Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 9


    
    ఆ రోజేదో సాధారణ పండగ అవడం వల్ల ఆలశ్యంగా భోజనాలవుతున్నాయి. వంట ఎవరు చేసినా శర్మ గారికి వడ్డించడం  మాత్రం పార్వతమ్మ గారే చూసుకోవడం అలవాటు వల్ల ఇటు ఆవిడకి ఒడ్డన కన్నీ అందిస్తూ, అటు బాకీ వున్న పిండి వంటనీ తయారు చేస్తుంది జానకి.
    'శంకరం గారు ఒచ్చేదాకా , అందాకా ఎవర్నన్నా పెట్టమంటే శ్రద్ధ చెయ్యక, పాపం జానకిని ఇబ్బంది పెడుతున్నావ్ నువ్వు.' అన్నారు భోజనం ముందు కూర్చున్న శర్మ గారు.
    'నేనూ ప్రయత్నిస్తూనే వున్నానండీ . సరైన మనిషి దొరకోద్దూ? అయింది ఇవాళో రేపో అతను రానే వస్తాడు. అన్నట్టు రామం, భార్యా కూడా ఒచ్చేవారం బెంగ్లూర్నుంచీ ఒచ్చేస్తారు కదూ.' అన్నారు పెరుగు పచ్చడోడ్డిస్తూ పార్వతమ్మ గారు.
    'వాళ్ళ మాటలావుంచి , ఎల్లుండి విజయవాడ నుంచి వీరంతా ఒస్తున్నారుగా! అప్పటి కన్నా శంకరం రాకపోతే ఇబ్బంది కదూ అందుకే -'
    'ఫరవాలేదండీ, ఒకవేళ అతను రాకపోతే , జోగారావు గారి మనిషోచ్చి అవసరాని కుంటాడు. వారితో చెప్పుంచా.'
    'అలాగైతే సరే.' చెయ్యి కడుక్కుని భార్య అందించిన తములపాకు కిళ్ళీ నోట్లో వేసుకుంటూ వెళ్ళిపోయారాయన. ఏవీ తోచకుండా అటూ ఇటూ తిరుగుతున్న సుధని చూసి నవ్వుకుంటూ.
    ఇంటి పన్లూ పోనూ, మిగతా వేళల్లో పార్వతమ్మ గారు పూర్తిగా పురాణ గ్రందాల్తోనే లోకం. జానకి కొంతసేపు ఇంటి పన్లూ, కొంతసేపు చేతి పన్లూ, కొంత సేపు గీతా పారాయణం చేస్తూ, ఇలా కాలక్షేపం చేస్తుంటుంది. సుధ కూడా చాలా వరకూ కాలాన్ని వృధా పుచ్చకుండా, తల్లి వద్ద చదువూ, అల్లికలూ, నేర్చుకోవడం ఆపైన వీణ సాధనం చేసుకోవడం , ఇటువంటి పనుల్తో పొద్దు పుచ్చుతూ వుంటుంది. అయినా కూడా ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్లడం ఇష్టం లేని సుదకి తోడి పిల్ల లెవరన్నా ఇంటి కొస్తే ప్రాణం లేచొచ్చి నట్టయ్యేది. అందుకనే ఏ బంధువుల పిల్లల్నన్నా అప్పుడప్పుడు రప్పిస్తుండే వారు కూడా పార్వతమ్మ గారు.
    మొత్తానికి తన తోడి వారెవ్వరూ లేరని మనసు కదోలాఉంటుండే సుదకి రామానికి పెళ్లవడంతో బ్రహ్మానందం కల్గింది. అందుకు తోడు పెళ్లవగానే కులాసా ప్రయాణాని కోసరం వెళ్లిన రామం, శాంతా , త్వరలో వస్తున్నందుకు సుధ సంతోషానికిక అంతులేకుండా వుంది. శాంత తనకన్నా నాలుగైదేళ్ళు పెద్దదే అయినా, తన తల్లీ, మేనత్త లంత పెద్దది కాదుగా? అందువల్ల తనకీ సరదాగానే వుంటుంది అనుకుంటూ, శాంతా రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది సుధ.
    అయితే వారికన్నా ముందు దత్తు గారి కుటుంబం వస్తున్న వివరం అప్పటి వరకూ సుధకు తెలియదు. వారోచ్చినప్పుడు తనెలా వుండవలసున్నదీ, రఘు హెచ్చరించడం మూలకం గానే సుధకా విషయం తెలిసింది.

                             *    *    *    *
    ఏవో పనుందంటూ రఘూ పొద్దున్నే వెళ్లి పోవడం వల్ల , వేణు రైల్వే స్టేషన్ కి వెళ్లి వార్ని తీసుకొచ్చాడు. వచ్చిన వార్ని పార్వతమ్మ గారు కుశల ప్రశ్నలు వేస్తుంటే శంకరం చేత కాఫీ, ఫలహారాల్ను పంపించింది జానకి. రఘు హెచ్చరింపు నుద్దేశించి సుధ ఆ వేపు క్కూడా రాలేదు.
    'మీ అమ్మాయి ఎదండీ?' అనడిగింది టిఫెన్ తీసుకుంటున్న లీల. కోటు స్టాండు మీది పరికిణిని ,వోణిని చూస్తూ.
    'నా కాడపిల్లల్లెరమ్మా , అవి మా తమ్ముడి కూతురివి.' అంటూ క్లుప్తంగానే పార్వతమ్మ గారు సమాధానం ఇచ్చినా, ఆ తరవాత వారి మాటల సందర్భం లో పార్వతమ్మ గారు జానక్కి బంధువేనన్న వివరం వారికీ తెలిసిపోయింది.
    'ఆ, పాపం ఇంతకీ వో చిన్న గుమస్తాగా బర్మా వెళ్ళి, అంతటి వాడయ్యాడాయన.' అంది వారితో తన పరిచయాన్ని గురించి చెప్తున్న సందర్భం మధ్యలో రాజమ్మ గారు.
    'ఏవిటో ఆయనన్నా అ చిన్న ఉద్యోగాన్నన్నా ఆధారం చేసుకు వెళ్ళారు. చేసేది లేకుండా వట్టి కట్టు బట్టల్తో వెళ్ళిన వాడ్నమ్మా! ఏవిటో, ఈ చంచల లక్ష్మీ ఏ క్షణం లో ఎవర్ని వరిస్తుందో తెలియదు గదా' అన్నారు అతి వినయంతో దత్తు గారు ఫలహారం ముగించి లేస్తూ.
    'అలాగా, అయితే మా వాళ్ళని మీరు బాగా ఎరుగుదురన్నమాట' అన్నారు పార్వతమ్మ గారు.
     'ఎరిగుండడ మేమిటమ్మా, నిజానికి ఈనాడు నేనింత గొప్ప స్థితిలో వున్నానూ అంటే, ఈ చలవంతా వారిదే నని చెప్పాలి' అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న దత్తు గారు, వొర చూపుల్తో భార్య చాటుగా వేస్తున్న సజ్జ న్నర్ధం చేసుకుని చప్పున ఆగిపోయారు.
    ఈ బట్టలు ఈవిడ తమ్ముడి కూతురివా. అయితే ఈడైన మేనరికాన్ని ఇంట్లో పెట్టుకునే వున్నారన్న మాట. అనుకున్న రాజమ్మ గారి మనసులో అప్పుడే ఏదో సందేహం బయల్దేరింది.
    'ఏదీ మీ మేనగోడలూ స్కూలు కెళ్ళిందా ...అన్నారు ఇక ఉండబట్టలేక. బాధ కంతకన్న ఆందోళనలా వుంది.
    'లేదమ్మా. ఇంట్లోనే మెట్రిక్కు చదువుతుంది.
'అలాగా ఏదీ పిలవండి.'
    'అలాగే....అన్నారే గాని ఆవిడ పిలవలేదు.
    'అన్నట్లు, జానకీ ఇక్కడే వుందా?'
    'ఆ లోపలుంది రండి.' వెలవెల బోతున్న మొహంతో లేచి 'జానకీ' అంటూ ముందు హెచ్చరింపు తో ఆవిడ భోజనాల గది వేపు నడుస్తుంటే సుధని చూడ్డం కోసరమే ఈ ఒంకతో లొపలి కొచ్చిన రాజమ్మ గారి కళ్ళు నాలుగు వేపులా వెతుకుతున్నాయి. ఈలోగా మెల్లగా తల్లిని గోకి సగం తెర తొలిగి వున్న  గదిలోకి చూడమన్నట్టు సౌజ్ఞ చేసింది రాధ. ఊతకాలు ఆధారంతో నిలబడి అలమార్లో వెనక నుంచీ చూసిన ఆ తల్లి కూతుళ్ళుఇద్దరూ 'అమ్మయ్యా' అన్నట్టు ఒకరి మొహం ఒకరు చూసి నవ్వుకున్నారు.
    జానకిని చూసి ఏవో నాలుగు ఉపశమనం మాటల్ని అంతరార్ధంగా ఎత్తి పొడుస్తూన్నట్టనేసి అనుకున్న పనై పోయిందన్నట్లు మళ్లీ వచ్చి హల్లో కూర్చున్నారావిడ.
    'ఈ ఫోటో ఎవరి దండీ,' అంది. ఏమీ తోచక సావిడంతా తిరుగుతున్న లీల గదిలో తగిలించున్న ఫోటో ని వెల్తో చూపిస్తూ.
    'మా పెద్దబ్బాయి పెళ్ళిలో తీసింది.' అంటూ లోపలి కెళ్లి ఆ ఫోటో తెచ్చారావిడ.
    'ఏవిటీ వీళ్ల పెద్దబ్బాయి పెళ్లై పోయిందా?' రాదా. రాజమ్మ గార్లు బిక్క పోతూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
    'అలాగా, మరి మా మురళి చెప్పనే లేదే?'
    'అంటే మా బావగారబ్బాయి . మా వద్దే ఉంటున్నాడు లెండి. వాడికీ మధ్యే పెళ్లయింది.... ఆ మాటతో ఆగిన గుండెలు మళ్ళీ కొట్టుకోసాగాయి వారికి. అంటే అంత అడురుపుట్టిందన్నమాట.'
    'పిల్ల చాలా అందంగా వుంది కదూ' అంది సంతోషంతో రాధతో లీల.
    'అందుకనే కోరీ, వేడీ చేశాం' అన్నారు తృప్తితో పార్వతమ్మ గారు.
    'మరి ఇంత చక్కని పిల్లనీ, మీ అబ్బాయికీ వెతకాలన్న మాట' అర్ధంగా అన్నారు.
    'మేం వెతకాలంటే అయిపోతుందా , అంతా ఆ లలితాంబిక దయ.'
    'సరే అంత వేదాంతానికి పొతే ఏదీ లేదూ.. అయితే మీ బావగారబ్బాయి ఇక్కడే వుంటారన్న మాట.' ఏవిటి అడ్డమైన వాళ్ళనీ నెత్తెక్కించుకోవడం! అన్నట్లుంది ఆవిడ ధోరణి.
    'ఆ పాపం ఆయనకి నిద్ర వస్తూన్నట్లుంది. పైకెళ్ళి పడుక్కోమనండి. 'కోటయ్యా ' ఈ సామాన్లన్నీ పైన పెద్ద బెడ్ రూమ్ లో పెట్టు' అన్నారు పార్వతమ్మ గారు. వేలి గోళ్లు కొరుక్కుంటూ కాలు మీద కాలు వేసుక్కూర్చుని పుస్తకం చదువుతున్న రాదని నిదానంగా చూస్తూ.
    'పెద్దావిడ కింద కూర్చుంటే ఏవిటా కళ్ళాడించడం . ఆ కూర్చోవడమూనూ.' అని రహస్యంగా అంటూ రాధ చెంగు పట్టి లాగింది లీల.
    'అబ్బ ఏవిటే నీ గోలా?' విసుక్కుందే గాని కుర్చీ దిగలేదు రాధ.
    'అయినా భోజనాలకే వస్తారనుకున్నాం' అన్నారు లేచి మేడ మీది కెళ్లాబోతున్న రాజమ్మగారితో మర్యాదకి పార్వతమ్మ గారు.
    'అబ్బే, అన్నీ టైం ప్రకారం జరగాల్సిందే గానీ, కక్కుర్తీ పన్లు మొదట్నుంచీ అలవాట్లేదు.' అంటూ రాదని లెమ్మని మెడ మీది కెళ్ళి పోయారు రాజమ్మ గారు. తను కాస్సేపయ్యాక వస్తానని ఆగిపోయిన లీల, వాళ్ళు వెళ్ళిపోగానే పార్వతమ్మ గార్నడిగి లోపలి కెళ్లి సుధతో పరిచయం చేసుకుంది. ఎందువల్లనో తోలి పరిచయం లోనే వారిద్దరి మాటా, మనసూ కలిసిపోయినందున చాలాసేపిద్దరూ మనసిచ్చి మాట్లాడు కున్నారు. పై కెళ్ళి ఏవీ ఎరగనట్లు పుస్తకం పట్టుకు పడుక్కుంది లీల.
    'లీల వెళ్లిపోయాక ఆలోచన్లో పడింది సుధ. ఏదో అమ్మని సముదాయించేందుకు కన్నట్టుగా వెళ్ళినట్లే వెళ్లి --
    'పాపం అసలే ఆస్తి అతనూ పోయి నువ్వు బాధపడుతుంటే , అందుకు తోడు పుట్టిన ఒక్క పిల్లా, కుంటి దవాలా?' అంటూ రాజమ్మ గారన్న శూలాల పోటు వంటి మాటలు సుధ మనసులో అలా వుండి పోయాయి.
    'ఇంతేకాదు ప్రతిదానికీ ఆవిడలాగే నిరసన గానే అంటుంది. ఏవిటి వీళ్ళ అధికారాలిక్కడ' అని మొదట్లో అనుకున్నా ' అయినా ఆవిడన్నాదాంట్లో తప్పేం వుందనీ. నా వంటి కుంటిది పుట్టడం దురదృష్టం గాక అదృష్టం ఎలాగౌతుంది....అని మళ్లీ సర్దుకున్న సుదకి దుఖం పొంగు కొచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS