'మీరలా ఫోనులో ఆలోచిస్తూనే వుండండి. అక్కడ, ఇక్కడ ఫోను బిల్లులు లక్షకు చేరుకుంటాయి. తరువాత గవర్నమెంటు ఫోను పీకేస్తే ఎంచక్కా పోస్టుకార్డులు రాసుకోవచ్చు ఖర్చు తక్కువ......' నిష్టూరంగా అంది.
'ఆ..... డియర్ గుర్తు వచ్చింది. ఇక్కడికి ఓ నలుగురు మంచి ఇన్ స్పెక్తర్లని పోస్టు చేయాలని వాళ్ళ పేర్లు నోట్ చేసుకో.....'
'అదేమిటి మీ కమిషనరు లో పనిచేస్తున్న వాళ్ళంతా వచ్చి సంవంత్సరం లోపేగా అయ్యింది, మరి ఇంతలోనే ట్రాన్సుఫార్ చేయడం బాగోదేమో! తన సందేహాన్ని వెళ్ళభుచ్చింది.'
'వాళ్ళ మంచి_ చెడు ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింటుంది.'
"పోనీ మీరు వాళ్ళకి చెప్పి చేయించుకోవచ్చుగా.'
'ఆ స్టేజీ దాటిపోయింది మేడమ్ నేను చెప్పే వాళ్ళ పేర్లు రాసుకుని ప్రపోజల్స్ హైదరాబాదు పంపు, నేను హొమ్ మినిస్టర్ తోను ఎడ్ మిస్ ఐజితోను మాట్లాడి వెంటనే అర్దర్సు వచ్చేట్టు చూస్తాను.'
'ఓ.కే పేర్లు చెప్పండి....'
'ప్రసాద్, సోమరాజు, వినయ్ కూమార్, మోహన్....'
'వెరీ వెరీ పూర్ భాయిస్ ..... కోరుకోక కోరుకోక భలేవారే కోరుకున్నారు. ఒకడు లాకఫ్ డేత్ కేసులో, ఒకడు రేఫ్ కేసులో, ఒకడు ఎ.సి.బి. ట్రాఫ్ లో. ఇంకొకడు భార్యను చంపిన కేసులో, అరెస్టు అయ్యి ఈ మధ్యే తిరిగి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళ చరిత్ర తెలిసే అడుగుతున్నారా?"
'డోంట్ వర్రీ డియర్. ఐనో, ఎవ్వీరిథింక్ . ఈ సిటీకి స్మూత్ గా పని చేసుకుపోయేవాళ్ళు పనికిరారు. రౌడీ, గూండాలను డీల్ చేయడానికి కరుకుతెలీ డక్కా ముక్కలు తిన్నవాళ్ళు కావాలని నేను సెలక్టు చేసుకున్నాను ప్రపోజల్ వెంటనే పంపు....'
'సరే మీ ఇష్టం ...... ఇంక డ్రింక్ తాగొద్దు.....'
రేపు ఆదివారం కూడా దేవిగారు కరుణించకపొతే ! తాగుబోతు కాకతప్పదేమో.....'
'సారీ ఇక్కడ ట్రాయిబల్ ప్రాబ్లమ్స్ ఉండటంవలన క్యా౦ఫ్ చేయవలసివచ్చింది రేపాదివారం తప్పకుండా వస్తాను.....'
'థాంక్సు' కమిషనర్ ఫోను పెట్టేశాడు.
గన్ మెన్ డోర్ ఐదుసార్లు ఎవరో మీతో అర్జెంటుగా మాట్లాడాలని ఫోను చేశారు. దొరగారు హాట్ లైనులో అమ్మగారితో మాట్లాడుతున్నారని కనెక్షను ఇవ్వలేదు....'
'ఎవరు మాట్లాడుతున్నారో? ఎక్కడనుంచి మాట్లాడుతున్నాడో విషయం ఏమిటో అడగలేదా!"
'సారీ సార్ అతను చాలా కంగారుగా మాట్లాడాడుసార్ తమరితోనే మాట్లాడాలన్నాడని వివరాలు అడగలేదుసార్ '
"అఘోరించావులే వెళ్ళు వెళ్ళి ఈసారి ఎవరు ఫోనుచేసి నాతోమాట్లాడాలి అన్నా ఇమిడియట్లీ నాకు కనెక్షను ఇవ్వు."
'ఏస్ సార్ ' గన్ మెన్ వెళ్ళిపోయాడు.
ఫోను ఎవరు చేసి వుంటారో? విషయం ఏమై వుంటుందోనని అలోచనలో పడ్డాడు సిటీ కమిషనర్.
20
"ఎక్కడికి ప్రయాణం ."
జవాబుగా చూచి భార్య లెంప పగులగొట్టాడు సిటీలో పేరుమోపిన రౌడీషీటర్ పృధ్వీ.
ఆమె తల తిప్పి హాలు వేపు చూసింది. పృధ్వీ అనుచరులు నలుగురు బరిశలు గోడళ్ళు , కత్తులు ఆటక మీద నుంచి తీస్తూ కనిపించారు. వరండాలో వున్న బెంచీల మీద ప్రైవైటు పంచాయితీల కోసం వచ్చిన జనం వున్నారు.
తన నీడని కూడా నమ్మని భర్త జాగ్రత్తకి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు ఆ ఇల్లాలికి. ఉనికి వస్తున్న కన్నీటిని పంటి బిగువున అపుకుంది.
'అయూధాలతోపాటు, ఈ సూట్ కేసు కూడా వ్యానులో పెట్టండి, అనుచరులకు హకుంజారీ చేశాడు.
నలుగురు అనుచరులు చకచక అయూధాలను వ్యానులో సర్ది ఆ వెంటనే సూట్ కేసును తీసుకువెళ్ళారు.
"హైదరాబాదు వెళ్తున్నాను" తన ఎదురుగా వున్న శ్రీ మతికే కాదు బయటవున్న అనుచరులకి, పంచాయితీకోసం వచ్చిన జనానికి వినబడేట్టు నొక్కి చెప్పాడు పృధ్వీ.
అనుచరులు వ్యాన్ ఎక్కారు. డ్రైవర్ వ్యాన్ స్టార్టు చేశాడు. అలాగే ఐదు నిముషాలు ఇంజన్ ఆడుతూనే వుంది.
పృధ్వీ హాలుబయటకు వచ్చి పంచాయితీకి వచ్చిన జనానికి రెండు రోజుల తరువాత రమ్మని చెప్పి వ్యాన్ ఎక్కాడు.
మెటడోర్ వ్యాన్ ఆ విధీ మలుపు తిరగ్గానే పృధ్వీ వ్యాన్ ఆపి క్రిందకు దిగాడు. హడావుడిగా అనుచరులు దిగబోతుండగా వద్దని వారించాడు.
"తుమ్ సీదా హైదరాబాదు జానా. డ్రైవర్ వ్యాన్ మధ్యలో ఎక్కడ ఆపకు...."
వ్యాన్ బయలుదేరిపోయింది.
అక్కడ ఇప్పుడు వంటరిగా పృధ్వీ మిగిలిపోయాడు.
అతను ఓసారి తన నడుంతట్టి చూసుకున్నాడు. లోడ్ చేసిన రివాల్వర్ ఉంది.
సరిగ్గా అదే సమయంలో రెండు టాటా సమోసాలు పృధ్వీ దగ్గరకు వచ్చి సడేన్ గా ఆగాయి.
"ఆపు .... ఆపరా ఆపు......."
పృధ్వీ అనుచరులలో ఒకడు డ్రైవరు ని వ్యాన్ అపమన్నాడు.
"సార్ ఎక్కడా ఆపవద్దని చెప్పారు....." డైవర్ వ్యాన్ స్పీడ్ మరింత పెందుతూ అన్నాడు.
"అరె ఆయనగారు చెప్పినవన్నీ చేస్తున్నామా? పక్కన ఆపితే టీ తాగి వెంటనే బయలుదేరవచ్చు ...." ఏమంటారని మిగిలిన సహచరుల వైపు చూశాడు.
