Previous Page Next Page 
అధికారి పేజి 29

      "ఒ.కే వర్మగారు  మీరు నాకో సహాయం చేస్తారా?"
   
    "చెప్పండమ్మా..... ఏం చేయమంటారు?"
   
    "మీరు వెళ్ళి ధర్నా చేస్తున్నా వారికి ఎవరు నాయకత్వం వహిస్తూన్నారో వారిని బండెంట్ పై చేసి వారితో మాట్లాడండి. వాళ్ళు ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోండి.

    వాళ్ళు నాకు మొమెరాండం ఏదన్నా ఇవ్వాలనుకుంటే  వాళ్ళ నాయుకుడిని, ఓ నలుగురైదుగురు అనుచరులను నా దగ్గరకు పంపండి."

    "అలాగేనమ్మా ఇప్పుడే వెళ్తాను"
   
    వర్మ వెళ్ళిపోగానే కలెక్టర్ కమిషనర్ కి ఫోను చేసింది.
   
                      *    *    *    *   
   
    పోలీస్ కమిషనర్ కార్యాలయం కౌంపౌండ్ బయట 'టెంట్ ' వేసి వుంది. ఆ టెంట్ లో బెనర్జీలో బెనర్జీతోపాటు అతని అనుచరులు మరో నలుగురు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. బెనర్జీ చుట్టూ విలేకర్లు, ఫోటోగ్రాఫర్లు, వున్నారు.
   
     వాళ్ళు అడిగిన ప్రశ్నలకు బెనర్జీ ఓపిగ్గా సమాధానం చెబుతూన్నాడు.
   
    టెంట్ కి కొంత దూరంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మొహారిల్లి వున్నాయి.
   
    సరిగ్గా అప్పుడే రేంజి డి. జి. బి. సరిత కారు కమిషనర్ కార్యాలయంలోకి ప్రవేశించిన బోతుండగా ఆందోళనకారులు కారులు చుట్టూముట్టారు. బయట బందోస్తులో వున్న రిజర్వు పోలీసులు లాఠీలు ఝుళిపించబోతుండగా సరిత కారు డిగి వద్దని వారించింది.
   
    పోలీసు డౌన్ ... డౌన్ ... అధికార పార్టీకి లోత్తులయిన పోలీసు ఆఫీసర్ల వెంటనే ట్రాన్సఫర్ చేయాలని నినాదాలు వినిపిస్తూన్నాయి.
   
    సరితకారు దిగి సరాసరి బెనర్జీ కూర్చున్న శిబిరం దగ్గరకు వెళ్ళింది.
   
    "నమస్తే మేడమ్" బెనర్జీ ఆమెను చూడగానే విష్ చేశాడు. 
   
    ప్రతిగా సరిత చిరునవ్వు నవ్వింది.
   
    "సారీ మేడమ్.... మావాళ్ళు మీకు ఇబ్బంది కలిగించినట్లున్నారు. మీరు కమిషనర్ రేట్ కి వెళ్ళండి మేడం, మావాళ్ళు అడ్డు తప్పుకుంటారు."
   
    "ఖాన్ మనవాళ్ళంద్దర్నీ అడ్డు తప్పుకోమను, స్లోగసు అపమను, అమ్మగార్ని లోపలికి పంపండి."
   
    "ఇట్స్ ఓ.కే బెనర్జీగారు మీరు అన్నీ తెలిసినవారు పోలీటికల్ మర్డర్స్ జరిగినప్పుడు ముద్దాయులు అంత సులువుగా దొరుకుతారా? మీరు ఇలా ఆమరణ నిరాహారదీక్ష, ధర్నాలు అంటూ లా అండ్ ఆర్డర్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వలన మా కాన్సంట్రేషన్ , ప్రయారీటి డైవర్డ్ అవుతుంది. కేసు దర్యాప్తు కుంటుపడుతుంది. దానివలన మీకే నష్టం . ముద్దాయిలు ఎలిభీలు సృష్టించుకోగలరు. నాయుకుల పంచనజేరి తప్పించుకునే మార్గాలను అన్వేషించను గలరు. అంతేకాదు, కోర్టులకు ఆశ్రమించి ముందస్తు పొందగలరు. అందుకే మీరు బాగా ఆలోచించి మాకు యూ కేసు దర్యాప్తు లో సకకరించాగలరని ఆశిస్తున్నాను."
   
     "మీరు వాస్తవం చెప్పారు మేడం. కాని మాకు జరగవలసిన నష్టం జరిగిపోయింది. అధికార పార్టీకి, వాళ్ళ ప్రెషర్స్ కి లొంగిపోయి యిక్కడి ఆఫీసర్లు ఏం చేశారో,  ఏం చేస్తున్నారో ఈపాటికి మీరు గ్రహించేవుంటారు. ఇంకా నేను సహిస్తూ కూర్చుంటే యిక నాప్రాణానికి కూడా ముప్పు వాటిల్లవచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ సలహ కాదంటున్నందుకు మన్నించండి మేడమ్.....!" బెనర్జీ చాలా నమ్రత గా చెప్పాడు.
   
    అప్పటికే బెనర్జీ అనుచరులు మెయిను గేటు వద్ద దారిచేశారు.
   
    "ష్చ్......" సరిత భారంగా నిటూర్చి కారు ఎక్కింది.
   
    కారు కమీషనరేట్ లోకి వెళ్ళింది. సరిత కారు డిగి సరాసరి కమిషనర్ చాంబర్ లోకి వెళ్ళింది.
   
                       *    *    *    *
   
    హొమ్ మినిష్టర్ ఛాంబర్.
   
    హొమ్  మినిస్టర్ ఎదురుగా విలేఖర్లు, ఫోటోగ్రాఫర్లు వున్నారు. వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని, పని తీరుని దుయ్యబడుతున్నారు ఉన్నతాధికారుల అరాచాకాలు. లంచగొండితనాన్ని నిలదీస్తున్నారు. హొమ్ మినిస్టర్ కి చాలా చిరాకుగా వుంది. వాళ్ళు వేలుకేస్తే కాలుకు, కాలుకేస్తే వేలుకి అన్నట్టు హొంమినిష్టర్ ని వాళ్ళ మాటల గారడీతో, ప్రశ్నల బాణాలలో పెడుతున్నారు.
   
    "సార్! మీరు  టీ బిస్కెట్లు యిచ్చి, మధ్య, మధ్య,     ఓ చిరునవ్వు నవ్వి, ఓ వేడి నిట్టూర్పు విడిచి మమ్మల్ని మభ్యపెడుతున్నారు. మా ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి...." వాళ్ళల్లో సీనియర్ జర్నలిస్టు నిలదీసి అడిగాడు.
   
    దానికి సమాధానంగా హొమ్ మినిష్టర్ మరోమారు చిరునవ్వు నవ్వాడు.
   
    "సార్ సిటీలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు మౌనం వహిస్తున్నారేమిటి? ముద్దాయిలు మీ పార్టీకి చెందిన వారేనా?"
   
    ".... సార్ మీ మౌనం చూస్తుంటే అవుట్ రైట్ గా మీ పార్టీ గూండాలకు, రౌడీలకు వెన్ను కాస్తోందనిపిస్తోంది. అసలు వాళ్ళ అండదండలు లేందేమీ పార్టీ మనుగడ లేదనిపిస్తోంది" ఓ మహిళా విలేకరి మండిపడుతోంది.
   
    స్ప్రింగ్ డోర్ తెరుచుకుని హొమ్ మినిష్టర్ సి.ఎ. వచ్చి మినిష్టర్ చేతికి ఓ చిన్న స్లీఫ్ యిచ్చాడు.
   
    హొమ్ మినిస్టర్ స్లీప్ చూసి ఓ క్షణం అలోచించాడు. పి.ఎ. ని దగ్గరకు రమ్మని పిలిచి సీక్రెట్ గా అతని చెవులో చెప్పాడు.
   
    పి.ఎ తలవూపి వెళ్ళిపోయాడు.
   
    "సార్.... "మరో విలేఖరి మాట్లాడాటానికి ప్రయత్నించాడు.
   
    "జస్ట్ వెయిట్ ప్లీజ్" అంటూ హొమ్ మినిష్టర్ ఫోన్ చేసి డైల్ చేసి ఓ రెండు మాటలు మాట్లాడి ఫోను పెట్టేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS