"ఓ.కే లక్ష్మిగారు బాయ్......" అధికారి ఆమెకు వీడ్కోలు చెప్పాడు.
"పద" అంటూ అధికారిఅతన్ని అనుసరించాడు.
వరలక్ష్మి ముఖం మూడ్చుకుంది.
* * * *
"ప్లాష్ .... ప్లాష్ ....ప్లాష్ "
టీవీలో కార్యక్రామాలు చూస్తున్న పృద్వీచూపులు ప్లాష్ న్యూస్ మీద నిలిచాయి.
"ప్లాష్..... ప్లాష్.... ప్లాష..... బెనర్జీకి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరామింపజేసిన హొమ్ మినిష్టర్ ని ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల నుంచి తొలగించాడు. బెనర్జీ హొమ్ మినిష్టర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు....."
అంతే పృధ్వీ కళ్ళు అగ్ని గోళాలు అయ్యాయి.
అసలు సిసలైన రాజకీయం అంటే ఇదే! సముద్రంలో నదులు వాగులు, వరదలు కలుల్తునట్టు ప్రజలలో పలుకుబడి, ప్రాబల్యం వున్న వ్యక్తులు రాజకీయాలలో చేరుతుంటారు. రాజకీయ నాయుకులు కూడా వాళ్ళశక్తి సామర్ధ్యాలు గురించి అనేకంటే వాళ్ళ వెనకవున్న నోట్లను గమనించే పదవులను కట్ట పెడుతుంటారు. బెనర్జీ విషయంలోను సరిగ్గా అదే జరిగింది.
అధికార పార్టీలో ఉన్న కొన్ని ముఖ్య అవసరాలకి నాయకులు పాచికులా వాడుకున్నారు. తనుకూడా రౌడీయిజంలో రాజకీయంగా ఎదగాలనుకున్నాడు. కాని కలసి రాలేదు. తను ఎన్నుకున్న మార్గం తనని కుప్పకూల్చింది. తన రౌడీ సామ్రాజ్యాన్ని ఒక్క దెబ్బతో పడగొట్టి, తన సమాధిమీదే పునాది ఏర్పరచుకున్నాడు. తనకి కోలుకోలేని చావు దెబ్బ తగిలింది. కేసుల పేరుతో తన మనుషులు చెట్టుకొకడు, పుట్టకొకడు చెల్లాచెదురైపోయారు.
తను బెయిల్ పై ఏం సాధించినట్టు? ఇప్పుడు తన ప్రాణానికి కూడా ముప్పువాటిల్లే ప్రమాదం వుంది. స్వతహాగా తనకన్నా తన బలగానికన్నా, కుట్రలు కుతంత్రాలలో తనకన్నా బలహీనుడైనా బెనర్జీ ఇప్పుడు సామాన్యవ్యక్తి కాదు. ఓ మహాశక్తి అతనివేమాట అధికార పార్టీవుంది. ప్రజలు వున్నారు. అంతకుమించి అంతులేని అధికారం వుంది. అతనిని ఓ సామాన్యుడిగా తను ఎదుర్కోగలడా? పోనీ రాజీమార్గం వెతుక్కుంటే! ఆ అవసరం బెనర్జీకి లేదు. తన మనుషులు పదిమందిని పోగొట్టుకున్న బెనర్జీ తన అంతం చూసే వరకు నిద్రపోడు.
ఇన్నాళ్ళు తనను వాడుకున్న అధికారపార్టీ తనను కరివేపాకులా తీసి పారేసింది. పరోక్షంగా అన్ని విషయాలలో, ప్రత్యక్షంగా ఫైనాన్స్ రాబడి వ్యాపార లావాదేవీలలో తన సహాయం పొందిన మాజీ హొంమంత్రి మాత్రం తనకేం న్యాయం చేశాడు? అసలు అతని పదవి వుంటేకదాతనకు ఏదన్న చేయడానికి. మాజీ హొం మినిష్టర్ తనకి బెయిల్ ఇప్పించి తనకి ఏదో గొప్ప మేలు చేశాడనుకుంనేకంటే తనకి ఏ కాస్తో కుస్తో ప్రజలమధ్య వున్న గ్లామర్ కూడా దీంతోపోయింది. తనకి రక్షణకూ లేకుండాపోయింది. ఈ విషయ పరిస్థిని అధిగమించాలంటే తను ఏదో ఒకటి చేయాలి. తను చేయబోయే పని ఎలా వుండాలో ఓ క్షణం ఆలోచించాడు.
ఇప్పటివరకు రౌడీ రాజకీయంలో ఎవరూ చేయలేని, తిరుగులేని పథకం ఆలోచించా. అంటే పృధ్వీ తన గారాల ఒక్కగాని ఒక్క తమ్ముడిని పిలిచాడు. పదహారేళ్ళువున్న ప్రసన్నకుమార్ బెరుకుబెరుకుగా అన్న దగ్గరకు వచ్చాడు.
"ఇటురారా కన్నా...." తమ్ముడిని అప్యాయంగా చేయి పుచ్చుకునితన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. టీపాయిమీద వున్న స్వీటు ప్యాకేటు తెరచి, స్వీటు తీసి అతని నోట్లో పెట్టాడు.
ప్రసన్నకుమార్ తన చేత్తో స్వీటుతీసి అన్న నోట్లో పెట్టాడు. పృధ్వీ కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి.
తమ్ముడుని కౌగలించుకున్నాడు. తనకి మూడేళ్ళు వయస్సు వచ్చేప్పటికి ప్రసన్నకూమార్ ని కాని, తన కన్నతల్లి కన్నుమూసింది. తనకి పదహారు ఏళ్ళు వచ్చేటప్పటికి కన్నతండ్రి లారీ యాక్సిడెంటు లో మరణి౦చాడు. అప్పటినుండి తల్లి, తండ్రీ అన్నీ తనే అయి తమ్ముడు ప్రసన్నకుమార్ కి ఏలోటు రాకుండా పెంచాడు.
పృధ్వీ కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాడు. రౌడీలకీ సెంటిమెంట్స్ వుంటాయి. ప్రేమాభిమానాలు వుంటాయి. పాప పుణ్యాళపట్ల విశ్వాసం, దేవుడిపట్ల భక్తీ వుంటాయి. నేను, నాది, తన వాళ్ళు అనే తపన వుంటుంది. అని అనుకుంటే పొరపాటే.
అప్పటివరకు నీళ్ళు సుడులు తిరిగి కళ్ళు ఇప్పుడు అగ్నిగోళ్ళాల్లా వున్నాయి. అతని చూపులు వాడిగా వున్నాయి. అతని కళ్ళలోని భావన అర్ధం కావడంలేదు. తలెత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూసే ధైర్యం ఎవ్వరికీ లేదన్నట్టు అనుచరుడోకడు దూరం నుంచే.
"అన్నా...." అంటూ సంభోదించాడు.
"ఇటు రారా...." అతని మెటాలిక్ వాయిస్ తో గది మారుమ్రోగుతుంది.
ఆ అనుచరుడు పరుగున వచ్చాడు.
"ఊ..... ఇప్పుడు చెప్పు...."
"ఏం లేదన్నా ...." నీళ్ళు నలుమూతున్నాడు.
"చెప్పరా చెప్పు......"
అతను చెప్పాలా వద్దా అన్న మీమాంశలో వున్నాడు.
"ఊ..... నన్ను విసిగించకు, విషయం తొందరగా చెప్పు" హుకుంజారీ చేసినట్టు అన్నాడు.
"అన్నా నువ్వు కండిషన్ల బెయిల్ మీద వచ్చింది లగాయతు పోలీసు స్టిషన్ కు హజరుకాలేదని, పోలీసోళ్ళు వదినమ్మను స్టేషను కు ఈడ్చుకువెళ్ళారు....."
"సేహభాష్ ...... చాలా చక్కని వార్త చెప్పావు. ఇదిగో స్వీటుతిను......" అంటూ స్వీటు తీసి అతని నోట్లో పెట్టాడు.
అనుచరుడితోపాటు ప్రసన్నకూమార్ కూడా విస్తుపోయాడు. అనుచరుడు నోట్లో పెట్టిన స్వీటు మింగలేక కక్కలేక అన్నట్టు గుటకలు మింగుతున్నాడు.
పృధ్వీ నవ్వుతున్నాడు. తనివితీరా నవ్వుతున్నాడు. పగలబడి నవ్వుతున్నాడు.
"నవ్వండిరా! మీరూ నవ్వండి. నా మనసంతా సంతోషంతో పిలకించిపోతుంది. ఊ.... నవ్వండి...." కసిగా అన్నాడు.
