇక నువ్వు చెప్పినట్టు నేను వినను."
ఆశ్చర్యం కొద్ది స్తంభించి పోయి నిలబడింది ఆష. 'కవితేనా ఇలా మాట్లాడుతుంది!" అనుకుంది.
ఆ మరునాడే బాల్కీని ఉద్యోగం నుంచి తీసేయ్యమని అరుణ్ తో చెప్పింది ఆష. చాలా కట్టుదిట్టాలు చేసి కవితను ఇంట్లోనే బంధించింది.
కవిత మనస్సు ని మార్చడం కష్టమని త్వరలోనే గ్రహించింది ఆష. ఏ నిమిషాన ఆయినా తాను ఇంట్లోంచి పారిపోతానని భయపెట్టింది కవిత. ఇది అషను కలవర పెట్టింది. దిగులు పడిపోయి అలాగే కూర్చుంది.
ఆ తరవాత తన స్నేహితుల్ని సంప్రటించింది ఆష. వాళ్ళ సలహా ననుసరించి ఆమె స్థానిక జావనైల్ కోర్టుకి ఒక అర్జీ పెట్టుకుంది. బాల్కీ అనే అతను తన మైనర్ కుమార్తె కవిత మనస్సుని మార్చి వేశాడనీ, ఆమెను కోర్టు వారి సంరక్షణ లో ఉంచ వలసిందనీ అందులో మనవి చేసుకుంది.
ప్రొబేషన్ అఫీసరయిన రామ్ నాధ్ అనే ఆయన్ని ఆ కేసుని విచారించ వలసిందిగా మేజిస్తేట్ కోరాడు.
కేసుకి సంబంధించిన వారి నందరినీ రామ్ నాద్ విచారించాడు. ఆష జీవన విధానమూ, కవిత-- బాల్కీ లకు మధ్య గల స్నేహమూ ఆయనకు తెలియ వచ్చాయి. బాల్కీ ని కనక తాను పెళ్లి చేసుకోలేక పొతే , తనకు ఆత్మహత్యే శరణ్య మని కవిత చెప్పింది. అయితే కవిత అంటే బాల్కీ కి నిజంగా ప్రేమ ఉందా, లేదా అనే సందేహం ఆయనకు కలిగింది. అదికాల గతిలో తెలుస్తుందనుకున్నాడు. ఆలోగా కవిత ను రెస్క్యూ హోమ్ లో ఉంచవలసిందిగా మేజిస్ట్రేట్ ని అర్ధించాడు. అదే విధంగా ఉత్తరువు జారీ చేయబడింది.
రేస్కూ హోమ్ లో ఆరు నెలలు నివసించింది కవిత. బాల్కీ పట్ల చేసుకున్న నిర్ణయాన్ని ఆమె మార్చుకోలేదు. ఇక ఎప్పుడూ పుట్టింటి కి వెళ్లనని ఆమె రామ్ నాద్ కి తెలియజేసింది.
ఇలా ఉండగా బాల్కీ మేజిస్త్రేట్ కి ఒక వినతి పత్రం పంపించాడు. కవితను వెంటనే విడుదల చెయ్యాలనీ, ఆమెను తాను పెళ్లి చేసుకోదలచాననీ అందులో అతను పెర్కున్నాడు. ఈలోగా బాల్కీ మంచివాడని తెలుసుకున్నాడు ప్రొబేషన్ అఫీసరయిన రామ్ నాద్. 'కవితను అతను పెళ్లి చేసుకోదలచాడు కనక ఆమెను రెస్క్యూ హోమ్ నుంచి విడుదల చెయ్యవచ్చు' నని అయన మేజిస్తేట్ కి సిఫార్స్ చేశాడు. అయన సిఫార్స్ చేయడం వల్ల కవిత విడుదల చెయ్యబడింది. ఆఫీసర్ రామ్ నాద్ సమక్షంలో కవిత, బాల్కీ ల వివాహం చక్కగా జరిగింది.
సాంఘిక సమస్యల్ని బాగా విచారించి మంచి తీర్పు లిచ్చే ఈ రామ్ నాద్ ద్వారా నేను కవిత, బాల్కీ లను కలుసుకో గలిగాను. ప్రస్తుతం ఒక కంపెనీ లో కవిత రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుంది. బాల్కీ ఒక మోటారు కంపెనీ లో మెకానిక్ గా ఉంటున్నాడు. వాళ్ళిద్దరూ ఆ నగరంలో ఆదర్శ దంపతులుగా జీవిస్తున్నారు.
* * * *
