పృధ్వీ ఫీలింగ్స్ పూర్తిగా మారిపోకముందే వచ్చీరాని నవ్వు ముఖాన పులుముకుని నవ్వారు.
"ఊ.... చాలదు, ఇంకా, ఇంకా బాగా నవ్వాలి......"
వాళ్ళు భయంతోనో, భక్తీతోనో, లేక అతను హుకుం జారీ చేయడం వల్లనో బిక్క చిక్కిపోతున్నారు.
"నవ్వండి..... ఇంకా నవ్వండి.... నవ్వండి.... ఇంకా నవ్వండి" వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాడు పృధ్వీ.
వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు, వాళ్ళ నవ్వులో ఏ ఫీలింగ్స్ లేవు. కేవలం నవ్వాలని నవ్వుతున్నారు.
"ఆపండి..... ఆపండి.... నవ్వులు ఆపండి....." దిక్కులు పిక్కటిల్లెటట్లు పృధ్వీ కేకలు పెట్టాడు.
ఓరి దౌర్భాగ్యుడా.... తల్లిదండ్రీలేని నిన్ను కన్నతల్లికంటె ప్రేమగా చూసుకున్న వాడినని పోలీసులు ఈడ్చుకు వెళ్ళారని తెలిసి ఎలా నవ్వగలుగుతున్నావురా...."
అంతే మాటలు పూర్తీ కావడంతో అతని జుత్తు అందుకున్నాడు. మరోచేత్తో టేబిల్ మీదవున్న పళ్ళు కోసే కత్తి తీసుకుని అతని మేడమీద పెట్టాడు.
"ఆ.....న్నా" ప్రసన్నకూమార్ నోటివెంట మాట పూర్తిగా రాకముందే అతని మెడ తెగిపోయి వ్రేళ్ళాడుతుంది.
అనుచరుడు ఆ దృశ్యం చూస్తూనే "అన్నా....." అంటూ భీతిల్లాడు.
"కంగారుపడకు ...... శవాన్ని బెనర్జీ ఇంటికి వెళ్ళే దారిలో డ్రయినేజీలో పడేసిరా...." అంటూ కారు తాళాలు అతని చేతికి ఇచ్చాడు.
"అలాగే అన్నా" అనుచరుడు వెళ్ళిపోయాడు. పృధ్వీ ఆలోచనలో పడ్డాడు.
"సార్ అమ్మగారు లైనులో ఉన్నారు" ఫోన్ కనెక్షన్ ఇచ్చి ఆర్డర్లీ ఫోన్ పెట్టేశాడు.
"హల్లో డియర్ ... ఇన్నాళ్ళకి శ్రీవారిమీద దయ కల్గిందన్న మాట....." విక్రమ్ చాలా జాలీగా అన్నాడు.
"అబ్బ ఆశ, దోశ అప్పడం....." సరిత అతన్ని మరింత ఉడికిస్తూ అంది.
"అబ్బ! బ్బ! ఊరికే ఊరించకు డియర్...."
"వయస్సు నలభై ఐదు దాటుతున్న ఇంకా ఆ పోకీరి వేషాలు తగ్గలేదు మీకు...."
"ఇప్పుడు నాకే వయస్సు ముంచుకొచ్చింది డియర్.... ఆ మాట కొస్తే నాకింకా తెల్లవెంట్రుకలు రాలేదు తెలుసా...."
"వయస్సు మీకు ముంచుకురాకపోవడం ఏమిటి.... ఇక మీరు అల్లుడిని వెతుక్కోవచ్చు....."
"అల్లుడా! ..... అంటే....."
"అంటే లేదు..... గింటే లేదు..... అమ్మాయి కూర్చుంది...."
"ఆ..... "క్షణం ఆశ్చర్యపోయాడు.
"పదకొండేళ్ళకే...." అనుమానంగా నసిగాడు.
"మరి పోలీసుల తి౦డిగా తిండి పుష్టితో పాటు కందపుష్టి... ఇంకా మిగిలిన కార్యాక్రమాలు అగవుగా...."
"అంటే ఫంక్షన్ చేద్దామంటావా!"
"చాల్లెండి..... ఇంకా కాన్వెంటు చదువు చదువుతున్న దానికి అవన్ని చేస్తే బెదిరిపోతుంది. ఈ వారం నేను రావడం లేదని చెప్పుకోడానికే మీకు ఫోన్ చేశాను బాయ్......" అంటూ సరిత ఫోన్ పెట్టేసింది.
"ప్చ్......." కమిషనర్ విక్రమ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. లేచిబయటకు వచ్చి చూశాడు. అప్పుడు సమయం రాత్రి పన్నెండు కావోస్తోంది. టెలిఫోన్ ఉన్న టేబిల్ కి కొంచెం దూరంలో నేలమీద లేడీ కానిస్టేబుల్ పడుకునివుంది ఆమె పమిట చెరిగివుంది. టెలిఫోన్ దగ్గరవున్న ఆర్టర్లీ చూపులు అక్కడే వున్నాయి.
కమిషనర్ రావడంతోనే ఆర్టర్లీ లేచి గుటకలు మ్రింగాడు.
"ఈడియట్..... గెటౌట్ ... ఫో మందిక్కడనుంచి...." కమిషనర్ అరవడంతో అర్జర్లీ జారుకున్నాడు......
కమిషనర్ లేడీ కానిస్టేబుల్ వరలక్ష్మి చెదిరిన పమిటమీద ప్రక్కనే వున్న దుప్పటీ కప్పాడు.
వరలక్ష్మి ఉలిక్కపడి లేచింది.
కమిషనర్ చూస్తూనే "సారీ సార్" అంది.
కంగారుగా చెదిరిన పమిటని సరిచేసుకుంటూ లేచి నుంచునిసాల్యూట్ కొట్టింది.
"ఇట్స్ అల్ రైట్ ... ఇక్కడ నీకు ఇబ్బందిగా వుంటే ఇంటికి వెళ్ళు అయినా వేదవలకి ఎన్నిసార్లు చెప్పాలి! రాత్రిపూట అడపిల్లల్ని ఫోన్ వెయిటింగ్ కి పంపించోద్దని వార్నింగ్ ఇచ్చినా నీకు డ్యూటీ వేసిఇబ్బంది పేట్టినట్లున్నారు. ఐయాం సారీ."
"ఫర్వాలేదు సార్.... ఇదేమి కష్టమైనా డ్యూటీ కాదు. ఇప్పటిదాకా చదువుకున్నాను" ఇప్పుడే నిద్రపట్టేసింది....." సంజాయిషీగా అంది.
"ఒకే ..... గుడ్ నైట్ " కమిషనర్ తిరిగి లోపలి వెళ్ళాడు.
వరలక్ష్మి నిద్రమేల్కోగానే చూసుకుంది. తన వంటిమీద దుప్పటి కప్పివుంది. అంటే కమిషనర్ తనవంటిమీద దుప్పటి కప్పాడా!
ఛ! ఛ!తను అంత మహొన్నత వ్యక్తిని అపార్ధం చేసుకుంది. మనిషిని కారుకు అయినంత మాత్రాన అతనికి హృదయం లేదనుకోవడం పొరపాటే! అతనిముందు తన ఉద్యోగం ఏపాటిది. అడవాళ్ళపట్ల అతనికి వున్న సరైన జోడని ఆనందించింది. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు సంస్కారవంతులుగా అందరు చెప్పకుంటుండగా తను విన్నది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది.
గదిలో విక్రం దగ్గుతున్నాడు. గుక్క తిప్పుకోలేని దగ్గు, మరికొన్ని క్షణాల్లో క్రింద ఏదో పడిపోయినట్లు శబ్దం వినిపించింది. వరలక్ష్మి అనుమానంగా తలుపుతోసి చూసింది.
అంతే క్షణం మ్రాన్పుడిపోయింది.
కమిషనర్ విక్రం నేలమీదపడివున్నాడు. అతని నుడుటున గాయంఅయి రక్తం కారుతుంది.
