అదీ ఒక్క "ఆంద్రభూమి" డైలీలోనే వచ్చింది. మరి ఇంకే దినదినపత్రికలోనూలేదు. ఆంద్రభూమి ఓ సామాన్యమైన పోలీసు కానిస్టేబుల్స్ ని ఆకాశానికి ఎత్తిన విషయం కమిషనర్ కు మింగుడుపడడంలేదు.
"తను తొందరపడి అధికారిని సస్పెండ్ చేశాడా? మొదటిసారిగా కమిషనర్ ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మరోవైపు వరలక్ష్మి తన మోహాన కొట్టిన రాజీనామా లేఖ చేస్తున్నట్టు వుంది.
వరలక్ష్మి రాసిన రాజీనామా లేఖను మరోసారి చూశాడు.
"గౌరవనీయులైన విజయవాడ నగర పోలీసు కమిషనర్ గారికి....
ఓ డర్టీ డేవిల్, అదే ఓ మహిళా కానిస్టేబుల్ నమస్కరించి రాసుకున్న రాజీనామా లేఖ.....
"ఆర్యా! మన దేశానికి స్వాతంత్ర్యం రావడంకన్నా ముందు బ్రీతిశు ప్రభుత్వ హయాంలో ఇండియన్ పోలీసు (ఐపి) అనే వ్యవస్థ ఉండేది. ఆ రోజులలో ఐసి ఎస్ కు, ఐపికి చాలా వ్యత్యాసం వుండేది. ఐసిఏస్ కు పోలీసు పరీక్షలు జరిగేవి. కానీ ఐపికి పోటీ పరీక్షలు నిర్వహింపబడలేదు. కేవలం నామినేషన్ ఆధారంగానే నియామకం జరుగుతుండేది. కానీ ఐపికి ప్రజలలో ఎప్పుడు సదాభిప్రాయం లేకుండా ఉండేది. స్వాతంత్యం ఉద్యమం ఐపిస్ (ఇండియన్ సివిల్ సర్వీసు) పరీక్షకు వయోపరిమితి హెచ్చించి భారతీయులకు అనుకూలంగా భారతదేశంలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఇండియన్ పోలీసుల్లో (ఐపి) లో భారతీయులను నియమించాలని ప్రజలు కోరలేదు. దీనినిబట్టి స్వాతంత్యం రాకముందునుండి పోలీసు వ్యవస్థమీద భారతీయులకు సదభిప్రాయంలేదు. స్వాతంత్యం లభించిన తరువాత వల్లభాయ్ పటేల్ హొంమంత్రిత్వశాఖ నిర్వహించినప్పుడు ఐపిఎస్ లకు నియమించాలనే తన నిర్ణయాన్ని పార్లమెంటు లో ప్రవేశబెట్టి ఆమోదాన్ని పొందారు.
ఆర్యా! మీ తప్పుగా అర్ధం చేసుకోకపోతే నాదొక సూటిప్రశ్నస్వాతంత్యం రావడానికి ముందు స్వాతంత్యం వచ్చిన యాభై సంవత్సరాల తరువాత ప్రజలలో పోలీసుల పట్ల ఏ అభిప్రాయం ఉందో మీరు గుండెలమీద చేయివేసుకుని ఆత్మపరిశీలన చేసుకొండి!
నా ప్రశ్నకు జవాబు పోలీసు కమిషనరు గా మీరు చెప్పలేరు. చెప్పాకూడదు కూడా. కానీ ఓ మనిషిగా, మీ అంతరాత్మకి జవాబు చెప్పుకోండి చూద్దాం. మీరు అవునన్నా, కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పటికి, ఇప్పటికి ప్రజలలో ఆ అభిప్రాయం మారలేదన్నది సత్యం,దానికి కారణం ఎవరు?
ఆర్యా! ..... మరశిక్షణకు అర్హుడైన నేరస్తుడుకి సైతం న్యాయవ్యవస్థలో నువ్వు నేరం చేశావా? చేయకపొతే నీ తరుపున వాదించడానికి ప్రభుత్వం వకీలును ఏర్పాటు చేస్తుందంటారు కానీ మీ కోర్టులో న్యాయాన్యాయాల మాట అటుంచి కనీసం ఏం జరుగుతుందో ప్రత్యక్ష్యంగా తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా నిజాయితీపరుడైనా అధికారిని "యూ ఆర్ సస్పెండ్ డ్ " అని మీరు ముందు నిర్ణయించుకున్న తీర్పును అమలు పెట్టినందుకు నిరసనాగా నేను రాజీనామా చేస్తున్నాను.
ఆర్యా! మీరు నన్ను డర్టీ డేవిల్ అన్నారు. నేను బాధపడలేదు ఎందుకో తెలుసా నేనా సమయంలో యూనిఫాంలో వున్నాను. డిసిప్లెన్ అన్నపదం నా నోరు నొక్కేసింది. మీరు నా రాజీనామాకు అంగీకరించండి. ఆ మరు నిముషంలో వరలక్ష్మి ఏమిటో? ఎవరు డర్టీ డేవిలో తేలుతుంది.
గుడ్ బై
ఇట్లు
విశ్వాసపాత్రురాలు , వరలక్ష్మి
పోలీసు కమిషనర్ ముఖం కళా విహీనమయింది. ముఖాన చిరుచెమటలు పట్టాయి.
"సార్ ప్రెస్ వాళ్ళు మీతో మాట్లాడానికి వచ్చారు. లోపలి పంపించమంటారా!" గన్ మెన్ డోర్ తెరచి అడిగాడు.
"నో... నేను ఇప్పుడు బిజీగా వున్నానని చెప్పు. ఈ రోజు ఎవ్వరికీ ఇంటర్వ్యూలు లేవని చెప్పు...."
"ఎస్ సర్....." అంటూ డోర్ మూశాడు.
ఫోను రింగ్ అయింది. కమిషనర్ రిసీవరేత్తాడు.
సర్ సి.ఎం. గారు లైనులోకి వస్తున్నారు."
"సర్ గుడ్ మార్నింగ్ సర్. విక్రమ్ హియర్ సర్......"
"యస్ సర్ ...."
