Previous Page Next Page 


    ఒక రోజు మధు ఇంటిలో ఒంటరిగా ఉన్నాడు. తల్లి రాజమ్మ, తండ్రి వెంకటేశ్వరవ్, చెల్లి సుధ అందరు కలిసి బయటి కెళ్ళారు. ఆరోజు అతని మనస్సేమీ బాగులేదు. రాధను, తనను గురించిన చర్చలు అతని చెవిని కూడా శోకాయి. ఎందుకో రాధ అంటే అతనికి అమూల్యమైన అభిప్రాయం. అభిప్రాయం అనటం కంటే, దానిని ' ప్రేమ' అని చెప్పవచ్చు అనుకున్నాడు. రాధ అందానికి, ఆమె నిర్మల ప్రవర్తన మరింత అందాన్ని చేకూర్చింది. అతన్ని ఆకర్షించింది కూడా అదేనని చెప్పవచ్చు. ఆ తనేందరి తోనో మునుపు స్నేహంగా ఉన్నాడు. కాని, రాధ కన్నులలోని చిలిపి తనంతో కూడిన ఆరాధ్య భావం తానేవ్వరిలోనూ చూడలేదు. ' రాధను వివాహ మాడితే?" తనను తాను ప్రశ్నించు కున్నాడు. ఎంత అందమైన ప్రశ్న! అతని మేను పులకరించింది. మునుపెన్నడూ ఎరగని తీయని పులకింత. ఆ రాత్రి అతని మనసు తీయని కలలతో  నిండిపోయింది.
    మరుసటి రోజు మధు ఆఫీసు కెళ్ళాడు. ఆరోజు రాధ తన కంటికి చాలా బాధపడుతున్నట్లు కనిపించింది. ఆరోజు చేయవలసిన అవసరమైన పనులలను మధు రాధతో చెబుతున్నాడు. ఆమె తల వంచుకుని వ్రాసుకుంటుంది. ఆమె కనురెప్పలు బాగా వాచీ ఉన్నవి. క్రితం రాత్రి బాగా ఏడ్చినట్లుందను కున్నాడు. అతను చెప్పటం ఆపి --
    "రాదా!" అన్నాడు.
    ఆమె తల ఎత్తి అతన్ని చూసింది. ఆమె అతనిని అంత విశదంగా చూడటం అదే మొదటి సారి. అతను మరలా, "రాధా!" అన్నాడు . ఆమె "చెప్పండి" అంది అతని వైపే చూస్తూ. అతనేదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుంది. అతనామే కళ్ళల్లోకి చూశాడు. వర్షించటానికి సిద్దంగా ఉన్న మేఘం లా ఉన్నాయి ఆమె కన్నులు.
    "రాధా! అందరను కునే మాటలు నిన్ను బాధిస్తున్నాయి కదూ?' రాధ అవునన్నట్లు తలొంచు కుంది.
    "పోనీ, రాధా! వాళ్ళను కుంటున్న మాటలనే నిజం చేస్తే?' అతని అభిప్రాయంలోని అంతర్యాన్ని ఆమె గుర్తించలేదు.
    అతని మాటలను ఇంకో విధంగా అర్ధం చేసుకున్న రాధ భరించలేక పోయింది. ఆమె కన్నుల కారు మేఘాలు నిజంగానే వర్షించాయి. ఆమె కన్నీటి బిందువులు రాసుకుంటున్న పేపరు మీద రాలాయి. అతను చలించి పోయాడు. అది తాను అడుగవలసిన సందర్భం, పద్దతి కాదేమో అనుకుంటున్నంత లో , ఆమె కన్నులు తుడుచు కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
    ఆనాటి రాత్రి భారంగా గడిచి పోయింది. మధు మరు రోజు ఆఫీసు కెళ్ళాడు. ఆరోజు రాధ రాలేదు. అతను చాలా కంగారు పడ్డాడు. తన మాటలను ఆమె సరిగా అర్ధం చేసుకోలేదను కున్నాడు. ఆరోజు సాయంకాలం మధు, రాధ ఇంటి కెళ్ళాడు. రాధ తల్లితండ్రులతో తన్ను తాను పరిచయం చేసుకున్నాడు. అతని రాక వారికి అర్ధం కాలేదు. అతనిని కూర్చోండ బెట్టి, రాధ తల్లి -- రాధను పిలిచే ప్రయత్నం చేసింది. మధు ఆమెను ఆ ప్రయత్నం నుండి వారించాడు. రాధ తండ్రి గంగాధరం మెల్లిగా --
    "మీరాకకు కారణం తెలుసుకో వచ్చునా?' అని ప్రశ్నించాడు. తొలుత, తన అభిప్రాయాన్ని వారి కేవిధంగా తెలుపాలో మధు కర్ధం కాలేదు. తన అభిప్రాయాన్ని తనవారు నిరాకరించరు. కారణం, అతను ఒక నిర్ణయాని కొస్తే దానికి తిరుగుండదు. అందుకని మధు చివరికి ధైర్యం చేసి--
    "మీ కభ్యంతరం లేకుంటే, రాధను నేను వివాహ మాడాలను కుంటున్నాను" అని సూటిగా ,దృడ సంకల్పం తో చెప్పాడు. ఆ మాట విన్న రాధ తల్లిదండ్రులు లకు నోట మాట రాలేదు. వారి ఆశ్చర్యా నందాలకు అంతులేదు. అతని మాటలు వారికి కలగా తోచాయి. లేకపోతె , కలిగిన కుబుంబము నుండో చ్చి , మంచి హోదాలో ఉన్న మధు తనను తాను రాధను కోరుకోవడ మంటే మాటలా? వెంటనే గంగాధరా నికి వారి పేదరికం గుర్తుకొచ్చి---
    "బాబూ! ఈ వివాహానికి మీ తల్లి దండ్రులు సమ్మతిస్తారా? మా కుటుంబ పరిస్థితులు మీకు తెలిసినవే" అని అన్నాడు.
    "నా అభిప్రాయాన్ని మా ఇంట్లో కాదనరు. దయచేసి రాధ నడిగి ఆమె సమ్మతాన్ని నాకు తెలియజేయండి." అన్నాడు.

                            *    *    *    *
    రాధ , మధుల వివాహం జరిగింది. ఆమె ప్రియ స్నేహితురాండ్రు వసంత, చిత్ర, హేమ వివాహాని కొచ్చారు. రాధ తల్లిదండ్రుల ఆనందానికి అవదు ల్లేవు. తమ ఇంటి ఆనంద జ్యోతి అత్తవారింట, భర్త సాన్నిధ్యంలో కలకాలం సుఖ సంతోషాలతో వెలుగొందాలని వధూవరులను ఆశీర్వదించారు. మధు తల్లిదండ్రులకు ఒక్క అంతస్తులో లోటు తప్ప, తక్కిన విషయాలలో కోడలు నచ్చింది.
    ఆనాటి రాత్రి తొలిరాత్రి. జీవితంలో మరుపు రాని రాత్రి.  సిగ్గుల మల్లె మొగ్గగా ఉన్న రాధ హృదయపు మల్లె మొగ్గ, భర్త సాన్నిధ్యంలో అతని అనురాగంతో విరిసి విప్పారింది.

                           *    *    *    *
    మాధవ ప్రతి విషయాన్నీ చాలా తేలికగా తీసుకునే స్వభావం కలవాడు. రాధ విషయంలో కూడా ఆమెను తేలికగా మరిచి పోగలను కున్నాడు. కాని, అతని మనసు రాధ విషయంలో వక్రించింది. అతనామెను మరవలేకపోయాడు. రాధతో స్నేహంగా ఉన్నన్ని రోజులు, కేవలం రాధతో ఉన్నంత సేపు తప్ప, తక్కిన సమయంలో ఆమె అతనికి అంత గుర్తు కొచ్చేది కాదు. అప్పుడప్పుడు ఆమెను గురించిన ఆలోచనలు వచ్చేవి. కాని, రాధకు దూరమైన దగ్గరి నుండి , అనుక్షణం రాధ రూపం, రాధ తలంపు అతనిని పిచ్చివానిని చేయసాగాయి. రాధ కంటే అందగత్తె ను తాను జీవితంలో పొందవచ్చును. అటువంటి అందాలకు కొరత లేదు. కాని, అటువంటి నిర్మలత్వం ఎంతమందిలో ఉంటుంది?ఆమెను అర్ధం చేసుకున్న తర్వాత , తానెందుకు తెగించి తన తల్లిదండ్రులను వివాహ విషయమై అడగలేక పోయాడు? కారణం, వారు సమ్మతించరని అతనికి బాగా తెలుసు. ఒకవేళ వారి నెదిరించి వివాహమాడి నట్లయితే తనకు తాను దైర్యంగా బ్రతుకుకునే వాడు కదా? తానిప్పుడు ఇంజనీర్.తానప్పుడు అంత ధైర్యం చేయలేకపోయాడు. తన హృదయాన్ని ఆమె అంతగా అక్రమించుకుందన్న విషయం అతనికే తెలియదు. అవును. "ధింగ్స్ ఆర్ వాల్యుడ్ వెన్ ఉయ్ లాస్ట్ దెమ్!" ఒక వస్తువును పోగొట్టు కున్నప్పుడే దాని విలువ తెలుస్తుంద నుకున్నాడు.
    "ఇప్పుడు రాధను తాను, తల్లిదండ్రుల నేదిరించైనా సరే వివాహ మాడితే!" అని ప్రశ్నించు కున్నాడు. అవును, అదే మంచి నిర్ణయంగా అతనికి తోచింది. ఆనాటి తన తెలివి తక్కువ తనానికి రాధ ఎంత బాధపడిందో? ఇప్పుడామె తనను మాన్నిస్తుందా? ఏమో? తానానాడు ఆమెను నిర్దాక్షిణ్యంగా మరిచి పోమని కోరాడు. కాని, తానె ఆమెను మరువలేక పోతున్నాడు.
    ఆవేళ సాయంత్రం, మాధవ రాధ వాళ్ళింటి కెళ్ళాడు. రాధ వివాహమైందని ఆమె తల్లిదండ్రుల వలన తెలుసు కున్నాడు. ఎంతో ఆశతో వెళ్ళిన మాధవ, నిరాశతో తిరిగి వచ్చాడు. అతని హృదయం గాయపడింది. ఇంటి కెళ్ళిన మాధవకు అంతా శూన్యంగా తోచింది. ఒంటరిగా వెళ్లి తోటలో కూర్చున్నాడు. చల్లటి గాలి, తోటలోని మల్లెల వాసన ఎంతో ఆహ్లాదకరంగా ఉండాలి. కాని, అవేవి ఆనందాన్ని కలుగజేయ లేకపోయాయి. మనసులోని ఆనందం, పరిసరాలను ఆహ్లాద కరంగా తిలకింప జేస్తుందా? లేక, ఆహ్లాదకరమైన పరిసరాలు మనసుకు ఆనందం కలుగ జేస్తాయా? అని అనుకున్నాడు. కాని, అతని మనసు మొదటి దానితోనే రాజీ పడింది. అవును, ఇప్పుడు తన మనసులో ఆనందం లేదు. కాబట్టి నిజంగా ఆనందదాయకమైనదేదీ తనకు ఆ విధంగా కనబడడు. మల్లె పందిరి నుండి గాలికి రెండు మల్లెలు రాలి అతని పై పడ్డాయి. వాటిని చేతిలోకి తీసుకున్నాడు. రాధకు మల్లెలంటే ఎంతిష్టం? అతని కనుకొనల్లో నీరు నిలిచింది. అతను నిగ్రహించు కోవడానికి ప్రయత్నించాడు. అతని అశ్రు బిందువులు ఇక ఆగలేక మన్నట్లు రాలి ఆ రెండు మల్లెల పై పడ్డాయి. వెనుక నుంచి "అన్నయ్యా!" అన్న పిలుపు."తన చెల్లి రమ. అల్లరి పిల్ల" అనుకుని సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాడు. అంతలో రమ పరుగున వచ్చింది. ఆమె వెంట మరో అమ్మాయి ఉంది.
    "అన్నయ్యా! నా ఫ్రెండ్ సుధ. మా అన్నయ్య మాధవ" అని పరిచయ

    సుధ నవ్వుతూ--
    "రమ లేదండీ?" అని ప్రశ్నించింది.
    "లేదు. ఎవరో ఆమె ఫ్రెండ్ వచ్చి, మీరు వస్తున్నట్లు చెప్పినా వినిపించుకోక బలవంతంగా తీసి కెళ్ళింది. త్వరగా వస్తానంది. కూర్చోండి" అన్నాడు మాధవ.
    నిట్టురుస్తూ కూర్చుంది సుధ. రమ లేనందుకు సుధ మనసులోనే సంతోషించింది. మాధవతో ఏకాంతంగా మాట్లాడాలని అతనిని చూచినప్పటి నుండి ఆమె మనసు ఉబలాట పడసాగింది. కుర్చీలో కూర్చున్న సుధ ఒకసారి నలువైపులా పరికించి చూచి, "మీ ఇల్లు చాలా బాగుందండీ!" అంది.
    మాధవ పేలవంగా నవ్వాడు.
    "ఏదోలా ఉన్నారు. వంట్లో బాగాలేదాండీ?"
    "ఆ" అన్నాడు మాధవ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS