సి.పి లో అనడంతోనే అంతా కూర్చున్నారు.
"డి.సి.పి. గారిని రమ్మని చెప్పండి......" ఇంటర్ కమ్ లోనూ క్యామ్ఫ్ క్లార్క్ ఇన్ స్త్రక్షన్స్ ఇచ్చాడు. కమిషనర్.
మరో రెండు నిముషాలలో డి.సి.పి రామచంద్రరావు కమిషనర్ ఛాంబర్ కి వచ్చాడు. మీటింగ్ ప్రారంభమయింది.
"ఎజిఎస్, సి.ఐ, హరిశ్చ౦ద్రుడు ఎక్కడ?" కమిషనర్ ఇంటర్ కమ్ లో సిపిని అడిగాడు.
"సార్ యిక్కడే వున్నారు సార్ సెల్యూట్ కొట్టాడు.
"రమ్మనండి ...."
ఎజిఎస్ సి ఐ. వచ్చి స్మార్ట్ గా సెల్యూట్ కొట్టాడు.
"నీ లీవ్ క్యాన్సిల్.... డ్యూటిలో జాయిన్ అవ్వు. అయినా నాకు తెలీక అడుగుతాను లీవ్ పేట్టి వెళ్ళిపోమంటే సీరియస్ గా నా ముఖాన ఓ కాగితం రాసి పడేసి పోవడమేనా!"
|సారీసార్......" సి.ఐ నోటిమాట రాక నీళ్ళు నములుతున్నాడు.
"ఓ.కే .... అంతే సీరియస్ గా ఉద్యోగం చేయి, రాజకీయ మర్డర్లు ఆపించు చూద్దాం....." చాలెంజ్ గా అన్నాడు సి.పి.
సి.ఐ తల ఊపి కూర్చున్నాడు.
ఆఫీసర్స్.... నేను జాయిన్ అయి పదిహేను రోజులైనా పూర్తీ కాలేదు. ఇప్పటికి పదిహేనుదాకా నా పరిధిలో మర్డర్లు జరిగాయి. అందులో పదమూడు రాజకీయ హత్యలు జరుగుతాయని మీకు ఇన్ ఫర్ మేషన్ లేదా? అని అన్నీ చాలా పకడ్భందిగా జరిగిన హత్యలు! స్రీ ప్లాన్జ్డు కోల్డ్ మర్డర్స్! కాని మీకు ఇన్ ఫార్ మేషన్ లేదు. నేనంటే కొట్టగా వచ్చినావాడిని, ఇన్ పార్మర్స్ నాకు సరాసరి చెప్పడానికి భయపడవచ్చు. కాని చాలాకాలంగా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు. మీకు ఇన్ ఫార్మర్స్ లేరా! ఇన్ ఫర్ మేషన్ రాదా!......."
"సార్.... మీరు తప్పుగా అర్ధం చేసుకోకపోతే ....." డి.సి.పి. రామచంద్రర్రావు ఆగి సి.పి. కేసి చూశాడు.
"నెవ్వర్ క్యారియన్ మిస్టర్ డి.సి.పి. ...." సి.పి. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
"సర్ మీరు చార్జీ తీసుకున్న మరుక్షణం నుంచే మిమ్మల్ని అవమానించడం మొదలు పెట్టారు. మీ మీద మీకు విశ్వాసం లేదు. అసలు మీకు మా గురించి ఎవరో చేదుగా చెప్పి వుంటారు. ఇంత పెద్ద నగరంలో ఏ చిన్న విషయానికైనా పెద్ద రాద్దాంతం చేసే ఈ నగర వాసులు, ఇందరు ఆఫీసర్లు, మీరనుమానిస్తున్నట్లు లంచగోండులు, దగుల్భాజీలు, ముండాకొరులు అయితే చూస్తూ వూరుకుంటారా! మీరు అందర్నీ ఏకపక్షంగా నీచంగా చిత్రించడంవలన మాలో నిరుత్సాహం , స్తబ్ధతకలిగాయి. ఏమీ చేయకపోయినా మాటపఢ్ఢాం, ఇక ఏం చేస్తే ఏం వచ్చి మీదపడుతోందన్న ఇన్ సెక్యూరిటీ ఫీలవుతున్నాయి. ఇక చొరవ చేసి మీకు ఇన్ ఫర్ మేషన్ ఏమి ఇవ్వగలం సార్!"
"ఐ.సీ......" సి.పి. ఆలోచిస్తున్నాడు.
"సార్.... తమరు కోప్పడకుండా వుంటే....." ఏ.జీఎస్. సి.ఐ. లేచి భయం భయంగా అన్నాడు.
"వూ..... క్యారియాన్...."
"సారీ... మనకి ఇన్ ఫార్మర్లు అన్ని గ్రూపులొను వున్నారు సార్...."
"ఉంటే.... ఇన్ ఫార్ మేషన్ ముందుగా ఎందుకు రాలేదు? ఇన్ని హత్యలు ఎందుకు జరిగాయి?.......
"సార్... తమరికి ఇన్ ఫార్ మేషన్ ....." ఇన్ స్పెక్టర్స్ నీళ్ళు నములుతున్నాడు.
"ఆ ఇన్ ఫర్ మేషన్........."
ఇన్స్ స్పెక్టర్స్ హరిశ్చంద్రుడు చెప్పాలా వద్దా! అన్న మీ మాంసంలో వున్నాడు.
"కమాన్ టెల్ మీది ట్రూత్" సి.పి, గొంతు ఖంగుమంది.
"సార్ ఇన్ ఫర్ మేషన్ కి నేను స్వయంగా ఫోన్ చేసి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ స్పెక్టర్స్ కి చెప్పి తమరికి తెలియ జేమనన్నానండీ."
ఆ మాటలో కమిషనర్ కళ్ళు చింతనిప్పులయ్యాయి.
"వేరీజ్ స్పేషల్ బ్రాంచ్ ఇన్స్ స్పెక్టర్స్...." కమిషనర్ కేకకి గది దద్దరిల్లిపోయింది.
చివరిసీట్లో కూర్చున్న స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ స్పెక్టర్స్ ఎటేక్షన్ లో నంచున్నాడు. ముఖాన ముచ్చెమటలు పోశాయి.
"ఏమీ, మాట్లాడవే...."
"సార్.... అతని గొంతు గీరపోయింది.
"స్పెషల్ బ్రాంచ్ అంటే ఏమిటి?"
సార్....."
"కమాన్ టెల్ మీ ది అన్సర్..... తెలుసా, తెలియదా?"
"సార్.... స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ కి చెవులు, కళ్ళు వంటిది."
"మరి నువ్వు చేసిన పని ఏమిటి? ఇన్స్ స్పెక్ట్రర్స్ హరిశ్చంద్రుడు చెప్పిన ఇన్ ఫర్ మేషన్ నా కెందుకు చెప్పలేదు......"
"సార్... అది..." ఇన్స్ స్పెక్టర్ నీళ్ళు నలుముతున్నాడు.
"యూబ్లడీ ఫెలో.... నాకు చెప్పమన్న ఇన్ ఫర్ మేషన్ నాకు ఎందుకు పాస్ అన్ చేయలేదు. పోనీ కనీసం నువ్వేం చేశావు? ప్రివేరటీవ్ గా ఏదన్నా చేశావా?'
'సార్ మన జిల్లా ఇన్ జార్జీ మినిస్టర్ గారు వచ్చారు, తమరు వారి పోగ్రాం తెలుసుకురమ్మంటే గెస్టు హాస్ కి వెళ్ళాను నేను తిరిగి అఫీసుకు వచ్చి ఇన్ ఫర్ మేషన్ చెబుదామనుకునే లోపే హత్యలు జరిగిపోయాయి.'
'యూ ష్టుపిడ్, నీకు బుర్రలేదు, వాటీజ్ ఇంపార్టెంట్? ప్రయారితీస్ తెలియదా! అదే రక్త సంబంధీకులకు ప్రాణహానీ వుందని తెలిస్తే ఇలానే చేస్తావా?......
'ఏయ్.... ఏ.జి. ఎస్... అసలు నువ్వెందుకు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయలేదు.....'
'సార్ నేను లీవులో వుండి ఈ ఇన్ ఫర్ మేషన్ నీ కెందుకంటారెమోనని......'
