Previous Page Next Page 
అధికారి పేజి 16

    గుడికి వెళుతున్న దారిలో రోడ్డు పొడవున అటు ఇటు అనేకషాపులు వున్నాయి. ప్రతిషాపు ముందు నలుగురిలో జనం వున్నారు. ఏవేవో బేరాలుచేస్తూ, తన ప్రక్కనేవున్న షాపువైపు చూశాడు. అసలు షాపు కనిపించనంతగా జనం మూగి వున్నారు.

   
    తను చాలా సంవత్సారాలనుండి పుస్తకాలు అమ్ముతున్నాడు. అంతంత మాత్రంగానే వుంది తన వ్యాపారం.
   
     అయితే తన పక్కనేవున్న  మధుసూధనరావు షాపులో అమ్మకాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 
   
    "తేడా ఎక్కడ వుంది?" తన ఇన్నేళ్ళు వ్యాపారంలో ఆ తేడా తెలుసుకోలేకపోయాడు. అసలు అది తెలిస్తే తన పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉండేది కాదేమో!
   
    "సారీ సార్ ఒకే కాఫీవుంది. మీకు కావాలంటే రెండురోజుల్లో మరల తెప్పిస్తాను" మధుసూదన్ కస్టమర్లకి నచ్చ చెబుతున్నాడు.
   
    ఒకే పుస్తకం ఇద్దరికీ కావాల్సి వచ్చింది అంటే అదేదో చాల గొప్ప పుస్తకమే అయివుండాలి సుమా? అనుకున్నాడు. సీతారామయ్య.
   
    భగవద్గీత వుందా? ఆ చిలుక  పలుకులను తలెత్తి చూశాడు. సీతారామయ్య తన కొట్టుకు ఎవరో వచ్చారు. పుస్తకం కొనడానికి వచ్చాడు. ఆమె మరలా అడిగింది. అవును  నిజమే, కలకాదు, ఓ పదహారేల్లాపిల్లపొడుగు లంగా, జాకెట్టు వేసుకుంది. సన్నగా, పొడుగ్గా సన్నజాజి తీగల వుంది. ఆమె జడకుచ్చులు పొడుగ్గా వుండి ఆమె పిరుదులను దాటాయి.
   
    "ఆ ముసాలాడి దగ్గరేం వుంటాయి. పుక్కటి పురాణాలు తప్పు ఇక్కడ చూడండి వివిధ భంగిమలు, అంతా డిటేల్ట్ గా అచ్చ తెలుగులో అర్డంయ్యేటట్టు వుంది......" పక్క షాపులోని కస్టమర్ ఇకతను "వాత్సాయన కామసూత్రాలు" అనే పుస్తకాన్ని తెరచి ఆ పిల్లకు ఆ పుస్తకంలోభంగిమలు కనిపించేటట్టూ చేయి ముందుకు చాపాడు.
   
    "ఆ దగ్గరేం వుంటాయి. పక్కిటి పురాణాలు తప్పు ఇక్కడ చూడండి వివిధ భంగిమలు, అంతా డిటేల్ద్ గా  అచ్చ తెలుగులో అర్డంయ్యేట్టట్లు వుంది....." పక్క షాపులోని కస్టమర్ ఒకతను "వాత్సాయన  కామసూత్రాలు " అనే పుస్తకాన్ని తెరిచి  ఆ పిల్లకు  ఆ పుస్తాకాల్లో భంగిమలు కనిపించెట్టూ చేయి  ముందుకు చాపాడు.
   
    ముసలాడి ముఖంలో ఆవేశం చోటు చేసుకుంది. అయినా అతను జపసత్వాలు క్షీణించిన వయోవృద్దుడు. ఆకుర్రకారుతో పేచి పడలేడు. రాక రాక వచ్చిన బేరంకూడా వాళ్ళ మూలంగా పోతుందేమోనన్న బాధ అతని ముఖంలో ప్రస్పోటంగా కనిపిస్తోంది.   
   
    అంతే మరుక్షణంలో పదిమంది సఫారీ డ్రస్సుల్లో ఉన్న వ్యక్తులు ఆ గుడి ముందువున్న పుస్తకాల షాపులమీద  పడ్డారు.
   
     అక్కడ జరుగుతున్నాదంతా చిత్ర విచిత్రంగా వుంది. సీతారామయ్యకి. బూతు పుస్తకాలు అమ్ముతున్న షాపువాళ్ళని సరుకుతో సహాఎత్తి జీపులో పడేశారు. ఎ.జి.ఏస్. పోలీసులు అప్పటిదాకా డాంభికాలు పోయిన కుర్ర వెధవలు నిస్సహయత వదిలి పెట్టలేదు.
   
    సీతారామయ్యకి వ్యాపారం గుర్తుకువచ్చింది.
   
    "అమ్మా భగవద్గీత శ్లోక రూపంలోనా, వచన రూపంలోనా అనుమానంగా అడిగాడు.
   
    "శ్లోకం నా నోటికి రావాలి, దాని భావం అర్ధం కావాలి. అంటే శ్లోకం, దానికి టీకా తాత్సర్యం ఉంటే సరిపోతుంది."
   
    సీతారామయ్య ఓ పుస్తకాన్ని అత్యంత ప్రాణ సమానంగా తీసి ఆ అమ్మాయి చేతికి అందించాడు.
   
    "ఎంత?"
   
    "పాతవేకదమ్మా దానిమీద వున్న ఖరీదులో సగం ఇవ్వండి." రేటు చూడకుండా అన్నాడు సీతారామయ్య.
   
    ఆమె ఓ వందరూపాల నోటు తీసి అతని చేతిలో పెట్టింది. దాని అసలు ఖరీదు వంద రూపాయలు. సీతారామయ్య యాభైనోటు తీశాడు. ఆమె కిద్దామని అప్పటికే ఆమె అతన్ని దాటివెళ్ళిపోయింది.
   
    "అమ్మా మీకు యాభైరూపాయలు వస్తాయి."
   
    "పార్యానై దాదాజీ, వైసారభియే."
   
    "ఆ.... " సీతారామయ్య కొద్దిక్షణాలు ఆశ్చర్యంనుంచి తేరుకోలేక పోయాడు.
   
    అతను సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆమె ఒక ముస్లీం పిల్ల. చక్కని తెలుగు మాట్లాడింది. మరింత గొప్ప విశేషం ఆమె భగవద్గీత చదవడానికి కొనుక్కుని వెళ్ళడం.
   
    అంతకుముందు ఆమె గుడికి వెళ్ళి గంటలు మ్రోగించడం చాలా  ఆనందంగా ఉందతనికి.
   
    మత సహనానికి మారుపేరుగా. మన సంస్కృతీ సంప్రదాయలను కపాడుతున్న పదహారణాల కన్నెపిల్ల ఆమె.
   
     అయ్యో! ఆమె పేరు ఏమిటో, ఊరు ఏమిటో తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోలేక పోయానే అన్న బాధ అతని ముఖంలో ప్రస్పోటంగా కనిపిస్తోంది.
   
    గుడిమెట్లు దిగిన హసీనా సరాసరి  రోడ్డుప్రక్కన వున్న స్టాండ్ వే మోటార్ బైక్ మీద కూర్చున్న ప్రశాంత్ దగ్గరకు వచ్చింది.
   
    "ఏం కోరుకున్నావు నీ దేవుడిని" ప్రశాంత్ చిరునవ్వుతో అడిగాడు.
   
    "ఇది మరీ బాగుంది నా దేవుడా?"
   
     "గుడికి   వెళ్ళింది నువ్వు, పూజచేసింది నువ్వు, గుళ్ళో ఉన్నబండరాయి ...."
   
    "తప్పు..... బండరాయి అనకు కళ్ళు పోతాయి" హసీనా చిరుకోపం ప్రదర్శించి చటుక్కున అతని నెత్తిన మొట్టికాయ వేసింది.
   
     "ఇదేమీ బాగోలేదు హాసీనా మనం పెళ్ళి చేసుకోవాలని నేను మతం మార్చుకున్నాను..... మరి  నువ్వేమో సరాసరి గుడికి వచ్చి పూజ చేస్తున్నావు ఇది మీ వాళ్ళకి తెలిస్తే......."
   
    "ఓకే మా వాళ్ళకోసం నువ్వు నీ మతం మార్చుకున్నప్పుడు, వాళ్ళకోసం నేను బొట్టు, కాటుక, చీర, రవిక కట్టుకుని మీ మతంలోవచ్చేస్తాను. ఓ.కే " గలగలా నవ్వేసింది.
   
    అతను ఆమెతో శ్రుతి కలిపాడు....
   
    అంతే రెప్పపాటు కాలంలో జరిగిపొయిందక్కడ  ఓ దారుణం .
   
                                                                    12
   
    "గుడ్ మార్నింగ్ "
   
    గుడిదగ్గర బందోబస్తులో వున్న అధికారి తలెత్తి చూశాడు. అతనికి ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ లేడి కానిస్టేబుల్ వరలక్ష్మి వుంది.
   
    "హాయ్ ... వెరీగుడ్ మార్నింగ్...... బావున్నారా?" 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS