"సార్..." విలేఖరి ఈసారి తన ఛాన్సు మిస్ చేసుకోదలచుకోలేదన్నట్టు అందుకున్నాడు.
"జంటిల్ మెన్ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, మీ ప్రశ్నలంన్నింటికి సావధానంగా సమాధానం చెబుతాను" హొమ్ మినిష్టర్ అందర్నీ ఉద్దేశించి అన్నాడు.
అంతా అత్రుతుగా ఎదురు చూస్తున్నారు.
"ప్లీజ్ తీసుకొండి. రిలాక్స్ అవ్వండి." మామూలుగానే తన ధోరణీలో అన్నాడు హొమ్ మినిష్టర్.
అందరూ బిస్కెట్స్ పక్కకు త్రోసి టీ తీసుకున్నారు.
సరిగ్గా అదే క్షణంలో "మే ఐకమిన్ సార్" అంటూ డోర్ తెరచుకుని సి.బి.సి.డి.ఎస్.పి. గౌతమ్ రాజ్ వచ్చాడు.
"వెల్ కమ్ గౌతమ్...... పృధ్వీ అతని అనుచరులను గెస్టురూమ్ లో పేట్టి లాక్ చేయించాను. మీరు సిబ్బందిని తీసుకువచ్చారు. కదా!"
"ఎస్...... సార్...."
"ఓ.కే వాళ్ళాని అదుపులోకి తీసుకుని డిటైల్డ్ గా ఇంటరాగెషన్ చేయండి. విజయవాడ హత్యల వెనుక మరి ఎవరి హస్తం వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొండి. ప్లీజ్ గో ఎహెడ్"
"వెరీ వెల్ సర్" సి.బి.సి.ఐ.డి. ఎస్.పి వెళ్ళిపోయాడు.
"సార్...." విలేఖర్లల్లో ఒకరు అత్రుతుగా అడగబోయారు.
"ఓ.కే మీ ప్రశ్నలకి ఈ పాటికి జవాబు దొరికే వుంటుంది. ఇంకా కొత్త ప్రశ్నలు మీరు వేయనక్కర లేకుండానే మీకు శ్రమలేకుండానే ప్రెస్ స్టేట్ మెంట్ ఇస్తున్నాను రాసుకోండి. మా పార్టీలో నేరస్తులకు, నేరగాళ్ళకు, స్థానం లేదు. పృధ్వీ, అతని అనుచరులు మా పార్టీలో సభ్యులయిన మాట వాస్తవమే. కాని వాళ్ళు విజయవాడలో ఇటీవల జరిగిన హత్యకేసులో ముద్దాయిలు. ఈ కేసు ఇప్పుడే సి.బి.సి.ఐ.డి.కి. హేండోవర్ చేశాను. ముద్దాయిలను సి.ఐ.డి ఎస్.పి.గారు నిర్భంధంలోకి తీసుకున్నారు. పృద్వీని, అతని అనుచరులను మాపార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాను. ఓ.కే మీ ప్రశ్నలంన్నింటికి ఇప్పుడు నేను జవాబు లిచ్చినట్లే కదా! ఇంకా ఏమన్నా డౌట్స్ వుంటే అడగండి" చెప్పడం ఆపి రిలాక్స్ అయ్యాడు హొమ్ మినిష్టర్.
"సార్ .... రోజురోజుకి ఉదృతం అవుతున్న నిరసన, ధర్నాలు, నానాటికి క్షిణిస్తున్న ఆమరణనిరాహరణదీక్ష చేస్తున్న బెనర్జీ ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని కేవలం ప్రజలకు మధ్యపెట్టడానికే ఈ అరెస్టు డ్రామా జరిపించాలని పార్టీ నుంచి పృద్వీనీ, అతని అనుచరులను సస్పెండ్ చేయడంవలన ఇప్పుడు ప్రజాస్వామ్యానికి కొత్తగా జరిగే మేలు, ఏమీలేదని, అసలు సస్పెన్షన్ పనిష్ మెంట్ కాదని మేం అంటున్నాం దీనికి మీరు ఏం చెబుతారు?" అందరిలోకి తలపండిన సీనియర్ జర్నలిస్టు నిలదీశారు.
హొమ్ మినిష్టర్ ఖంగుతిన్నారు. ముఖంలో రంగులు మారాయి. గొంతు తడారింది.
తను ఎవరితోటి జాగ్రత్తగా ఉండాలనుకున్నాడో వాళ్ళ దగ్గరేపప్పులోకాలేశాడు. తను దోరికిపోయాడు. ఎదురుదెబ్బ తిన్నాడు. ప్రెస్ రిపోర్టు అంటూ తను తొందరపడి తప్పుడు నిర్ణయం, తీసుకున్నాడా? రేపు ఉదయం పేపర్లో ఈ విషయాన్ని రాసి తనమీద స్వపక్షం వారికి లేనిపోని అనుమానాలు, ప్రతిపక్షం వారికి అవకాశం కల్పించి తన పదవి నుంచి ది౦చేదాకా వాళ్ళు నిద్రపోమని కంకణంగాని కట్టుకోలేదుకదా! ఆలోచిస్తూన్నాడు హొమ్ మినిష్టర్ .
"ఏం సార్! షాక్ తిన్నారా ?" ఓ విలేఖరి అపహాస్యం చేశాడు.
"నో.... నో.... బ్రదర్స్ అది అంతా ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం అని మీరు గుర్తిస్తే చాలు, ఆధిపత్యం కోసం పోటీ, ఎత్తులు, కుయుక్తులు, కొట్టుకోవడాలు, పొడుచుకోవడాలు షరా మామూలే, అరెస్టులు జరిగాయి. వల్ల గురించి అనవసరంగా ఆలోచించి నా టైమ్ పాడు చేసుకోవడం నాకు ఇష్టంలేదు. మీరు ఆ విషయాలు ఇంకా సాగదీయడం వలన నేను చేయవలసిన మంచి పనులు చేయకపోవడం, సమయం వృధా అయ్యి సామాన్య ప్రజలకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. అవతల నాకు చాల కార్యక్రమాలు వున్నాయి. ఇంతటిలో ప్రెస్ మీట్ ముగించి జైహిందు" హొమ్ మినిష్టర్ హడావిడిగా వెళ్ళిపోయాడు.
వెళుతున్న హొమ్ మినిష్టర్ చెవిలో ఆ మాటలు పడనే పడ్డాయి.
* * * *
"డియర్... బయట అందోళనకారులు, ఐమీన్ బెనర్జీ మనుషులు ఏమన్నా ట్రబుల్ ఇచ్చ్చారా?" విక్రమ్ సరిత రావడంతోనే అత్రుతుగా అడిగాడు.
వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు అక్రోశించడం సహజమే! తమ నిరసనను రకరకాలుగా తెలియజేయడం షరామామూలే! కాకపోతే ఇక్కడ నాప్రేమేయం లేకపోవడం వలనేమో నన్ను రచ్చ కీడ్చకుంటూ వదిలేశాడు. అయినా వాళ్ళని, ధర్నాలు నిరాహారదీక్షలు దాకా ఎందుకు రానిచ్చి నట్లో.... ముద్దాయిలను అరెస్టు చేయాలన్న వాళ్ళ డిమాండ్ లో న్యాయం వుందిగా!
విక్రమ్ భృకటి ముడిపడింది భార్యకేసి అదోలా చూశాడు.
"నా అడ్మేనిస్ట్రేషన్ తప్పు పడుతున్నట్టూ, లేక జస్ట్ సలహానా!"
"మీరు ఎలా అనుకున్నా నేను బాధపడును ముందు మీరు నాభర్త అ తర్వాతే పోలీస్ ఆఫీసర్. మీర బాధపడడం, అవమానానికి గురి అవ్వడం నేను చూడలేను. అందుకే నా మనసులోని బాధను అణచుకోలేక నిర్మోహమాటంగా అడిగేశాను. ఎందుకంటే మనకీ రాజకీయ నాయకుల పట్ల ఎస్ట్రాలాయలటీస్ ప్రభుత్వద్యోగులు భారత రాజ్యంగం నిర్దేశించినంత వరకే డ్యూటీ చేయాలి. ఆపైన జరిగే వాటికి మనం బాధ్యులంకాదు. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంటున్నారు అవునా?"
"థాంక్సు మేడమ్ మీ అవగాహానానికి మిమ్మల్ని ఆకాశం అంత ఈటు పొగడదనుగాని, భర్తపట్ల తమకున్న ఆకాశం అంత ప్రేమకి మాత్రం నేను ప్లాట్ అయిపోయాను. ఇటువంటి శ్రీమతిని ఇచ్చినందుకు థాంక్సు మీ పేరెంట్స్ కి చెప్పాలో? మన ఇద్దర్నీ ఒకే భ్యాచ్ లో ఐ.సి.ఏస్.కి సెలెక్ట్ చేసిన పభ్లిక్ సర్వీస్ కమిషన్ కి థాంక్సు చెప్పాలో? మన ఇద్దరినీ అంధ్రప్రదేశ్ కేర్ కి పంపినందుకు కేంద్ర ప్రభుత్వానికి థాంక్సు చెప్పాలో? అర్ధం గాక అతగంత నుంచి ఆలోచిస్తూన్నావంటే నమ్ము డియర్."
