"అంటే నేను సీరియస్ గా అడుగుతుంటే మీకు జోక్ గా వుందన్న మాట...." సరిత బుంగమూతి పెట్టింది.
"సారీడియర్.... అయినా నువ్వు థాంక్సు చెప్పాల్సిందిపోయి, ఇలా ముద్దాయిలా నిలదీస్తావనికోలేదు. ఈ లాండ్ ఆర్డర్ ప్రోబ్లమ్ రాకపొతే మనిద్దరం హాయిగా ఓ వారం రోజులు ఇక్కడే కలసి వుండే వాళ్ళమా! అందుకుని, తమరు ఇప్పటికైనా థాంక్సు చెప్పుకోండి."
"అబ్బ ఆశ.... ఈ సాయంత్రంలోగా బెనర్జీతో మాట్లాడి, నిరాహారదీక్ష మాన్పించి, సరాసరి ఏలూరు వెళ్ళి ఫోన్లో మాట్లాడమని లా అండ్ ఆర్ద్ ఐ.జి.గారి ఇన్స్ స్త్రక్షన్స్ .
హతోస్మీ...." విక్రంమ్ తల పట్టుకున్నాడు.
బజర్ మోగాడంలో రిసీవరేత్తాడు విక్రమ్.
"సార్ హొమ్ మినిష్టర్ గారు లైన్ లోకి వస్తున్నారు. " ఇంటర్ కమ్ లో కంప్యుక్లర్క్ చెప్పాడు.
"గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ హియర్...."
"ఎస్ .సార్ ...."
"ఎస్.... సార్...."
"ఎస్. సార్......"
"గుడ్. డే . సార్ ..."
విక్రమ్ ఫోన్ పెట్టేశాడు. సరిత ముఖంలో కత్తిగాటుకు నెత్తురుచుక్కలేదు.
"విక్రమ్ వాట్ హేపండ్?" సరిత అతని చేతిని అందుకుని అత్రుతుగా అడిగింది.
"హొమ్ మినిష్టర్ విజయవాడ వస్తున్నట్టా...."
"దేనికి?"
"సి. ఎం తనని వెళ్ళి బెనర్జేతో మాట్లాడాదమన్నాట్ట. ఛ! ఛ! బెనర్జీ ఈజ్ ఏ బ్లడీ రౌడీ షీటర్. పృద్వీ అనుచరుడుని కాల్చి చంపినా కేసులో ముద్దాయి. వాడికి భయపడిపోతే ఇంక ఈ రాష్ట్రాన్ని వీళ్ళేలా పరిపాలీస్తారో?" నిష్టూరంగా అన్నాడు విక్రమ్.
"మీరు ఎక్సైట్ కాకండి. రాజకీయ నాయుకులు ఏ నిర్ణయం తీసుకుంటే మనకెందుకు? మన పని చేసుకుపోదాం" సరిత అనునయంగా అంది.
"కాని ప్రజలకి, మిడియాలకి మనం సమాధానం చెప్పాలిగా! అయిన పృద్వీని, బెనర్జీలమధ్య ఇంత శత్రుత్వం వున్నట్టు ముందే తెలిసినప్పుడు వాళ్ళకి గన్ మెన్ ను ప్రోవైడ్ చేయాల్సింది. వాళ్ళ మూమెంట్స్ ని ఎప్పటి కప్పుడు కనిపెట్టగలిగి వుంటే......"
"సిల్లీ...... వాళ్ళిద్దరు. కేరాఫ్ ప్లాట్ ఫారం గాళ్ళు, ఆకూరౌడీలు, వాళ్ళకి గన్ మెన్ లను ఇవ్వడం వాళ్ళా స్టేజీని పెంచటం అవ్వదు! ఇక మూమెంట్స్ అంటావా ఇక్కడ ఎవ్వరూ సరిగ్గా ఉద్యోగం చేయడం లేదు ఎవరి సంపాదనలు వారివి. పైరవీలు, నాయుకులకు సలాంలు, గులాంలు చేసి కాకాపట్టి తమ తమ స్థానాన్ని కాపాడుకోవడం మినహా ఇంకేమిచేయరు. అందుకేగా వాళ్ళందర్నీ పంపించి కొత్తవాళ్ళను తెచ్చుకోవాలనికుంది...."
"బావుంది ఏమ్దర్నీ మారుస్తాను. వచ్చినవాళ్ళు మాత్రం ఎంత వరకు నీతిగా, నిజీయితీగా వుండగలరు. అసలు వాళ్ళు వుండాలన్నాఇక్కడ పరిస్థితులు వాళ్ళని ఉండనిస్తాయా! నా సలహా అయితే ఉన్నవాళ్ళతోనే అందరించో, బెదిరించో పని చేయించుకోవాలి తప్ప......"
"అంటే ..... నన్ను కాంప్రమైజ్ అవ్వమంటావా?"
"కాని ఇప్పుడు జరిగింది ఏమిటి? ఇప్పుడు వున్నవాళ్ళ నందరిని బయట జిల్లలాకు పంపించేస్తున్నారన్న నిసృహతో అసలు వాళ్ళు పనిచేయడం మానేశారు. వాళ్ళ దగ్గర సమాచారం కమిట్ మెంటు వాళ్ళకి వుండకపోవడం వలెనే ఇన్ని హత్యలు జరిగుండోవచ్చు" సరిత నిర్మోహమాటంగా చెప్పుకుపోతుంది.
నిజమే, సూక్ష్మంగా ఆలోచిస్తే సరిత చెప్పిన దాంట్లో ట్రూత్ వుంది. నిజాయితీగా తన తప్పును ఒప్పుకునే హొదా కాదు తనది. కాని తోటి అధికారిగా ఆమె సలహా పాటించకపోయినా, జీవిత భాగస్వామిగా ఆమె సలహా పాటించటంలో తనకు వచ్చే నష్టమేమి లేదు. కనీసం తన జీవిత బాగాస్వామినైనా తృప్తి పరచిన వాడవవుతాడు.
"సారీ.... మీకు కోపం వచ్చినట్టుంది...." సరిత కంగారుగా అంది.
"నాట్ ఎట్ అల్ డార్లింగ్.... యూ ఆర్ కరెక్ట్. నీ సలహా తప్పక పాటిస్తాను." అంటూ టెలిఫోను రిసీవర్ అందుకున్నాడు విక్రమ్.
"హొమ్ మినిష్టర్ హైదరాబాదు నుండి బయలుదేరారు. హెడ్ క్వార్టర్స్ ఆర్.ఐ.కి. పైలెట్ ఎస్కార్డ్ రెడీ చేయమని చెప్పండి. అలాగే ట్రాఫిక్, లా అండ్ అప్జ్హీసర్స్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తే ఆఫీసర్లు అంతా ఓ గంటలో నా చాంబర్ లో ఉండాలని చెప్పండి." ఇంటర్ కమ్ లో క్యాంఫ్ క్లర్క్ కి సూచన లిచ్చాడు విక్రమ్.
"గుడ్ బోయ్....." అంది సరిత క్రీగంట విక్రమ్ ని చూస్తూ......
"థాంక్స్ మేడమ్..... థాంక్యూ వెరీమచ్ ఫార్ యువర్ కంప్లీమెంటేనా .... వట్టి కాంప్లీమెంటేనా, ఈ దాసుడుని కరుణించి పార్టీ గట్రాఏమన్నా ఇస్తారా!"
"పార్టీయా... ఏ పార్టీ?" అమాయకంగా ఫోజు పెడుతూ అంది.
"అమ్మడూ పెళ్ళయి పన్నెండేళ్ళు అయ్యింది. పార్టీ అంటే తెలియదా! పద.... పద...." నెత్తిమీద మొట్టి అన్నాడు.
"నో... నో.... శ్రీవార.... ఇంకో గంటలో మీకు మీ స్టాఫ్ తో మీటింగ్ ఉంది. నేను బెనర్జీ తో, వాళ్ళ మనుషులతో మాట్లాడాలి. మరో నాలుగు గంటల్లో హొమ్ మినిష్టర్ వస్తున్నాడు. అందుకనే వర్కింగ్ లంచ్ ఇక్కడికే పంపించమని ఆర్డరు వేశానుగా" అంది చిలిపిగా నవ్వుతూ.
"ఎప్పుడు?"
"ఇందాకా శ్రీవారు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, తమరి గన్ మెన్ కి చెప్పానుగా"
