ఆమె కిందట వారం దర్భారుకు వచ్చింది. తన భర్త తిరుగుబోతు అని, ఎవేతినో, ఉంచుకుని తనకి, తనపిల్లలకి అన్యాయం చేస్తున్నాడని, పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేస్తే ఏ యక్షన్స్ కి తీసుకోలేదని ఆమె కమిషనరుకి అరోపణ చేసింది. కమిషనరు ఆ స్టేషను సబ్ ఇన్స్ స్పేక్టరుని మందలించి తిరిగి వచ్చేవారం జరిపే దర్యాప్తులోపు ఆమె కాపురాన్ని చక్కబెట్టాలని అల్టిమేటం ఇచ్చాడు. ఇప్పుడామేను తనకి న్యాయం జరిగిందాని అడుగుతున్నాడు. ఆమె కాపురం చక్కబడిందా లేదా? అన్న విషయం కమిషనర్ స్వయంగా పిర్యాదు నోటిద్వారా తెలుసుకోవడమే తను నిర్వహిస్తున్న దర్భారుల విశేషం.
"అయ్యా నా కాపురం చక్కబడిందయ్యా. ఇప్పుడు నా భర్త ఆ వగలాడిని వదిలి నన్ను చక్కగా చూసుకుంటున్నాడు. ఇది అంతా ఆ బాబు దయవల్లే జరిగి౦దయ్యా!"
"ఎవరు ? ఎవరి దయ?" కమిషనర్ విక్రమ్ అనుమానంగా అడిగాడు.
"మీరు చెప్పిన సభ్ ఇన్స్ స్పెక్టర్స్ కాదయ్యా కానిస్టేబుల్ అధికారి బాబు మా ఇద్దరి మధ్య సఖ్యత చేకూర్చారు" ఆమె ముఖంలో సంతృప్తి కనిపిస్తోంది.
ప్రెస్ చకచకా రాసుకుపోతున్నారు. పోలీసు అధికారులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూన్నారు. పోలీసు అధికారులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు.
"కమిషనర్ ముఖంలో రంగులు మారాయి. ప్లాష్ కెమేరాలు క్లిక్ మన్నాయి.
"అమ్మా నీ పని అయిపోయిందిగా ఇక నువ్వు వెళ్ళొచ్చు" కమిషనరు అనడంతోనే ఆమె పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది.
"మీ అన్నదమ్ముల ఆస్తి తగాదా ఎంతదాకా వచ్చింది?" అక్కడ దర్భారులో వున్న అన్నదమ్ముల్ని ఇద్దర్నీ ఉద్దేశించి అడిగాడు.
"సార్ మేము మా మీదవున్న క్రిమినల్ కేసులను ఉపసంహరించుకున్నాం. చెరోక పోర్షన్ లో ఉండడానికి నిర్ణయించుకున్నాం. బ్యాంకులో వున్న క్యాష్ చేరి సగం చేసుకుని కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నాం......"
"ఓ.కే ..... ఇట్స్ మీ గొడవలు మా వన్ టౌన్ ఎస్ ఐ పరిష్కరించాడుగా?"
"సారీ సార్! అయన వలన ఏమి అవుతుంది సార్. పైసా ఖర్చు లేకుండా అధికారి బాబు మా మధ్య అడ్డుగోడలను కూల్చేశాడు......"
విలేఖరులు చకచక రాసుకుపోతున్నారు. పోలీసు ఆఫీసర్లు ఈసారి తమలో తామే నవ్వుకున్నారు.
కమిషనర్ ముఖం కళావీహీనం అయ్యింది. మరోసారి కెమెరాలు క్లిక్ మన్నాయి.
"ఓ.కే ... యు కేన్ గో....." కమిషనర్ అతికష్టంమీద అనగలిగాడు. అది దర్భారులా లేదు. అధికారి గుణ విశేషాలని ప్రశ౦సించడానికి ఏర్పాటు చేసిన సభలావుంది.
అ దర్భారుకు చాలామంది పిటిషన్ దార్లు వచ్చారు. ఉదయం పది గంటలకు మొదలై సాయంత్రం అరుగంటలదాకా ఏకబిగిని జరిగే పోలీసు దర్భారులో విచిత్రమైనా కేసులు వస్తుంటాయి. వాటిని చాలా ఓపికతో పరుష్కరించాల్సి వుంటుంది. పోలీసు స్టేషనులో తమకు న్యాయం జరగలేదనే అభియోగాలే ఎక్కువ వస్తుంటాయి. సంబధిత అధికారులను మందలించడం, బాధితలను సత్వర న్యాయం చేకూర్చమని ఆర్డరు వేయడం పోలీసు కమిషనర్ బాధ్యత.
అయితే ఇంతకుముందు జరిపిన దర్భారులో కమిషనర్ విక్రమ్ చాలా మందికి న్యాయం చేసి ప్రజల, ప్రజాప్రతినిధుల, ముఖ్యంగా ప్రెస్ అభినందనలు పొందాడు. కానీ ఈ రోజు అతనికి పోలీసు కానిస్టేబుల్ అధికారి ప్రత్యర్ధిగా నిలిచాడు. తనకు అందాల్సిన కీర్తి ప్రతిష్టలను గేద్దలా తన్నుకు పోతున్నాడు. ఫిర్యాదులను ఎవ్వరిని అడిగినా మాకు యీ దర్భారులో అవసరం లేదు. మాకు మా అన్న అధికారి వున్నదంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితులో తను దర్భారు నిర్వహించలేడు.
"ఓ.కే .... థాంక్యూ ఎవ్విరిబడీ.... ఇంతటితో దర్భారు ముగిసింది" అన్నీ ఆలోచించి అన్నాడు.
"అంటే ఒక పోలీసు దర్భారుకి కాలం చెల్లినట్ట్లేనా !" విలేఖరులలో ఒక సీనియర్ చిన్న చురకవేశాడు.
"ఆ.... "కమిషనర్ వెంటనే తెరుకోలేకపోయాడు.
"అదేసార్, ప్రజల సమస్యలను రౌడీలు, గూండాలు, నాయకులు, వినాయకులేకాక పోలీసు కానిస్టేబుల్ రేంజివాళ్ళు కూడా సునాయాసంగా పరిష్కరించగలుగుతున్నప్పుడు, ప్రజలకు రుచించినప్పుడు ఇక మీ పోలీసు దర్భారు అవసరం యేమిటి? ఇక మీరు దర్భారులను పెట్టడం విరమించు కుంటునట్ట్లేనా అని అడుగుతున్నాం....." మరో జర్నలిస్టు బాణం వేశాడు.
"ఊ... ఎస్..... ఎస్..... ఎవ్వరు చేసినా, ఎక్కడ చేసిన ఆ న్యాయం న్యాయమేగా..." అన్నాడు కమిషనర్.
అంతా వెళ్ళిపోయారు. అప్పుడు కమిషనర్ మెదడు చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది. ఏదో గుర్తుకు చటుక్కున సీటులోంచి లేచాడు.
అక్కడ జనం బారులు వున్నారు.
అది సినిమాహాలు కాదు. అక్కడ గుడి, గోపురం, చర్చిగాని దుర్గాగానీ లేవు.
రోడ్డు ప్రక్కన పార్కుచేసిన సైకిళ్ళు స్కూటర్లు, కార్లు లెక్కకు మించి వున్నాయి. అప్పుడప్పుడు ట్రాఫిక్ జాం అవుతోంది. ఆ సెంటరులో వున్న ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేకనానా ఇబ్బంది పడుతున్నాడు.
"వాట్.... వాట్ హెల్ ఈజ్ గోయింగ్ అన్ హియర్?" సిటీ పోలీసు కమిషనర్ కారు సడన్ గా ఆపి బీటు కానిస్టేబుల్ ని నిలదీశాడు.
"సార్.... సార్... ఒక్క రెండు నిముషాలలో ట్రాఫిక్ అంతా క్లీయర్ చేస్తానుసార్...."
