Previous Page Next Page 
ముద్ద మందార పేజి 9

 

                                    5

 

   

    రాధ తల్లి గారిని వీలైనంత త్వరలో వెనక్కు పంపించేయాలని నిర్ణయించుకున్నాను. నేనూ, రాదా కలిసి ఆవిడకు జూ, మ్యూజియం, అడయార్ మర్రిచెట్టు, లైట్ హౌస్, బీచి , కాపాలి. పార్ల సారది గుడులు అన్నీ ఓ వారం రోజుల్లో చూపించేశాను. మేం ముగ్గురం, భాస్కరం  సుమతి వాళ్ళబ్బాయి కలిసి మహాబలిపురం కూడా చూసేశాం.
    అన్నీ అయిపోయాయి. ఇంక ఆవిడ వెళ్ళాలి. "మరో నాల్రోజులు గడిచాక ఇహనే వెళ్తానోయ్. పాపం అన్నీ చూపించేశావు" అందావిడ. నా శరీరం ఆనందంతో రెట్టింపయ్యింది. రాధ నాకేసి చూసి, కళ్ళతో వెక్కిరించి,"అప్పుడే వెళ్తావా, ఇంకో వారం పదిరోజులుండి వెళుదువు గానిలేమ్మా" అంది. నాకు కోపం పెట్రేగి పోయింది. కానీ ఆవిడ తెలివైనది. "వుండడానికి ఏం బోయింది? ఎన్నాళ్ళయినామ హాయిగా వుండచ్చు. కానీ అవతల మీ నాన్నగారు ఒక్కరూ వుండాలి. వంటావిడ వంట ఆయనకు నచ్చదు. నేనే చెయ్యాలి." అంది.
    "అవునవును" అన్నాను నేను వుత్సాహంతో.
    ఆరోజే ఆవిడకీ, ఒక చీర, పరంధామయ్యగారికి పంచల చాపూ, కండువా వగైరాలు తీసేసుకున్నాను. మర్నాడు ఆవిడ ప్రయాణమయ్యింది.ఆవిడను సాగనంపి మౌంటు రోడ్డులో ఓ సినిమా హాల్లోకి జోరపడ్డాము.
    'అరవ సినిమానా?" అంది రాధ తేలు కుట్టినట్లు గెంతి, తిరిగి సరిగా కూర్చుంటూ.
    'అవును. ఇది మద్రాసు" అన్నాను. 'అయితేనేం ? మన తెలుగు సినిమాలు ఎందుకుండవు?" అంది. సినిమా పొడుగునా , "వాడేందుకు అలా అరుస్తాడు ఆ అమ్మాయేమంటుంది? వీడెవడో ఎరిగిన ముఖంలా వుంది. ఏవిటండీ ఎందుకలా నవ్వుతారు! పలకరెం" అంటూ అనర్గళంగా సతాయింపు ప్రారంభించింది.
    'కొంచెం సుమ్మా యిరమ్మా' అన్నాడో తమిళుడు.
    రాధ ఉలిక్కిపడి, "ఎవంటాడు వాడు?' అంది.
    "అరవద్దంటాడా అరవ్వాడు" అన్నాను.
    రాధ అభిమానపడింది.
    మధ్యలో నాకర్ధం కావట్లేదంది మళ్ళీ.
    "నాకు మాత్రం అర్ధమవుతోందేమిటి? అలా చూడ్డమే ' అన్నాను. రాధ మాట్లాడడం, చూపరులు వారించడం తన్నే లేదు. నేను చూడవలసినవి రెండు సినిమాల'య్యాయి. రెండూ ఒకేసారయ్యాయి.
    వుస్సురుమంటూ యింటికి చేరాము. గడియారం అరగంట కొట్టి ఒటిన్నరంది.
    ఆకలి చుర్రుమంది.
    పదార్ధాలన్నీ నీళ్ళు కారాయి.
    మేమూ నీళ్ళు కారాము. అవురుమంటున్న ఆకలిని చల్లార్చి, స్పృహ తెలీకుండా తెల్లెరేవరకూ నిద్రపోయి , భళ్ళున తెల్లారేక లేచాము.
    మా దాంపత్య జీవితం అలా ఆరంభమయ్యింది.

                              *    *    *    *
    గతం తల్చుకోడం నాకు దైనందిన కార్యక్రమాల్లో ఒకటయి పోయింది. పనీ పాటా లేకపోడం దానికి మరో దోహదమిచ్చింది. పొద్దున్న కాఫీ టిఫిన్లయ్యాక, మధ్యాహ్నం భోజనం అయ్యాక, రాత్రి పడుకునే వరకూ ఎప్పుడూ గతాన్ని గురించిన తలంపే! నాగతం తలచుకుంటే జీవితేచ్చ నశించేది. అయినా బండగా జీవితాన్ని నేట్టగలిగి అంత నా మనస్సు బండబారి పోయింది. నేను ఆత్మహత్య చేసుకుంటే-- నాతొ పాటు ఒక పరమరహస్యం అడుగంటి పోతుంది. అది కనీసం తెలియవలసిన వాళ్లకు తెలియాలి.
    ఒక అమాయక జీవితాన్ని బలి తీసుకున్నందుకు నా జీవితం మోడులా అయిపొయింది.
    కుర్చీలోంచి లేచి, మంచం మీద కూర్చోడం, మంచం మీంచి లేచి కుర్చీలో కూర్చోడం చివరకి నిద్రపోడం. ఇది నాకార్యక్రమమయిపోయింది.

                                                  *    *    *    *
    అద్దంలో నా విగ్రహం చూసుకున్నాను. ఆల్బం తీసి పాతికేళ్ళ ముందు నా ఫోటో చూసుకున్నాను. ఎంత తేడానో! ఆనాడు నా వయస్సున్నవాడికి నాడు నేను తండ్రిని. జుట్టు కల్నేతగా నేరుస్తుంది. పోషత్తూ మంచి తిండి వుండడం వల్ల శరీరం మరీ ముసలితనానికి తోదవ్వలేదు. అద్దంలో పరికించిచూసుకున్నాను. అవకపోవడమేమిటి యాభయ్యే వడిలో పడితే, సమర్చించుకోడానికి సిగ్గయినా ఉండద్దు.
    నా సిగ్గులేని తనానికి సిగ్గేసింది.
    నాకు ఎందుకో ముసలితనం ఆపాదించుకోడానికి బుద్ది పుట్టడం లేదు. 'అలోచించి ఆల్బం తీసి, మంచం మీద కూర్చుని, సింహాచలం ఫోటో ఉన్న పేజీ చూశాను. సింహాచలం! నవయవ్వనం లో చక్కని అంగ సౌష్టవంతో మిసమిస లాడుతూ, నోట్లో గడ్డి పరకతో, ఆనందంతో, మెరిసే కళ్ళతో నవ్వుతూ.... మిలమిల్లాడే కళ్ళతో నాకేసి చూస్తోంది.
    సింహచలాన్ని ముసలితనంతో వూహించబోయాను. మనస్సు ఎదురు తిరిగింది. కుదరలేదు. రాధ ఫోటో చూశాను. ఊహూ ఆ రకమయిన ఆలోచన కుదరలేదు.
    ఆల్బం తిరిగి యదా స్థానంలో పెట్టేసి, మేడ దిగి క్రిందికి వచ్చాను. సాయంత్రం అయ్యింది. షికారుకు వెళ్లాలని పించింది. "రంగా కారు బయట పెట్టు" అన్నాను. రంగడు కారు బయట పెట్టాడు. కారులో కూర్చుని స్టార్టు చేశాను. అది తన పని తను ప్రారంభించింది.
    వూరు దాటాను.
    "నూజివీడు " అన్న బోర్డు దూరమయ్యింది. వూరు చివర ఆంజనేయ స్వామి గుడి దగ్గర కారాపి, గుళ్ళో కి వెళ్ళి దేముడికి దండం పెట్టుకున్నాను. భాస్కరం, సుమతి గుర్తుకొచ్చారు. మద్రాసు వెళ్లాలని పించింది. కోర్కె బలీయమయ్యింది. వెంటనే కారు వెనక్కు తిప్పి, యింటికి చేరుకొని, ఓ లెదరు సూట్ కేసు నిండా బట్టలు సర్దుకుని మేనేజర్ని పిలిచి, "మద్రాసు వెళ్తున్నాను. వారం లోగా వస్తాను." అని చెప్పి, సింహాచలాన్ని పిలిచి, "ఓ మందార పువ్విలా కోసి పట్రా" అన్నాను. పరుగున వెళ్ళి పట్టుకొచ్చింది. కారు స్టార్టు చేసి "నేను మద్రాసు వెళ్తున్నాను. మందార చెట్లు పూలు జాగ్రత్త" అన్నాను.
    కారు పరుగు ప్రారంభించింది.
    మనస్సులో రమణ రూపం మెదిలింది.
    రమణ!!
    ఆ పేరు వింటేనే నా శరీరం జివ్వు మంటుంది. నవనాడులూ కృంగి పోతాయి. అసలు మద్రాసు వెళ్ళాలని కోర్కె పుట్టడానికి కారణం భాస్కరం అనే కన్నా రమణ అనడమే న్యాయం. బెజవాడ లో ఓ గంటాగి వ్యాపార సహాధ్యాయుల నందర్నీ కలిశాను. నా కన్నా ముందు వ్యాపారంలో దిగి, ఇంకా అక్కడే వున్న తోటి వ్యాపారులు అసూయ పడ్డారు. అసూయ మానవత్వానికో చిహ్నం. అసూయ లేకపోతె ఇహ మానవుడు దైవత్వాన్ని పొండుతున్నట్లే లెక్క. వాళ్ళంతా చేరి, "మీకేం లెండి" అన్నారు నన్ను ధనంతో కొలుస్తూ. నాకేమో వాళ్ళకేం తెలుస్తుంది? తీరా తెలియజేప్తే -- జాలి పడడానికి చీదరించుకుంటారు. చీత్కారిస్తారు.
    బెజవాడ లో భోజనం చేసి బయల్దేరాను. కారు వెధవకారు నత్త కన్నా హీనంగా పోతోంది. మనస్సు వెయ్యిసార్లు మద్రాసు వెళ్ళి, తిరిగి కార్లోకి వచ్చేసింది. రెక్కలు వుంటే, ఎంత బాగుడునో. విజ్ఞానం ఎంత అభివృద్దయి మాత్రం ఏం  లాభం? మనిషి చేపలా యీదగలుగుతున్నాడు కానీ, పక్షిలా ఎగురగలుగుతున్నాడా? లేదు. ఈదడానికి లేని యంత్ర సహాయం ఎగారడానికి ఎందుకు!
    కారు పాపం దరిదాపులకు వచ్చేసింది. నాలుగు మజీలీల అనంతరం మద్రాసు చేరగలిగాను. వయస్సులో వున్న రోజుల్లో అయితేనా అబ్బే ఏం లాభం? రోజులన్నీ ఒకలా వుండవు. రోడ్లన్నీ ఒకేలానూ వుండవు. వంకర్లు సహజం.
    కారు శబ్దం విని, భాస్కరం బయటికి వచ్చి, 'హరేరే, మీ తమ్ముడోచ్చాడోయ్ పంతులమ్మా" అని అరిచీ "నూజీవీడు నుంచేనా, యీ వయస్సులో కారు తోలుకుంటూ ఒక్కడివీ యింత దూరం వచ్చావా" అని మందలించాడు. ఆ మందలింపులో ఒక ఆప్యాయత వుంది.భాస్కరం కొడుకు సూర్యం పెట్టె కార్లోంచి తెచ్చి ఇంట్లో పెట్టాడు. సుమతి కూడా "ఎందుకోయ్ అంత అలసట! హాయిగా డ్రయివరున్నాడు కదా! అంది.
    "పాయింటే , కానీ తోచలేదు. రావాలనుకున్నాను వచ్చేశాను" అన్నాను.
    "సరేలే, మాట్లాడుకుంటూ వుండండి. స్నానానికి నీళ్ళు పెడ్తాను" అని సుమతి వెళ్ళిపోయింది.

                              *    *    *    *
    సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించాము. భాస్కరం తన రూము లో నాకు పక్క వేయించి , "బాగా అలసటగా ఉండుంటుంది పడుకో" అన్నాడు. నా కలవటనేది వుండదనీ, నిద్రపోవలసిన పని లేదనీ చెప్పాను. రమణను గురించి అడగాలన్న ఆత్రం ఎక్కువయి పోయింది. ఇంట్లో అడిగితె సుమతి గాని, సూర్యం గాని వింటారు. ఎవ్వరూ వినకూడని రహస్యం అది.
    భాస్కరం ఏవో కష్టసుఖాలు చెప్పుకు పోతున్నాడు. నాకు వాటి మీదంత ఆసక్తి కనబడలేదు. అయినా వింటూ వూకొట్ట నారంభించాను. ఎప్పుడు నిద్రపోయానో తెలీదు కానీ లేచేసరికి గడియారం మూడు కొట్టింది. భాస్కరం నిద్రపోతూనే వున్నాడు. సుమతి గదిలోకి వచ్చి నన్ను చూసి, 'లేచావా" అని, భాస్కరం కేసి తిరిగి, "లేవండి. ఏడయ్యింది టయిమాప్పుడే" అని అతన్ని తిట్టి లేపింది. భాస్కరం లేస్తూనే "హా రామచంద్రా కాఫీ అయ్యిందా" అన్నాడు.
    "నోట్లో పోయ్యనా" అంది సుమతి.
    "నెత్తి మీద పొయ్యకుండా వుంటే అదే చాలు" అంటూ భాస్కరం లేచి కూర్చున్నాడు.
    "మీ నెత్తి మీద పొయ్యి లేదు, కుండా లేదు లెండి లేవండి." అనేసి సుమతి వెళ్ళిపోయింది. భాస్కరం తృప్తిగా అతిట్టు నానందించాడు. ఆ వయస్సు లో కూడా చక్కగా ఛలోక్తులు విసురుకుంటూ ముచ్చటగా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న వాళ్ళని చూసేసరికి నాకు ఆనందమయ్యింది.
    అంతలోనే మనస్సు చివుక్కుమంది.
    కలియుగంలో పాపఫలితం అప్పటికి అప్పుడే కనుపిస్తుందంటారు. అక్షరాలా నిజం. నేను చేసిన పాపమే నన్నిలా చేసింది. ఒక్కనాడు కూడా చక్కని ఆనందం నా జీవితంలో లేదు. ఎన్ని లక్షలుంటే ఏం లాభం! ప్చ్...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS