Previous Page Next Page 
సమాంతర రేఖలు పేజి 18


    నా మీద ఆయనకు ఉన్న గౌరవానికి గర్వించేదాన్ని. మళ్ళీ జాలివేసేది, ఒక స్త్రీ వ్రాసిన ఉత్తరానికి జవాబివ్వలేని అశక్తతకు, కోపంకూడా వచ్చేది. విచిత్రమైన ఆ ప్రవర్తనను ఇంతవరకూ నేనెన్నడూ, ఎక్కడా చూసి ఉండలేదు.
    రోజులు గడుస్తున్నకొద్దీ నాలో కొంగ్రొత్త భావాలు రూపు దిద్దుకుంటుండేవి. ఇటు మా నాన్న, అటు వారి తల్లిదండ్రులు ఆయన కెన్నో ఉత్తరాలు వ్రాసినా అన్నిటికీ మౌనం వహించేవారు. మళ్ళీ నేను వ్రాసిన ఉత్తరాలకు జవాబు వచ్చేది. ఎవరన్నా వెడితే అప్పటికప్పుడు ఏదో జవాబు చెప్పి పంపించేవారు.
    పాలపొంగులాంటి యౌవనం. వయస్సహజమైన కోరికలకు అడ్డుకట్ట వెయ్యటమనేది కష్టసాధ్యంగా ఉండేది. అందులో నేను వివాహితను. అదీగాక ఆ చుట్టుపక్కల కొన్ని ఊళ్లకు అదొక్కటే హైస్కూలు కావటం మూలాన ఆడపిల్లలకు, మగపిల్లలకు హైస్కూలు చదువు చివరి రెండు సంవత్సరాల్లోనుకలిపే ఉండేది. అందువల్ల మేము ప్రతిదానికి మగపిల్లలతో పందాలు వేసుకుని పైచేయిగా ఉండాలని ప్రయత్నించడం జరుగుతూండేది. ఈ సందర్భంలో నాకు ఒక విధ్యార్ధితో పరిచయమైంది. అతని ఇల్లు కూడా మా పిన్ని ఇంటికి చాల దగ్గర్లో ఉండేది.
    మా పరిచయం పెంపొందుతున్న కొద్దీ నాలో ఏవో కొత్త అనుభూతులు కలుగుతూండేవి. ఒక విధంగా అతను నాలో నిద్రాణమై ఉన్న వాంఛలను మేల్కొలిపాడు, రెచ్చగొట్టాడనవచ్చు. అరిచేతిలో స్వర్గం చూపించ ప్రయత్నించాడు.
    నేను తొందరపడలేదు. పదేపదే యోచించాను. ఎటు చూసినా నాదే తప్పు అన్న సత్యం నన్ను అన్ని వైపులనుండీ హెచ్చరించింది. క్షణికమైన ఉద్రేకాలను అదుపులో పెట్టుకోకపోతే కలిగే ఫలితాలను నా మనసు చూడగలిగింది. పైగా, ఉత్కృష్టమైన విజ్ఞానాన్ని నాకు బోధిస్తున్న అయన ఉత్తరాలు నా చుట్టూ అతిక్రమించలేని పరిధిని గీయగలిగాయి.    
    నాముందు ప్రేమపాఠాలు వల్లించబోయిన అతనితో ఖచ్చితంగా చెప్పేశాను, నీ సదర్భంలోనూ నాతో హద్దులుమీరి ప్రవర్తించవద్దనీ, లేనిపోని ఆశలు కల్పించుకోవద్దనీ.
    ఆశించని జవాబు రావడంతో అతను పాలిపోయిన ముఖంతో వెళ్ళిపోయాడు. నేను పీడా వదిలిందనుకుని తృప్తిపడ్డాను. అయితే ఆ రోజునే అతను నన్ను లోబరుచుకోటానికి ఒక నాటకానికి నాంది వేశాడని నాకు తెలియదు.
    అందుకే అతను తనను తాను----------------------------------------
    మొదట ఆయన వ్రాసిన ఉత్తరమే విప్పాను. ఆ సంవత్సరంలో ఎమ్. ఎ. ముగించేస్తున్నానని, ఇక మేమిద్దరమూ ఒకరి కొకరు తోడునీడగా జీవయాత్ర.
    ఇవన్నీ వింటుంటే నాలో ఓ రకమైన భావ సంఘర్షణ కలిగేది. ఎవరెలా పోతే నా కెందుకు అని నిర్లక్ష్యం చేసి మరిచిపోవాలనుకున్నా, ఆ ఆలోచనలనుమాత్రం దూరంచేసుకోలేకపోయేదాన్ని. ప్రతిరోజూ ఇవే ఊహలు. పాఠాలుకూడా సరిగా అర్ధమవక పోయేవి.
    మాటిమాటికీ అతనన్న మాటలు చెవుల్లో గింగురు మనేవి. 'కళ్యాణీ, మనం కావాలనుకున్నప్పుడు సుఖాలు దొరకవు. అవి తటస్థపడ్డప్పుడే జారవిడుచుకోకుండా అనుభవించాలి. వదులుకున్నామంటే వట్టి అవివేకం అన్న మాట. మనం కష్టమైనా, సుఖమైనా అనుభవించటానికి పుట్టాం కనక అనుభవించాలి!'
    ఇటు ఆయన ఉత్తరాల్లో 'నీతినియమాలకు దూరం అయి నరకసదృశమైన జీవితాన్ని గడపటం కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అవినీతివల్ల నువ్వు తాత్కాలిక సౌఖ్యం పొందినా, దానికి పరిహారం పైలోకంలో ఏమోగాని, ఈ జన్మలోనే ఏదో రూపంలో తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. సచ్చీలం, నిర్మలమైన నైతికజీవనం మానవుడికి దైవత్వాన్ని కలగజేయగలనని విశ్వసిస్తున్నాను' అన్న మాటలు. రెండు వైపులా మధనపడేదాన్ని.
    'బతికి ఉన్నప్పుడుకాక మరణించినప్పుడు సుఖపడ తామా?' అని నేను సౌఖ్యాన్ని పొందటానికి నిర్ణయించుకున్న రోజున ఆ ఉత్తరాలు, ఎన్నడో పెళ్ళిలో చూసిన ఆయన ముఖమండలం నా పాడు నిర్ణయాలను దహించివేసేవి.
    పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. హాల్ టికెట్లు కూడా వచ్చాయి.
    ఒకరోజు అతను రాలేదు. ఆ రోజుతో స్కూలు మూసేస్తారు. మధ్యాహ్నం ఒక కుర్రాడు పరిగెత్తుకు వచ్చి నాతో ఆదరాబాదరాగా అర్ధంకాకుండా ఏదో చెప్పి ఒక కాగితం నాకిచ్చాడు. అతను వెళ్ళాక నేను దాన్ని చదువుకున్నాను.
    'చివరిక్షణాల్లో ఉన్నాను. దయచేసి ఒక్కసారి రమ్మని కోరుతున్నాను. ఆఖరిచూపు చూసి నీ సమక్షం లోనే మరణిస్తాను.
                                                                                            -సూరి.'
    నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి.
    వెంటనే అతని ఇంటికి వెళ్లాను. నేను వెళ్ళే సరికి గదిలో అతను, మరొక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకతను బలవంతంగా ఏమిటో తాగిస్తున్నాడు. సూరి 'ఇంకెందుకురా నన్ను బతికించ ప్రయత్నిస్తున్నారు?' అంటున్నాడు.
    నా రాక చూసి వాళ్లిద్దరు పక్కకు తప్పుకున్నారు.
    సూరి విషం మింగాడనీ, సమయానికి చూడబట్టి వెంటనే విరుగుడు మందు తాగించటం చేత పడిపోయిందనీ, లేకపోతే ఆపాటికి మరణించి ఉండేవాడని ఓ స్నేహితుడు చెప్పాడు.
    వచ్చినన్నా  నొచ్చుకున్నాను----------------
    మొదట్లో ఆయన ఉద్దేశ్యం ఏమిటో నా కర్ధం కాలేదు. మారు ఆలోచన లేకుండా సరేనన్నాను. ఆయన నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు.
    వారం రోజుల్లోనే నిజానిజా లేమిటో అవగతం-----------------
    తను పరీక్షలకు కూర్చోలేనన్నాడు. నేనతన్ని ప్రోత్సహించాను. నా మాట తీసివెయ్యలేక సరేనన్నాడు.
    ఒకానొక వెన్నెల రాత్రి. అప్పటికి నేను పూర్తిగా అతని వలలో పడిపోయాను. ఆ రోజు ఉదయం ఆయన ఉత్తరం వచ్చింది. ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని బోధపరుస్తూ వ్రాసే ఆయన ఎందుకో ఆ లేఖలో క్షేమ సమాచారాలతో మాత్రమే ముగించారు. ఒకవేళ ఏదైనా వ్రాసి ఉంటే, నేనివ్వాళ మీకీ కథ చెప్పే అవసరం కలిగిఉండేది కాదు. ఆ వ్రాతలు నా పతనాన్ని అరికట్టి ఉండేవి. కానీ ఆయనేమీ వ్రాయలేదు. వెళుతున్నానని అడిగాడు. చెప్పాను వెళుతున్న చోటు.
    'ఎందుకో?'
    అదీ చెప్పాను.
    'హుఁ! ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలీలా ఏం? అయినా ఆ లెక్కల్లో అంత కష్టమేం ఉంది. చాలా ఈజీ.'
    'మీరు చేసి చూపించగలరా?'
    'రాజాలా!'
    పగలు నేను మాటల సందర్భంలో అతనితో కొన్ని లెక్కలు అంతుబట్టటం లేదని, ఫలానా స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాలని చెప్పాను. తన పథకం ఫలించబోతున్నడని, అతడు నేను వెళ్ళే సమయానికి తను చేయవలసిన కార్యక్రమాన్ని నిర్ణయించుకుని సిద్దంగా ఉన్నాడు. ఇదంతా ముందు నిర్ణయించుకున్నదని నేను గ్రహించలేకపోయాను. అతను నన్నంత అవివేకినిగా చేశాడు.
    'రండి!' గదిలోకి దారితీశాడు. అతని మిత్రులు తాత్కాలికంగా ఆడిన నాటకంలో సహాయం చేయటానికి వచ్చినవారు కనక, ప్రస్తుతం వాళ్ళ అవసరం లేదు కనక వాళ్ళు లేరు. ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు.
    కొంతసేపు అతను నాకు లెక్కలు చెప్పాడు. బాగా అర్ధం అయ్యేట్లు మరీమరీ చెప్పాడు. అతనికి కృతజ్ఞత తెలుపుకున్నాను.    
    'వట్టి కృతజ్ఞత చెబితే లాభమేం ఉంది?' చిలిపిగా నా వంక చూశాడు. నాకు అతని మాటలు బోధపడలేదు.
    ఒక్కొక్కమాటనే తనవిజయానికి సోపానంగా చేసుకుంటూ నన్ను కట్టివేశాడు మాటలతో.    
    ఆ వెన్నెల రాత్రిలో మొదటిసారిగా నా శీలం హరించబడింది. ఉద్రేక ప్రవాహంలో నాకే ఒడ్డూ కనిపించలేదు. అందులోపడి కొట్టుకుపోవటమే నా పని అయింది.  
    తెల్లవారటానికి ఇంకొక రెండు గంట లున్నదనగాచేసిన తప్పు తెలిసివచ్చింది. పశ్చాత్తాపపడ్డాను. ఏడ్చాను. అతను ఓదార్చాడు. ధైర్యం చెప్పాడు. ఈమాత్రం దానికి అధైర్యపడితే జీవించటం కష్టమన్నాడు.
    ఇంటికి తెల్లవారి ఆరు గంటలకు వెళ్ళాను.  నా వాలకం చూసి పిన్ని అడిగింది. రాత్రి రాలేదేమని. చదువుకోవలసినవి ఉండటంచేత నేను అక్కడే పడుకున్నానని ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాను.
    పరీక్షకు వెళ్ళాను.
    అతనూ వచ్చాడు. నన్ను చూసి వికారం పుట్టేటట్లు నవ్వాడు.
    బాగానే చదివాను. కానీ పరీక్ష సరిగా వ్రాయలేక పోయాను. అదేకాదు. అన్ని పేపర్లూ చెడగొట్టాను. పరీక్షలు అయిపోయాయి.
    ఇంటికి ప్రయాణమయ్యాను. అతని గదికి వెళ్లాను. ఇంకెక్కడ ఉంటాడు? నిరాశగా తిరిగివచ్చాను. ఇంటికి రాగానే నా పేర వచ్చిన రెండు ఉత్తరాలను పిన్ని నా చేతిలో పెట్టింది. ఒకటి సూరి వ్రాసింది. రెండోది ఆయన దగ్గిర నుంచి.
    మొదట ఆయన వ్రాసిన ఉత్తరమే విప్పాను. ఆ సంవత్సరంతో ఎమ్. ఎ. ముగించేస్తున్నానని, ఇక మేమిద్దరమూ ఒకరి కొకరు తోడునీడగా జీవయాత్ర సాగించబోయే శుభదినం కొద్దిరోజుల్లోనే ఉందని దాని సారాంశం.
    మనసు మరింత వికలమయింది.
    సూరి ఉత్తరం విప్పాడు. తను ఆడిన నాటక మంతా వివరించి, "-నేను గర్వభంగం చేశాను. అందమైన నాన్నని, పతివ్రతా శిరోమణినని విర్రవీగావు. ఇక కూర్చుని తీరిగ్గా ఏడు...' అని వ్రాశాడు.
    నాశనమై పోయింది బతుకు. లోలోపల ఏడుస్తూనే ఇంటికి వెళ్ళాను. సాధ్యమైనంతవరకు అందర్నీ తప్పించుకుని తిరగసాగాను. నాలో ఏదో మార్పు మా అమ్మ పసికట్టింది కాని అదేమిటో ఒక నెలవరకూ ఆమెకు తెలీలేదు.
    చివరకు ఒకరోజు అదికూడా బయటపడింది. అప్పటికే నాకు నెల తప్పింది. అమ్మ నెత్తీ, నోరూ బాదుకున్నది. నాన్న ఉగ్రుడయ్యాడు.
    ఆ రోజే మామయ్య వచ్చి మరునాడే ఆయన వస్తున్నట్లు చెప్పి, ఉత్తరం కూడా చూపించాడు. ఎవ్వరూ కిక్కురుమనలేదు. ఆ రాత్రి నాన్న నన్ను చంపేస్తానన్నంత కోపంగా ప్రవర్తించాడు.
    తెల్లవారితే ఆయన వస్తారు. ఏది ఏమైనా నా ముఖం ఆయన చూడకూడదు. నేను దృఢనిశ్చయం చేసుకున్నాను. అర్దరాత్రి రెండు గంటల సమయం. గదికి ముందువైపు దర్వాజాకు గొళ్ళెం వేసిఉంది. కాని వెనకవైపు మాత్రం లోపలివైపే వేసి ఉంది. పెరటి వైపు బయటినుంచి గొలుసు తగిలించాలని ఎవరికీ తట్టలేదు. తలుపు తీసుకున్నాను. పెరటి గుమ్మం గూడా తెరుచుకుని వచ్చేశాను. మా ఊరికీ, పిన్నిగారి ఊరికీ ఉన్న పదహారు మైళ్ళూ నడిచాను. ఎనిమిది గంటలకల్లా పిన్నిగారి ఊరు చేరుకున్నాను. ఎవరింటికీ వెళ్లలేదు. తిన్నగా స్టేషన్ చేరుకున్నాను. ఒక రైలు ఫ్లాట్ ఫారం మీద ఉంది. ఎక్కడికి వెళుతుందోకూడా చూడలేదు. ఎవరూ లేని కంపార్టు మెంటు చూసి ఎక్కేశాను, రైలు కదిలాక అది ఫస్టు క్లాసు కంపార్టు మెంట్ అని తెలుసుకున్నాను.
    కొంతసేపటికి పై బెర్తు మీద ఎవరో దగ్గిన చప్పుడయింది. తుళ్ళిపడ్డాను. ఒకాయన కిందికి దిగాడు. యాభై అయిదేళ్ళ పైనే ఉంటుంది వయస్సు. నన్ను ప్రశ్నార్దకంగా చూశాడు. నేనేం జవాబిస్తాను?
    'ఎవరమ్మాయీ నువ్వు?'
    కూచుని ఏడుపు మొదలెట్టాను. ఆ ముసలాయన గాభరాపడ్డాడు.  నేను ఏడ్చినంతసేపు ఏడవనిచ్చాడు. నెమ్మది నెమ్మదిగా నా వివరాలన్నీ అడిగి తెలుసు కున్నాడు.
    'ప్చ్! పాపం. ఏదో తెలియనితనంలో కాలుజారావు. అయినా ఇంత  యుక్తవయస్సులో విచక్షణ అనేది తక్కువ. ఏమిటో? మీ కుర్రకారు అంతా ఇంతే!'
    ఆయన నన్ను తనవెంట రమ్మన్నాడు. ఆయనదీ హైదరాబాదే. గెజిటెడ్ ఆఫీసరుగా పనిచేసే రిటై రయ్యాడు. వెనకా ముందూ ఎవరూ లేరు. నా ఇష్టం వచ్చినన్నాళ్ళూ ఆయన ఇంట్లో ఉండవచ్చు.
    మొదట్లో ఆయన ఉద్దేశ్యం ఏమిటో నా కర్ధం కాలేదు. మారు ఆలోచన లేకుండా సరేనన్నాను. ఆయన నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు.
    వారం రోజుల్లోనే నిజానిజా లేమిటో అవగతం చేసుకున్నాను. ఆ మాజీ గెజిటెడ్ ఆఫీసరు నన్నూ వాంఛించాడు. ఆయనకూ ఆయన ఇంటికీ ఒక నమస్కారం పెట్టి అక్కడి నించి వచ్చేశాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS