Previous Page Next Page 
అధికారి పేజి 26

    "కంట్లో నలకపడితే పంపు దగ్గర మోహం కడుక్కుని వచ్చాను. అందుకే ఆలస్యం అయ్యింది" ఈసారి కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
   
    "మీకింతా ఆడపిల్లలే పుడతారు."
   
    "మీకు జాతకాలు చెప్పడం కూడా వచ్చా....?"
   
    "రాదు....."
   
    "మరి మీరు నాకు అబద్దాలు ఆడతారని ఎలా అన్నారు"
   
    "సింపుల్ అబద్దాలు అడేవాళ్ళకి ఆడపిల్లలు పుడతారని లోకోక్తి"
   
    అంటే నేను అబద్దాలు అడతానాని...."
   
    "ఎస్ పచ్చి అబద్దాలు" ఉడికిస్తున్నట్టుగా రెట్టించి అంది.
   
    "నా మీద అంత పెద్ద నిందవేయకండి. ప్లీజ్...."
   
    "మీ కంట్లో నలక పడడం అబద్ధం కాదంటారా!"
   
    "వరలక్ష్మిగారు ఎప్పుడో ఒప్పుకున్నాను. మీతో పోటీలో నేను ఓడిపోతానని."

    "మరి అయితే నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి. గుడిలో పూజారి ప్రసాదం ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదు? హారతి ఇచ్చినప్పుడు ఎందుకు కళ్ళకద్దుకోలేదు? అమ్మవారికి ఎందుకు నమస్కరించలేదు" ప్రశ్నల వర్షం కురిపించింది.
   
    "అయితే నాకు మీ తేడా లేదు."
   
    "అంటే......"
   
     "మీకు అమ్మవారి మీద భక్తీకన్నా నా చర్యలని గమనించడంతోనే పుణ్యకాలం కాస్త గడచిపోయిందని అర్ధం."
   
    "అంటే నాది కొంగజపమని గెలిచేస్తున్నారా?" నిష్టూరంగా అంది.
   
    "సారీ మీ భక్తీ విశ్వాసాలను కామెంట్ చేయడం, నా అభిమతంకాదు."
   
    "నా ప్రశ్నలకు జవాబు...." రాగం తీస్తూ అడిగింది.
   
    "ఓ,కే చెబుతున్నాను సరిగ్గా 25 సంవత్సరాల క్రిందట ఇదే రోజున ఇందాక మనం కలసిన మెట్టు దగ్గర పట్టపగలు ఎవరో పుణ్యాత్మారాలు నన్ను పసిబిడ్డగా వున్నప్పుడే వదిలిపేట్టి పోయిందట అప్పటి నుంచి ఈ అనాదను ఎవరో పుణ్యాత్ముడు పెంచి పెద్దచేశాడు....." అధికారి చెప్పడం ఆపి నిట్టూర్చాడు.
   
    వరలక్ష్మి షాక్ అయ్యింది.
   
    అమ్మలగన్న అమ్మ. ఇంద్రకీలాద్రిపై కొలువు చేసిన అమ్మ, సాక్ష్యాత్తు జగన్మాత ప్రాగాణంలోనే పట్టపగలు నన్ను నా తల్లి అనాధను చేసినప్పుడే అ తల్లి మౌనం  వహించి, కళ్ళు మూసుకుంది, పసిగుడ్డు ఆక్రందనలు సైతం ఆ జగన్మాత హృదయం కరిగించలేకపోయాయి. ఇప్పుడు మాత్రం ఆ జగజ్జనని  నా మొర ఆలకింస్తుందన్న ఆశ నాకు లేదు. అందుకే నేనుం గుడి మెట్లవరకే పరిమితం ఆపై ఒక్క అడుగుకూడా ఇన్ని సంవత్సరాలుగా ముందుకు వేయలేదు. ఇప్పుడు కేవలం మీ మీద ఉన్న..... ఐ మీన్ మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక వచ్చాను. ఇప్పుడు నేను నాస్తికుడినో, ఆస్తికుడినో మీరే నిర్ణయించండి....." అప్పటికే అధికారి హృయంతోపాటు గొంతు కూడా మూగవోయి౦ది.
   
    వరలక్ష్మి ఏదో ట్రాన్స్ లో కి వెళ్ళిపోయినట్టు అధికారి చేయి అందుకుంది.
   
    అధికారి విస్మయంగా చూశాడు. ఆమె కళ్ళ నుండి నీళ్ళు జలజల రాలడం చూశాడు.
   
    "థాంక్యూ వరలక్ష్మి గారు ఈ అనాదగాధ విని కనీసం మీ హృదయం అయినా కరిగి, నాలుగు కన్నీటి చుక్కలు నేలరాల్చినందుకు"
   
    "అధికారిగారు ..... మీరు మరోసారి నేను అనాధను అనడం నేను వినను, వినకూడదు. ఈ ప్రపంచంలో ఏకాకిగా వున్న ఎవరైనా అనాధలే! మనిషికి మనషి సాయం వున్ననాడు ఎవ్వరూ అనాధలు. కారు. నేను మీకు తోడు వున్నప్పుడు మీరు ఎప్పటికి అనాధకారు. కాలేరు'. అంటూ వరలక్ష్మి అప్పటికే అధికారి చేతిని తీసుకుని తన హృదయానికి హత్తుకుంది.
   
    అధికారి కళ్ళల్లో కొత్త కాంతి చిగురించింది.

     ఆ ప్రయత్నింగానే ఆమె చుట్టూ చేతులు వేశాడు.
   
    వరలక్ష్మి అధికారి కౌగిలిలో వదిగిపోయింది. 
   
    కొండమీద జగన్మాత ఇప్పుడు కూడా మౌనం వహించింది. ఆ ప్రేమ జంటను చూసి కళ్ళు మూసుకుంది. మౌనం శాపం కాదు! దేవతలు మనోనేత్రంతో చూస్తారు. భక్తులను ఆశీర్వదీస్తారు అనడానికి నిదర్శనంగా పూజారి గుడి బయటకు వచ్చి అమ్మవారి ప్రసాదం అధికారి ముందుపేట్టి వెళ్ళిపోయాడు.
   
                                     19
   
    "మేడం మీకు ఫోను, సార్ లైనులో వున్నారు" అంటూ క్యా౦ఫ్ క్లర్క్ రేంజి డి.ఐ.జి. సరితకు ఫోను కలిపింది.
   
    'హాలో.... మీరు బావున్నారా!"
   
    "తమరక్కడ నేనిక్కడ ఇంకే బావుంటాను. డియర్ బేబి బావుందా? టెన్నిస్ కి రెగ్యులర్ గా వెళ్తుందా?"
   
    "ఆ.... ఆ..... ఎందుకు వెళ్ళదు. దానికి అన్ని శ్రీవారి బుద్దులు వచ్చాయిగా ఏమిటి విషయం అంతరాత్రి ఫోను వేశారు....'
   
    "ఏం చేయను కాళిదాసు మేఘసందేశంలా దేవిగారికి ఈ భక్తుడు ఫోను సందేశం పంపుకుందామని....'
   
    'ఏమిటో శ్రీవారు అలా కుషీగా వున్నారు. కొత్త అలవాట్లు ఏమన్నా'
   
    'నాకేం అలవాట్లు వున్నాయి డియర్.......'
   
    'గుమ్మడి కాయల దొంగలంటే భుజాలు తుడుముకున్నాట్టా వెనకటికి ఎవడో అలా వుంది. వాసన ఫోనులో తెలుస్తుంది లెండీ.....'
   
    ఫోనులో వాసన తెలుస్తుందా! ప్రామిస్ డియర్ ఒంటరిగా వుండలేక రెండంటే రెండే పెగ్గులు వేశాను. అయినా తీసుకుని చాలాసేపు అయిందిలే!"
   
    'అనుకున్నాను ముందే అనుకున్నాను మాటలు ముద్దగా వస్తున్నప్పుడే అనుకున్నాను....'
   
    'సరితా .... సరితా... ప్లీజ్ వెయిట్ నేనెందుకు ఫోను చేశానంటే......
   
    'కమిషనర్ విక్రమ్ ఆలోచిస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS