Previous Page Next Page 
ఆరాధన పేజి 9


    "లేదు...  మాదప్ప నీవు వెళ్ళాక నా దగ్గర కొచ్చి శవం దగ్గరకు రమ్మన్నారు. వెళ్ళాను. అతనిచేతిలో చుట్టవున్నది. ఆసుపత్రిలో వారు కాలవటం చూడటం అదే ప్రధమం. విస్తుపోయావనుకో. మేము వెళ్ళేసరికి కొడుకులిద్దరు తప్ప అందరు అక్కడే ఉన్నారు వాళ్ళ లాయర్ కూడా ఉన్నాడు. ఆయనచేతిలో స్టెతస్ కోప్ ఉన్నది "మరణపత్రం రాయకముందు నిజంగా చనిపోయిందీ లేనిదీ చూడాలి. కాస్త తొలగండి నాకు ఎంతగా వుంది.....ఏమిటీ చోద్యం. చనిపోయి అరగంట కావస్తోంది. స్టెతస్ కోప్ పరీక్ష చేశారు - కాలుతున్న చుట్టను ముక్కు దగ్గరుంచాడు తర్వాత అరచేతుల కంటించాడు. ఉన్నట్లుండి అతని ఎడమచేతి బొటన వేలుకి అంటించాడు.... లాభం లేదు......చనిపోయాడు.....డాక్టర్ ఇలాతే - సంతకం చేస్తాను. కుమార్ నివ్వెరపోయాడు. అతని కంతా అయోమయంగా ఉంది. "మారెప్పకు ఎందులో కూడా మనల్ని ఇరికించటం ఇష్టంలేదు. ఓ చిన్న రహస్యం. మనలో మనమాట మరిట అతని రెండవ భార్య కూతురు ఏడుస్తూనే సర్జన్ తో కన్నడంలో అందిట మా నాన్న వ్రేలిముద్రకోసం అందరూ వచ్చారని? నేను అక్కడే ఉన్నాను.....నాకు ఏమీ అర్ధం కాలేదు. అంత మెల్లగా అంత చాతుర్యంతో అంది. అప్పటికి శవం దగ్గర అంతా ఉన్నారు ఆపరేషన్ థియేటర్ నుంచి బైటికి రాగానే ఆ పిల్ల అన్నదట. వింతగా లేదూ? ఆ పిల్లకు కన్నడం ఎలా వచ్చు. మాదప్పకు కన్నడం వచ్చునన్న సంగతి ఆ పిల్లకెవరు చెప్పారు? అంటావేమో - నాకు తెలియదు గానీ- ఆ పిల్ల ఏడ్చేటప్పుడు చాలాసార్లు కన్నడంలోనే ఏవేవో అని ఏడ్చింది సుమా! తర్వాత-నువ్వే ఏదైనా అనుకో.
    కుమార్ తిరిగివస్తూ అనుకున్నాడు. ఆ పిల్ల మాతృభాష కన్నడమై ఉండాలి. దుఃఖంలోనైనా సంతోషంలోనైనా బాధలోనైనా మొట్టమొదట తన భాష నోటికి వస్తుంది. ఇది మన సత్వం అంటే అతని రెండో భార్య కన్నడం వాళ్ళయి ఉండాలి... పోనీ అంతా మేలుకే అయింది. వాళ్ళ కన్యాయం జరుగలేదు... అంతే చాలు. సమస్య నెంత సునాయాసంగా పరిష్కరించారు సర్జరీ తనకు ముందే తెలిసివుంటే ఇంత గాభరా పడక పోవును - సర్జన్ మీదికి మనసు మళ్ళింది. తనతో ఓమారుకాదు ఎన్నోమార్లన్నారు..."కేవలం వ్యాధిగ్రస్తులను బాగుచేయటమే మన ధ్యేయంకాదు. శారీరక బాధలకు మానసిక వేదన చాలావరకు కారణమౌతుంది. ముందు ఆ మనోవ్యధను తొలగించు. నీ పేషెంట్ ప్రాణం వదిలితే బ్రతికి ఉన్న వారి సుఖం చూడు...
    
                               *    *    *

    ప్రభాకరుని లేత కిరణాలు వృక్షాగ్రభాగాలను హాస్పిటల్ పైభాగాన్ని బంగారుతో ముంచెత్తినై. పిల్లగాలులు అల్లనల్లన నిస్తూ హృదయ వీణను సుకుమారంగా మీటుకున్నాయి. అతని హృదయం సుమధుర మంజుల రాగాన్ని ఆలపిస్తోంది. ఏదీ తెలియని ప్రశాంతత అతన్ని ఆవరించింది. పరుగున వెళ్ళి మంజును చేతుల్లోకి తీసికోవాలి. ఆమె కాఫీ అందిస్తుంటే-
    దూరంగా కెవ్వున కేకలు చటుక్కున తిరిగి చూశాడు. కానపు గదిలోంచి కాబోలు... "ష్" అని నిట్టూర్చి గేటు సమీపించాడు.... అప్పుడే తలుపు తోసుకుని ధారణమైనచీరెతో, పైపైన దువ్విన తలతో చేతిలో స్టెతస్కోప్ తో అర్ధాంగి హడావిడిగా బైటికొచ్చింది.....భర్త అడక్కముందే గబగబ అడుగులేస్తూ అంది. "కష్టమైన కాన్పు......బ్రీచెస్ అట (కాళ్ళు మొదట రావటం. డాక్టర్ అన్నపూర్ణ రమ్మన్నారు. ఒక్క క్షణం ఆగి భర్త ముఖంలోకి ప్రేమగా చూచింది.
    త్వరతగతిని వెళ్తూనే అంది అంత పెందలాడే ఎక్కడి కెళ్ళారు? కాఫీ -ఫ్లాస్కులో వుంది ఇడ్లీ మీరు తిని నాకు..."
    ఆమెను అలాగే చూస్తూ నుంచున్నాడు. ఆమె సన్నని నడుము కొద్దిగా నిండుదనం దాల్చింది.
    తనలో తానే నవ్వుకున్నాడు.....మంజు పోలిక లున్న పాపాయి అయితే....అనుకున్నాడు.

                              *    *    *

    కాన్పుగదికి ఇవతల చాలామంది వున్నారు. మంజుల లోపలికి వెళ్ళింది. అప్పటికే అక్కడ నలుగురున్నారు. కావలసిన పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి వారు హుషారుగా చక చకా పనిచేస్తున్నా గొడవ లేకుండా వుంది. ఎంతో కాలంనించి పొందిన తర్ఫీదు మహత్యం కాకపోతే మరేమిటి?
    "త్రీ పింగర్సీ" అంది డాక్టర్ అన్నపూర్ణ మంజుని చూచి.
    మంజు తల ఊపుతూనే నమస్కరించింది.    
    "ఇంకా త్వరత్వరగా నొప్పులు రావడం లేదు.
    "ఎప్పుడొచ్చిం దీమె?"
    "రాత్రి పది గంటలకు"
    ఉండి ఉండి బల్లమీది స్త్రీ కేకలేస్తోంది.
    అబ్బ అనుకుంది మంజు - ఈ బాధ తనుకూడ పడాలికదా!
    ఎప్పుడు లేని సానుభూతి కల్గిందామెకు.        
    నిమిషాలు దొర్లుతున్నాయి. ఎవరో ఒకరు లోపలికి తొంగిచూచి ఇంకా ఎంత దూరంలో ఉందన్నట్లడుగుతున్నారు.
    మంజులకు ఏం చేయటానికి తోచలేదు. ఆమెకు సంబంధించిన నోట్సు తీసింది. అది డ్యూటీ నర్సులు రాస్తారు.
    ".... రాత్రి 10గంటల 5నిమిషాలకు వచ్చింది. తొమ్మిదిన్నరకు నీరు పోయిందట... సూర్యకాంతం....ఎనిమిదవ కాన్పు.....పిల్లలందరు బాగున్నారు. అన్ని సాధారణమైన కాన్పులే..... కాన్పుకు ముందు మూడు నెలల గర్భం పోయింది..."
    "ఎనిమిదవ కాన్పు "మంజు బిగ్గరగానే అంది?    
    అప్పుడే అక్కడికి వచ్చిన సిస్టర్ అంది, "ఆ ఎనిమిది మందీ ఆడవాళ్ళేనట డాక్టర్... అందుకే మగాడి కోసం ప్రయత్నం ఈ సారి ఈ సారి- అనుకుంటూనే ఎనిమిది మంది ఆడవాళ్ళను కనింది పాపం..."
    డాక్టర్లిద్దరు ఒకరి ముఖాలొకరు చూచుకున్నారు. ఆమెకు నొప్పు లెక్కువయ్యాయి. ఏం తను అంటున్నది- ఏం చేస్తున్నది- ఏమీ తెలియని పరిస్థితిలో ఉంది.
    "బాబోయ్.... ఈ సారీ-ఆ - డ - పిల్ల యితే- నన్ను చం-పే- స్తారమ్మోయ్ .......నాయినోయ్."
    అయా- ష్" అంటుంది-గానీ ఆమె పదే పదే అంటోంది. డాక్టరు అన్నపూర్ణ నొప్పులు త్వరత్వరగా రావటానికి ఇంజక్షన్ ఇమ్మంది. నర్సు వచ్చి యిచ్చింది. అప్పుడప్పుడు మంజుల నాడి చూస్తోంది.    
    ఇక లాభంలేదు- మత్తు మందిచ్చి తియ్యాలనుకున్నారు.....కానీ అనవసరం అయింది. కాలు వచ్చింది....డాక్టరు అన్నపూర్ణ అతి చాక చక్యంతో బిడ్డ కే హాని కలక్కుండా బైటికి తీసింది ....పాపం. ఆడపిల్ల-అనటానికి ఎవ్వరికి ధైర్యం లేకపోయింది పాప కెవ్వుమంది.
    ఒక్క క్షణం సుఘస్తావస్తలోంచి తేరుకు న్నట్లు -కళ్ళు తెరచి ఆశగా చూచింది. మంజు ముఖం తప్పించేసుకుంది.    
    ఆయా అంది నీరసంగా. "ఆడపిల్లమ్మా"
    ఆమె కళ్ళు మూసుకుంది. కళ్ళలోంచి ధారగా నీరు కారుతోంది.
    "మనచేతిలో లేదమ్మా- ఆ భగవంతుని దయ...ఏడవకండమ్మా-" అంటోంది ఆయా.
    డాక్టర్లకు జాలి - అంతకు తప్ప ఏం చెయ్యగలరు.
    బైటికి కబురు చేసేసిన సిస్టర్ భ్రుకుటీకరించి పెదాలు వికృతంగా వంచి - లోపల అంది "వాళ్ళసలు మనుష్యులే కాదండి....రాక్షసులు"
    ఇకపై చెప్పలేక సైగ చేసింది. "ఈవిడ పైకెళ్తే మంచిదట. రెండో పెళ్ళి చేసుకుంటే లక్షణంగా కొడుకులు పుడ్తారట." సగం సగం మాటలతో ఎలాగో అభినయం చేసి అసలు విషయం తెలియజేసింది.
    "ఎలాంటి మనుష్యులు" అన్నట్లు చూచారు అంతా.
    ఆమె కళ్ళు జలాశయాలే అయ్యాయి.
    "అమ్మా బిడ్డను చూడండి-బంగారు ముద్ద"
    స్నానం చేయించి ఆ వృద్ధ ఆయా టవలులో చుట్టి పాపను తెచ్చింది. నిజంగా పాప చాలా బావుంది. నల్లని పొడవైన జుత్తు. చిన్నముక్కు చిన్ననోరు, "ఎర్రని పెదాలతో గులాబి పువ్వు రంగుతో వున్న పాపను చూచి మంజు హృదయం ఆనందంతో పరవళ్ళు ద్రొక్కింది-
    ఆమె కళ్ళు తుడుచుకుని పాపవైపు చూచింది.
    ఆ చూపులో మాతృప్రేమనంతా పొందు పర్చింది. దయతో అంది. "తల్లీ -వీళ్ళ మధ్యలో పడ్డావెందుకమ్మా..."
    "నీవున్నావు- చాలు" అన్నట్టు ఆ పసికందు తల్లి చూపుదు వ్రేలును గట్టిగా పట్టుకుంది.
    మంజు ఆ దృశ్యాన్ని చూచింది. కళ్ళు ఆర్ద్రాలయ్యాయి. డాక్టర్లిద్దరు బైటికొచ్చారు.
    చెట్టుక్రింద చుట్టాలంతా సమావేశమై ఉన్నారు. వీళ్ళిద్దర్నీ చూడగానే మౌనం దాల్చారు.
    అందర్నీ పలుకరించినట్లే - మామూలుగా అంది డాక్టర్ అన్నపూర్ణ. "మనుమరాలిని చూచారా? ఆరోగ్యంగా - బంతిపువ్వులా ఉంది," "ఎందుకమ్మా - మాకు - ఎనిమిది మంది ఉన్నారింట్లో - అందరూ బాగానే ఉన్నారు - ఎటొచ్చీ మాకీ పేరు నిలిపేందుకు ఒక్క కుర్రాడు లేడు ... ఎన్ని సార్లు ఎదురు చూసినా కూతుర్లనే కంటుందా మహాతల్లి..."
    "అంటే తప్పంతా మీ కోడలిదేనా?" డాక్టర్ అన్నపూర్ణ చిరునవ్వుతో ప్రశ్నించింది.
    "కాదండీ మరి-పుత్రుడ్ని కనే యోగం లేదు. అంతా కర్మ-కాకపోతే ఎనిమిదిమంది ఆడాళ్ళా? ఆ పోయిన గర్భం కూడా ఆడదేనట - ఇక ఈకొత్తపిల్ల-ఎవరికి తెలుస్తుందమ్మా మా బాధ"
    డాక్టర్ అన్నపూర్ణ- మంజు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
    "ఏమిటీ వైపరీత్యం! "అనుకుంటున్నాయి వారి చూపులు. డాక్టర్ అన్నపూర్ణ దీర్ఘంగా నిట్టూర్చింది.
    "పుత్రికా జననం విని కోడలిని అనటం బదులు -ఆ చంటిబిడ్డ తండ్రినంటే న్యాయంగా వుంటుదమ్మా"
    "ఏం-వాడేం నవమాసాలు మోసి కన్నాడా' ఓ పెద్దమనిషి చేతులు త్రిప్పేసింది. అన్నపూర్ణ నవ్వింది.
    "అందుకే ఆ బాలెంతరాల్ని ఏమీ అనరాదనేది. మోసి కనింది-పిల్ల ఊరికే రాలి పడలేదు. చచ్చిబ్రతికినంత పనికాదా!...
    "ఆ...చచ్చినా బావుండేది" అత్తగారు కాబోలు అన్నది.
    నాలుగడుగులు అవతల నుంచున్న పురుషుడు- ఏదో ఆలోచిస్తూ నుంచున్నాడు. వీళ్ళ మాటలు వింటున్నా, జోక్యం కల్గించుకోకుండా నుంచున్నాడు.
    ఆమె ఆఖరుగా అన్న మాటలకు అన్నపూర్ణ మొహం కోపంతో అరుణాంచితమైంది. "మా దగ్గరకొచ్చే వాళ్ళంతా ప్రాణాలతో సుఖంగా ఉండాలని కోరతాముగాని చావాలనుకోము...ఇప్పటికీ అయే కన్నీరు కారుస్తూ దుఃఖిస్తోంది....వెళ్ళి పలుకరించ రాదా?"
    అటు వేపుగా ఖాన్ వుండటం చూచి, డాక్టరు అన్నపూర్ణ పిల్చింది. ఖాన్ ఏమిటీ అన్నట్లు వచ్చారు.
    "కాన్పు కేసు- చాల కష్టమైంది- తల్లి - పాప బాగున్నారు."
    "దట్స్ గుడ్" అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
    "ఆడపిల్లను ప్రసవించిందని వీళ్ళంతా చాల కోపంగా ఉన్నారామె మీద. ఆ చంటిమీద- తప్పంతా ఆ కోడలిదేనట.
    ఆమె అర్ధవంతంగా ఖాన్ వైపు చూచింది. తర్వాత దృష్టిని పాప తండ్రి వైపు మరల్చి మళ్ళీ ఖాన్ వైపు చూచి- తల పంకించి అంది "ఇంటి కెళ్ళాలి...వస్తాము."
    మంజుల - డాక్టరు అన్నపూర్ణ కొద్ది దూరం వరకు మౌనంగా నడిచారు. విడిపోయే ముందు మంజుతో అంది "హాస్పిటల్ కు వచ్చిన క్షణం నించీ అందరితో చెప్పుకుని ఏడ్చింది పాపం. ఆమె బ్రతుకు దుర్భరమై పోతుంది.
    ఆమె వెనక్కు తిరిగి చూచింది. ఖాన్ అతడితో ఏదో మాట్లాడుతున్నాడు. డాక్టర్లిద్ధరూ వెళ్ళగానే ఖాన్ వాళ్ళనందరినీ పరీక్షగా చూచాడు.
    ఒక్కరి ముఖంలో కూడా అణుమాత్రం ఆనందంగానీ జాలిగానీ లేదు.
    అతను వారిని సమీపించాడు.
    "చంటిపాపకు మీరు ఏమౌతారు?"
    "తండ్రిని".
    "కొడుకును ప్రసాదించక పోయారా!" ఖాన్ మామూలుగా అడిగాడు?
    "అవ్వ - ఇదేమి చోద్యం? అతనేం జేస్తాడు?" ముసలమ్మ కఠినంగా అంది.
    "అయ్యో? అదేమిటవ్వా- అట్లంటావూ -"అని వెక్కిరింపుగా అని మళ్ళీ మమూలు ధోరణిలో అన్నాడు" చూడండి - మీకు తెలియని విషయాలెన్నో ఉన్నాయి. బిడ్డ పురుషుడయ్యేది స్త్రీ అయ్యేది ఆ శక్తి పురుష వీర్యంలోనే ఉంది. ఆ శక్తి స్త్రీలో లేదు. ఆమె గర్భంలో స్త్రీ. పురుష బేధం లేని బీజం మాత్రమే వుంది. బిడ్డ ఆడదౌతుందో మగదౌతుందో తెలియదు. మళ్ళీ మొదటి కెళ్ళి అంతా భగవంతుని ఇచ్చ అని ఊరుకో వాలి. చదువుకున్నవారు - ఇలా ప్రవర్తిస్తే అంతా ఏమనుకుంటారు ఆడవాళ్ళ చేతిలో వుంటే బహు!? అంతా మగాళ్ళే ఉందురు లోకంలో....వెళ్ళిండి.....వెళ్ళి చూచి ఆమెను ఓదార్చండి."
    నీరసంగా అడుగులేస్తూ అతను వెళ్ళి పోయాడు. కానపు గదివైపు ఖాన్ స్మ్లాక్ జోబుల్లో చేతులు దూర్చుకుని దీర్ఘాలోచనలో నిమగ్నుడై తన పనిమీద వెళ్ళిపోయాడు.
    ఆ సమయంలో మంజు ఇంటికెళ్ళి స్నానం చేసి అల్పాహారం తిని తడి జుత్తును నీరు కారకుండా తుడుచుకుని -వెంట్రుకల్ని వేలు ముడివేసి పిన్నులు గుచ్చుకుంది. మళ్ళీ భర్తను చూడటం పడలేదు. ఆమె తను గదిలో కెళ్ళి కూచుని రోగులను పరీక్షించటంలో మునిగి పోయింది.
    మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చినా కుమార్ రాలేదు. కబురు తెలిసింది. "వార్డ్ బాయ్ వచ్చి తెల్పాడు," ఓ పదారేళ్ళ అమ్మాయిని ఎద్దు పొడిచిందండమ్మా - పెద్దమ్మగారు - అయ్య గారు - పెద్దమ్మగారు ఆపరేషన్ చేత్తుండారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS