"యూ బ్లడీ పూల్ నేనడిగిందేమిటి? నువ్వు చెప్పేదేమిటి? ఇక్కడ ఏం జరుగుతుంది?" కమిషనర్ మరోసారి అడిగాడు.
"సార్.... అధికారి ఉండేది ముడిపడింది. తలెత్తి మరల ఓ సారి ఆ జనం కేసి చూశారు. శనివారం వెంకటేశ్వరస్వామీ దర్శనార్ధం, వచ్చినవాళ్ళే సార్!"
ఆ మాటతో కమిషనరు బృకటి ముడిపడింది. తలెత్తి మరల ఓ సారి ఆ జనంకేసి చూసారు. శనివారం వెంకటేశ్వరస్వామీ దర్శనార్ధం, గురువారం, సాయిబాబా శుక్రవారం కనకదుర్గ అమ్మవారి దర్శనార్ధం, వచ్చిన భక్తుల్లా వున్నారు జనం, కొందరి చేతులలో స్వీటు పాకెట్లు, యింకొందరి చేతులలో కొత్త బట్టలు వున్నాయి.
కమిషనర్ పళ్ళు పటపటా మంటూ కొరికాడు. వెంటనే సెట్ అన్ చేసి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్స్ కాంటాక్టు చేశాడు.
"యూ పిట్ ఫర్ నథింగ్ ఫెలోస్, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది, ఒక్క కానిస్టేబుల్ వల్ల ఏం అవుతుంది. సెండ్ సమ్ మోర్ కానిస్టేబుల్స్ , నువ్వు నీ ఎస్ ఐ లు ఐదు నిముషాల్లో యిక్కడ ఉండాలి....."
"సార్...... విఐపి......" ట్రాఫిక్ ఇన్స్ పెక్టరు హడావడిగా ఏదో చెప్పాబోయెడు.
"ఓవర్... అండ్ అవుట్....." కమిషనర్ అతన్ని కట చేశాడు.
"విక్టర్ ముభైల్ కాలింగ్ జాకీ రిపోర్టు సిగ్నల్స్" కమిషనర్ మెటాలిక్ వాయిస్ సెట్ లో ఖంగుమంటుంది.
"అల్ స్టేషన్స్ స్టాండ్స్ బై అల్ స్టేషన్స్ స్టాండ్ బై, విక్టర్ ఆఫీసరు గారు ఎజిఎస్, సిఐ గారిని అడుగుతున్నారు. జాకీ.... జాకీ.... ఫ్రంకంట్రోల్.... జాకీ ఫ్రం కంట్రోల్ ...." హెడ్ క్వార్దర్స్ వైర్ లేస్ ఇన్స్ స్పెక్టర్ కాంటాక్టు చేస్తున్నాడు. జాకీ..... జాకి రెస్పాండింగ్ కంట్రోల్...... జాకీ రెస్పాండింగ్ కంట్రోల్ ...." జాకీనుండి హెడ్ కానిస్టేబుల్ కాంటాక్టు చేశాడు.
"సార్ సిఐగారుజాకీ ముబైల్ లో వున్నారు సార్"
"నోమోర్ ఆర్గ్యుమెంట్స్, కమ్ డౌన్ ఇమీడీయట్లీ నీ వెంట్ సౌత్ సిబిని కూడా తీసుకురా ... రోజర్ అండ్ అవుట్....." కమిషనర్ విసుక్కున్నాడు.
"ఏ.జి ఏస్. సి.ఐ హరిశ్చంద్రుడు, సౌత్ సి.బి. హుటాహుటిన కమిషనర్ ఉన్న చోటుకి వచ్చారు.
"నమస్తేసార్",,,,ఇద్దరూ కమిషనర్ కి స్మార్ట్ గా సెల్యూట్ చేశారు.
వినయానీకేం తక్కువ లేదు! అ స్మార్ట్ నేస్ ట్యూటీ చేయడంలో చూపించండి......"
"సార్ దొరగారు రమ్మన్నారు, ఇన్స్ స్ట్రక్షన్స్ ఇస్తే....." సౌత్ సిబి మధ్యలోనే ఆగి నీళ్ళు నలుముతున్నాడు.
"ఒట్టి బవూన్ లా ఉన్నావే! యూడో౦ట్ నో వాట్ ఈజ్ గోయింగ్ అన్ ఇన్ యువర్ జూరిస్ డిక్షన్! యూఫెలో. నెవ్వర్ బదర్ టు నో ఇట్ అల్ సో....."
అప్పటికే ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్, అతని సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేశారు.
"ఎజిఏస్ సిబి! నువ్వు అధికారిని తీసుకుని నా చాంబర్ కి రా...." కమిషనర్ వెళ్ళిపోయాడు.
అక్కడ వానకురిసి వేలిసిల్లినట్లయింది. అఫీసర్లంతా తృప్తిగా గాలిపీల్చుకున్నారు.
ఇన్ స్పెక్టర్స్ హరిశ్చంద్రుడు అధికారి ఇంటివేపు బయలుదేరాడు. అక్కడి వాతావరణం చూసిన ఇన్స్ స్పెక్తర్స్ మతి పోయినంత పని అయ్యింది.
సౌత్ ఇన్స్ స్పెక్టర్స్ సెట్ లో కంట్రోల్ రూం నుంచి వార్త విన్న వెంటనే హడావిడిగా సబ్ కలెక్టర్ ఆఫీసుకు బయలుదేరాడు. అప్పటికే పృధ్వీ అతని అనుచరులు టెంట్ వేసి, ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. జన చేరుతున్నారు.
* * * * *
తీసుకోబాబు...." ఓ ముసలమ్మా చేతి సంచిలోంచి పళ్ళు తీసి అధికారి చేతిలో పెట్టింది.
ఆమె వయస్సు దాదాపు కాటికి చావుకున్నట్టే వుంది. వంటి మీద ఉన్న నేత చీర, జాకెట్టు రంగువెలసి పోవడమేకాకుండా జీర్ణావస్థలో వున్నట్టు అక్కడక్కడ చిరుగులు వున్నాయి.
అధికారి మనస్సు చివుక్కుమన్నది. తను ఆమెకు చేసిన సహాయం అంటూ ఏమీ లేదు. ఆమెకు ఉన్న ఒక్క గాని ఇక్క కొడుకు కోడలు, ఆమెను ఇంట్లోంచి తరిమేశారు.శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఆమె తన పేరున ఉన్న పొలంలో పళ్ళు, కయగూరలు పండించి, కూడబెట్టింది. కూడా కొడుకుకే ఇచ్చింది. ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా పోయి కళ్ళు చూపుకూడా తగ్గడంతో తను ఏ పనీ చేయలేక ఒకరిమీద ఆధారపడవల్సిన పరిస్థితి ఏర్పడింది.
నలుగురి ద్వారా అ నోటా, ఈ నోటా అధికారి తనకు న్యాయం చేస్తాడని వచ్చింది. ఆమె గాధ తెలుసుకుని, ఆమె కొడుకు, కోడలని, పిలిపించి, అధికారి వాళ్ళకి తల్లిప్రేమ గురించి, కొడుకును కనడానికి పెంచడానికి ఆ తల్లి పడ్డా కష్టనష్టాలను చెప్పి, వాళ్ళకి వాళ్ళ బాధ్యత గుర్తుచేసి కనువిప్పు కలిగించాడు.
ఇప్పుడు వాళ్ళు ఆమెను నెత్తిమీద పెట్టుకొకపోయినా ఆమెకు పిడికెడు మెతుకులు పెట్టడానికి, వాళ్ళ పంచన పడి ఉండడానికి ఒప్పుకున్నారు. అ సంతోషంతోనే ఈ ముసలది అధికారికి పళ్ళు త్రీసుకుని వచ్చి ఇచ్చింది.
సరిగ్గా అదే సమయానికి నూతన వధూవరులు వచ్చి అధికారి కాళ్ళలో నమస్కరించారు. వాళ్ళు అధికారికి శాలువా కప్పారు. ఆ ప్రేమ జమ్తలకి పెళ్ళి చేయడమే అతను చేసిన గొప్పపని, నిజానికి అధికారి గనుక పూనుకోకపొతే ఆ పెళ్ళి జరిగేది కాదు.
"మామ్మాగారు..." వెళ్ళిపోతున్న ముసలమ్మను అధికారి పిలిచాడు.
