"ఓ.... గాడ్ .... నీవెంత నిర్దయుడవయ్యా!"
"ఏమండోయ్ శ్రీవారు అనవసరంగా దేవుడిని నిందించకండి. ఇందులో అయన చేసిందేమీ లేదు. అంతా మీరు చేసుకుందే. చేసుకున్నవారికీ చేసుకున్నంత మహాదేవా!" అంది ఉడికిస్తూ.
గన్ మెన్ డోర్ తీయడంతో ఇద్దరూ మాట్లాడడం ఆపారు. ఆర్డర్లీ క్యారియర్ తెచ్చి పక్కనే వున్న డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.
"అమ్మా వడ్డించామంటారా!" అన్నాడు వినయంగా
"వద్దులే నేను లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే ఈ భక్తురాలు వడ్డించుకుంటుంది.
క్యారియర్ తీసి అప్పటికే సరిత చకచకా టేబుల్ మీద అన్ని సర్ధింది. విక్రమ్ మౌనంగా వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు సరిత ఒడ్డిస్తోంది
సరిగ్గా అదే సమయానికి ఫోను మోగింది. విక్రం లేవాబోయాడు.
"మీరు తినండి నేను చూస్తాను " సరిత రిసీవర్ ఎత్తింది.
రెండు నిమిషాలు అవతల వైపు నుంచి సమాచారం అంతా వింది.
"ఓ.కే. ఓ.కే ఇప్పుడే ఫోర్స్ పంపే ఏర్పాట్లు చేస్తాను."
"వాటీజ్ ది మేటర్ సరితా?" అత్రుతుగా అడిగాడు విక్రమ్.
"వేస్ట్ గోదావరి ఎస్.పి నుంచి ఫోను. ట్రాయిబల్స్ ప్రోబ్లం.... ఫోర్స్ వెనక్కీ పంపమని రిక్వెస్టు"
"అలానే పంపిద్దాం.... ఇక్కడ ఉన్న ఫోర్స్ తో నేను మేనేజ్ చేస్తాను. క్యాంప్ క్లర్క్ కి చెప్పి మీ పోర్స్ రిటన్ చేయమని హెడ్ క్వార్దర్స్ ఆర్.ఐ.కి. తెలియజేయమను."
సరిత అలానే ఫోను తీసి ఇన్ స్ట్రక్షన్ ఇచ్చింది.
"సరితా కమాన్ చల్లారిపోతున్నాయి" విక్రం చేయి తుడుచుకుని ప్లేటు తీసి సరిత ముందు పేట్టి వడ్డించబోయాడు.
"ఆగండి శ్రీవారు ఇది ఆఫీసు. మన రేసిడేన్స్ కాదు. ఎవరన్నా చూస్తె నన్ను సత్యభామా అనుకుంటారు. మీ చేత నిజంగానే సేవలు చేయించుకుంటుందనుకుంటారు. ఇక మీరు వెళ్ళి మీ చైరు లో కూర్చోండి. నేను వడ్డించుకుంటాను" సరిత మధ్యలోనే అడ్డుపడింది.
"చిత్తం దేవి" కన్నుగీటుతూ వెళ్ళి తన సీటులో కూర్చున్నాడు విక్రమ్ . గన్ మెన్ డోర్ తెరుచుకుని వచ్చాడు.
"సార్..... ఆఫీసర్స్ అంతా మీటింగ్ కి వచ్చారు. రమ్మంటారా?"
"జస్ట్ ఓ పది నిముషాలు వెయిట్ చేయమను. మేడం లంచ్ చేస్తున్నారు."
గన్ మెన్ వెళ్ళిపోయాడు.
* * * *
కలెక్టర్ రమ్యశ్రీ బెనర్జీ శిభిరం దగ్గర వుంది. ఆమెతోపాటు జాయింట్ కలెక్టర్, ఇంకా మిగిలిన రెవెన్యూ సిబ్బంది వున్నారు.
"ప్లీజ్ బెనర్జీగారు ఈ నిమ్మరసం తీసుకుని మీరు దీక్ష విరమించటం మంచిది." కలెక్టర్ అనునయంగా అంది.
"సారీ మేడమ్. నా ప్రాణానికి ఎవరు హామీ ఇస్తారు? కేవలం ముద్దాయిలను అరెస్టు చేయడం, కేసు సి.బి.సి.ఐ.డికి అప్పజేప్పడంతో అయిపోయిందనుకుంటే సరిపోదు మేడమ్ నాకు గన్ మెన్ కావాలి. నా ప్రాణానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. అప్పుడుగాని నేను నా దీక్ష విరమించను" బెనర్జీ నిష్కర్షంగా ఖండించాడు.
అతని సమాధానానికి కలెక్టర్ కి చిరేత్తుకొచ్చింది. కేవలం హైదరాబాడు నుంచి చీఫ్ సెక్రటరీ చెప్పబట్టి తను డిగి వచ్చింది. నిజానికి అది తన డ్యూటీ కాదు. కాని బెనర్జీ పోలీసు ఆఫీసర్ల మీద, వాళ్ళ దర్యాప్తు మీద అభియోగం మోపడం వలన తను చొరవ చూపాల్సి వచ్చింది.
"ఓ.కే మిష్టర్ బెనర్జీ, మీరు అడిగినట్లుగానే గన్ మెన్ ను ఏర్పాటు చేయిస్తాను. ఇక మీ ప్రాణ రక్షణకు హామీ అంటారా! హొమ్ సేక్రటరీలో మాట్లాడి మీకు మీ ఇంటి దగ్గర కూడా పోలీసు పికేట్ పేట్టే ఏర్పాటు చేయిస్తాను.... ఇప్పటికైనా మీరు దీక్ష విరమిస్తే....."
'అలా అని కాగితం మీద రాసి ఇవ్వండి మేడమ్.....'
'కాగితం మీద అంటే నా మాట మీద మీకు......'
"సారీ మేడమ్. ఇక్కడ నమ్మకాలు, అపనమ్మకాలు అంటూకూర్చుంటే నా సమస్య తీరదు మేడమ్. రానివ్వండి ప్రభుత్వానే డిగిరానివ్వండి అందాకా దేనికైనా నేను మనుషులు సిద్దపడే వచాహము. దీక్ష కంటిన్యూ చేస్తాము, విరమించే. ప్రసక్తే లేదు."
కలెక్టర్ ముఖంలో రంగులు మారాయి. మరోమాట మాట్లాడకుండా కలెక్టర్ కారు ఎక్కి కూర్చుంది.
ఆమెతోపాటే మిగిలిన రెవెన్యూ సిబ్బంది అంతా కార్లలో బయలుదేరారు.
ఇదంతా పోలీసు శిబిరం నుంచి ఎసిపి శ్రీకళ వాచ్ చేస్తూనే వుంది. ఎక్కడి బెనర్జీ __ ఇంతలోనే ఎంత రాటుటెలిబోయాడు. అ రోజున భిల్లా దగ్గర ప్రాణబిక్షపెట్టమని కమిషనర్ కాళ్ళమీద పడిన వ్యక్తిలో ఇంతటి మొండి ధైర్యం ఎలా వచ్చిందో అలోచిస్తోంది. వృత్తిలో అటు, ఇటు, పోట్లు తిన్న వాడికి సుత్తి దెబ్బ ఓ లెక్కలోనిది కాదు. అలాగే యుక్తులు కుయుక్తులు, హత్యాలతో ముడిపడివున్న వాడికి చావు భయం కన్నా, తన ప్రత్యర్ధిని లేపేయాగాలనా, ముడిపడివున్న వాడికి చావు పీడిస్తూ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఘోరావ్ లు, ఆందోళనలు, అరాచాకలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టటంకేవలం అటు ప్రజల సానుభూతి, ఇటు ప్రభుత్వం నుంచి రాయితీలు, రక్షణలు పొందడం కోసం కాక మరేమిటి. బెనర్జీ అందుకు ఆతీతుడెం కాదు! అయితే ఇక్కడ జరుగుతున్నా రాజకీయ చదరంగంలో పోలీసులు పావులుకాకుండా తమని తాము కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీ కళ తన దగ్గరవున్న ఆఖరి ఆస్రాన్ని ప్రయోగించడానికి బెనర్జీ శిభిరం.దగ్గరకు చేరింది.
"గుడ్ మార్నింగ్ మేడం...." బెనర్జీ శ్రీ కళను చూస్తూనే నిటారుగా కూర్చుని విష్ చేశాడు.
శ్రీకళ ప్రతిగా అర్ధంకానిఓ చిరునవ్వు నవ్వింది.
"రండి మేడమ్......" బెనర్జీ అనడంతోనే అతని అనుచరులు ఏ.సి.పి.కి. కుర్చీ తీసుకు వచ్చి వేశారు.
శ్రీకళ కుర్చీ బెనర్జీ దగ్గరగా జరుపుకుని కూర్చుంది. "చెప్పిండి మేడమ్......"
