Previous Page Next Page 
అధికారి పేజి 45

    కొత్తగా వచ్చిన పోలీసు కమిషనర్ విక్రం నోరు పారేసుకున్నాడని, ముక్కోపి అని, న్యాయాన్యాయాల విచక్షణ తెలియని మూర్కుడని వరలక్ష్మి ఒకప్పుడు రాజీనామా చేసింది. మరల అంతలోనే అతనోలోని ఏ గుణ విశేషమూ ఆమెను భ్రమింపజేస్తుండనిపిస్తోంది. ఒక టాఫ్ రాంక్ ఆఫీసర్ ముఖాన ఒక చిరుద్యోగి రాజీనామా లేఖ విసిరికొట్టినప్పుడు ఆ ఆఫీసరు హృదయంలో రగిలే బడబాగ్నిని అర్ధం చేసుకోలేని అమాయకుడు కాదు తను, కానీ వరలక్ష్మి చదువుకున్నది, అన్ని తెలివితేటలు గలది అతనిని నమ్మింది.
   
    ఒక లేడీ కానిస్టేబుల్ కి క్షమాపణ చెప్పుకునెంత విశాల హృదయం కమిషనర్ విక్రమ్ కి ఉందని తను అనుకోవడంలేదు. ఎలా చెప్పి వరలక్ష్మిని కన్వీన్స్ చేయాలో అర్ధంకాక తను ఇన్నాళ్ళు సతమతమవుతున్నాడు.
   
    "అధికారిగారు మీ మౌనం నన్ను బాధిస్తోంది! నేను ఏం తప్పుచేశానని నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నారు?"
   
    అధికారి అమెవేపు జాలిగా చూశాడు.
   
    "ప్లీజ్ చెప్పండి.... నేను తెలిసిగానీ, తెలియకగానీ తప్పుచేస్తే సరిదిద్దుకుంటాను."
   
    అధికారి సమాధానం చెప్పలేకపోయాడు.
   
    "పనేను ఇంతగా ప్రాదేయపడుతున్నా మీరు మౌనంగా వున్నారంటే నేను దృష్టిలో ఘోరమయిన తప్పుచేసయినా వుండాలి. లేదా మీ హృదయమలో నా స్థానం చెరిగిపోయి అయినా వుండాలి." ఆ మాటలు అంటున్నప్పుడు వరలక్ష్మి కళ్ళనుండి నీటిచుక్కలు నేలరాలాయి.
   
    అధికారికి నోటమాట రావడంలేదు. అలా అని అతని హృదయం బండాబారిపోయింది మనసు ముక్కలైపోలేదు.
   
    "ఐయాంసారీ లక్ష్మి.... నన్ను అపార్ధం చేసుకోవద్దు ప్రస్తుతపరిస్థితుల్లో నేను ఏమీ చెప్పలేదు నేను ఏదిచేసినా నీ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకునే చేస్తునాను నన్ను విశ్వసించు ప్రియ నేస్తమా!" అధికారి మనసులోని వ్యధనంతా అమెముండు వెళ్ళగక్కాలనుకున్నాడు. కానీ తన బాధ్యత అతనికి అడ్డు తగులుతుంది. మనసులోని మాట అతని గొంతుదాటి రావడంలేదు.
   
    అంతే వరలక్ష్మి వ్యానిటీ బాగ తెరచింది. మరుక్షణంలో లోడ్ చేసి వున్న రివాల్వర్ పైకి తీసింది.
   
    అధికారి ఆశ్చర్యపోయాడు. అనుమానంగా ఓ అడుగు ముందుకు వేశాడు. మరల అంతలోనే తనకు తాను సర్ది చెప్పుకున్నాడు.
   
    "వరలక్ష్మిగారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు......" చాలా రోజుల తర్వాత అధికారి వరలక్ష్మితో హితవుగా మాట్లాడిన ఒకే ఒక్క మాట అది.
   
    "భయపడకండి..... దీనితో నేనేమీ ఆత్మహత్య చేసుకోను. అలా అని కక్షతో ఎవరినిపడితే వాళ్ళను కలుస్తానని అనుకొండి. ఒక్కటి మాత్రం నిజం, ఈ రివాల్వర్ కి పని కల్పించేరోజు తప్పకవస్తుంది. ఆ రోజు కోసమే నేను వేయికళ్ళతో ఎదురు చూస్తునాను" ఆమె మాటల్లో ప్రతీకారం కన్నా పట్టుదల ప్రస్పుటంగా గోచరిస్తోంది. ఆవేశంకన్నా ఆలోచనతో కూడిన విషయ పరిజ్ఞానం ఆమెలో వుంది.
   
    "వరలక్ష్మి గారు ఈ రివల్వారు...." అనుమానంగా అడిగాడు.
   
    "అనుకున్నాను తప్పకుండా మీరు అడుగుతారనుకున్నాను. ఏం న దగ్గర రివాల్వర్ ఉండకూడదా? అయినా మీరు అనుమానించారుగనుక చెబుతున్నాను. నాకు రివాల్వర్ లైసెన్స్ వుంది."
   
    "ఆ......." అధికారి క్షణం నిర్ఘా౦త పోయాడు.
   
    "అవును వుంది. ఆ అవసరం నీ కెందుకొచ్చిందని మీరడగవచ్చు. యస్ ... అవసరం వుంది...." చెప్పడం ఆపి క్షణం గాలి పీల్చికుంది.
   
    "రివాల్వర్ వసరం మీకేందుకులేండి, మీకు రక్షణ కావాలంటే మేమంతా లేమా!"
   
    అతని మాటలకి వరలక్ష్మి పకపకా నవ్వింది.
   
    అధికారి చిన్నబుచ్చుకున్నాడు.
   
    "సారీ అధికారిగారు, మిమ్మల్ని హార్ట్ చేయాలని నేను అనడంకాదు. కానీ వాస్తవాన్నీ ఎవ్వరైనా అంగీకరించాలి."
   
    మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడంలేదు. మీరు నన్ను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తే చెప్పండి పరాయి వాడిని అనుకుంటే, ఇక జీవితంలో నామొహం మీకు చూపించను."
   
    "అధికారిగారు తొందరపడి ప్రతజ్ఞలు చేయవద్దు! మౌనం ఇప్పటికే మన మధ్య దూరాన్ని పెంచింది. ఇక మన వ్రుత్తి, ప్రవృత్తిలంటారా అగమ్య గోచరంగా వున్నాయి. ఇద్దరం ఒకే వ్యవస్థలో పనిచేస్తున్నా, మనుషులు కలిసినా, ఏ దుష్టశక్తి మనమధ్య అగాధాన్ని సృష్టింస్తోంది" ఆమె మాటల్లో ఆవేదన గూడుకట్టుకుంది.
   
    వరలక్ష్మి తనతో చెప్పడానికి ఎందుకు తటాపటా ఇస్తుందో! ఎంత ఆలోచించినా అధికారికి అర్ధం కావటం లేదు.  కాని ఆమె మనసులో ఏదో మదనపడుతుందని గ్రహించ గలిగాడు.
   
    వరలక్ష్మి తనని ఒక మంచి స్నేహితుడుగా భావించినా, లేక ప్రేముకుడిగా అంగీకరించినా తన మనసు విప్పి మాట్లాడావలసింది. కానీ ఆమె మనసులో తను లేనట్టా! అందుకే తనతో చెప్పలేక మదన పడుతున్నట్టా! అధికారి ఆలోచనలు పరి పరివిధాలుగా వున్నాయి.
   
    అతని ముందు వరలక్ష్మి చిటిక వేసింది.
   
    "వాట్ హిమాన్, కలలో  విహరిస్తున్నాట్టున్నారు."
   
    అధికారి ఉలుక్కిపడ్డాడు.
   
    వరలక్ష్మి అతని కళ్ళల్లోకి చూస్తూ చిలిపిగా నవ్వింది.
   
    ఇప్పుడు అతనికి ఎంతో రిలీఫ్ గా వుంది. మనసు ప్రశాంతంగా వుంది. ఆమె చేతిని అందుకుని ముద్దు పెట్టుకోబోయి  ఠక్కున చేయి వదిలేశాడు.
   
    అది కమిషనరేట్ ప్రాగాణం కావటం,  టెంట్ లో వున్న సెంట్రీ కానిస్టేబుల్ వాళ్ళిద్దరిని గుచ్చి గుచ్చి చూడటం అధికారి గమనించాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS