"ఊ ....ఫర్వాలేదు చెప్పు."
"వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు...."
"యూ సిల్లీఫెలో ... యూ ఆర్ ఏ పూల్ ..... నీ మీద విశ్వాసం లేక కాదు. నీ తెలివితేటలమీద నమ్మకం లేక కాదు నేనీ టాస్క్ నీకు అప్పజెప్పింది. గవర్నమెంటు నుండి నాకు ఎంత వత్తిడి వస్తుందో చెప్పినా నీకు అర్ధం కాదు. కేవలం నీ వర్క్ స్పీదఫ్ చేయమని చెప్పాదానికే నిన్ను పంపించాను...."
అంతే అధికారి మాట్లాడకుండా పిస్టల్ తీసుకుని కమిషనర్ కి స్మార్ట్ గా సాల్యూట్ చేశాడు.
సరిగా అదే సమయంలో డి.సి.పి రామచ౦ద్రరావు. సౌత్ ఇన్స్ స్పెక్టర్ కోపంతో తలెత్తి ఇన్స్ స్పెక్టర్ వైపు చికాకుగా చూశాడు. కమిషనర్.
సారీ ... సార్... మేటర్ మోస్ట్ సీరియస్ ...." సౌత్ ఇన్స్ స్పెక్టర్స్ సర్వస్ అయ్యాడు.
"ఒకే .... యూక్యారియాన్ అధికారి. విష్ యూ గుడ్ లక్ " కమిషనర్ అనడంతోనే అధికారి వెళ్ళిపోయాడు.
"వాట్ ఈజ్ ది మేటర్ డి.సి. పి. అధికారి వెళ్ళగానే కమిషనర్ అడిగాడు.
"సార్ పృధ్వీ ....
"యస్..... పృధ్వీ..."
సార్ పృద్వీ జాడ తెలుసుకోవడానికి అతని భార్యను మనవాళ్ళు నిర్భందించారు. త్రి టౌన్ పోలీసు స్టేషనులో పెట్టారు. ఇప్పుడామె తనను పోలీసులు మనభ౦గం చేశారని...."
"వ్వాట్.... కష్టోడియల్ రేఫ్....."
"యస్ ... సార్....."
"పృధ్వీ అజ్ఞాతంలోంచి వచ్చి ఎంత సేపయ్యింది......?"
"సార్ ..." డిసిపి ఇరకాటంలో పడ్డాడు.
"కమాన్ ... టెల్ మిది ట్రూత్ ....."
"సార్ పృద్వీ బయటకు వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీసుముందు నిరాహారదీక్ష ప్రారంభించి దాదాపు ఆరు గంటలు పైనే అయ్యింది...."
"దెన్, పృద్వీ భార్యను ఇంకా నిర్భందంలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆమెను వేంటనే రిలీజ్ చేసి ఉండాల్సింది.... చేసినదానికి అనుభవించండి, స్ట్రయిట్ ఐవిల్ సస్పెండ్ సౌత్ ఇన్స్ స్పెక్టర్ ..... కమీషన్రర్ సీరియస్ గా అన్నారు.
సౌత్ ఇన్స్స్పెక్టర్ ముఖం మాడిపోయింది. ముఖాన ముచ్చేమటలు పట్టాయి.
"సార్.... ఇందులో మన సిబ్బంది తప్పు ఏమీ లేదు సార్! మనల్ని అన్ పాపులర్ చేసి, తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి పృద్వీ తన భార్యను అడ్డం పెట్టుకుని ఆడిన నాటకం కనిపిస్తోంది!"
'దెన్ యూ సాల్ వది ఇష్యూ."
"సార్ ... అది..."
"యస్... అది మీ వల్లకాదు. మీ చేయి దాటిపోయింది. మహిళా సంఘాలు. అపోజోషన్ పార్టీ వాళ్ళు ఉద్యమించారు అవునా...."
అంతా మౌనంగా ఉండిపోయారు.
"సే! యస్ ఆర్ నో..... నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి."
"సర్.... మీరు ఎన్నట్టు సమస్య జఠిలమయ్యేటట్లే వుంది. మీరు ఇన్ స్ట్రక్షన్స్ ఏమన్నా ఇస్తారుమోనని...." డిసిపి నీళ్ళు నలుముతున్నాడు.
"వాట్ డి.సి.పి. నువ్వేదో పెద్ద సీనియర్ ని, చాలా ఎక్స్ సీరియస్ ఉందనుకున్నాను. చిన్న ఇష్యూని డీల్ చేయలేక పోతున్నావు...."
"సార్ .... ఐయాం రడీ టు ఫేస్, అండ్ డీల్ ది సీట్యాయేషన్, కానీ ముందుగా మీతో ఓ మాట చెబుదామని...."
"రైట్ .... ఏం చేద్దాం అనుకుంటున్నారు?"
"సార్ సిటిలో 144 డిక్లేర్ చేస్తాను మహిళామండలి ప్రెసిడెంట్ అపోజిషన్ పార్టీ లీడర్స్ అరెస్టు చేస్తాను...." ఠక్కున సమాధానం చెప్పాడు.
కమిషనర్ పకపకా నవ్వాడు.
డిసిపి హార్ట్ అయ్యాడు.
ఇన్స్ స్పెక్టర్ అంతా అగమ్యగోచరంగా వుంది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు తనమీద, తన స్టేషన్లు సిబ్బందిమీద విరుచుకుపడుతున్నాయి. కొంపతీసి తను పృద్వీ భార్యను మానభంగం చేసినట్టు తన మీద కమిషనర్ గాని రేఫ్ కేసు పెట్టించడు కదా! అదే జరిగితే తనకి మిగిలేది చిప్పకూడు. తలచుకాగానే గుండె దడ మొదలయ్యింది.
"నాన్ సేన్స్ ..... యూ ఫెలోస్, డు నాట్ ఎప్లే బ్రౌన్స్...." కమిషనర్ ముఖం ఎర్రబడింది.
"సార్ అక్కడ సిట్యూయేషన్ ఏం బాగోలేదు. మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి...." డిసిపి కంగారుగా అన్నాడు.
"యస్... ఏదో ఒకటి చేయాలి. అదే... ఏం చేయాలి" కమిషనర్ ఏమోషనల్ గా రోయాక్టయ్యాడు.
"సార్.... జనం కమిషనర్ రేట్ ని ముట్టడించారు" ఎసిపి శ్రీకళ స్ప్రింగ్ డోర్ తెరచుకుని కంగారుగా వచ్చింది.
కమిషనర్ సీటులోంచి లేచి టోపి సరిచేసుకున్నాడు. కమిషనర్ టేబుల్ మీదున్న తన పిస్టల్ తీసుకున్నాడు.
"సార్.... " ఎ.సి.పి. శ్రీకళ మాట్లాడాటానికి ప్రయత్నించింది.
"నో... మీకు లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేయాలో తేలియదు..... "కమిషనర్ రెండడుగులు వేయగానే ఫోన్ రింగయింది. వెనక్కీ వచ్చి రిసీవర్ తీశాడు.
"నేనండీ! సరితను ...." అవతల్నుండి సరిత మాట్లాడుతోంది.
"ఊ.....చెప్పు...."
"లా అండ్ ఆర్డర్ ఐజి ఇక్కడినుండి ఫోర్స్ పంపమన్నారు. నన్ను క్యాంఫ్ చేయమన్నారు......"
