శ్రీకళ ఆమె చేతిని అందుకుంది.
అప్పటికే వరలక్ష్మి తల్లి మూడు కప్పుల్లో టీ తీసుకువచ్చింది.
"తీసుకొండమ్మా మొదటిసారి మా ఇంటికి వచ్చారు. " అంటూ టీ కప్పు శ్రీ కళకి అందించింది.
"మీరు అదృష్టవంతులు అంటీ....." టీ అందుకుంటూ శ్రీకళ ఆమెను అభినందించింది.
"ఏమో తల్లీ ఈ పిచ్చిది ఉద్యోగానికి రిజైన్ చేసి రేపటినుంచి ఇంట్లో గోళ్ళు గిల్లుకు కూర్చోవడంకన్నా ఏం చేయగలదు. చక్కటి ఉద్యోగాన్ని వదులుకుని...." ఆమె కళ్ళు వత్తుకుంది.
"మీరేమి కంగారు పడనవసరంలేదు అంటీ...... వరలక్ష్మి చేసిన పని ప్రభుత్వమే హర్షించింది. ఈ విషయాలన్నీ సి.ఏం. దృష్టికి వెళ్ళాయి. వరలక్ష్మి కేవలం రిజగ్నేషన్ తో తన ఆత్మాభిమానాన్ని కాపాడుకున్నా అది అంతటితో ఆగలేదు. ప్రజలు, ప్రెస్, సి.యం. ని హొం మినిష్టరుని, డిజిఓ నీ ఊపు ఊపారు సి.పి.కి కనువిప్పు కలిగింది. ఇప్పుడు సి.పి. గారి దూతలా నేను మీ దగ్గరకు వచ్చాను. సి.పి గారు అధికారి సస్పేషన్ వాసన్ తీసుకున్నారు. నీ రిజగ్నేషను ను అంగీకరించలేదు. ఓసారి మీరిద్దరూ. వచ్చి సి.పిగారిని కలిస్తే బావుంటుంది......."
"మేమెందుకు రావాలి మేడమ్...... వరలక్ష్మి ఆవేశంగా అంది.
ప్లీజ్ వరలక్ష్మిగారు తొందరపడకండి" అధికారి వరలక్ష్మికి సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు.
"తప్పు ఆయనగారు చేసినప్పుడు, ఆయనగారికి పై అధికారుల నుండి, ప్రభుత్వం నుండి, ప్రెస్ నుండి వత్తిడి ఉందనే వుంది. కానీ సి.పిగారు తన స్టేజీ దిగి క్షమాపణ చెప్పడానికి మీ దగ్గరకు వచ్చి తిరిగి తను ఈ కమిషన రేట్ లో ఉద్యోగం చేయగలరా? ప్రెస్, పభ్లిక్, ముందు తలఎత్తుకోగాలరా?"
"సారీ మేడమ్ వరలక్ష్మి ని తీసుకుని నేను కమిషనర్ రేట్ కి వస్తాను" అధికారిని మధ్యలో కల్పించుకుని భరోసా ఇచ్చాడు.
"దట్స్ గుడ్......" అధికారిని అభినందించింది. శ్రీకళ.
"అమ్మా వరలక్ష్మి నీ పట్టుదలకి నేను మనస్పూర్తిగా అభినందిస్తూన్నాను. కానీ దేనిని తెగేవరకు లాగాకూడదు. మన మంచితనం గురించి తెలుసుకుని మన శత్రువు కూడా సిగ్గుపడాలి అదే మాటలను కాదనకు......" హితవు చెప్పి శ్రీకళ వెళ్ళిపోయింది.
వరలక్ష్మి ఆలోచనలో పడింది.
"మేడమ్....... ఆ మేడమ్ వెళ్ళిపోయారు. ఇక ఈ మేడంగారు తయారు అయితే రిక్షా తీసుకురావాడానికి" ముసిముసిగా నవ్వుతూ వేసుకోవడానికి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది వరలక్ష్మి.
17
"కంగ్రాచ్యులేషన్స్ .... టేక్ దిస్.... " అంటూ పోలీసు కమిషనరు నగదు బహుమతులను ఎ.జి.పి.ఎస్. ఇన్స్ స్పెక్టర్ హరిశ్చంద్రడికి, సిబ్బందికి పంచిపెట్టారు.
అక్కడ కమిషనర్ ఛాంబర్ లో జరుగుతున్నా మీటింగుకి కమిషనర్ రేట్ లో పనిచేస్తున్న పోలీసు అధికారులు అంతా హజరయ్యారు.
కమిషనర్ కి అనందం వచ్చినా ఆవేశం వచ్చినా పట్టుకోలెం! రివార్డులు ఇవ్వడంలో ఎంత లిబర్ ల్ గా వుంటాడో పనిష్ మెంట్ ఇప్పుడు అంత కర్కోటకుడు మరొకడు ఉండదనిపిస్తాడు.
"డియర్ ఆఫీసర్స్ యాంటి గూండా స్టాఫ్ కి నగదు బహుమతులను ఎందుకు ఇచ్చానో తెలుసా?"
కమిషనర్ ప్రశ్నకి ఒక్కరుకూడా జవాబు చెప్పడానికి సాహసించలేరు. "కొందరు తవ్వి ఎలుకను పట్టినందుకు"
కమిషనర్ మాట్లాడిన మాటల్లోని వ్యర్దాగ్యం అవగతమైనా ఒక్కరు కూడా సాహసం చేసి నవ్వలేకపోయారు.
"గుడిదగ్గర బూతు పుస్తకాలను అమ్ముతున్న వ్యక్తులను చాలా సాహసోపెటంగా పట్టుకున్నందుకు నగదు బహుమతులను ఇచ్చాను. కాక పొతే ఎ.జి. ఎస్. స్థాఫ్ వెళ్ళిన మరుక్షణంలో నే అక్కడ రెండు హత్యలు జరిగాయి అనుకోండి...."
ఇన్స్ స్పెక్టర్ హరిశ్చంద్రుడి ముఖాన అంత ఎ.సి గదిలోనూ చెమటలు పట్టాయి. ఇక అతని సిబ్బంది సరేసరి, మొదటిసారి కమిషనర్ కురుకుతనాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు వాళ్ళు.
"హత్యా చేయడానికి కారుల్లో వచ్చి మాటువేసి ఉన్న వాళ్ళని మాత్రం మన ఏజిఎస్ పోలీసులు గుర్తించలేకపోయారు. కాని నేరస్థులు మాత్రం మన కదలికలను గమనించి, మనం వెళ్ళిపోయినా తరువాత వాళ్ళపని కానిచ్చి వెళ్ళిపోయారు. శేహాభాష్! ఇంతపెద్ద కమిషనర్ రేట్ లో ఎజీఎస్ ఇన్స్ స్పెక్టర్ కి , అతని సిబ్బందికి అరాచక శక్తుల గురించి వారి కార్యాకలాపాలు గురించి, ఇన్ ఫర్మేషన్ లేదు, రాదు. కాని బూతు పుస్తకాలు, గురించి మాత్రం ఎప్పటికప్పుడు సమాచారం వస్తూనే వుంటుంది. మనం వెళుతూనే వుంటాం. రైడ్స్ చేస్తూనే వుంటాం. ఆఫీసర్ల మెప్పు పొందడానికి ప్లాటిస్టిక్స్ కోసం కేసులు పెడుతూనే వుంటాం. మనం వృత్తి, వాళ్ళు చేసుకుపోవాలిగా ఉదారపోషణార్ధం....... సో ఇన్స్ స్పెక్టర్ నువ్వు ఓ పని చేయి....."
" సార్...." హరిశ్చంద్రుడు గుటకలు మింగుతున్నాడు.
"అబ్బే నిన్నేమీ అనడంలేదు. జస్ట్ లాంగ్ లీవ్ పేట్టి ఇంట్లోరెస్టుతీసుకో లేకపోతె, అనవసరంగా సస్పెన్షన్ కి గురయ్యి అర్దాకలితో మలమల మాడాల్సి వస్తుంది......"
