"షటప్! యూ డర్టీ డేనిల్! నువ్వు ఎక్కడవుంటే అక్కడ ఏదో ఒక సీన్ క్రియేట్ అవుతుంది గెటవుట్.... పో ఇక్కడనుంచి...." కమిషనరు ఆవేశం కట్టలు తెగినట్లయింది.
అధికారి కళ్ళల్లో ఎర్రజీర ఏర్పడింది. అతని పిడికిలి బిగుసుకుంది. వరలక్ష్మి అధికారిని తొందరపడవద్దని కళ్ళతోనే ప్రాధేయపడింది.
కమిషనర్, మిగతా సిబ్బంది వెళ్ళిపోయారు.
"బాబు పొరపాటు జరిగిపోయింది. నావల్ల మీకు చాలా నష్టం జరిగిపోయింది. అసలు ఇది అంతా ఆ యాభైరూపాయలు నిటువల్లే జరిగింది. అది ఇలా ఇవ్వు బాబు...." సీతారామయ్య జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
"ఎందుకు....." అధికారి అతనివైపు సీరియస్ గా చూశాడు.
ఇంత జరిగాక ఇంకా ఈ నోటును పుచ్చుకు తిరగడం మంచిది కాదు. దేవుడి గుడిలో హుండీలో వేస్తాను."
"లేదు మాస్టారు.... ఈయాభైరూపాయలు చనిపోయిన హసీనా తల్లిదండ్రులను అండజేస్తాను. అప్పుడన్నా ఈ వ్యవస్థలో మార్పు వస్తుందేమో!"
ఆ ఇద్దరూ అధికారిని జాలిగా చూశారు. జాలిగా చూశారు. అప్పటికే అధికారి టోపి బెల్టు, షర్ట్ తీసివేశాడు. శిబిరంలో వున్న తన భ్యాగ్ లోనుండి సివిల్ షర్టు తీసి వేసుకున్నాడు.
వరలక్ష్మికి కళ్ళనీళ్ళు తిరిగాయి. ఒక నిజాయితీపరుడుకి, ఒక అమాహామనిషికి ఎంత అన్యాయం జరిగిందో ఎలుగెత్తి చెప్పటానికి తను ప్రత్యక్ష సాక్షి. కాని తన సాక్ష్యానికి విలువలేకుండా పోయింది దీనికి పరిష్కారం ఏమిటి.... ఏమిటో... ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది.
శిబిరంలోకి కూర్చిని కాగితం, కాలం అందుకుంది. అప్పటికే అధికారి శిభిరం దాటి వెళ్ళిపోయాడు.
13
పాత మసీదులో ప్రార్ధనలు జరుగుతున్నాయి.
ముస్లీం సోదరులు అంతా ప్రత్యెక పార్దనలు చేస్తున్నారు. హసీనా ఆత్మశాంతిచాలని, అధికారిని మొదటిసారిగా మసీదులో అడుగు పెట్టాడు. అక్కడ అంతా తదేక దీక్షతో మోకాలుపై కూర్చుని తలలు వొంచి ప్రార్ధనలు చేశాడు.
ఓ ఐదు నిముషాలకి ప్రార్దన కార్యాక్రమం పూర్తయ్యింది. ముస్లీం సోదరులంతా ఎదుటి వ్యక్తులను సోదర భావం భావంతో కౌగిలించుకున్నారు.
అధికారి మసీదు పెద్ద దగ్గరకు వెళ్ళి హసీనా గురించి విచారించాడు. మసీదులో ఓ ప్రక్కగా హసీనా తండ్రి హుస్సేన్, అన్న ఆలీ ఉన్నారు. మసీదుకొచ్చిన పెద్దలు తండ్రి కొడుకులకి నాలుగు సానుభూతి మాటలు చెప్పి వెళుతున్నారు.
"సలమాలేకుం ...." అధికారి వాళ్ళిద్దరికీ విష్ చేశాడు.
పైన తెల్లషర్టు వున్నా, ఖాకీప్యాంటులో ఉండడం మూలాన అధికారి పోలీసు కానిస్టేబుల్ లుగా వాళ్ళు వెంటనే గుర్తించారు.
"రండిసార్ ఇంటికివెళ్ళి మాట్లాడుకుందా౦" హుస్సేన్ చాలా గౌరవంగా అధికారిని ఆహ్వానించాడు.
"అచ్చా అలాగే వెళదాం.... హుస్సేన్ భాయ్ నాకు ఖురాన్ ప్రతికావాలి...."
"సంతోషం .... అంతకంటేనా ..." అంటూ హుస్సేన్ ఠక్కున చేతిలో ఉన్న ఖురాన్ పుస్తకాన్ని అధికారి చేతికిచ్చాడు.
అధికారిని జేబులోంచి వందరూపాయల నోటు తీశాడు.
"నక్కో..... నక్కోసాభ్...... మేం దానిని మీకు ప్రజెంటు చేస్తున్నాం మీరు మా పుస్తకం చదవటం మాకెంతో ఆనందంగా వుంది.....
ముగ్గురు నడుచుకుంటూ ఇంటికి చేరారు. అప్పటికే ఆ ఇంటికి చుట్టాలు అంతా వచ్చి ఉండటంవల్ల చాలా రద్దీగా వుంది బయటవేసిన షామియాన టెంట్ లో చాలమంది కూర్చుని వున్నారు మరోప్రక్క పొయ్యిలమీద పలావ్, కుర్మాలు తయారవుతున్నాయి.
అధికారిని ఇంటి వరండాలో కుర్చీవేసి కూర్చోపెట్టారు. అప్పటికే అలీ లోపలికి వెళ్ళి పాయసం తీసుకువచ్చి అధికారి చేతికిచ్చాడు.
"అచ్చా.... ఈ విందు ఏ సందర్భంలో ఇస్తున్నట్లు" అధికారి సూటిగా అడిగాడు.
అలీకి వెంటనే నోట మాటరాలేదు.
"మాకీ బెటికి నిన్నటితో నూరేళ్ళు నిండాయి అల్లా సన్నిధికి చేరిపోయింది తనకి ఆత్మశాంతించాలని..... మీ ప్రవర్తనకి స్వర్గంలోకంలో వున్న ఆమె ఆత్మక్షోభిస్తుంది.
"ఏ.... అల్లా...." హుస్సేన్ బాధగా చెవులు మూసుకున్నాడు.
"ఇక్కడ కూతురుపోయి పుట్టెడు దుఃఖంలో మీరు వున్నారు. అక్కడ ఒక్కగాని ఒక్క కొడుకుని పోగొట్టుకుని కన్నీటికి మున్నీరుగా విలపిస్తూ వాళ్ళున్నారు. మీరెండు కుటుంభాలు నష్టపోయాయి. అంతేకాదు ఆ తరువాత జరిగిన గృహాదవానాలు, ఊచకోతల్లో అటు ముస్లీంలు, ఇటు హిందువులు ఏ పాపం తెలియని అమాయకులు బలైపోయారు. చనిపోయిన హాసీనాగాని, ప్రశాంత్ గాని, ఇలా జరగాలని కోరుకోలేదు తమ ఇరువురి పవిత్రప్రేమ రెండు విభిన్నమతాలకి, సంస్కృతీ సంప్రాదయాలికి వారధి రావాలనుకున్నారు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? జరుగుతున్నదేమిటి?....." తండ్రి కొడుకులు ఇద్దరూ తప్పు జరిగిపోయినట్లు, ఆ తప్పు తమ మూర్కత్వం వలెనే జరిగినట్టు నిజాయితీగా తలలు వంచుకున్నారు. గదిలో లోపల వరండాలో ఉన్న ముస్లీ౦లు నోటికి గుడ్డ ఆడ్డుపెట్టుకుని పొంగి వస్తున్న దుఃఖాన్ని అదుపుచేసుకోవాడానికి ప్రయత్నింస్తున్నారు.
