Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 10


                                    4
    మధ్యాహ్నం భోజనానికి బాగా ఆలశ్యంగా ఒచ్చిన రఘు 'ఎప్పుడూ తన రాక కెదురుచూస్తూ సావిట్లో నే తపస్సు చేస్తుండే సుధ ఇవాళ కనిపించడదేం!' అనుకుంటూ కాళ్ళూ చేతులూ కడుక్కుని లోపలి కోస్తూ గదిలో పరుపు చుట్టలకి చేరబడి నిద్రపోతున్న సుధని చూసి మెల్లగా లోపలి కెళ్లాడు.
    తడి మెరుస్తున్న కనురెప్పలూ! బుగ్గల మీద కాటుక చారికలూ, కంట తడి పెట్టడవేమిటో ఎరగని సుధ ఇవాళ ఏడ్చింది. అంటే అందుక్కారణం ఎవై యుంటుందో , క్షణం లో ఊహించుకున్న రఘు కి కోపంతో ఒళ్ళుడికి పోయింది. తిన్నగా హాల్లోకి కెళ్ళి కూర్చుంటూ అక్కడున్న వేణు నడిగాడు. అన్నీ ఉన్నదున్నట్టు చెప్పక పోయినా రాజమ్మ గారి విరగబాటుని గురించి మాత్రం తు.చా తప్పకుండా చెప్పేశాడు, పేపరు పట్టుకునున్న పళ్ళేన్నే కునికి పాట్లు పడుతున్న దత్తు గారి పక్కని వో పుస్తకం పట్టుకు తనూ కూర్చున్న వేణూ. వేణు జరిగినవన్నీ పరకాయిస్తూన్నట్టు, అంతవరకూ ఎవరికీ తెలియనే తెలియదు.
    'భోజనానికి రా బావా?' ఏవీ జరనట్టు మొహం తుడిచేసుకుని నవ్వుతూ వొచ్చిన సుధని చూడ్డం తోనే ఇక అప్పుడా ప్రసక్తి తేవడం ఇష్టం లేక మామూలుగా భోజనం ప్రారంభించాడు రఘు.
    ఈలోగా నిద్ర కానిచ్చి లేచిన రాధ తన వాళ్ళంతా ఇంకా నిద్ర పోతున్నందున ఏమీ తోచక డాబా మీద అటూ ఇటూ తిరుగుతూ యాదాలాపంగా , మండువా లోంచి కిందికి చూసింది. సరిగ్గా అదే సమయానికి వరండా లోని 'సిన్క్' వద్ద చెయ్యి కడుక్కుంటున్నాడు రఘు. తెల్లని బట్టల్తో , ఆజాను బాహువైన రఘుని చూడ్డం తోనే 'అబ్బ? రోహిణి చెప్పినట్టు ఇతనెంత అందగాడో?' అనుకుంది పరవశమయి పోతూ రాధ , డబ్బున మునిగోళ్ళ తో, రేగిన జుట్టుని సరిచేసేసుకుని చీరే, పవిటే మరోసారి సర్దుకున్నాక మళ్ళీ వంగి చూసింది.
    'చేయి తుడుచుకుందుకు తువ్వాలందిస్తున్న సుధకి దగ్గరగా నిలబడి లాలనగా ఏదో అడుగుతున్నాడు రఘు. సమాధానం చెప్పడానికి సిగ్గు పడుతూ, తలొంచుకుని నవ్వుతుంది సుధ. ఆ దృశ్యం చూసేసరికి అర్ధం లేని అసూయతో సుధ యందోక విధమైన ఈర్ష్యా ప్రారంభమయింది రాధ మనసులో...' తన కడ్డంగా ఈ కుంటి దెక్కడ దాపురించిందా' అనుకుని మొదట్లో అంతలా అసూయ పడ్డా ఒకటే చోటే పెరుగుతున్న మేనత్త మేన మామ పిల్లలు చనువుగా వుండడం లో తన కెందుకు మధ్య ఈ ఈర్ష్యా ' అనుకుంటూ మళ్ళీ తనకి తనే సమాధాన పెట్టుకుంటూ వాళ్ళు లోపలి కెళ్ళి పోగానే తనూ చరచరా గదిలో కెళ్ళి పోయింది రాధ.
    రాధ గదిలో వెళ్ళేసరికి -- అంతకు ముందే లేచి , మధ్యాహ్నపు తమ ప్రవర్తనల్లో ఒకరి లోపాలోకరు చెప్పి వాదించుకుంటున్నారు దత్తూ రాజమ్మ గార్లు. 'అబ్బబ్బ ఆ అబ్బాయి తీరా మళ్ళీ బయటి కెళ్ళి పోతాడో ఏవో, ఒచ్చిన పనోదోలి వాళ్ళ కిప్పుడే దెబ్బలాటెక్కడ కావల్సోచ్చింది?' అనుకుని రాధ మనసు తహతహ పడుతుంది.
    'అయినా మనం వచ్చామని తెలిసుండీ, మర్యాద కన్నా రాలేదేం ఆ కుర్రాడూ.' వాదన అయ్యాక రాజమ్మగారే ప్రారంభించింది.
    'చదివేది డాక్టరుకిగా. ఏదన్నా అద్భుత మైన ఆపరేషన్ గనక వుందంటే అదంతా చూస్తేనే గాని మరో పని కెళ్ళరు. అదీగాక మనం ఈ విషయంగా వచ్చి నట్టూ అతనికేం తెలుసూ.
    'బాగుంది మీరనడం. మనవద్ద పిల్లా వారివద్ద పిల్లాడూ వున్నప్పుడింకెందు కోస్తామనుకుంటారూ? అదీగాక మన మురళీ అన్నా చెప్పుండడూ అతన్తోటీ!
    'అంతా నీలాగే సూక్ష్మంగా గ్రహించేసే వాళ్లే ఉంటారా రాజ్యం.'
    'ఆ మీ బోలిబోలి మాటలకేం లెండి గానీ, ఎంతా లస్యమైనా ఈ పాటి కతడు వచ్చే వుంటాడు గనక మరోసారి కింది కెళ్లి పరిచయం చేసుకుని అతన్ని పైకి తీసుకు రండి. మాటల్లో బడి అక్కడే చతికిలపడకండెం?' అధికార ధోరణి లో అన్నారావిడ.
    'ఆ! మనం కింది కెళ్ళాలి గానీ, అతన్ని రమ్మనడం ఏం బాగుంటుందని.'
    'అతనిందాకే ఒచ్చినట్టున్నాడు డాడీ!' హెచ్చరిస్తున్నట్టుగా అనేసింది ఇక ఆగలేక రాధ    
    'ఆ మీవన్నీ విడ్డూరపు ఆలోచన్లే. అసలా ముసలావిడకే గోలా తెల్సినట్టు లేదు. మధ్య మీ బక్కురుకొనడం తప్పా. అతనున్నప్పుడే త్వరగా వేల్దురూ కాస్త. ఒచ్చిన పనేదో త్వరగా తెల్చేసుకుంటే తిరిగి వూర్లో కాస్తన్నా చూడ్డానికి సావకాశం వుంటుంది మనకి.'
    'అది కాదు రాజ్యం. మనబ్బాయిల పెళ్ళికి మనదే పై చెయ్యి. మనమ్మాయిల పెళ్ళికి మనదే పై చెయ్యి అంటే అదేం న్యాయం--'
    'అబ్బబ్బ, మీతో నేవాదించలేను బాబూ.'
    'సరి ఇదుగో వెళ్తున్నానుగా. ఏవీ కాసిన్ని మంచి నీళ్ళూ.' చేయిజస్తూ అన్నారు.'
    'కూజా లో అయిపోయినట్టున్నాయి. వెళ్లి తెస్తా' దొరికిందే చాలు చాన్సన్నట్టుగా దబదబ మెట్లు దిగిన రాధ . సరిగ్గా అదే సమయానికి అటు వెళ్తున్న రఘుని చూడ్డం తోనే ఆఖరి మెట్టు మీద ఆగిపోయింది.
    'ఆవిడే మురళీ చెల్లెలు మిస్ రాధ రఘూ. ఆవిడా మెడిసెన్ 'ధర్డ్ ఇయరే' నట. ఇతడు మా అన్న రఘు. ఇతనూ మెడిసెన్ మూడే ఏడే' అంటూ ఇద్దరికీ పరిచయం చేశాడు వేణు. 'నమస్తే' అంటూ అతని కోసరం అవతరించిన సౌందర్య దేవతలా ఒయ్యారంగా నిలబడింది రాధ    'మురళి ...చెప్పాడు కాని త్వరగా రాలేక పోయాను. సాయంత్రం అందర్నీ పరిచయం చేసుకుంటా. సారీ' చేతి గడియారం చూసుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు రఘు. రఘూ తనని చూడ్డం తోనే మైమరచి పోతాడనుకుంటూ ఎంతో ఇదిగా వచ్చిన రాధకి రఘు మామూలు కన్నా ముభావంగా మాట్లాడి మరోసారి వెనక్కి తిరిగి చూడనన్నా చూడకుండా వెళ్ళిపోవడం తో తొలిసారిగా రాధ అహం దెబ్బ తినింది.
    'నీళ్లయిపోయా యేవిటమ్మా ,పంపనా శంకరం పళ్ళ రసం తీస్తున్నాడు. రెండూ పైకి పంపుతాలే'....లోపలి సావిట్లో కూర్చుని భాగవతం చదువుకుంటున్న పార్వతమ్మ గారన్నారు. బడులేవీ చెప్పకుండా గబగబా పైకెళ్ళి పోయింది రాధ.
    ఇదంతా చూడ్డట్టే చూస్తున్న వేణు, తన అన్న మనో నిబ్బరాన్ని మనసారా ప్రశంసించుకున్నాడు.
    'ఏవే నీళ్ళూ' పక్క మీద పద్మాసనం వేసూక్కూర్చున్న రాజమ్మ గారే ముందడిగారు.

              
    'ఆవిడే ఎప్పుడో పంపిస్తారుట.'
    'ఏం చోద్యమే --'
    'బాగుంది ఒద్దంటుంటే లోపలికి జొరబడమంటావా?' వున్న కోపమంతా తల్లి మీద చూపుతూ అంది.
    'ఇంతకీ అతనోచ్చాడా.'
    ఏమో అతనో ఎవరో, నే కింది కెళ్లే సరికి వెళ్లి పోతున్నాడు.
    'అయితే మీ నాన్న దిగోచ్చేసరికే లేడన్నమాట అతడు...'
    'ఏవిటమ్మా , ఈ అడ్డదిడ్డ ప్రశ్నలూ, నేవెళ్ళే సరికే లేదంటుంటే నాన్నోచ్చే సరికి, ఎలా వుంటాడనుకున్నావ్.'
    'ఇందాక స్కూటర్ చప్పుడయినప్పుడే అనుకున్నా, అయినా, ఎంతసేపూ నాతో వాదన తప్పించి కదుల్తేనా మనిషి!' అంత ఒళ్ళు మోసుకుంటూ దిగ్గున లేచిందావిడ.
    'ఐనా ఈయన కింది కెళ్ళిన మనిషి, పత్తావున్నారేమో చూశావా. ఇంతే! నువ్వన్నా, డాక్టరు చదువుతున్న పిల్లవే, కాస్త మాటలు కలిపి ఉండొచ్చుగా? అబ్బబ్బ, అందరూ అందరే నా ప్రాణానికి.' చిరాకు పడిపోయారావిడ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS