అవును , నాకు తెలియకుండా నన్ను అభిమానించేవాడు, ఆరాధించే వాడిని ఊరికే వదిలి పెట్టకూడదు. ప్లీజ్ చెప్పండి...."
"సారీ చెప్పి మిమ్మల్ని హంతకురాలిని చేయలేను."
"ఓ.కే మీరు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను."
"బెట్....."
"యస్ బెట్......"
"తెలుసుకోలేకపొతే నేను సెలక్టు చేసిన అబ్బాయిలతో మీరు మూడుముళ్ళు వేయించుకోవాలి.......".
"తెలుసుకుంటే"
"తెలుసుకుంటే"
"అది నెను చెప్పాలి.... నాకు నచ్చినమ్మాయి మేడలో మీరు మూడుముళ్ళు వేయాలి. ఓ.కే...."
"ఓ.కే...."
"మరి ఈ బెట్ ఎప్పటిలోపు"
"ఈ బందోబస్తు అయ్యేలోపు .... మీరు ఒకేగా"
"యస్.... ఒకే......"
"మారో..... మారో సాలేకో... జొరసే మారో...." సి. ఏర్. పి జవానులు ఆ వీధిలో కవాతు చేస్తూ అరుస్తున్నారు. ఎవరినో లాఠీలతో బాదుతున్నారు.
"ఆయ్యో! ఎవరో అమయుకుడిని చితకబాదుతున్నారు" బాధగా అంది వరలక్ష్మి.
అధికారి టోపి సరిచేసుకుని ఒక ఉదుటున అక్కడికి పరిగెత్తాడు.
"అధికారి గారు ప్లీజ్ వెళ్ళొద్దు. వాళ్ళతో అనవసరంగా గొడవ పడవద్దు......" వెనకనుంచి వరలక్ష్మి కంగారుగా అంది.
అప్పటికే అధికారి సి.ఆర్.పి ఎఫ్. జవానుల దగ్గరకు వచ్చేశాడు.
"ప్లీజ్ అతన్ని వదిలేయండి. నేను తీసుకువెళ్ళి స్టేషన్ లో హేండోవర్ చేస్తాను" అధికారి చాలా సబ్ మిసీస్ గా అడిగాడు.
"నో.... మేర్నీ.... జాలి, దయ ఉండకూడదు బ్రదర్! దొరక్కదొరక్క దొరికాడు వీడిని ఫినిష్ చేస్తే రేపు కౌంట్ కి వస్తుంది"
అప్పటికే అతను తల పగిలి నేలమీద గిలగిల కొట్టుకుంటున్నాడు. అతన్ని పరిశీలనగా చూశాడు జాలి చూపండి......"
"ఏమయ్యా జాబ్ లో కొత్తగా జాయిన్ అయ్యావా కర్వ్యూరూల్స్ తెలిసే మాట్లాడుతున్నావా, వెళ్ళు వెళ్ళి నీ పనిచూసుకో ..... చేలో.... చేలో......"
అధికారి వాళ్ళ మాటలు లెక్క పెట్టకుండా ము౦దుకు వెళ్ళి క్రింద పడివున్న సీతారామయ్యను లేవదేశాడు.
"ఏయ్ చెబుతుంటే నీక్కాదు. వినకపోతే నీకు వడ్డించాల్సి వస్తుంది....."
వాళ్ళల్లో ఒకడు అధికారి రెక్క పుచ్చుకుని ప్రక్కకు తోశాడు. అంతే అధికారి తన భూజాన వ్రేలాడుతున్న రైఫిల్ లోడ్ చేసి వాళ్ళకి గురిపెట్టారు.
ఊహించని ఆ చర్యకి వాళ్ళంతా ఖంగుతిన్నారు.
"ఏ మిస్టర్ పోలీసు అయివుండి, సెంట్రల్ పోలీసుల మీదకి తుపాకి గురి పెడతావా నీ సంగతి పై అధికారులను చెప్పి నిన్ను అరెస్టు చేయించకపొతే చూడు......."
వాళ్ళు రంకేలేస్తూ అధికారి నెంబరు నోట్ చేసుకుని వెళ్ళిపోయారు .
సీతారామయ్య అధికారికి చేతిలెత్తి నమస్కరించాడు. "ఛ ! ఛ! మీరు పెద్దవారు నాకు నమస్కరించకూడదు" అతన్ని నడపించుకుని సివిల్ పోలీసు ఉన్న శిబిరంలోకి తీసుకువెళ్ళాడు.
వరలక్ష్మి సీతరామయ్య తలకి కట్టు కట్టింది.
"కర్వ్యూ ఉందని తెలిసే రోడ్డు మీదకు ఎందుకు వచ్చారు? మీరు ప్రాణం మీదకి తెచ్చుకోవడమే కాకుండా...."
"దెబ్బలు తగిలి షాక్ లో ఉన్నరాయన మీరు ఆయనకి రూల్సు గట్రా చెప్పి మరో షాక్ ఇవ్వొద్దు....." అధికారి వరలక్ష్మి మధ్యలోనే అడ్డుకున్నాడు.
"వీరిని రక్షించి పెద్ద హీరో అయిపోయాననుకుంటున్నారా? తరువాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? సి.ఆర్.పి. ఎఫ్. వాళ్ళమీదే రైఫిల్ గురి పెడతారా .... అయ్యో మీరు తెలిసి చేస్తున్నట్లా? తెలియక చేస్తున్నాట్లా....." వరలక్ష్మి కంగారు పడుతుంది.
సీతారామయ్య వాళ్ళిద్దర్నీ మార్చి మార్చి చూశాడు ఇద్దరిలో త్యాగబుద్ధి వుంది. కానీ జరగబోయే ఉపద్రవాన్నీ ముందుగానే ఊహించుకుని ఆమె బెంబేలు పడిపోతుందనుకున్నాడు .
"క్షమించండి నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది. నేను మీ దగ్గరకే వస్తున్నాను మధ్యలో వాళ్ళు ఆపేశారు. ...."
"మా దగ్గరకా? ఏం పని...." అధికారి అడిగాడు.
సీతారామయ్య తన జేబులోంచి ఓ యాభై రూపాయల నోటు తీశాడు.
"నిన్న హత్యకు గురైన అమ్మాయి నా దగ్గర భగవద్గీత కోంది. వంద రూపాయలు ఇచ్చింది. మిగిలిన చిల్లర యాభైరూపాయలు తీసుకోలేదు. దుర్మార్గులు ఆ మహాతల్లిని పొట్టనబెట్టుకున్నారు. దయచేసి ఈ యాభైరూపాయలు చనిపోయిన ఆమె తాలూకు వారికి అందజేయండి సీతారామయ్య యాబైరూపాయల నోటు అధికారి చేతికిచ్చాడు.
సరిగ్గా అదే సమయానికి సి ఆర్ పి ఎఫ్ దళం కమాండర్, అతని సిబ్బంది, సిటీ పోలీసు కమిషనర్ వెంటబెట్టుకుని వచ్చాడు.
దేకో...... సాభ్....." సి ఆర్ పి ఎఫ్ జవానుల్లో ఒకడు అధికారిని చూపించాడు.
"యూ కరప్ట్ బాస్టర్డ్.... యూ ఆర్ సస్పెండెడ్ " కమిషనర్ అవేశంగా అరిచి షర్టుకివున్న నెంబర్ ప్లేట్లును లాక్కున్నాడు.
సీతారామయ్య సర్ది చెప్పాలని ప్రయత్నించాడు.
"ఏమయ్యా ఇంత వయస్సు వచ్చినా బుద్ధిలేదా? కర్వ్యూలో బయట తిరగకూడదని తెలియదా?"
"సార్... అసలేం జరుగుతుందంటే..." వరలక్ష్మి చెప్పాలని ప్రాయత్నించింది.
