కమిషనర్ ఆలోచనలో పడ్డాడు.
ఇంటర్ కమ్ తీసి సి.ఎం షేషి కి కలుపని క్యాంఫ్ క్లర్క్ కి సూచన చేశాడు.
18
"హల్లో.... గుడ్ మార్నింగ్" వరలక్ష్మి పూల సజ్జతో కనకదుర్గ గుడిమెట్లు ఎక్కుతూ ఎదురుపడ్డ అధికారిని చూసి గ్రీట్ చేసింది.
"హాయ్.... వెరీగుడ్ మార్నింగ్...."
"ప్రతి శుక్రవారం మీరు గుడికి వస్తారా?" వరలక్ష్మి అడ్వాన్స్ గా అడిగింది.
"ఇక మీరు నాకు చాన్స్ ఇచ్చేట్టు లేరు. అ ప్రశ్న నేనే మిమ్మల్ని అడగాలనుకున్నాను. అయినా శుక్రవారం అమ్మవార్నికి దర్శించుకోవడానికి ఆడవాళ్ళు అధిక సంఖ్యలో వస్తారుగానీ...."
"అంటే మగవాళ్ళు రారనా, రాకూడదనా? " మధ్యలోనే అందుకుని అంది వరలక్ష్మి.
"సారీ.... అలా అని నేనెందుకంటాను..."
"మరి..."
"మేడమ్ నేను పోటీ చేసి నెగ్గలేనని ఒప్పుకుంటున్నాను......"
"థాంక్యూ నన్ను ఆకాశానికి ఎత్తేసినందుకు .... రండి వెళదాం......"
"మీరు వెళ్ళిరండి నేను వెయిట్ చేస్తుంటాను."
"అయితే అబ్బాయిగారు అందరికన్నా ముందు అమ్మవారిని దర్శనం చేసుకొచ్చేశారన్నమాట."
"లేదండి...."
"మరి అయితే రండి వెళదాం"
"మీరు వెళ్ళండి. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను...."
"అదేమిటి దర్శనం అయ్యిందా అంటే అవ్వలేదంటారు, లోపలి రమ్మంటే రానంటారు. ఒకవేళ కమిషనరు గారు మీకు ఏదన్నా స్పేషల్ డ్యూటీ అప్పజెప్పారా...." చిరునవ్వుతో అంది.
"పోనీ అలాగే అనుకోండి...."
" ఈ రోజున శ్రావణ శుక్రవారం చాలా మంచిరోజు. జస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళొచ్చుగా ...."
"నాకు ఆ నమ్మకాలూ లేపులేండి"
"పోనీ నా కోసం రావావుచ్చుగా."
ఆలోచనలో పడ్డాడు అధికారి.
అల్ రైట్ సంతానికైనా మీరు నాతో ఈ రోజు గుడికి రారు. ఆ విషయంలో నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను." వరలక్ష్మి నిష్టూరంగా అని ఇక అక్కడ క్షణం కూడా ఆగకుండా చకచకా మెట్లు ఎక్కసాగింది.
"సారీ.... మిమ్మల్ని హార్ట్ చేసినట్టున్నాను" అధికారి పరుగున వచ్చి ఆమె చేతిలోని పూలా సజ్జను తన చేతిలోకి తీసుకుని ఆమె ప్రక్కనే నడవసాగాడు.
"థాంక్యూ నన్ను గుర్తించినందుకు నా మాట కాదనునందుకు" క్రీగంట అధికారికి చూస్తూ అంది.
గుడిలోకి వెళ్ళగానే అధికారి పూలసజ్జ ఆమె చేతి కందించాడు.
పూజారి దేనికి కొబ్బరికాయ కొట్టి, హారతి పళ్ళెం, ఇద్దరి ముందు ఉంచాడు.
వరలక్ష్మి ఐదు రూపాయలు పళ్ళెంలో వేసి హారతి కళ్ళకి అద్దుకుంది.
అధికారి చేతులు కట్టుకుని నుంచున్నాడు. అతని దృష్టి అమ్మవారిమీద లేదు. ద్వారం మీద వున్న శ్లోకం మీద వుంది. అధికారి అది చదివి తనలో తాను నవ్వుకున్నాడు.
పూజారి రెండు కొబ్బరి చెక్కలు తీసి ఒకటి వరలక్ష్మి కి రేండోది అధికారికి ఇవ్వబోయాడు.
అధికారి తీసుకోకుండా రెండడుగులు వెనక్కీ వేశాడు.
పూజారితోపాటు వరలక్ష్మికికూడా అధికారి చర్యకి ఆశ్చర్యపోయింది. వరలక్ష్మి గుడి మండపంలో కూర్చుంది.
అధికారి కొంచెం దూరంలో ఆమె కెదురుగా కూర్చున్నాడు.
వరలక్ష్మి కొబ్బరిచిప్ప పగలగొట్టి ప్రసాదం నోట్లో వేసుకుంది. అధికారి దృష్టి గుడిలోకి భక్తులమీద వుంది.
"మీరు నాస్తికులా...."
అధికారి ఆలోచన ఎక్కడో వుండడంతో ఆమె మాట వినిపించలేదతనికి .
"మీరు నాస్తికులాని అడుగుతున్నాను" గొంతు పెద్దదిచేసి అడిగింది.
మౌనంగా ఉండిపోయాడు.
"నోటితో చెప్పడం ఇష్టం లేకపోతె కనీసం, అవుననో, కాదనో, తల వూపవచ్చుగా " నిష్టూరంగా అంది.
అధికారి చిరునవ్వు నవ్వాడు.
" నా ప్రశ్నకి జవాబు అదికాదు....." చిరుకోపం ప్రదర్శించింది.
"పోనీ ఏం సమాధానం చెబితే మీకోపం చల్లారుతుందో చెప్పండి"
"నా కోపం చల్లారాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలి."
"ఓ.కే చెప్పండి చేస్తాను."
"ప్రామిస్...."
"నా మనస్సాక్షికి వ్యతిరేకంగా ఏదీ చేయను. సారీ ప్రామిస్ మాత్రం చేయలేను....."
"అయితే చెప్పనుపొండి" బుంగమూతి పెట్టింది.
"కొన్ని ప్రశ్నలకు ఈ విశ్వంలో జవాబులు వుండవు వరలక్ష్మి గారు" అధికారి గొంతు వణికింది.
అతని కళ్ళలో నీలినీడలు చోటు చేసుకుంటుండగా తల పక్కకు తిప్పుకున్నాడు.
"సారీ అధికారిగారు. నేను మిమ్మేల్ని హార్ట్ చేసునట్టున్నాను."
"అబ్బే అలాంటి దేమీలేదు."
"ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి."
అధికారి జేబులోంచి ఖర్చీఫ్ తీసుకుని ముక్కు చీదుతున్నట్టు దూరంగా వెళ్ళాడు. అతను చాలా సేపటికిగాని రాలేదు.
అధికారి రావడంతోనే "ఇక బయలుదేరదమా!" అన్నాడు.
"మీరు ఎక్కడికి వెళ్ళారు....." అందోళనంగా అడిగింది వరలక్ష్మి.
