Previous Page Next Page 
అధికారి పేజి 33

    శ్రీకళ సమాధానంగా టెంట్ లో వున్న బెనర్జీ అనుయాయులు అందరివైపు చూసింది.
   
     బెనర్జీకి అర్ధమైనట్లుంది. అందర్నీ వెళ్ళమన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు. టెంట్ లో వున్నవాళ్ళంతా టెంట్ కి దూరంగా వెళ్ళారు.
   
    "ఇప్పుడు చెప్పండి మేడమ్...... ఇక్కడ నేను తప్ప మరెవ్వరూ లేరు."
   
    "బెనర్జీ ... నువ్వు పాత రోజులు మరచిపోయినట్టున్నావు!" "లేదు మేడమ్....."
   
    ప్రాణభిక్ష  పెట్టిన మీకు నేను చాలా కృతజ్ఞుడ్ని ఆ విశ్వాసం ఇప్పటికి, ఎప్పటికి ..... నా నుండి పోదు ఆ రోజు మీరు కమిషనర్ గారికి అడ్డుపడలేకపోతె  ఈ పాటికి......"
   
    "బెనర్జీ ఇప్పుడు అవన్నీ నిన్ను గుర్తుచేసుకోమని చెప్పి బెదరించడానికి నేను రాలేదు. అప్పుడు అధికార పార్టీ __ నిన్ను బంఫ్ ఆఫ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, కేవలం మానవతా దృష్టితో కమిషనర్ గారు, నేను నిన్ను కేవలం అరెస్టు చేయడంతోనే  సరిపెట్టాం. ఇప్పుడు నీ ప్రత్యర్ది పృద్వీని అతని మనుషలను అరెస్టుచేశారు. ప్రభుత్వనుండి నీకు రక్షణకు సంభందించి, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాను. మరి ఇంకా ఎందుకయ్యా ఈ దీక్షలు, మమ్మల్ని ఇరకాటంలో పేట్టిడానికి, ఏడిపించడానికి తప్ప."
   
    "సారీ మేడమ్ .... మీ మీద, మీ కమిషనర్ గారి మీద, నాకు ఏ విధమైన పగలేదు. పైపెచ్చు మీరంటే నాకు గురుభావం ఉంది. కాని నేను ఇలా చేయడానికి కారణం ఉంది. లోపయికారిగా అధికార పార్టీకి నాకు మధ్య అవగాహాన కుదురింది. ఈ రోజు సాయంత్రం హొమ్ మినిష్టర్ వస్తాడు. నాకు నిమ్మరసం ఇస్తాడు. నేను అనుచరులతో అధికార పార్టీలో చేరడానికి రంగం సిద్ధం అయింది. ఈ టే౦క్షన్  ఈ సాయంకాలం వరకే వుంటుంది. తరువాత అంతా షరామామూలే !" బెనర్జీ తన ప్లాను అంతా ఆమెకు చెప్పివేశాడు.
   
    అమ్మో! బెనర్జీ ...... నీ రేంజి పెరిగిపోయింది రోయ్! అసలు సిసలైన రాజకీయం నడుపుతున్నావు. నీ తెలివితేటలకు హేట్సాఫ్! శ్రీకళకు అతని ఆలోచన తెలిశాక మతిపోయినంత పని అయింది.
   
    "మేడమ్...... కమిషనర్ గారిని హార్ట్ అవ్వద్దని చెప్పండి. పోలీసులకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలు, మేమొరాండమ్ లు, ఈ ధర్నాలు, అన్నీ నిజానికి అయనగారి మీద విశ్వాసం లేకకాదు, కేవలం మాస్వలాభం కోసం దయచేసి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచమని చెప్పండి......"
   
    శ్రీకళకి ఇంక అంతకన్నా ఎక్కువగా అతనితో మాట్లాడాలనిపించలేదు. సరాసరి కమిషనర్ చాంబర్ కి బయలుదేరింది.
   
                                                   *    *    *    *   
   
    డోర్   లాక్ చేయకుండా సరాసరి గదిలోకి వచ్చిన శ్రీకళ వైపు అదోలా చూసింది సరిత. భార్యభర్త లిద్దరూ సోపాల్లో పక్క పక్కన కూర్చుని రిలాక్స్ అవుతున్న వాళ్ళు కాస్తదూరంగా జరిగారు.
   
    "సారీ సార్..... " శ్రీకళ కంగారుగా వచ్చినంత వేగంగానే వేనుదిరిగింది.
   
    "ఇట్స్ ..... ఓ.కే వచ్చారుగా ...... మళ్ళీ వెళ్ళడం దేనికి రండి కూర్చోండి" అంది సరిత.
   
    "సారీ మేడమ్....." శ్రీకళ మేడమ్ కి సారీ చెప్పింది.
   
    "ఇట్స్ ... ఓ.కే ... రండి ... కూర్చోండి" కమిషనర్ సోఫాలోంచి లేచి వచ్చి తన సీట్లో కూర్చుని శ్రీకళకు సీటు ఆఫర్ చేశాడు.
   
    "సార్..... కలెక్టర్ గారు జ్యూస్ ఇచ్చినా బెనర్జీ తీసుకోలేదు; హొమ్ మినిష్టర్ వచ్చేవరకు దీక్ష కొనసాగిస్తాడట....."
   
    "ఐ.సీ......" కమీషనర్ భ్రుకుటి ముడిపడింది.
   
    "సార్.... నథింగ్ టు వర్రీ, నేను బెనర్జీతో మాట్లాడాను. ఇప్పటి వరకు అతను, అనుచరులు చేస్తుంది అంతా అధికార పార్టీ అండతోనే. సాయంత్రం హొమ్ మినిష్టర్ సమక్షంలో అతను, అతని అనుచరులతో అధికార పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధమయింది......"
   
    "బెనర్జీ తనంతట తానె ఇవన్నీ చెప్పాడా?"
   
    "ఏస్. సార్..... అంటేకాదుసార్ ఇప్పటివరకు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాల్చినందుకు ధర్నాలు, ఘోరావ్ లు, దీక్షలు చేపట్టినడానికి మిమ్మల్ని అపార్ధం చేసుకోవద్దని మరీ చెప్పామన్నాడు సార్....."
   
    "ఇడియట్ ......" విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో అతని ముక్కుపుటాలు ఎగిరెగిరి పడుతున్నాయి.
   
    "ఇదంతా మనం ముందే అనుకున్నంగా దీనిగురించి ఇంక ఎక్కువుగా ఆలోచించడం, బందోబస్తు గురించి నానా హైరానా పడడం అనవసరం. ఇతర జిల్లాలనుంచి పంపమన్న ఫోర్స్ ని వద్దని పోతుందేమో!" సరిత సలహా ఇచ్చింది.
   
    "ఏస్.... యూ ఆర్ కరెక్ట్.... ఇతర జిల్లాల ఎస్ పిలకు ఫోర్స్ పంపనవసరం లేదని చెప్పు సరిత.....
   
    సరిత  చకచకా ఫోన్ తీసి హాట్ లైన్ లో ఇతర జిల్లాల ఎస్పిలకు ఆ విషయం తెలియజేసింది.
   
     "సార్...... లా అండ్ ఆర్డర్ ఐ.జి. గారికి, ఇంటిలిజెన్స్ ఐ.జి. గారికి బెనర్జీ ప్లాన్స్ గురించి చెబితే బావుంటు౦దేమో!" సరిత మరల సజెస్టుగా అంది.
   
    "సారీ మెడమ్..... ఈ విషయాలు మనల్ని దాటి వెళ్ళకూడదని బెనర్జీ ప్రామిస్ తీసుకున్నాడు. అయినా బెనర్జీ మనుషులు అధికార పార్టీతో హైదరాబాద్ లో మంతనాలు జరిపారు. వాళ్ళకి ఈ విషయాలు తెలియకుండా ఉంటాయి అంటారా!" శ్రీకళ తన అభ్యంతరాన్ని బయటపెట్టింది.
   
    "ఎస్.... యూ ఆర్ కరెక్ట్ మిస్ శ్రీకళ........"
   
    సార్.... ఆఫీసర్స్ వెయిట్ చేస్తున్నారు, రమ్మంటారా!" గన్ మెన్ గుర్తుచేశాడు.
   
    ఆఫీసర్స్ అంతా ఛాంబర్ లోకి వచ్చారు.
   
    "ప్లీజ్ బిసీటేడ్....."      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS