Previous Page Next Page 
అధికారి పేజి 24

    కమిషనరు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత దానికి తిరుగులేదు.
   
    "సో.... యూ ఆర్ అప్లయింగ్ లాంగ్ లీవ్.... మిగిలిన మీరంతా టీమ్ కేప్టెన్ కూలబడి౦తరువాత మీరేంచేస్తారు. ... ఓ మనిచేయండి. పోయి కంట్రోల్ రూం లో రిపోర్టు చేయండి."
   
    "యస్... సర్......" అంతా ఎలర్ట్ గా సెల్యూట్ కొట్టి వెళ్ళి పోయారు......
   
    ఇన్స్ స్పెక్తర్స్ హరిశ్చంద్రుడు అప్పటికిప్పుడే లీవ్ అప్లయ్ చేసి కమిషనర్ స్మార్ట్ గా సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
   
    "ఈ కమిషనర్ రేట్ కి తప్పు పట్టింది. ఈ తుప్పు వదలించేకన్నా స్క్రాఫ్ ను తీసిపడేయడమె బెస్ట్..... సిటీలో కమ్యూనల్ మర్డర్లు జరిగాయి అని తెసిలికూడా కీలకప్రాంత్రలలో పికేట్స్ వేయకుండా, పెట్రోలియం చేయకుండా ఆ శ్రద్దచేసినా ఇన్స్ స్పెక్తర్స్, వేస్ట్, సౌత్ , నార్త్ .... యూన్   లేస్ యూ ఆర్ ఓన్లీ రెస్పాన్స్ బుల్ ఫర్ అల్ దిస్.... ఎసిపిలు, డిసిపిలు మీరు కేవలం టేబుల్ ముందు కూర్చుని సంతకాలు పెట్టడానికే పరిమితమైపోయారు.....
   
    ఛ ! ఛ! ఒక్కడు ఒక్క ఆఫీసరు బుర్ర పేట్టి సక్రమంగా క్రమంగా ఉద్యోగం చేయడంలేదు. క్రిమినల్ వేస్టు ప్రభుత్వం  మీ అందరికీ  జీతాలు ఇవ్వడం జస్ట్ క్రిమినల్ వేస్టు.......
   
    అయిపోయింది. మీరంతా తట్టా బుట్టా సర్దుకోవచ్చు. ఐ డోంట్ వాంట్ బ్లడీ ప్రెగ్ నెంట్  డేక్స్.... ఐ వోన్లీ వాంట్ మార్షల్స్... సో ల్జర్స్ డోంట్ షో యువర్ ఫేసెస్ ప్లీజ్ అల ఆఫ్ యూ గో అవుట్."

    అంతే వాన కురిసి వెలసినట్టు అంతా లేచి నుంచుని సెల్యూట్ చేసి బ్రతుకు జీవుడా అంటూ బయలుపడ్డారు.
   
    "సార్ ఎసిపి శ్రీకళగారు, లేడి  కానిస్టేబుల్ వరలక్ష్మి. అధికారి వచ్చారు...." గన్ మెన్ డోర్ తీశాడు.
   
    "యస్... కమిన్ ..."సిపి అనగానే వాళ్ళంతా లోపలకు వచ్చారు.
   
    "కంగ్రాచ్యులేషన్స్  అధికారి. ఇంత పెద్ద కమిషనరేట్ లో నేను సాదించలేనిది నువ్వు సాధించావు. ఉభయవర్గాలవారిని మారణాయూధాలతో సహా హొమ్ మినిస్టర్ వాళ్ళను నువ్వు నా ఎదుట సరండర్ చేయించి వుంటే నీకు రాష్ట్రా వ్యాప్తంగా పేరు వచ్చేది కాదేమో?  
   
    "సారీ సార్...... తమరు"
   
    "నో... నో..... నేను మీ తప్పుపట్టడంలేదు. అంత పెద్ద క్రెడిట్ కొట్టేసినందుకు నేనేమీ జెలసీ ఫీలవ్వడంలేదు . నాదగ్గర పనిచేస్తున్న వ్యక్తికీ అంత పేరు రావడంతో నేను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి ఆపుతున్నాను. లీజ్ టేక్ దిస్......."
   
    అధికారిని కమిషనర్ ఇచ్చిన పేపర్లు అందుకున్నాడు. "ఒకటి సస్పెషన్స్ నేను ఉపసంహరించుకున్నట్టు. రేండో ఆర్డర్ నీకు హెడ్ కన్సిటేబుల్ గా ఎక్స్ లరె టేడ్ ప్రమోషన్."
   
    "థాంక్యూ సార్ .... థాంక్యూ వెరీమచ్...." అధికారి వినక్రమంగా సెల్యూట్ చేస్తూ అన్నాడు.

    "మిస్ వరలక్ష్మి ఐయాం రియల్లీ సారీ! నిన్ను డర్టీ డేవిల్ అన్నందుకు నేను మనస్పూర్తిగా సారీ చెబుతున్నాను. కానీ అధికారిని సస్పెండ్ చేయడం నువ్వు తప్పుగా అర్ధం చేసుకున్నావు.  అప్పుడు నాకు  రెండువర్గాలు వున్నాయి. ఒక యూనిఫాంలో వున్న సి ఆర్ పి ఎఫ్ జవానులమీద తుఫకీ లోడ్ చేసి  ఒకటి గురిపెట్టినందుకు కేసు పేట్టి అధికారిని అరెస్టు చేయడం. రెండోది నాలుగు కేకలు వేసి సస్పెండ్ చేయడం. బైదిబైవరలక్ష్మి సస్పెన్షన్ పనిష్ మెంట్ కాదమ్మా. నేను అధికారిని సస్పెండ్ చేయడం వలన అధికారికి మేలు జరిగిందా, కీడు జరిగిందా?.... కమిషనర్ జవాబు కోసం క్షణం ఆగాడు.
   
    వరలక్ష్మి కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. కమిషనర్ అంటే భయంతోకాదు. కమిషనర్ చర్యని అపార్ధం చేసుకుని రిజైన్ చేసి ఇంత రాద్దాంతం చేసినందుకు.   
   
     "సారీ సార్....." వరలక్ష్మి పెదాలు అస్పష్టంగా కదిలాయి.
   
   
    "నో... నో... బేబి నువ్వు సారీ చెప్పకూడదు. ఎనీవే వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నందుకు నిన్ను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను..... బైదిబై నువ్వు ఏం చదివావమ్మా."
   
    "ఎం ఎ క్రిమినాలజీ సార్...."
   
    "గుడ్..... వెరీగుడ్ .... రేపటినుంచిఈ ఆఫీసులోనే నైట్ డ్యూటీ వేయండి శ్రీకళగారు. నువ్వు కష్టపడి చదివి రాబోయే సెలక్షన్స్ లో ఏస్ ఐ పోస్టు సంపాదించాలి..... ఓ.కే బేబి."
   
    "థాంక్యూసార్.... మీకు నేను చాలా రుణపడి వున్నాను."
   
    "ఓ.కే అధికారి రేపటినుంచి డ్యూటీలోచేరు. ఎసిపిగారు అధికారి ఆధ్వర్యంలో మరో  ఐదుగురు సిన్సియర్ కానిస్టేబుల్స్ ని సెలెక్ట్ చేసి నాకు అటాచ్ చేయండి వాళ్ళు ఏ డ్యూటీ చేయాలో నేను చెబుతాను. ఓ.కే..... అల్ ది బెస్ట్ ... బోట్ ఆఫ్ యూ కేన్...... గోనౌ"
   
    అధికారి, వరలక్ష్మి ఇద్దరూ కమిషనర్ కి సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు.
   
    "ఐయాం సారీ సార్. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఈ అవమానం మీకే కాదు సార్ యావత్ ఐసిఏస్ అఫీసర్లందరది. అప్టారాల్ ఓ కానిస్టేబుల్ కి మీరు సారీ చెప్పడం" శ్రీ కళ గొంతు బొంగురుపోయింది. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి.
   
    "ఇట్స్ ఒకే.... ప్లీజ్ కూల్ డౌన్ శ్రీకళ. నేను తొందరపడి నోరు జారడంవల్లనే ఇదంతా జరిగింది. అందుకే ఆత్మాభిమానాన్ని చంపుకుని పెద్దమూల్యం చెల్లించుకున్నాను. లీవిట్. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అనవసరంగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోవడం మంచిది కాదు. ఒకే థాంక్యూ వెరీమచ్. ఈ సమస్య ఇంత తెలికిగా పరిష్కరం అవ్వటానికి మీరు చూపిన చోరవకి నా కృతఙ్ఞతలు."
   
    "నో సర్.... మీరు నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడకపోయిన ఐయాం ఎట్ యువర్ సర్వీస్ సార్"
   
    "సో నైస్.... థాంక్యూ .... థాంక్యూ వెరీ మచ్.
   
    శ్రీకళ చిరునవ్వునవ్వి విష్ చేసి వెళ్ళిపోయింది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS