వరలక్ష్మి క్షణం సంశయించింది. బయటకు వచ్చి చూసింది. బయట ఎవ్వరూ లేరు. గార్డు కేకకి అందనంతదూరంలో ఉన్నారు.
తిరిగివచ్చి కమిషనర్ లేపి బెడ్ మీద పడుకోబెట్టింది. అతని ముఖాన చల్లటి నీరు చల్లింది. విక్రమ్ స్పృహలోకి వచ్చాడు.
"బాత్ రూమ్ కి వెళ్ళబోతూ కాలు జారి పడ్డాను. టీపాయిమీద పడడంతో నుడుటుకి దెబ్బ తగిలి దిమ్మతిరిగిపోయింది. నౌ ఐయాం ఆల్ రైట్......"
అప్పటికే తన చేతిలోవున్న కర్చీపు తో రక్తం కారుతున్న చోటు వరలక్ష్మి నొక్కి పెట్టింది.
"సార్..... డాక్టర్ కి ఫోన్ చేయమంటారా?"
"నో.... నో.... చిన్న దేబ్బేగా అదిగో టించర్, బ్యాండేజ్ కడితే సరిపోతుంది." వరలక్ష్మి అల్మారాలో ఉన్న టించర్ తీసుకుని కాటన్ వేసి భ్యాండేజీ కట్టింది.
"గుడ్.... నర్సింగ్ కోర్స్ చేశావా?" విక్రం నవ్వుతూ అన్నాడు.
"అబ్బే! అదేమీ లేదుసార్... ఎన్ సిసిలో ఉన్నప్పుడు ప్రధమ చికిత్స గురించి తెలుసుకున్నాను అంతే......"
"ఎనీవే థాంక్యూ .... థాంక్యూ వెరీమచ్ "
"సార్.... మీకు టెంపరేచర్ ఉన్నట్టుంది."
"నాకేమీ ఉన్నట్టు అనిపించడంలేదు......"
"లేదు సార్ బ్యాండేజీ వేసేటప్పుడు మీ నుదుటిని చూశాను చాలా వేడిగా వుంది...."
విక్రం దగ్గాడు.
'ఏదో కోల్డ్ చేసి కప్పుకున్నాడు.
డాక్టర్ ఫోన్ చేయడానికన్నట్టు ఫోన్ రిసీవర్ తీసింది.
"వరలక్ష్మి వద్దమ్మ.... ఈ మాత్రం దానికే డాక్టరేందుకమ్మా!"
విక్రం అనడంతోనే కిచెనులోనికి వెళ్ళింది.
ఓ ఐదు నిముషాలలో మిరియాల పాలు తీసుకొచ్చి కమిషనర్ కి ఇచ్చింది.
"అర్దరాత్రి ఎందుకమ్మా నీకు శ్రమ. అడపిల్లవు ఇంటికి వెళ్ళామ్మా ఏదన్నా ఫోన్స్ వస్తే గరదుని అటెండ్ అవ్వమని చెప్పు...."
"లేదు సార్ మిమ్మల్ని ఈ స్థితిలో వదిలి...."
"ఫర్వాలేదు ! నాకేమీ కాలేదు నువ్వు వెళ్ళు తల్లీ...." లాలనగా అన్నాడు.
"ఇంకెంతసేపుసార్. ఇంకో రెండు గంటల్లో తెల్లవారిపోతుంది. నాకు రిలీవర్ రాగానే వెళతాను...... " అంటూ తలుపు దగ్గరకు వేసిబయటకు వచ్చింది.
సరిగ్గా అదే సమయానికి అధికారి ఆమెకు ఎదురయ్యాడు. ఎంత సేపయ్యింది. మీరు వచ్చి అంటూ తలుపు దగ్గరకు వేసి బయటకు వచ్చింది.
అధికారి ముఖం సీరియస్ గా వుంది.
"కమిషనర్ గారితో మాట్లాడాలి. వీలవుతుందా?" అంతకన్నా సీరియస్ గా అడిగాడు.
"ఇప్పుడు వీలుకాదు. వారు విశ్రాంతి తీసుకుంటూన్నారు......"
"ఐ.సీ. ....." అధికారి గిర్రున వెనుదిరిగాడు.
"ఏముంది...."
అధికారి వినిపించుకోలేదు.,
"అధికారి ప్రవర్తన అర్ధంగాక ఆలోచనలో పడింది. పక్కమీద వాలిందేగాని ఆమెకు నిద్రపట్టలేదు. పక్కమీద అటు ఇటు దోర్లింది.ఎప్పుడో తెల్లవారు జామున మగతనిద్ర పట్టింది.
చెదిరిన పమిట క్రింద అందాలు, మోకాలువరకు చెదిరిన లంగాను, ఓ జత కోరికతో చూస్తున్న సంగతి గమనించలేదు.
* * * * *
ఆ రోజున శుక్రవారం.
సిటీ కమిషనర్ చాంబర్ లో పోలీసు దర్బారు జరుగుతుంది. ఫిర్యాదు దారులు, వాదులు, ప్రతివాదులు పిటిషన్లతో బారులు తీరివున్నారు! మనోభావాలు మరో రంకంగానూ వున్నాయి.
క్రిమినల్ కేసులలో పోలీసుల జోక్యం హర్షించదగిందే. కానీ సివిల్ కేసులలో సత్వర న్య్యయంకోసంఅంటూ పోలీసులు తల దూర్చడం అటున్యాయవ్యవష్టను చులకన చేయడం కాదా? మరోవైపు న్యాయవాదుల వృత్తిని దెబ్బతీయడం కాదాని కొందరు న్యాయనిపుణులు నినాదం లేదదీశారు.
పోలీసు దర్బారు పేరుతో ఫిర్యాది దారుడుకి వాదులకు, ప్రతివాదులకు ఆఫీసులో పెద్దపీట చేసి, వాళ్ళందరి సమక్షంలో పోలీసు అధికారలను రెస్పాండెంట్స్ చేసి మాట్లాడడం ముఖ్యంగా క్రిందస్థాయి ఉద్యోగులకు మింగుపడడంలేదు.
ఇది అంతా సత్వర న్యాయం అంటూ, ప్రజలకు మేలుచేసేది అనేకంటే ఒక స్థాయి అధికారులకు పేరు, ప్రాఖ్యతుల కోసం, చీఫ్ పావులారిటీ కోసమే అని కొన్ని స్వంచ్చంద సేవా సంస్థలు నిందారోపణలు చేశారు.
అయినా కమిషనర్ విక్రమ్ తన స్టయిల్ మార్చుకోదల్చుకోలేదు. పదిమంది తన పనితీరును హర్షిస్తున్నప్పుడు ఒకరు ఇద్దరు మొరిగినంత మాత్రాన తన అత్మవిశ్వాసం చెక్కు చెదరదని నిరూపించడం కోసమే ఈ రోజు పోలీసు దర్భారు ఏర్పాటు చేశారు.
ఆ దర్భారులో పోలీసు ఆఫీసర్లు, పురప్రముఖలు, పత్రికా విలేఖర్లు ఉన్నారు.
"నీ సమస్యకి పరిష్కారం దొరికిందమ్మా....? ఇద్దరు పిల్లల్ని తీసుకుని దర్భారుకు వచ్చిన ఓ అడకూతుర్ని సిటీ కమిషనర్ విక్రం అడిగాడు.
