"ఐయాం సారీ సర్"
"అలానే చేస్తాను సార్...... ఇప్పుడే చేస్తాను సార్.... "
"సర్ మీరు చెప్పినట్టు చేసి మీకు ఫోను చేసి చెబుతాను సార్...."
కమిషనర్ టేబుల్ మీదవున్న మంచినీళ్ళు గుటగుట తాగేశాడు.
వెంటనే ఇంటర్ కమ్ తీశాడు. "మిస్ శ్రీకళా మీరొకసారి నా చాంబర్ కి రండి..."
16
"మీరు జాబ్ కి రిజైన్ చేయకుండా ఉండాల్సింది" అధికారి మాటలకు చివ్వున తలెత్తింది వరలక్ష్మి.
ఆమె కళ్ళలోకి చూడడానికి ధైర్యం చాలక చటుక్కున పక్కకు తిప్పుకున్నాడు అధికారి
"అలా బుద్ధిచెప్పు నాయనా! దీనికి వయసు పెరిగినా బుద్ధి పెరగటంలేదు. ఉన్న ఆధారం పోయిందన్న దిగులే లేదు దానికి. ఇంకెప్పుడు వస్తుందో దీనికి జ్ఞానం ...." వరలక్ష్మి తల్లి నిష్టూరంగా వుంది.
"ఒకే... సార్..... మా అమ్మగారు అంటే ఏదో తెలియంది చదువుకోలేదు. పాతకాలపు మనిషి అని సర్దిపెట్టుకుంటాను. కానీ అన్నీ తెలిసిన మీరు అంటే...... నో.... నో... నాకు మీ మీద చాలా గౌరవం వుంది అధికారిగారు. గొప్ప సదభిప్రాయం వుంది. దయచేసి మరొక్క మాట మాట్లాడి నా నమ్మకాన్ని పోగోట్టండి...." వరలక్ష్మి కళ్ళల్లోఎర్రజీర ఏర్పడింది.
అధికారి ఆమెను ఆ స్థితిలో చూడడం అదే మొదటిసారి. అర్ధంచేసుకున్నాడు. ఆమె రాజీనామా చేయడానికి ముందు ఎంత మానసికంగా వేదన అనుభవించింది.
"ఐయాం సారీ వరలక్ష్మిగారు మొదట నేను రొటీన్ గా తీసుకున్నాను. ఏదో మీరు ఆవేశంలో అలా చేశారునుకుని వెధవ సలహాఇచ్చాను. కానీ ఓ ఆడపిల్లగా మీరు ఎంత క్షోభ అనుభవించి ఉంటారు ముందుగా ఊహించలేకపోయాను.
మిమ్మల్ని అసిపి అంతమాట అన్నప్పుడే అతని నోటికి అడ్డుపడాల్సింది పోయి, పిరికివాడిలా నోరు మూసుకున్నాను. సారీ ఐయాం రియల్లీ సారీ.... ఐయాం ఎ బ్లడీ పూల్......." అధికారి గొంతు వణకింది.
"నన్ను తిట్ట్టినందుకు కాదు అధికారుగారు నేను రిజైను చేసింది."
"మరి...."
"మీకు అన్యాయం జరిగినందుకు"
"అయితే మీరు తొందరపడినట్టే...."
"నేను... నేను తొందరపడ్డానా...."
"కాక మరేమిటి, సిపి నన్ను సస్పెండ్ చేయడంలో రీజన్ వుంది."
మీకింత అన్యాయం చేసిన సిపిని మీరింకా వెనకేసుకున్నారంటే కొత్తగా సర్వీసులో జాయిను అయిన మీరు అతి తక్కువకాలంలోనే బానిసత్వానికి అలవాటు పడిపోయారని అర్ధమవుతుంది."
"లేదు లక్ష్మిగారు. మీరు ఆవేశంలో అంటున్నారు నిదానంగా ఆలోచించండి. నేను నేను చేసిన తపీమిటో అర్ధం అవుతుంది."
"నెవ్వరు మీరు ఏ తప్పు చేయలేదు. అధికారిగారు. తప్పు చేశానని మిమ్మల్ని మీరు వంచించుకుంటున్నారు. మీ ఆత్మాభిమానాన్ని కించపరచుకుంటున్నారు. ఇటుచూడండి. ఓ సారి ఈ పేపర్లోని ఎడిటోరియల్ చదవండి మారేమిటో మీ శక్తి ఏమిటో మీకే తెలుస్తుంది."
"వరలక్ష్మిగారు అదేదో పేపరులో నా గురించి ఎక్కువగా రాశారు. టేబుల్ ముందుకూర్చుని రాసిన ఆ రాతలకు మనం అంత విలువ ఇవ్వక్కరలేదు...."
"నో.... నో..... అధికారిగారు అని ఎవరు మీ మెప్పు పొందాలని టేబుల్ ముందు తిని, తాగి, టేబుల్ ముందు రాసిన రాతలు కాదు. అప్టారాల్ మీ ఆర్ధిక స్తోమత ఎంత? మీరు డిపార్టుమెంటులో మీది ఏ పాటిస్థాయి మిమ్మల్సి కాకాపట్టడానికి ...... యూనో ప్రెస్ ఈజ్ ఫోర్త్ ఎస్టేట్. మహా మహా సామ్రాజ్యలానే విప్లవాల రూపేణా పునాదుతో పెకలించ గలిగిన శక్తి ప్రసార సాధనలకి ఉందని మరచిపోవద్దు. ఓసారి చరిత్ర తిరగవేయండి. మీకే అర్ధమవుతుంది......
ఇంత పెద్ద కమిషనరేట్ లో ఏ ఒక్క పోలీసు అపీసరు సాధింఫ్ లేనది సస్పెన్షలో ఉండికూడా మీరు సాధించగాలిగారంటే రియల్లీ హేట్సాఫ్ టుయూ. అందుకే అధికారిగారు మీరంటే నాకు....|" వరలక్ష్మి చెప్పడం మధ్యలో ఆపేసింది.
ఎదురుగా ఎసిపి శ్రీకళ జెస్పీ దిగింది.
"గుడ్ మార్నింగ్ మేడమ్...... " ఇద్దరూ కోరస్ గా ఆమెకు విష్ చేశారు.
"వెరీ గుడ్ మార్నింగ్ టు బొత్ ఆఫ్ యూ" శ్రీ కళ అంటూ వరలక్ష్మి ఇంటి వసారా దాకా వచ్చింది.
"రండి మేడమ్...... లోలకురండి......" వరలక్ష్మి కంగారుగా ఆమెను లోపలకు ఆహ్వానించింది.
శ్రీకళ సరాసరి డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి కూర్చుంది.
"అరే మీరు కూర్చోండి......" వాళ్ళిద్దర్నీ ఉద్దేశించి అంది.
"ఫర్వాలేదు మేడమ్......" ఇద్దరూ బిడియపడుతూ కోరస్ గా అన్నారు.
బైది బై వెల్డన్ అధికారి. ఐ కంగ్రాచ్యులేట్ యూ" అంటూ చేయిచాచి అధికారికి శ్రీకళ షేక్ హేండ్ ఇచ్చింది.
"థాంక్యూ మేడమ్..... థాంక్యూ సోమచ్......." అధికారి అనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.
తనని ఓ ఐపియస్ అధికారి స్వయంగా వచ్చి అభినందించడం ముందు ఓ కలాలా అనిపించినా, అది వాస్తవమే అని నిర్ధారించుకున్నాక. అతని మనసు అద్భుతావస్థలో విహారిస్తోంది. వృత్తే దైవంగా భావించే వాళ్ళకి మణులు, మాణిక్యాలు కాదు ఆనందాన్ని ఇచ్చేవి. ప్రజల మమకారం, అధికారుల అదరాభిమానాలే!
"శేషాబాష్ వరలక్ష్మి నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఆత్మాభిమానాన్ని నిల్చుకుని ఈ రోజున స్రీ జాతికే గర్వకారణంగా నిలిచినందుకు ఓ స్రీగా నేను గర్వబడుతున్నాను. నీకు కూడా నా మనఃపూర్వక అభినందనలు...."
