Previous Page Next Page 
అధికారి పేజి 41

    తన మీద కప్పిన శాలువాను తీసి ఆమెకు కప్పాడు.
   
    "వద్దు బాబు...." ముసల్ది అభిమానపడుతోంది.
   
    "చలికాలం.... దీని అవసరం నాకన్నా మీకే ఎక్కువుగా వుంటుంది. తీసుకువెళ్ళండి....." అంటూ ఆ ముసలిదాన్ని గుమ్మం దాకా సాగనంపాడు.
   
    కొత్త దంపతులు అధికారి వద్ద శలవు తీసుకుని వెళుతుండగా వాళ్ళ చేతుల్లో ముసలమ్మా తెచ్చిన పళ్ళు పెట్టాడు. వాళ్ళు అయోమయంగా చూశారు.
   
    కొత్త దంపతులను ఉట్టి చేతులతో పంపకూడదు.... వాళ్ళని సమాధానపరిచాడు.
   
    ఏ.జి.ఎస్ ఇన్స్ స్పెక్తర్స్  హరిశ్చంద్రుడు రావడంతోనే, అధికారి లేచి సాల్యూట్ కొట్టాడు.
   
    "నిన్ను ఉన్న ఫళంగా కమిషనర్ గారు తీసుకురామ్మన్నారోయ్!"
   
    "అలాగేసార్ మీరు పదండి. వీళ్ళని పంపించి నేను వెంటనే బయలుదేరి వస్తాను...."
   
    "అలాగంటే కుదరదు.... కమిషనర్ గారు నిన్ను వెంటబెట్టుకుని తీసురమ్మన్నారు......" ఈ సారి ఇన్స్ స్పెక్టర్ గొంతులో కమాండ్ వినిపిస్తోంది.
   
    అధికారి మాట్లాడలేదు. వచ్చిన ఫిర్యాదదులను తీసుకున్నాడు. కొందరిసమస్యలు పరిష్కారం అవ్వడంతో వాళ్ళంతా అభిమానంగా అధికారికి కృతఙ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు.  అధికారి వాళ్ళందర్నీ సంతృప్తి పరచి, ఇన్స్ స్పెక్టర్ వెంట జీపులో బయలుదేరాడు.
   
                                                                           29
   
    బెనర్జీ మినిష్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా ఇరవైనలుగు గంటలైనా కాలేదు. అప్పుడే అతని ప్రత్యర్ధులపైన దాడులు ప్రారంభమయ్యాయి. నిరాహార దీక్షా శిభిరంలో వున్న పృద్వీ. అతని అనుచరులను ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. విలేఖర్లు ప్రుద్వీని ఇంటర్వ్యూ చేశారు. "నా మీద నా అనుచరులు మీద దాడుల వెనుక హమ్ మినిష్టర్ బెనర్జీ హస్తం వుందని ఖరాఖండిగా చెబుతున్నాను. నా మీద ఇప్పటికి రెండుసార్లు హత్యా ప్రయత్నం జరిగింది. శ్రీమాన్ బెనర్జీ హొమ్ మినిష్టర్ గా ప్రమాణ స్వాకారం చేసిన రోజునే ముక్కు పచ్చలారని నా తమ్ముడుని ఘోరాతిఘోరంగా నరికించాడు. నన్ను అంతం చేయడానికి ప్లాన్ సిద్దం అయ్యిందని తెలిసి అజ్ఞాతం లోకి వెళ్ళాను నాకు రక్షణ కల్పించమని పోలీసులు బెనర్జీకి, అతని మనుషలకు లోత్తులయ్యారు. నన్ను పట్టుకోవడానికి నా భార్యను నిర్భంధించారు.
   
    హైకోర్టు నుండి బెయిల్ పొందిన నాకు, బెయిల్ క్యాన్సిల్ చేయించడానికి నేను రోజూ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టలేద్దన్న కుంతి సాగుతో నా బెయిల్ కాన్సిల్ చేయించటానికి పోలీసులు కుయుక్తులు పన్నుతున్నారు. ఈ విషయాన్ని నా అభిమానులకు, ప్రజలకు, ప్రెస్ కు తెలియజేయాలనే ప్రాణాలకు తెగించి ఈ శిభిరంలో కూర్చున్నాను. ఈ క్షణం నుండి ఎక్కడ, ఎప్పుడు ఏం జరుగుతుందో మా కేవ్వరికి అంతుబట్టడం లేదు.   అంతా అగమ్య గోచరంగా ఉంది. అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నాకు, నా ప్రాణానికి బెనర్జీ వలెనేముప్పు జరిగే ప్రమాదముంది ఇది న అభిమాన ప్రజలు గుర్తు పెట్టుకుంటే చాలు. రౌడీ రాజకీయం చేయడం, హత్యలు చేయడం, హత్యలు చేయించడం పదవులకోసం ప్రాకులాడడం బెనర్జీ లాంటి వ్యక్తులకే చెల్లింది. నాకు రౌడీ ఇజం అవసరం లేదు. నేను పదవుల కోసం హత్యలు చేయాల్సిన పనిలేదు.  నాకు  నా ప్రజల అభిమానమే కొండంత బలం వాళ్ళ కోసం న చివరి రక్తపు బొట్టును ధరపోయడానికికైనా నేను సిద్దంగానే వున్నాను.
   
    పదిమర్డర్లు చేసిన వ్యక్తిని, రౌడీ షీటు వున్న వ్యక్తిని ఊసరవేల్లిలా క్షణానికో పార్టీ మార్చే వ్యక్తిని అధికార పార్టీ ఆహ్వానించింది అంత పెద్ద పీట వేసిందంటే దాని వెనుక బెనర్జీ ఎంతటి కుటిల రాజకీయం చేశాడో మీకు అర్ధం అయ్యే వుంటుంది.
   
    అటువంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్ర శాంతి భద్రతలను పెట్టడం ఎంతవరకు సంమంజసమో మేధావులు మీరే ఆలోచించండి. "పృధ్వీ మాట్లాడటం ఠక్కున ఆపాడు. శిబిరం వైపు ఎవరో వ్యక్తి దూసుకుని వస్తున్నాడు.
   
     "అన్నా.... అన్యాయం జరిగిపోయిందన్నా......" పృధ్వీ అనుచరుడొకడు శిబిరం దగ్గరకు పరుగు పరుగున వచ్చి గగ్గోలు పెట్టాడు.
   
    పృధ్వీ చివ్వున తల ఎత్తాడు. ఇప్పుడతని ముఖంలో ప్రకంపనలు పుట్టాయి. అంతలోనే తాను కంట్రోల్ చేసుకుంటూ  "చెప్పరా... ఏ ఘోరం విన్నా తట్టుకునే గుండెధైర్యం ఆ దేవుడు నాకు ప్రసాదించాడు...... ఊ ఫర్వాలేదు చెప్పు......  
   
    "అన్నా .... పోలీసు స్టేషన్ లో వదినమ్మపై పోలీసులు అఘాయిత్యం ...." ఆపై అతను మాట్లాడలేక పోయాడు.
   
    విషయం తెలిసిన విలేఖర్లు విభ్రాంతికి గురయ్యారు. పట్టాపగలు, నగర నడిబొడ్డున పోలీసు స్టేషను లో.సిటీలోనే పేరు మోపిన వ్యక్తి పృధ్వీ భార్య మానభంగానికి గురి అయ్యిందన్న విషయం మింగుడు పడడంలేదు.  కానీ నిజానికిది వాస్తవం. ఇప్పుడు పృధ్వీ, అతని అభిమానుల రియాక్షన్ ఎలా వుంటుందోనని ఆలోచనలో పడ్డారు.
   
    దూరం నుంచి అరుపులు, , నినాదాలు వినిపిస్తున్నా పోటెత్తిన సముద్రంలా మహిళలు సభ కలెక్టర్ ఆఫీస్ వైపుకు దూసుకు వస్తున్నారు.
   
                                               *    *    *    *   
   
    పోలీసు కమిషనర్ ఆఫీసులో క్యామ్ఫ్ క్లార్క్ స్థానంలో లేడీ కాని స్టేబుల్ వరలక్ష్మి కూర్చుని టిఫ్ చేస్తుంది.
   
    అధికారిని చూస్తూనే ఆమె పలకరింపుగా చిరునవ్వు నవ్వింది. అతను ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు.
   
    "బాగున్నారా...."

    సౌత్ ఇన్స్ స్పెక్టర్ కమిషనర్ చాబంర్ లోకి వెళ్ళిన తరువాత మెల్లిగా అడిగింది.
   
    అధికారి మౌనంగా ఉండిపోయాడు.
   
    "మీరు ప్రైవైటు పంచాయితీలు చేయకుండా ఉండాల్సింది, కమిషనరు గారికి కోపం వచ్చినట్లుంది......"
   
    వరలక్ష్మి మాటలకి అధికారి చివ్వున తల ఎత్తాడు. ఇప్పుడతనికళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS