Previous Page Next Page 
అధికారి పేజి 28

    డ్రైవర్ మెత్త బడుతున్నట్టు వ్యాన్ స్లో చేశాడు.
   
    "సార్ ఎక్కడ ఆపవద్దని, సరాసరి హైదరాబాద్ పొమ్మని మరీ మరీ చెప్పాడు __ నువ్వు పోనీబాయ్..." డ్రైవర్ కి వార్నింగ్ ఇచ్చాడు.
   
    డ్రైవర్ మారు మాట్లాడకుండా స్పీడ్ పెంచాడు. ఇప్పుడు వ్యాన్ స్పీడు గంటకి తొంభై కిలోమీటర్ల దాటింది.
   
    వ్యాన్ ఇబ్రహీంపట్నం  పేర్రా దాటినా తరువాత హైవే మలుపుతో ఓ లారీ సడన్ గా రోడ్డుకి అడ్డంగా రావడంతో డ్రైవర్ కంగారుగా బ్రేక్ వేశాడు. వ్యాన్ లారీని గుద్దుకుని ఆగిపోయింది.

    అంటే లారీలోంచి తప్పించుకున్నాడు.
   
    "ఒరే పృధ్వీ అందులోనే వున్నాడు. ఏ ఒక్కడ్ని వదలొద్దు అందర్నీ వేసేయండిరా....." లారీ కాబిన్ లో కూర్చున్న బెనర్జీ కేకలు పెట్టాడు.
   
    "సరిగ్గా ఆ గుంపు వ్యాన్ ని సమీపించబోయేలోగా వ్యాన్ వెనుకే టాటా సుమోలు రెండు ఆగాయి. వాటిల్లోంచి పృధ్వీ అతని అనుచరులను ఓ ఇరవై మంది మరణాయుధలతో దిగారు.
   
     "అన్న వచ్చాడు... అన్న వవ్చాడు" వ్యానులో వున్న పృధ్వీ అనుచరులు ముగ్గురు చావు తప్పించుకున్నమన్న ఆనందంలో అరుస్తూ ఊపిరి పీల్చుకున్నారు.

    అంతే మరుక్షణంలోనే పృధ్వీ అతని అనుచరులు అంతా కలసి లారీ దిగిన పదిమంది బెనర్జీ అనుచరుల మీద నాటుబాంబులు విసిరారు.
   
    అప్పటికే లారీ క్యాభిన్ లో వున్న బెనర్జీ క్యాబిన్ దూకి పరారయ్యాడు. బాంబులు పేలి అక్కడికక్కడే బెనర్జీ అనుచరులు తునాతునకలయ్యారు. 
   
    కాలిన గాయాలయ్యి పారిపోతున్న బెనర్జీ అనుచరులు నలుగుర్నీ పృధ్వీ మనుషులు వేటకొడవళ్లతో నరికేశారు.
   
    పృధ్వీ రివాల్వర్ తీసి బెనర్జీకోస౦, తనని వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించిన అనుచరుడికోసం ఆ చుట్టుప్రక్కల వెదికాడు.
   
    వాళ్ళిద్దరి ఆచూకీ దొరకలేదు.
   
    పృధ్వీ టాటా సుమోలను, మెటడోర్ వ్యాన్ ను రివర్స్ చేయించి కొండపల్లి మీదగా మైలవరం వైపు వెళ్ళిపోయాడు.
   
                          *    *    *    *
   
    "అన్నా నా గురించి ప్రుద్వీకి తెలిసిపోయిందన్నా"
   
    పొలం గట్టు మీదనుంచి పరుగుపేట్టి బెనర్జీని చేరుకున్న పృధ్వీ అనుచరుడు ఆయసంలో రొప్పుతూ, అన్నాడు.
   
    "నా కొడకా నా ప్లాన్ అంతా తల్లక్రిందులు చేశావు. నా పదిమంది అనుచరులను పొట్టనబెట్టుకున్నావు కదరా" బెనర్జీ ఆవేశంతో ఊగిపోతూ బొడ్లోవున్న పిస్తోలు బయటకు తీశాడు.
   
    "అన్నా..... అన్నా నీకు దండం పెడతామన్నా .... తల్లితోడన్నా పృధ్వీ మొదట తన సూట్ కేసు మేటడోర్ వ్యాన్ లో పెట్టించినప్పుడే తను కూడా వ్యాన్ లో వస్తాడని నిర్దారి౦చునే నీకు ఫోను చేశామన్నా నేను చెప్పినట్టుగానే పృధ్వీ వ్యానులో ఎక్కడున్నా మరెందుకనో వీధి మలుపు తిరగగానే వ్యాన్ ఆపి దిగిపోయాడన్నా. మమ్మల్ని సరాసరి హైదరాబాద్ వెళ్ళి పోమన్నాడన్న. అప్పటికి నీకు ఫోన్ చేద్దామని 'టీ' అన్న సాకుతో వ్యాన్ ను అపమన్నానన్నా మిగిలిన వాళ్ళు వ్యాన్ అపనివ్వలేదన్నా....." ప్రాణభీతితో సంజాయిషీ  ఇచ్చుకున్నాడు.
   
    "వేస్టూ పుట్  నా కొడకా ...." అంటూ గురిచూసి ట్రిగ్గర్ నొక్కాడు బెనర్జీ.
   
    పృధ్వీ అనుచరుడు రక్తపు మడుగులో కుప్పకూలి గిలగిల కొట్టుకుని తుది శ్వాస తీశాడు.  
   
    బెనర్జీ సెల్యులర్ ఫోన్ తీసి పోలీసు కంట్రోల్ రూం కి ఫోన్ చేశాడు.
   
                                                           *    *    *    *   
   
    కలెక్టర్ క్యా౦ఫ్ ఆఫీసు .
   
    కలెక్టర్ రమ్యశ్రీ డ్రాయింగ్ రూమ్ లో ఫైల్స్ చూస్తోంది.
   
    "మేడం బయట బెనర్జీ మనుషులు ధర్నా చేస్తున్నారు. పోలీసులకు ఇన్ ఫార్మ్స్  చేయమంటారా?" క్యామ్ఫ్ క్లర్క్ వర్మ ఇంటర్ కమ్ లో అడిగాడు.
   
    "వాళ్ళ డిమాండ్స్ ఏమిటో, అసలు ధర్నా ఎందుకు చేస్తున్నారో?" తెలుసుకున్నారా?"
   
    "మేడమ్ బెనర్జీ మనషులు పదిమంది చనిపోయిన కేసులో పోలీసులు ఇంతవరకు ముద్దాయిలను అరెస్టు చేయనందుకు నిరసనగా బెనర్జీ పోలీసు కమిషనర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.  అతనికి మద్దతుగా అతని అనుచరులు జిల్లా అంతటా ధర్నాలు రాస్తారాకో లు చేస్తున్నారు. బహుశ మీకు మెమోరాండం ఇవ్వడానికి వచ్చి వుండవచ్చు."
   
    "ఐసి..... పోలీసులు వైఖరికి నిరసనగా వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు మనం పోలీసులను పిలవడం అంత మంచిది కాదు. తీరా పోలీసులు వచ్చి తొందరబడి అరెస్టులు. లాఠీచార్జీలు వగైరా చేస్తే పరిస్థితి మరింత కంట్రోల్ తప్పుతుంది. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. నేను వస్తున్నానని వాళ్ళకి తెలియజేయండి."
   
    "వద్దు మేడం. మీరు బయటకు రావొద్దు. వాళ్ళు చాలా ఆవేశంతో వున్నారు....."
   
    "భలేవాడివి దోరికావయ్యా! భయపడితే మనం ఉద్యోగం చేయలేమయ్యా!"
   
    "మేడం నా ఉద్దేశ్యం అది కాదు. మీరు బయటకు వస్తే వాళ్ళు మిమ్మల్ని ఘెరావ్ చేయోచ్చు మేడమ్. అనవసరంగా రిస్కు చేయడం ఎందుకమ్మా...." చిరు ఉద్యోగి అయినా, వయసుచేత జీవితాన్ని కాసీ వోడబోసిన అనుభవంతో అనునయంగా చెప్పాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS