Previous Page Next Page 
మహాశక్తి పేజి 44

    "ఆ పనైతే నీదాకా ఎందుకురా, సారా బట్టీలో కట్టెల కింద పెట్టి కాల్చేసేవాడు కోటినాగులు. ఆ కోడి పుంజుని మన దొడ్లో కట్టేసుకొని, పందెం పుంజుగా పెంచుకోవాలి."

    "ఇదేం రాజకీయం గురూగారు?"

    "నీ గురూగారి రాజకీయం అంటే అదేరా వెర్రి పాపన్నా నువ్విప్పుడు అర్జంటుగా ఓ పనిచెయ్యాలి."

    "సెలవివ్వండి."

    "ఓ మంచి టెంటు పాతాలి."

    పాపారావు కళ్ళు మెరిశాయి.

    "కొత్తపిట్టా!"

    "అవును కొత్తదే కాలేజీ పిట్ట. అది నీ గురూగారి గుండె కెలికి కెలికి పారేసింది. అందుచేత దానికో టెంటేసి దాన్ని నలిపి పారేయించు."

    "త్వరగా సెలవివ్వండి గురూగారూ కొత్త లేత చికెన్ కోసం నా కష్టమర్లు ఆవురావురు మంటున్నారు."

    ఆ కొత్త పిట్ట గురూగారి కూతురు లెవల్లో ఉంటే బావుండునని మనసులో అనుకొంటున్నాడు పాపారావు.

    "ఆ పిట్ట పేరు స్వర్ణ. లేత లెగ్గార్ నే"

    పాపారావు కళ్ళు చిన్నవి చేసి చూశాడు.

    "అంటే మీరు గుండు కొట్టించిన......"

    "అవునదే."

    "ఛ.....ఛ.....ఛ...... పరువు తీసేశారు కదండీ గురూగారూ! అది నడవదండీ."

    "దానికేవయిందిరా?"

    "గుండుదాని దగ్గర కెవరొస్తాడండీ బాబూ. ఎంత చీకట్లో పనైనా కష్టమర్లు నాకు గుండు గీసేస్తారు. కుదర్దండీ" అన్నాడు బాధపడిపోతూ పాపారావు.

    "అదో సమస్యటరా పాపన్నా నీకు! ఓ విగ్గు కొని పెట్టేయ్. అది మళ్ళీ నీ కోటలోంచి బయటికి రాకూడదు. పోలీసోళ్ళకిగానీ, ఊళ్ళో వాళ్ళకి గానీ ఆచూకీ తెలియకూడదు."

    పాపారావు అసహ్యంగా నవ్వాడు.

    "మన కోటలో అడుగెట్టాక అంతఃపురం కాంత అయిపోతుంది. గురుగారూ..... నా దగ్గర పేర్ల లిస్ట్ లో మంచి పేరు కూడా ఉంది. ఆ పేరుతో దాన్ని చలామణి చేస్తాను."

    "ఏం పేరు?"

    "స్వర్ణనే పేరు కొట్టిపారేసి 'జయంతి' అని కొత్త పేరుతో రంగప్రవేశం చేయిస్తాను. దాని చరిత్రని మన కోటలో ఎలా పెంచేస్తానో మీరే చూద్దురుగానీ."

    "ఈ రాత్రికే దాన్ని లేపేయ్."

    "ఇంక చెప్పద్దు. ఇక పనినాది. అయితే రెడ్ రిబ్బన్ ఎవరితో కత్తిరింపజేసి ఓపినింగు చెయ్యాలా అని."

    అంకయ్య నవ్వాడు.

    "నీ గురూగారుండగా రెడ్ రిబ్బన్ కత్తిరించడానికి కొత్తోడెందుకురా? ఓపినింగ్ మనమే చేద్దాం."

    "సరే కానీండి" అన్నాడు పాపారావు.
       
                                                                19

    ఈశ్వర్ తన స్నేహితులతో పాన్ షాపు దగ్గర నించుని సిగరెట్ కాలుస్తున్నాడు.

    రాజు, ముకుందం, చలపతి అతని పక్కనే నించుని ఉన్నారు.

    "బాబూ! రక్షించండి. కాపాడండి."

    కేకలు వినబడ్డాయి. రోడ్డుకి అవతల పక్క ఏదో గలాటా జరుగుతోంది.

    ఈశ్వర్ అటుకేసి తల తిప్పి చూశాడు.

    ఎదురుగా ఓ ఇంటి ముందు ఓ ముసలిమనిషి. ఏడుస్తూ కేకలు పెడుతున్నాడు. అరవై ఏళ్ళుంటాయతనికి.

    బాగా దృఢంగా ఉన్న ఓ రౌడీ కొడుతున్నాడు, ఆ ముసలి మనిషిని.

    అక్కడ చేరిన జనం అదంతా చోద్యంగా చూస్తున్నారే తప్ప ఎవరూ కల్పించుకోవడం లేదు.

    ఈశ్వర్ చేతిలో సిగరెట్ ని పెదాల మధ్య పెట్టుకుని అటుకేసి కదిలాడు అడుగులో అడుగువేస్తూ ఓ సింహం కదులుతున్నట్టు.

    అతని వెనకే అతని స్నేహితులూ నడిచారు.

    "బాబూ చూడండి దారుణం. నేనేం చెయ్యలేదు. నన్ను కాపాడండి ఈ రౌడీగాడితో నా ఇల్లు కాళీ చేయించండి బాబూ. అద్దె ఇవ్వడంలేదు. డబ్బు అడిగితే కొడుతున్నాడు. నేనెలా బతకాలి?" రోదిస్తున్నాడు వృద్ధుడు.

    "నోరెత్తితే చంపేస్తా ముసలినాకొడకా!" ఒక్కతోపు తోశాడు. ఆ వృద్ధుడి భార్య కాబోలు భర్తని పడిపోకుండా పట్టుకుంది. ఆమె బోరుమని ఏడుస్తోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS