Previous Page Next Page 
అధికారి పేజి 17

    అధికారి తిరిగి విష్ చేస్తూ పలకరింపుగా కుశల ప్రశ్నలు అడిగాడు.

   
    "మీ దయవలన బాగానే వున్నాను...."
   
    "నా...... నా దయా భలే జోక్ వేశారే....." అధికారి పగలబడి నవ్వాడు. "జోక్ కాదండి. నేను సీరియస్ గానే అంటున్నాను...." ఇప్పుడామే ముఖం సీరియస్ గా వుంది.
   
    "ఏమో ! మీరు  చాలా గమ్మత్తుగా మాట్లాడుతారు. మీ మాటలనేకాదు చేష్టలకూడా అర్ధం చేసుకోవటం కష్టమే సుమండీ!"
   
     "సారీ.... నేను ఇప్పుడు సీరియస్ గానే చెబుతున్నాను. మొన్న జారిగిన విషయంలో పేపర్లో చిలువలు పలువలు కల్పించి వేశారు. పెళ్ళికాని పిల్లని ప్రెస్ లో అంత అసభ్యంగా రాస్తే నా జీవితం ఏం కాను. మా వాళ్ళంతా నన్ను ఉద్యోగం మానెయమన్నారు. కానీ మరునాడు ఉదయం పేపర్లో మీరిచ్చిన స్టేట్ మెంటు, దానికి తగ్గట్టుగా ప్రెస్ తప్పుగా ప్రకటించి నందుకు చింతిస్తున్నట్టు ఇచ్చిన ప్రకటనతో మా వాళ్ళు ఊరట చెందారు. ఇక మన డిపార్టుమెంటువాళ్ళు తీస్తున్న వ్యంగర్దాలకి పుల్ స్టాఫ్ పడింది...... నా గౌరవం కాపాడినందుకు మెనీ మెనీ థాంక్సు ......." వరలక్ష్మి కృతఙ్ఞతలు తెలియజేసింది.
   
    "ఐయాం రియల్లీ సారీ, పేపరు న్యూస్ చదివి మీరింతగా రియాక్ట్ అయి బాధపడుతారని నేనూహించలేకపోయాను. ఇలాంటి నీలాపానిందులు పోలీసులు సహజమే అని సరిపెట్టుకున్నాను. కానీ మీరు ఆడపిల్ల. సెన్సిటివ్ అన్న సంగతే మరచిపోయాను". నొచ్చుకుంటూ అన్నాడు. అధికారి.
   
    "మీరిక్కడ ఇంకెన్నాళ్ళు వుండాలి? ఐమీన్ బందోబస్తులో " టాపిక్ మార్చి అడిగింది వరలక్ష్మి.
   
    "ఫ్చ్..... ఇవ్వాల్టీకి మూడు రోజులయ్యింది. ఈ కమ్యూనల్ చిచ్చు ఎప్పటికి అరిపోతుందో ఏమో! భైదిభై అడగడం మరిచాను. మీరిటు వచ్చారే. కొంపదీసి మీకుకూడా ఇక్కడే బందోబస్తు పడిందా?" 
   
    అవునన్నట్టు చిన్నగా తలవూపి చిరునవ్వు నవ్వింది వరలక్ల్ష్మి దూరంగా ఎసిపి సుధాకర్, ఇన్స్ స్పెక్టర్ తిలక్ రావడం గమనించింది.
   
    వాళ్ళని గమనించని అధికారి ఏదో మాట్లాడాబోతుండగా  వరలక్ష్మి అతన్ని తప్పించుకుని ముందుకు వెళ్ళిపోయింది.
   
     "వాట్ మెన్ ? ఏం చేస్తున్నావు? నిన్నిక్కడ బందోబస్తుకు నియమించింది హస్కుకొట్టడానికి కాదు. మైండ్యువర్ డ్యూటీ" ఎసీపీ వార్నింగ్ యిచ్చి ముందుకు వెళ్ళిపోయాడు.
   
    అధికారి లాఠీని నేలకేసి కసిగా బాదాడు. లాఠీ రెండు ముక్కలయింది.
   
    "ఐయాంసారీ నావల్ల మీరు మాటాపడ్డారు." వెనక్కీ తిరిగివచ్చి వరలక్ష్మి అతనివేపు జాలిగా చూస్తూ అంది.
   
    అధికారి ముఖంలో అనందం చోటు చేసుకుంది. పై అధికారి అనవసరంగా నోరు పారవేసుకున్నందుకు వచ్చిన ఆవేశం వరలక్ష్మి చిరునవ్వుతో చల్లబడిపోయింది. ఆమె చిరునవ్వుకే అంత మహిమ ఉంటే ఇక ఆమె తన జీవితంలోకి వస్తే.... ఆ ఆలోచనలో అధికారి మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది.
   
    అతను ఏం మాట్లాడక పోయేసరికి ఇంకా ఆ మూడలోనే ఉన్నాడని వరలక్ష్మి కలవరపడిపోతుంది.
   
    "ఏవండీ అన్నీ తెలిసిన మీకు నేను ఏం చెప్పగలను. ఈ డిపార్ట్ మెంటు లో ఆఫీసర్లకి సబార్దినెట్స్ లోకువ. ఏదో ఒక తప్పు చూపించకపొతే, క్రింది వాళ్ళని ఏదో ఒకటి అనకపోతే వాళ్ళ మనస్సు శాంతించదు. అన్నీ సక్రమంగా వుంటే మనం వాళ్ళని డామినేట్ చేస్తామేమోనన్న ఇన్ పిరియారిటీ  కాంప్లెక్స్ __ వాళ్ళ మాటలకి మీరు అంతగా పట్టించుకోవద్దు" వరలక్ష్మి చెబుతూ మధ్యలో ఆ అధికారి వంక చూసింది.
   
    అధికారి రెండుచేతులు కట్టుకుని ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధి మాస్టరు చెబుతున్న పాఠం శ్రద్దగా వింటున్నట్టుగా ఫోజు పెట్టాడు.
   
    "నేను చెబుతుంటే మీకు జోకులా వుందా?" బుంగమూతి పెట్టింది వరలక్ష్మి.  
   
    "మీరు చెప్పండి మేడం మీ నుండి చాల విషయాలు తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాల్సిన  ఏమన్నావుంటే చెప్పేయండి మేడం......"
   
    అతని ఫోజును చూసి ఆమె తన నవ్వు ఆపుకోలేక పోయింది మీరు అధికారి పకపక నవ్వేశాడు.
   
    "బైదిబై ఇందాక అదే ఎ.సి.పి ఇన్స్ స్పెక్టర్ వచ్చేముందు మీరు నాతో ఏదో మాట్లాడాబోయారు. ఏమిటి విషయం. ఇప్పుడు చెప్పండి ధైర్యంగా వింటాను."
   
    "విని మీరు ఫీలవ్వనని మాటిస్తే చెబుతాను."
   
    "అంటే మీరు చెప్పకముందే నేను ఫీలు అవుతానన్న అనుమానం మీకు కలిగిందంటే ... అదేదో నేను ఫీలయ్యే విషయం అయివుంటుంది. అందుకే వద్దులెండి చెప్పొద్దు. తీరా చెప్పి మీరు ఫీలవ్వడం, విని నేను మోసుకువెళ్ళడానికి ఈ కర్ఫ్యూలో లారీలుకూడా దొరకవు."
   
    "మీరు సీరియస్ విషయాలను కూడా చాలా జోవియల్ గా డీల్ చేస్తారు. మిమ్మల్ని కట్టుకోబోయావారు చాలా అదృష్టవంతు......"
   
    "సారీ,........ యూ ఆర్ రాంగ్...... మీ అనాలసిస్ తప్పు. నన్ను పోరపాటున ఎవరన్నా ధైర్యంచేసి కట్టుకున్నా, నా గురించి ఐ మీన్ నా నోటిగురించి తెలిస్తే ఏకంగా ఈ దేశమే వదిలి పారిపోవడం ఖాయం....." 
   
    "అమ్మాయిగారు మీ అనాలసీస్ కరెక్టు కాదు. మీరంటే అభిమానించేవారు, ఆరాధించేవారు వున్నారు....."
   
    "ఎవరు? ఎవరా అమాయకుడు? ప్లీజ్ తెలిస్తే చెప్పండి......" ఆతృతగా అడిగినట్టు ఫోజు పెట్టింది.
   
    "తెలుసుకోవాలని వుందా? అయినా తెలుసుకుని ఏం చేస్తారు. కొంపదీసి అరెస్టు చేయరుకదా?"
   
    "కాదు చంపేస్తాను.........."
   
    "ఆ......"  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS