Previous Page Next Page 
అధికారి పేజి 20

    "హుస్సేన్ భాయ్.... మీరు పెద్దవారు ఇంతకంటే నేనేమీ చెప్పలేను.ఈ పరిస్థితుల్లో, ఈ సమాజంలో తిరిగి మనిషికి మనిషికి మధ్యన మాట సంబంధాలు కాదు. మానవ సంబంధాలు ఏర్పడేలా ప్రాయత్నం చేయండి. అప్పుడే పసి వయసులోనే బలి అయిపోయిన ఆ ఇద్దరు నిర్భాగ్యుల ఆత్మలు శాంతిస్తాయి..." అధికారి ఖర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుని అక్కడ ఉండలేనట్టు వెళ్ళిపోవడానికి లేచాడు.
   
    "ఆ... హుస్సేన్ భాయ్... అసలు నేను వచ్చిన పనే మరచాను నిన్న గుడిలో హసీన భగవద్గీత కొన్నప్పుడు, చిల్లర తీసుకోవడం మరచి పోయిందట. ఆ షాపు యజమాని చిల్లర మీకు ఇవ్వమన్నాడు" అంటూ జేబులోంచి యాభై రూపాయలు  నోటు తీసి అతని చేతికిచ్చాడు అధికారి.
   
    అప్పటికి ఇంట్లోవున్న ముస్లీం స్రీలందరూ, బయట టెంట్ లో వున్న ముస్లీం పెద్దలందరూ అధికారి అన్నమాటలు విననే విన్నారు మొదటిసారిగా మానవ సంభంధాల గురించి ఆలోచించడం  మొదలుపెట్టారు.
   
                                                                         14
   
    " వీలు కాదు .... అలా ఎన్నటికీ వీలు కాదు. ముందు ఉభయులు ముద్దాయిలను హాజరుపెట్టండి, ఆ తరువాతే రాజీ విషయం గురించి ఆలోచిస్తాను" సిటీ కమిషనర్ ఛాంబర్ లో తన ఎదురుగావున్న హసీనా తండ్రి హుస్సేన్. ప్రశాంత్ తండ్రి రామ్మోహన్, రెండు వర్గాలవేపు వచ్చిన పెద్ద మనుషలతో నిష్కర్షగా తెగేసి చెప్పాడు.
   
    "ఒక్కగాని ఒక్క కూతుర్ని పోగొట్టుకున్న హుస్సేన్ గాని, ఒక్కగాని ఒక్కకొడుకుని పోగొట్టుకున్న రామ్మోహన్ గారుగాని కేసులు కావాలని, ముద్దాయిలను పట్టుకుని ఉరి తీయాలనిగాని కోరుకోవడం లేదు సార్ దయచేసి మీరు మరోమారు ఆలోచించి ఇరువర్గాల మధ్య తిరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడేటట్లు చూడమని మా అందరి అభిలాష" పెద్దమనుషులలో బాగా తలపండిన శాస్రీ హితవు పలికాడు.      
   
    "ఇంత జరిగాక రాజీ అంటే ఎలా? అయినా జరిగిన నష్టానికి ఎవరు బాధ్యతా వహించాలి? మత మారణహొమంలో పదిమంది అమాయకులు బలయిపోయారు. లక్షల్లో ఆస్థిబుగ్గిపాలయ్యింది. విజయవాడ కమిషనర్ ట్ చరిత్రలో ఇంత ఘోరంగా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పలేదు. ఈ విషయంలో నేను రాజీ పడను. అవసరం  అయితే పరిస్థితులు అదుపు లోకి వచ్చేవరకు నిరపధికంగా కర్వ్యూను కొనసాగిస్తాను . ఫోర్సు చాల లేదనుకుంటే కేంద్రంనుంచి పారా మిలటరినీ పిలిపిస్తాను..."
   
    "సార్ మీరు అన్నీ తెలిసినవారు. అది చాలా సెన్సిటివ్  మేటర్. తన మతాన్ని కాదని హసీనా గుడిలో పూజలు చేయించింది భగవద్గీత కనుక్కోంది. చివరికి నుడుతున బొట్టు పెట్టుకుంది. తన మతంలో పుట్టి తమ మతాన్నే అవమానపరచమని ముస్లీం యువత ఆవేశపడింది. పర్యన సానం ఆమె ప్రాణాలే పోయాయి.
    ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయింది. ఆమె మరణం ఆమె తల్లిదండ్రులను ఆశనిపాతమే కానీ యిప్పుడు మీరు పట్టుదలతో కేసులు, అరెస్టులు  అంటూ మొదలు పెడితే ఒక్కడు, ఒక్క ముస్లీం మిగలదు అందర్నీ అంటే యావత్ మిస్లీంలను వయసు విచక్షణ లేకుండా ముద్దాయిలను చేయాల్సి వస్తుంది. 

    అంతేకాదు సార్.... అటు హిందువులుకూడా హార్ట్ అయ్యే పరిస్థితి వుంది. సనాతనమైనా తమ హిందుమతాన్ని  కాదని కేవలం ప్రేమ, ఆకర్షణ అనే మోజులోపడి ప్రశాంత్ మతం, మార్చుకున్నాడని తెలసి హిందువులు ఆవేశపడ్డారు. దారుణం జరిగిపోయింది. ప్రశాంత్ ప్రాణాలు పోయాయి. రామ్మోహన్ కి పుత్రాకోశం మిగిలింది. ఇటుకూడా మీరు కేసులు , అరెస్టు అని మొదలు పెడితే హిందూ ఫ్యామిలీలో  మగవాడనేవాడు లేక జైలులోనే జీవించాల్సి వుంటుంది. అందుకే దయచేసి మీరు ప్రశాంతంగా అలోచించమని నా విన్నపం" ముస్లీం న్యాయవాది  కమిషనర్ కి నచ్చజెప్పప్రయత్నించాడు.
   
    "ఒకే..... మీరంతా మీకు తోచినవిధంగా సలహాలు యిచ్చారు. ఈ విషయంలో నేనోక్కడినే వోవర్ నైట్ తీసుకోవడానికి వీలుకాదు. నాపై యింకా పై అధికారులు వున్నారు. రెవెన్యూ తదితర డిపార్టుమెంట్స్ తో చర్చించాల్సిన అవసరం వుంది. అంతేకాదు గవర్నమెంటు స్టాండు కు వ్యతిరేకంగా నేను నడుచుకోలేను. మీ సలహాలు గవర్నమెంటు కి తెలియజేస్తాను...... థాంక్యూ ... వెరీమచ్ , నౌ యూ అల కేన్ గో ...."
   
    కమిషనర్ సమావేశాన్ని ముగించాడు.
   
    ఎక్కడ చేసిన గొంగళి అక్కడే వుందన్న సామెత నిజమయింది.
   
     ఆ సమావేశానికి వచ్చిన ఉభయవర్గాలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కమిషనర్ ఆఫీసుదాటి బయటకురాగానే వాళ్ళకి అధికారి కనిపించాడు. అంటే ఆ ఉభయులు క్షణం ఆలోచించి, కూడబలిక్కుని ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు.
   
                       *    *    *    *   
   
    అ౦ధ్రభూమి
   
    మతం మనిషికి మనషికి మధ్యన అడ్డుగోడలు నిర్మిస్తే
   
    మానవత్వం మూర్తీభావించిన మహామనిషి వాటిని కూల్చేందుకు ఉద్భవించాలి!
   
    బుధవారం, 25 జనవరి, 199
   
    మతంకన్నా మానవత్వం మిన్న!
    
    యుగయుగాలుగా, మానవ సంభంధలన్నీ మతం, కులం, గోత్రం చుట్టూ తిరుగాడుతున్నాయన్నది. అక్షరసత్యం.  మాట మారణహొమాలు చరిత్ర చవిచూసిన పరాకష్టాలు, కులం, గోత్రం, అనే  సంకుచిత పదాలు మనిషిలోని బలహీనతలకు మారురూపాలు, గుడి, చర్చి, మసీదు మరే పవిత్రస్థల నిర్నాణానికికయినా కావాల్సినవి ఇటుకలు, ఇసుక, సిమెంటు, అవి నేలతల్లి మనకు ప్రసాదించిన వనరులే నిర్మాణానికి ఉపయోగపడిన వస్తుసామగ్రిలో ఏ కల్తీ లేదు. కానీ వాటిని, హేండిల్ చేసిన చేతుల్లోనే అపవిత్రత వుంది. స్వార్ధం వుంది. నాది, మీది అనే బలహీనత వుంది, ఈ సృష్టిలో ప్రతిజీవికి జీవించే హక్కువుంది.  అలానే స్వేచ్చా, స్వాతంత్ర్యాలు వున్నాయి. అసలు మనిషిని మనిషిగా, మహా మనిషిగా తీర్చిదిద్దాడానికే భగవద్గీత, ఖూరాన్, బైబిల్ వున్నాయి. వాటిలో నిక్షిప్తమైన ధర్మం, సత్యం, అహింస, జీవులపట్ల సోదరభావం. ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క కూలానికో నిర్దేశించినవి కావు. అవి అన్నీ సర్వమానవతాకి కావలసినవే. కానీ సగటుమనషి అని మరచి మతం అనే ఉచ్చులో బిగిసి మానవత్వాన్ని మరచిపోతున్నాడు. తత్పలితమే. నిన్న, మొన్న, అటుమొన్న, జరిగిన మత మారణహొమం. మతం మనిషికి  మనిషికి మధ్యన అడ్డుగోడలు నిర్మించింది. కొందరు స్వార్ధపరులు వాటికి మరింత ఆధ్యంపోసి కూల్చలేన్నంతగా చేస్తున్నారు. అటువంటి విపత్కర పరిస్థితులో అమాయఆక్రందనలు, నిర్భాగ్యుల నినాదాలు, అర్ధం చేసుకోగల శక్తి ఉద్భావించాలి. వాళ్ళని కాపాడాలి. ఆశక్తి ఒక వ్యవస్థ కావొచ్చు.  ఒక వ్యవస్థ తను  చేయాల్సిన పని మరచిపోయినప్పుడు ఆ వ్యవస్థకావొచ్చు. లేక  వ్యక్తి కావొచ్చు. ఒక వ్యవస్థ తను చేయాల్సిన పని మరచిపోయినప్పుడు  ఆ వ్యవస్థ లోని వ్యక్తులే శక్తులుగా మారడంలో తప్పులేసు ఆ వ్యక్తి మానవత్వం మూర్తీభవించిన  కహామనిషి, పోలీసు శాఖలో ఓ చిరుద్యోగి. అటు యావత్ రాష్ట్రాపోలీసు యంత్రాంగం, రాష్ట్ర, కేంద్రా, ప్రభుత్వాలు సాదించలేనిది  ఒక వ్యక్తి సాదించగలిగాడు. అది అతను పనిచేస్తున్న పోలీసు శాఖకే కాదు, సమస్త మానవాళికి గర్వకారణం, "హిందూ ముస్లీం భాయిభాయి" నేటి నినాదం. తన కళ్ళకి కనిపించిన ప్రతి మనిషి తన సోదరుడే అన్న భావం ప్రతి హృదయంలో కలగాలి. అదే అధికారిని మానవులలో ఉత్తముడిని చేసింది. మనావోత్తమూడయ్యాడు. మనిషిని మహామనిషిని చేసింది. ఇప్పుడు అతను ఓ విశిష్టవ్యక్తి ఓ వినూత్నశక్తి.  అటువంటి విశిష్ట వ్యక్తిని  గౌరవవించకపోవడం ఆ శాఖ చేసుకున్న దౌర్భాగ్యం _" ఆ రోజు పేపర్లో వచ్చిన సంపాదకీయాల్నీ  అప్పటికి చాలాసార్లు చదివాడు పోలీసు కమిషనర్ విక్రమ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS