7
"ఇప్పుడైనా లిల్లమ్మ ను ఒసారి చూసొద్దమా?" అన్నాడు రాఘవులు ఊళ్ళో అడుగుపెట్టి గంటయినా కాకుండానే....
చలపతి కాస్త తటపటాయించి చేతులు జోడించి "ఒరేయ్ రాఘవులు కాస్త నా పరువు కాపాడు." అన్నాడు.
"చెప్పను లెండి. అంత తెలివి తక్కువ వాడ్నా"
"ఇప్పుడెందుకులే." అన్నాడు చలపతి నసుగుతూ.
"ఒక్కసారి వెళ్దాం పదండి. మళ్ళీ అమ్మగారు కాపరానికి వస్తే ఎలాగూ వెళ్ళటం పడదు."

రాఘవులు బలవంతం మీద చలపతి అయిష్టం గానే అంతకుముందు రాఘవులి కి ఇచ్చిన మాట నిలబెట్టుకుందుకు బయల్దేరాడు. వాళ్ళు వెళ్ళేసరికి లిల్లమ్మ కాఫీ కాచుకుంటుంది.
తలుపు తీసేసరికి ఎదురుగ్గా చలపతి ఆమెకు రాఘవులు కంట పడేసరికి ఆమెకు ఒళ్ళు జలదరించినట్టుగా అయింది.
"రండి, లోపలికి రండి" అంటూ ఆహ్వానించింది.
రాఘవులు అక్కడ గుమ్మం దగ్గరే చతికిల బడ్డాడు. చలపతి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. ఇదివరకు అతను చనువుగా మంచం మీద కూర్చునేవాడు.
లిల్లమ్మ "ఒక్క నిమిషం కాఫీ తీసుకు వస్తాను." అంటూ లోపలికి వెళ్ళింది. మరో నిముషంలో రెండు కప్పులతో కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చి "ఇవ్వాళ నా ఇల్లు పావనం చెయ్యాలనే బుద్ది పుట్టిందెం?" అంది.
చలపతి "ఓసారి చూసిపోదాం అని వచ్చాను" అన్నాడు.
"పెళ్ళి బాగా జరిగిందా?" అంది లిల్లిమ్మ.
చలపతి "ఓహో పెళ్లి కేం చాలా వైభవంగా జరిగింది. బహుశా అలాంటి పెళ్ళి ఇంకెక్కడా జరిగి ఉండదు."
రాఘవులు సన్నగా దగ్గుతున్నాడు. చలపతి ఓసారి అతని ముఖంలోకి చూసి చూపుల్తో అతడ్ని హెచ్చరించాడు. రాఘవులు నోరు మెదపకుండా ఊరుకున్నాడు.
"అంతా బాగా జరిగిందన్న మాట. కట్నం ఏపాటి ఇచ్చారు?"
"ఐదు వేలు"
రాఘవులు "మరీ ఇంత ఘోరంగా కోతలు కొయ్యటం " అనుకుంటున్నాడు.
లిల్లమ్మ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ "అయితే మీరు ఖరీదైన పెళ్ళి కొడుకే నన్నమాట." అంది.
"అదేందమ్మా గారూ అయ్యగారికి అంతా బ్రహ్మ రధం పడితే" అన్నాడు.
"పోనీ ఓ చిన్న కారయినా కొనిచ్చారా."
ఈ ధోరణి ఎగతాళిగా ధ్వనించింది చలపతికి.
"ఆహా అయ్యగారే కొనిచ్చారా కారు?"
"ఏవిటీ కారు కొనిచ్చారా?"
రాఘవులు నవ్వేసి "రూపాయి పెట్టి బావమరిది గారి అబ్బాయికి ఒక కారు కొనిచ్చారు అయ్యగారు" అన్నాడు.
"అదా. ఇంతకీ అత్తగారు మీ అయ్యగారికేం కొనలేదా?"
రాఘవులు "కొంటారుట . మోటారు సైకిలు , మాట ఇచ్చారు" అన్నాడు.
"పెళ్ళి సలక్షణంగా గొడవలూ అవీ లేకుండా జరిగిందా?"
"ఆహా దివ్యంగా జరిగింది. ఊరు ఊరంతా పెళ్ళికి వచ్చారు"
"ఆశ్చర్యంగానే ఉంది" అంది లిల్లమ్మ నమ్మకం లేని స్వరంతో.
"ఇందులో ఆశ్చర్యం ఏముంది?"
"చలపతయ్య పెళ్ళంటే గొడవల్లెకుండా జరగడ మేమిటా అని." అంది లిల్లమ్మ.
"ఇప్పుడు అయ్యగారు చాలా మారిపోయారు లేండమ్మా." అన్నాడు రాఘవులు.
"మరి చుక్క పుచ్చుకోలేదు?"
'అది మాత్రం మానలేరు లెండి. ఎదేల్లా గున్నా అది మాత్రం మాములుగానే సాగిపోయింది"
"వాళ్ళు పసిగట్టలా?"
"రెండో కంటి వాడికి తెలియకుండా పుచ్చుకున్నారు."
చలపతి పెళ్ళికి సంబంధించిన వివరాలు చాలా చెప్పాడు. వాళ్ళు చాలా ఉన్నవాళ్ళనీ, చాలా మర్యాదస్తులనీ, పలుకుబడిగల వారనీ చెప్పాడు. అతను చెబుతున్న మాటలన్నీ "ఇప్పుడు నాకు స్టేటస్ పెరిగింది సుమా" అని చెబుతున్నట్టుగా వున్నాయి.
"మరి మీఅవిడని ఎప్పుడు తీసుకువస్తారు?' అంది లిల్లమ్మ.
"త్వరలోనే వస్తారు."
లిల్లమ్మ తన స్వంత వ్యవహారాలు, గొడవలూ ఏమీ అతనితో ఈసారి ప్రస్తావించలేదు. అతనూ అడగనూ లేదు.
చలపతికి ఆమె అసూయ పడుతున్నట్టు ఉడుక్కుంటూన్నట్టు కనబడింది. అతను ఓసారి ముక్కు ఎగపీల్చి "ఇక వస్తాను"అన్నాడు.
"అప్పుడేనా? ఇప్పుడేగా వచ్చింది" అంది లిల్లమ్మ.
చలపతి లేవబోతుంటే "కాసేపు కూర్చోండి, మళ్ళీ ఎప్పటికో దర్శనం" అంది.
'ఇక్కడే వుంటారుగా అయ్యగారూ" అన్నాడు రాఘవులు.
'అయ్యగారున్నా నేను ఉండొద్దూ" అంది లిల్లమ్మ.
చలపతి ఆశ్చర్యంగా "ఏం?' అన్నాడు.
"లిల్లమ్మ "నేను యాత్రలకి పోతున్నాను. అక్కడ తెలుసున్న వాళ్ళ సత్రం ఒకటి ఉంది. అక్కడ కొన్నాళ్ళు వుందామని అనుకుంటున్నాను." అంది.
"అదేందమ్మగారు . ఎప్పుడు వెళ్తున్నారు? ఎన్నాళ్ళు ఉంటారక్కడ?"
"ఓ వారం రోజుల్లో బయల్దేరుతున్నా, ఎన్నాళ్ళు ఉంటానో ఇప్పుడే ఇదమిద్దంగా తెల్చలేను." అంది.
ఆమె చాలా నిర్లిప్తంగా , విరక్తిగా వున్నట్టు కనిపించింది.
చలపతి ఓసారి ముక్కు ఎగపీల్చి "వెళ్ళటం మంచిదే" మనస్సుకు హాయిగా, విశ్రాంతి గా ఉంటుంది." అన్నాడు.
రాఘవులు ఈ ధోరణి నచ్చక "ఎందుకు లెండమ్మగారు . అక్కడ మీరు వుండలేరు. అలవాటు లేని చోట కష్టాలు పడతారు." అన్నాడు.
లిల్లమ్మ "ఆహా వెళ్ళాలి తప్పదు. డబ్బు కూడా కట్టేశాను." అని ఆమె యాత్రా స్పెషల్ వారి రసీదు తెచ్చి చూపించింది.
చలపతి ఆమె ధోరణికి బెదిరి తాను బ్రతిమిలాడి అగమంటానని కాబోలు అనుకున్నాడు. ఆ రసీదు చూసిం తర్వాత ఆమె ప్రయాణం ఖాయం అని నిర్ధారించుకుని ఆమె మనస్సు దెబ్బతినే వెళ్తుందని అనుకున్నాడు. అతనికి ఆ ధోరణి మరీ విపరీతంగా తోచింది.
"డబ్బు కడితే కట్టారు లెండమ్మా, ఎందుకు అనవసరంగా ప్రయాణం?" అన్నాడు రాఘవులు ఆమెను అపాలనే ధోరణి లో.
"వెళ్ళక తప్పదు." అంది లిల్లమ్మ.
"వెళ్ళనీ రాఘవులు. ఆమెకి ఎలా యిష్టం అయితే అలా చేస్తుంది. మనం ఎందుకు ఆపటం?" అన్నాడు చలపతి.
ఆమె ముఖంలో ఏ మార్పూ లేదు. చాలా నిర్లిప్తంగా ఓ ఖరారయిన నిర్ణయానికి వచ్చేసి నట్టుగా ఆమె కనిపించింది.
అయినా చలించలేదు చలపతి. అతనికి ఈమె చర్య మీద స్థితి గతుల మీద ఇప్పుడు సానుభూతి గాని జాలి గాని లేవు. ఒక వ్యక్తీ కొంతకాలం చెడు తిరుగుళ్ళు తిరిగి ఉండవచ్చు. అంతమాత్రాన తమ స్వార్ధం కోసరం ఎవరూ ఎదుటి వాళ్ళు తమ కోసవరం బలయి పోవాలని కోరుకునే హక్కు వారికి లేదు. ఆ ధోరణి ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. బహుశా రాఘవులు కూడా ఈమె ధోరణి హర్షిస్తాడని తాను అనుకోడు. తాను బ్రతిమిలాడి ఆమెకు కొన్ని సలహాలు ఇచ్చి ఈ ప్రయాణం అపు చేస్తానని ఆమె అభిప్రాయం . లేకుంటే ఆమె ఇప్పుడే ఈ ప్రయాణానికి ఎందుకు తలపెట్టాలి?"
చలపతి కుర్చీలోంచి లేచి "వుంటాను" అంటూ ఇవతలకు వచ్చాడు. ఆమె "మంచిది" అని మాత్రం అంది.
రాఘవులు "నా మాట విని వెళ్ళకండమ్మా." అన్నాడు.
లిల్లమ్మ "మళ్ళీ త్వరలో వచ్చేస్తాలే రాఘవులు" అంది.
రాఘవులు కళ్ళు వత్తుకోవడం చూశాడు చలపతి. లిల్లమ్మ చూసింది. "ఎందుకు రాఘవులు నీకు నా మీద అంత అభిమానం. నేను నీకు ఏం సహాయం చేశాను" అంది.
రాఘవులు సమాధానం చెప్పకుండా ముందుకు సాగిపోయాడు. లిల్లమ్మ లోపల కొచ్చి తలుపు వేసుకుంది.
ఇంకా చలపతి పాత ధోరణి లోనే ఉన్నాడు. తనిప్పుడు బాగుపడుతున్నట్టు తన జీవితం వెనకటి జీవితంలోంచి ఇంకా పైకి పోతుందని అతను అనుకుంటున్నాడు. గత జీవితంలో పైకి ఒక్క విషయం కూడా ఆఖరికి తనతో సాంగత్యం కూడా అతనికి వెగటు గానూ, అసహ్యంగానూ భావిస్తున్నాడు. అలాగని అతను ఏ వ్యసనమూ మానలేక పోవచ్చు, కాని అన్నిటి కంటే తన దగ్గరకు రావటం తనతో మునుపటి లా ఉండటం అన్నది చాలా నీచమైందిగా అతను భావిస్తున్నాడు. ఇప్పుడిలా వచ్చాడంటే అది తన మీద అభిమానం కాదు. తాను అన్న మాటలు తప్పని రుజువు చెయ్యటానికే వచ్చాడు. "నీ మాటలు నేను లక్ష్య పెట్టను సుమా. నేను సంసారం చెయ్యలేని అసమర్దుడ్ని అనుకుంటున్నావు కాబోలు, నా గౌరవం, మర్యాద ఇప్పుడు పెరిగాయి." అని చెప్పటానికే వచ్చాడు అని ఆమెకు అర్ధం అయింది. ఆమెకు చాలా కష్టంగానూ, దుస్సహంగానూ ఉన్న ప్రవర్తనే అది. అతన్ని ఆ భావన నుంచి తానెంతగా మార్చాలని చూసినా అతను మనస్సు మార్చుకో లేకపోతున్నాడు. అతను తన ఇంటికి మునుపటి లా రాకపోవచ్చు. కాని కనీసం తను తన అభిమానాన్ని గుర్తిస్తే చాలు" అనుకుంది. కాని అతను ఆ గుర్తింపు ఇవ్వటం రాఘవులు ఈ పరిస్థితులు గ్రహించాడు అతనికి అర్ధం అయిన ప్రేమాభిమానాలు చలపతయ్య కు అర్ధం కాలేదు. అతను ఏ విషయమూ సరిగ్గా అర్ధం చేసుకోలేడు. అపార్ధం చేసుకోవటం మాత్రం సులువుగా చేస్తాడు. ఒక అభిప్రాయానికి వస్తే మనస్సు తిప్పుకోలేడు. శుద్ధ మొద్దు స్వరూపం అలా ఉంటె మళ్ళీ ఊరేడు కోపం. ఇక్కడ ఉంటె తన పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోతుంది. చలపతి ఎలాగూ ఇంక రాడు. అందుకు సందేహం లేదు. అతను దూరం అయిన మరుక్షణం నలుగురి లోనూ నవ్వుల పాలవుతుంది. అతనితో ఉంటె అతడ్ని అతని సంసారం ను చెడ కొట్టేసింది అని అప్పుడు నింద వేసే లోకమే అతను దూరంగా తప్పుకోగానే ఎగతాళి చేస్తుంది. మంచు విడిచ కొండలా తన లొసుగు బట్ట బయలవుతుంది. తన చుట్టూ మళ్ళీ చెడు గ్రహాలు తిరగటం ఆరంభిస్తాయి. తన జీవితం మళ్ళీ మొదటి కొస్తుంది.ప్రస్తుతం ఊళ్ళో బాకీలు చాలా వరకూ తను వసూలు చేసింది. ఇక కొద్దిగా మాత్రం ఉన్నాయి. ఫర్వాలేదు ఎప్పటికైనా వసూలు చేసుకోవచ్చు. హృషీకేశం లో తెలుసున్న ఆవిడ ఈ ఊరు నించి వెళ్ళి స్థిరపడింది. ఆమె తన డబ్బుతో దైవకార్యాలు చేస్తూ అక్కడే స్థిరపడింది. ఆమెకు తాను కొన్నాళ్ళు అక్కడ ఉండే అవకాశం కల్పించమంటూ కోరుతూ ఉత్తరం రాస్తే ఆమె అంగీకారం తెల్పుతూ రాసింది. ఆమె ఆహ్వానం పెద్ద పెన్నిది దొరికినట్టుగా అనిపించింది. ఈ సదవకాశం జారవిడుచు కుంటే ఇక తన బ్రతుకు అల్లరి పాలయి పోతుంది. ఇక్కడ ఉంటె తనకి మనశ్శాంతి ఉండదు తనకి.
