Previous Page Next Page 
అధికారి పేజి 35

    భయపడ్డావు.... ఉట్టప్పుడు అక్కడ పేకాటవుంది. ఇక్కడ సింగిల్ నెంబరు లాటరీ వుంది, అక్కడ వ్యభిచారం జరుగుతుందని  నానా చెత్త_ చెప్పేటప్పుడు వున్న ధైర్యం, మనిషి ప్రాణాలకు ముప్పువాటిల్లు తుందని చెప్పడానికి మాత్రం లేదు....... ఛ ! ఛ!....
   
    'సార్... అధికారి.'
   
    'వూ.... అధికారి.'

    'సార్.... ఆ ఇన్ ఫర్ మేషన్ అధికారికి కూడా తెలుసుసార్ .'

    'యూ అర్ ఏ గజటేడ్  ఆఫీసర్, యూ ఆర్ నాట్ ఎ పూల్.
   
    పూర్ పెలో రివార్డు అందుకోవాల్సింది పోయింది సో!"
   
    అధికారిని పిలవండి....' ఇంటర్ కమ్ లో క్యామ్ఫ్ క్లార్క్ కు చెప్పి ఫోన్ పెట్టేశాడు. సి.పి.
   
                                                              *    *    *    *   
   
    మధ్యాహానం   రెండు గంటలు దాటుతోంది.
   
    ఎండమండుతోంది.
   
    అప్పటికి సుమారు అరగంటనుంచి వరలక్ష్మి ఆ వీధి మలుపులో కాపుకాసి వుంది. రోడ్డుపక్కన యూనిఫారంతో వున్న వరలక్ష్మిని చూసిన జనం ఆమె ఏదో బందోబస్తు చేస్తుందని సరిపెట్టుకున్నా, తనకి మాత్రం ఎంబ్రాసింగ్ గానే వుంది.
   
    తప్పదు. తను అధికారిని ఎప్పుడు కలవాలన్నా అంతకన్నా మార్గం కనిపించడంలేదు. అతను ఇప్పుడు పోలీసు క్వార్దర్స్ లో వుండడం లేదు. ఎక్కడ వున్నావు? అంటే సత్రం భోజనం, మఠం నిద్ర అంటూ ఓ చిరునవ్వు నవ్వి తప్పించుకుంటున్నాడు.
   
    కాని తనకి ఎప్పుడూ అతను ఈ విధీ మలుపులోనే తారసపడుతున్నాడు. ఈరోజు అతనితో మనసు విప్పి మాట్లాడాలని వుంది. అంతే కాదు తన నిర్ణయం కూడా ఖచ్చితంగా తెలియజేయాలనుకుంది. కాని అతనెందుకో ఈ రోజు రెండు దాటుతున్నా, తన అత్రుతుకి తగ్గట్టు రాలేదు. పోనీ అతనికి లెటర్ రాసి పోస్టు చేస్తే! అయినా పోస్టులో వచ్చిన లెటర్ ఆసాంతం, అతను చదువుతాడన్న నమ్మకం ఏమిటి? ఒకవేళ చదివి తనని అపార్ధం చేసుకుంటే! ఆలోచనకే ఆమె మనసు అదోలా అయిపోయింది.
   
    అసలు కొన్ని రోజులుగా అతను తనపట్ల ఎందుకు నిదారనగా వుంటున్నాడు? తన ప్రవర్తన అతని మనుషుని గాయపరిచిందా?   తను చులకన అయ్యిందా! లేక మరెవరన్నా తన గురించి అతనికి చేదుగా చెప్పరా!
   
    'హాయ్ ..... గుడ్ మార్నింగ్ '
   
    అధికారిని చూస్తూనే వరలక్ష్మి ఉలిక్కిపడింది . తను అలోచనలతో సతమతమవుతుండడం వలన అధికారి రాకను గమనించలేదు.
   
    వరలక్ష్మి సహజ సిద్దమైన కోపంతో మూతిముడుచుకుంది.
   
    'ఇది అన్యాయం సుమండీ..... నేను ఎంతో వినయంగా మీకు గ్రేట్ చేసినప్పుడు కనీసం కర్టసీకోసం తిరిగి విష్ చేయకపోయినా, ఓ చిరునవ్వు నవ్వితే మీ సొమ్ము ఏమీ పోదుకదండీ...! అధికారి నిష్టూరంగా అడిగాడు.
   
    "థాంక్సు... మీరు నాకు విష్ చేసినందుకు ఇక తిరిగి నేను మీకు గ్రేట్ చేమారిగా, వెరీ, వెరీ గుడ్ మార్నింగ్ సార్! కాని మీరు నాకు సారీ చెప్పాలి."
   
    'ఆ....'
   
    'ఊ... ఆడపిల్లలను అతగంతనుంచి నడిరోడ్డు మీద.....'
   
    'ఆగండారండి మిగిలిన వాక్యం నేను పూర్తీ చేస్తాను. ఆడపిల్లలను అరగంటనుంచి నడిరోడ్డు మీద, మధ్యాహ్నం నిలబెట్టినందుకు మహానుభావా నువ్వు సారీ చెప్పాలి అన్దామనుకున్నారు అంతే కదా మేడమ్!
   
    'ఏస్.....'
   
    'కాని నేను మీకు సారీ చెప్పను....'
   
    వరలక్ష్మి అతనివంక సీరియస్ గా చూసింది.
   
    'తొందరపడి తిట్టకండి మెడమ్ తిరిగి మీరే నాకు మరోసా చెప్పాల్సివస్తుంది.'

    దట్స్ గుడ్.... ఇంత తొందరగా మిమ్మల్ని మామూలు మూడ్స్ లోకి తీసుకురాగలిగినందుకు నన్ను పొగడుతుంటున్నానండీ!'
   
    'సోది ఆపి అసలు విషయం చెబుతారా!"  సూటిగా అడిగింది వరలక్ష్మి.
   
    "ఆ చెప్పక తప్పుతుందా! మేడమ్ మిమ్మల్ని కలవాలని మీరు లంచ్ కి ఇంటికి వస్తారని ఒంటి గంటనుంచి మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. అంతే కాదండోయ్ , మీ మమ్మీగారు బలవంతం చేస్తే లంచ్ కూడా చేశాను. ఇక ఇప్పుడు చెప్పండి ఎవరు సారీ చెప్పాలి?"
   
    "ఐయాం సారీ....." తలవొంచుకుని అంది.
   
    "ఛ! ఛ! ఏదో జోక్ గా అన్నాను  మన మధ్య సారీ లేమిటండీ!" వరలక్ష్మికి అర్ధం కాక అడిగింది.
   
    "అదేనండి.... వీళ్ళేవరండీ బాబు రోడ్డు మధ్యన నిలబడి వాదులాడుకుంటున్నారు అనుకుంటూ మనల్సి చోద్యం చూడమంటూ అదేనండి ప్రేషో.....
   
    వరలక్ష్మి కిలకిల నవ్వేసింది.
   
    ఇద్దరూ కలసి వరలక్ష్మి ఇంటికి బయలుదేరారు.
   
    "అధికారి"
   
    వెనకనుంచి పిలిపువినబడడంతో అధికారి నడుస్తున్నవాడు కాస్త ఆగి వెనుదిరిగి చూశాడు. 
   
    ఎదురుగా కమిషనర్ గారి ఆర్టర్లీ వున్నాడు.
   
    "అధికారి నిన్ను కమిషనర్ గారు ఉన్న ఫళంగా తీసుకురమ్మన్నారు." 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS