"ఆ అవసరం లేదు .... " అని విక్రమ్ ఠక్కున ఫోను పెట్టెశాడు.
అతను బయలుదేరుతుండగా మరల ఫోను రిగ్గయ్యింది.
సరిత లైనులో వుంది.
కమిషనర్ చికాకుగా ఉన్నాడని గ్రహించి డిసిపి, ఎసీపి, ఇన్స్ స్పెక్టర్స్ బయటకు వెళ్ళారు.
"చెప్పు విసిగించకు ....."
విక్రమ్ మాటలకు హార్ట్ అయింది సరిత. ఇన్నాళ్ళు తమ సంసార జీవితంలో విక్రమ్ అంత చికాకుగా తనతోటి ఎప్పుడూ మాట్లాడి ఎరగడు.
"ఈ రోజు మీ కేమయ్యింది? వంట్లో బాగోలేదా? పని వత్తిడి ఎక్కువ యిందా?" ప్రశ్నల బాణం కురిపించింది.
"కుశుల ప్రశ్నలకి ఇది సమయంకాదు. ఫోను పెట్టేయి....." అని విసురుగా ఫోను పేట్టి ఛాంబర్ దాటాడు కమిషనర్ విక్రమ్.....
కమిషనర్ కారుతోపాటు డిసిపి, ఎసిపి, ఇన్స్ స్పెక్తర్స్ వెహికల్స్ కూడా కనబడుతోంది. అతని పెదాలమీద చిరునవ్వు లాస్యం చేస్తోంది. ఇప్పటిదాకా నినాదాలు చేస్తున్నా అందోళనకారులు ఠక్కున నినాదాలు ఆపారు.
మానభంగానికి గురి అయ్యింది అన్న, బాదితురాలని కమీషనర్ పిలిచాడు. ఆమెతోపాటు మహిళా మండలి ప్రెసిడెంట్, ప్రగతిశీలా అభ్యుదయ వేదిక కన్వీనర్ కూడా ముందుకు వచ్చారు.
"సౌత్ ఇన్ స్పెక్టర్, అతని సిబ్బంది మీద కేసు రిజిస్టరు చేస్తున్నాను దర్యాప్తు ఎసిపి శ్రీకళగారు చేస్తారు. మీరురండి హాస్పిటల్ లో మెడికల్ టెస్టులు పెట్టసాగారు."
హాస్పిటల్, పరిక్షలు కేసు ఇవన్నీ ఎందుకు న వలన పోలీసులు నష్టపోవడం నా కిష్టంలేదు . అయినా వాళ్ళను జైలును పంపితే మాత్రం పోయిన నా శీలం తిరిగి వస్తుందా?" పృధ్వీ భార్య నిలదీసింది.
"బాగుందమ్మా! నీ ఆర్గ్యుమెంట్ బావుంది నీ ప్రశ్నకు సమాధానం నేను కాదు. ఏ న్యాయస్థానం కూడా మాతో సహకరించాలి....."
కలెక్టర్ రమ్యశ్రీ కారు దిగింది.
"కమిషనర్ గారు కేసుపెట్టింది దర్యాప్తు జరిపిస్తానని, దోషులను శిక్షిస్తాను హామీ ఇచ్చారుగా. మీరు కమిషనర్ గారికి సహాకరించండి....." కమిషనరేట్ బయట వున్న అందోళనకారులను ఉద్దేశించి కలెక్టరు అంది.
కలెక్టరు కూడా స్త్రీయే కనుక మహిళలంతా శాంతించారు. ఆమె ఇచ్చిన భరోసాతో వాళ్ళకి నమ్మకం కుదిరింది.
కమిషనరు, కలెక్టరు ఇద్దరూ కారులో యూనివర్సిటీ జనరల్ హాస్పిటల్ కి బయలుదేరారు.
అందోళనకారులంతా పెద్ద పెట్టున నినాదాలిస్తూ రోడ్లవెంట ఊరేగుతూ యూనివర్సిటీజనరల్ హాస్పిటల్ వేపు బయలుదేరారు.
యూనివర్సిటీ జనరల్ హాస్పిటల్ లో పృధ్వీ భార్యకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.
30
కమిషనర్ చాంబరునుంచి బయటకు వచ్చిన అధికారి ఓ రెండు క్షణాలు వరలక్ష్మి గదిముందు ఆగాడు లోపలకు అడుగు పెట్టాలా వద్దా? అని తటపటాయించాడు.
వరలక్ష్మి టైఫ్ చేస్తుంది క్రీంగంట అతన్ని గమనిస్తోంది.
తన రాకను గమనించకుండా తనకు పట్టనట్టు కూర్చున్న వరలక్ష్మి చర్యకి అధికారి మనసు చివుక్కుమంది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు కదిలాడు.
"ఆ.... అధికారిగారు ...." వరలక్ష్మి కుర్చీలోంచి లేచి అతన్ని పిలుస్తూ అతని వెనుకే బయలుదేరింది.
అధికారి అప్పటికే మెయిన్ ఆఫీసుదాటి లాం లోకి వచ్చాడు. ఆ రోజు ఆదివారం కావటాన్న మినిస్టరియల్ సిబ్బంది లేరు. దూరంగా వున్న టెంట్ లో సెంట్రీ కానిస్టేబుల్ పహారా కాస్తున్నాడు.
"ప్లీజ్... అధికారిగారు ఓ క్షణం ఆగండి. మీతో పర్సనల్ గా మాట్లాడాలి."
"నాతోనా...."
"అవును"
"నాతో మీకంత అవసరం ఏమొచ్చింద. అయినా మీ వెనుక చాలా చాలా పెద్దవాళ్ళు అండదండలు వున్నాయిగా."
అతని పుల్లవరపు మాటలకి ఆమె హృదయం భారమయ్యింది. వస్తున్న దుఖాన్ని పంటి బిగువున అపుకుంది.
"మీరు ఎలా అనుకున్నా, నన్ను మీరు అపార్ధం చేసుకున్నా, నేను ఎప్పుడూ మీ అభిమానినే!"
అధికారి తలెత్తి ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు.
ఆమె కళ్ళలో నీలినీడలు చోటు చేసుకున్నాయి. వరలక్ష్మిని తను మాటలతో చిత్రవధ చేస్తున్నాడు.
తన బాధ అంత వరలక్ష్మి తనకి దూరమైపోతుందని కాదు. తెలిసి తెలసీ తన మెడకి ఉచ్చు బిగించుకుంటుంది. చేచేతుల తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్న అనుమానంతోనే అధికారి ఆమెపట్ల ముఖభావంగా ఉంటున్నాడు. పోలీసు వ్యవస్థలో నల్లనివన్నీ నీళ్ళు, తెల్లని వన్నీ పాలు అని పూర్తిగా విశ్వశించడంకూడా పొరపాటే! పైకి కరుకుగా కనిపించిన వాళ్ళంతా కఠినాత్ములు కారు! తాఫీగా మాట్లాడిన వాళ్ళంతా దయాద్రహృదయులు కారు!
అలానే చెడ్డ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నా స్వతహాగా చేడ్డవడా! పరిస్థితులు అతన్ని చెడ్డవాడిగా మర్చాయా! లేక చేడ్డవాడిని ఈ సమాజం అతనికి ముద్రవేసిందో తెలుసుకోవడం కష్టమే! అలాంటప్పుడు యీవ్యవస్థలో పనిచేస్తున్న ఆఫీసరు గురించి ఖచ్చితంగా ఒక స్థిరభిప్రాయానికి రావడం కష్టమే!
