Previous Page Next Page 
జీవనకలశం పేజి 9

 

    వాసుకి ఇష్టం లేకున్నా పెళ్ళి చూపులకి సిద్ధం చేసింది శ్రీలక్ష్మి.
    పెళ్ళికూతురు బి.ఏ. ఫైనల్ తండ్రి రిటైర్డు తాసీల్దార్. అన్న సబ్ ఇన్ స్పెక్టర్. మరో అన్న పేరుపొందిన డాక్టర్, అంటూ వివరాలు అన్నీ ముందే అందించింది శ్రీలక్ష్మి.
    పెళ్ళి చూపులు చాలా సింపుల్ గా అరేంజ్ చేశారు.
    పిల్ల తండ్రీ, అన్నగారూ, రాఘవరావూ ముందున్న హాలులో కూర్చున్నారు, పెళ్ళి కూతురూ, వాసూ, శ్రీలక్ష్మి, పెళ్ళికూతురు చిన్న అన్నగారూ డ్రాయింగ్ రూములో కూర్చున్నారు.
    ఈ యేర్పాటు చాలా హాయిగా అన్పించింది.
    ఒకటి రెండుసార్లు ఆ అమ్మాయిని చూడటానికి ప్రయత్నించాడు వాసు. కాని ఆ అమ్మాయి చిన్నప్ప తననే గమనిస్తూవుంటే లాభంలేదని తన దృష్టిని మళ్ళించుకున్నాడు. ఇది గ్రహించేకాబోలు ఆ చిన్నన్నయ్యా కూతురూ, వాసూ, శ్రీలక్ష్మి, పెళ్ళికూతురు చిన్న అన్నగారూ డ్రాయింగ్ రూములో కూర్చున్నారు.
    ఈ యేర్పాటు చాలా హాయిగా అన్పించింది.
    ఒకటి రెండుసార్లు ఆ అమ్మాయిని చూడటానికి ప్రయత్నించాడు వాసు. కాని ఆ అమ్మాయి చిన్నన్న తపనే గమనిస్తూవుంటే లాభంలేదని తన దృష్టిని మళ్ళించుకున్నాడు. ఇది గ్రహించేకాబోలు ఆ చిన్నన్నయ్యా శ్రీలక్ష్మి అక్కడనించి ముందు హాల్లోకి వెళ్ళి పోయారు.
    ఇప్పుడు గనుక ఈ అమ్మాయిని సరీగా చూడకపోతే ఒకవేళ అన్నయ్య ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అని పట్టుబడితే ఎలా అనుకుంటూ సోఫాలో సర్దుకు కూర్చుంటూ ఆ అమ్మాయి పాదాల వైపు చూశాడు.
    లైట్ నారింజ కలర్ యంబ్రాయిడరీ బోర్డరు సారీ ఆమె పాదాలను కప్పేసింది.
    అక్కడ నించి మెల్లగా అతిమెల్లగా పైపైకి వెళ్ళి ఆ అమ్మాయి కళ్ళు తనని ఢీ కొనడంతో ఆగిపోయి వులిక్కిపడ్డాడు. ఈ అమ్మాయి....ఓ రోజు లైబ్రరీలో తను తీసుకున్న పుస్తకమే కావాలంటూ లైబ్రరియన్ తో ఫిర్యాదు చేసి ఆ పుస్తకం తనే తీసుకువెళ్ళిపోయింది. అవును ఈ అమ్మాయే.......ఆ రోజు ఒకరితో ఒకరు మాట్లాడలేదుగాని. నిశితంగా చూసుకున్నారు ఒకరికి ఒకరు. మరెప్పుడూ తటస్థపడలేదు కదూ అనుకుంటూ ఇద్దరూ ఒకేసారి చూడబోయి తమదృష్టిని తిప్పేసుకున్నారు.
    "గుర్తించిందా?" అనుమానం వాసుకి.
    "ఓ.... ఈయనా..." అన్నది ఆ అమ్మాయి మనస్సు.
    "మీరేమన్నా అడగదలిస్తే అడగవచ్చు." అంటూ ఆ అమ్మాయి చిన్నన్న కేకపెట్టాడు. రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోతూంటే మరోసారి వాసుదృష్టి ఆమె మీదకి మరలింది.
    చేతి వుంగరాన్ని ఇటూ అటూ కదిలిస్తూ మునిపంటితో కింది పెదవిని నొక్కుతూ వుండిపోయింది ప్రసన్న లక్ష్మి.
    "మీ రేమన్నా అడగాలనుకుంటే జవాబివ్వటానికి రెడీగా వున్నాను" ఆమెనే చూస్తూ అన్నాడు. తెల్లని ముఖం మరీ పెద్దవికాని కళ్ళు తీరైన పలువరుస అందగత్తె కాదని ఎలా అనడం, తెల్లగా, సన్నగా, పొడుగ్గా వున్న ఆ చేతి వేళ్ళు చూస్తుంటేనే ఎంతో బాగున్నాయి.
    "ఏం లేదు" అన్నట్టు తల అడ్డంగా వూపింది ప్రసన్న లక్ష్మీ.
    "మరి ఈ ఇంటర్వ్యూ యెందుకు?"
    "నాకేం తెలుసు? అన్నట్లు చూసింది అమాయకంగా.
    "స్త్రీ" కళ్ళతోనే మాట్లాడుతుంది అంటారు ఇదే కాబోలు. వాసు మనస్సులో కోటిమల్లెలు విరిసినాయి.
    "కాస్త చిన్న వయినా కళ్ళు బాగున్నాయి కదూ" అన్నది మనస్సు.
    మరి ఈ అందమంతా ఆ రోజు లైబ్రరీలో చూసినప్పుడు ఎక్కడ దాగి వుంది!
    ఆనాడు నువ్వు సరిగ్గా చూడలేదు. ఆ దృష్టి వేరు.
    సోఫా మీద ఒక చెయ్యి ఆనించి మరో చేత్తో ఫ్లవర్ వాజ్" లోని లిల్లీ రేకులని సుతారంగా స్పృశిస్తున్న ఆ యువకుడి నే చూస్తూంది ప్రసన్న మనస్సు. ఫుల్ సూట్ లో నల్లబెల్టు రిస్టు వాచీ నల్లగా నిగనిగ లాడుతున్న బూటు, చాలా పొడుగ్గా వుంటాడు కదూ అన్పిస్తోంది. తెల్లటి బలమైన చేతులు ప్రసన్నకి కన్పిస్తోంటే పది నిముషాలు కాలం ఇట్టేగడిచిపోయింది ఆ ముఖం మీద కుడి పక్క ఏమిటో ఆ మచ్చ. బహుశా హాకీ ఆటగాడేమో ఆడేటప్పుడు దెబ్బ తగిలి మచ్చ పడిందేమో....... మనస్సు ఎన్నో ఆలోచనలు చేస్తోంది.
    "మీ పేరు అడగవచ్చా."
    అంతవరకూ అతన్నే చూస్తున్న ప్రసన్న బెదిరిపోయింది.
    ఛీ ఎంత సిగ్గులేకుండా చూస్తున్నాను. ఎంత గడుసుతంగా వేశాడో ప్రశ్న ఇందాకటినుంచీ అడిగిన దానికలా అవునూ, కాదూ అన్నట్లు అడ్డంగానూ, నిలువుగానూ తల తాటిస్తూంటే "ఇప్పుడెలా వూగిస్తారో చూస్తాను" అన్నట్లు వుందా ప్రశ్న. ఎవరైనా వస్తే జవాబివ్వటం బాగుండదు అని వెంటనే చెప్పేసింది. "ప్రసన్న లక్ష్మి."
    "ప్రసన్న లక్ష్మి.....ప్రసన్న...." మనస్సులో మననం చేసుకున్నాడు.
    "మరి......మరి" ఇంక అడగలేక ఆగిపోయింది.
    "మరి....?" అతను రెట్టించాడు.
    అర్ధం అయిందిగా. పోనీ జవాబివ్వకూడదూ,
    వాసు నవ్వుతూ వూరుకున్నాడు.
    "వాసూ" అంటూ శ్రీలక్ష్మి యేదో చెప్పి తిరిగి ప్రసన్నలక్ష్మి వదినగారితో కబుర్లు మొదలు పెట్టింది.
    "విన్నారుగా, మరి సెలవా!" అంటూ లేచి చేతులు జోడించాడు. ప్రసన్నలక్ష్మి తత్తర పడుతూ నిలబడింది ప్రతి నమస్కారం చేయాలనే సంగతి స్ఫురించేసరికి వాసు ఆ గది దాటి హాలులోకి వెళ్ళిపోయాడు యెంత సంస్కార వంతుడు ప్రసన్నలక్ష్మి మనస్సు రంగు రంగుల ఊహా చిత్రాలతో తేలిపోతోంది.
    రాఘవేంద్రరావూ ప్రసన్నలక్ష్మి తండ్రీ మరో కాయనా గదివైపు వీపు నుంచి కుర్చీల్లో కూర్చున్నారు. వాసు వీరికి యెదురుగా కూర్చుని కాఫీ తాగుతున్నాడు.
    పైన ఫాను గాలికి జుట్టు చెదిరి నుదురు మీద పడుతూంటే పైకి తోసుకుంటూ పెళ్ళికూతురు తండ్రీ అన్నగారూ వేసే యక్ష ప్రశ్నలకి జవాబిస్తూ ఆ గోడలకివున్న చిత్రాలని చూస్తూ కాఫీ తాగుతున్నాడు. ప్రసన్నలక్ష్మి కిటికీలోనుంచి ఆ మూర్తిని యెంత చూస్తున్నా తనివి తీరడం లేదు గదిలో తనతో మాట్లాడినప్పుడు కంటే ఇప్పుడు సరీగా చూసింది.
    వాసు కాఫీ తాగుతూనే కిటికీ వైపు చూశాడు హఠాత్తుగా తను యెంత ఠక్కున తప్పుకున్నా అతను గుర్తించే వుంటాడు అనుకుంది వాసు ముఖంలో లిప్తపాటు ఒక విధమైన వింతకాంతి మెరిసి మరుక్షణంలోనే తిరిగి మామూలుగా అయింది.

       
    కాఫీ తాగిన వేడికి పట్టిన చెమట తుడుచుకునే నెపంతో మరోసారి కిటికీవైపు దృష్టి సారించాడు. ఈసారి ప్రసన్నలక్ష్మి తెలివిగా తప్పు చేసింది. ఇంక మళ్ళీ చూడలేదు వాసు.
    ముగ్గురూ వెళ్ళి కారులో కూర్చున్నారు.
    వాసు మరొక్కసారి వెనక్కి చూడకూడదూ విన్పించింది ప్రసన్నకి. కాని అతను అలా చెయ్యకుండానే కారు కదిలి వెళ్ళిపోయింది.
    కుర్రాడు చాలా బాగున్నాడు. మన ప్రసన్న ప్రక్కకి మంచి జోడి. అంటూ తలో రకంగా వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి ప్రసన్నకి. అన్నయ్య అంటూంటే యేమో అనుకుంది కాని ఇంత బాగుంటాడని అనుకోలేదు.
    కుర్రాడు చాలా తెలివిగల వాడు నాన్నగారూ-నేడో రేపో సెలక్షన్ వస్తే యెంత మంచిఛాన్సు అతనికి తప్పకుండా వస్తుంది." అంటూ పెద్దన్న గారూ తండ్రీ మాట్లాడుకుంటూ వుంటే వింటూంది ప్రసన్న.
    ఇంతలో వదిన నళిని మెల్లగా ప్రక్కన చేరింది.
    "ఏమమ్మా అర్ధ మొగుడూ నచ్చినట్లేనా....అంటూ.
    ప్రసన్న జవాబివ్వలేదు.
    నా కెందుకు చెప్తావు, అయినా గదిలో వంటరిగా మీరిద్దరూ మాట్లాడుకోమని మేము ఏర్పాటు చేస్తే ఇద్దరూ అలా తలుపులూ కిటికీలూ లెక్కిస్తూ కూర్చున్నారేమిటి? ఎలాగైనా మగవాడు గనుక ఆ అబ్బాయే ధైర్యం చేసి యేదో అడిగాడు కదూ నేను ఈ తలుపు ప్రక్కన వున్నా ఒక్క మాట విన్పిస్తే ఒట్టు. అతను చాలా తెలివిగలవాడు ఆవలిస్తే పేగులు లెక్కించే రకం. నన్ను చూడలేదులే అనుకున్నానేగాని నాపమిటకొంగు అతని దృష్టి కి పట్టిచ్చిందని తెలుసుకోలేదు వెర్రిముఖాన్ని. యేది యేమయినా మొగాడంటే అలా వుండాలి. అవునా కాడా!"

       
    వదిన మాటలు సగం అర్ధం చేసుకోలేక పోయింది శ్రీలక్ష్మి "ఇంతకీ అవునూ కాదూ అని యేదో ఒక మాట చెప్పవేం. మీ అన్నయ్య అక్కడ నా కోసం నిరీక్షిస్తున్నారు. నేను రూతిక'ను, త్వరగా చెప్పవమ్మా" తొందర పెట్టేసింది నళిని.
    "మీకంటే నాకేం ఎక్కువ తెలుసు" చిన్నన్న ఇష్టం అన్నానని చెప్పు"
    "అబ్బా ఎంత నంగనాచివే.... పాపం... అంత తెలియనిదానివి గనకనే గదిలో చూసింది చాలక మళ్ళీ కిటికీలోంచి నువ్వు చూస్తుంటే పాపం సిగ్గుపడీ అరకప్పు కాఫీ అలాగే వదిలేశాడు మా తమ్ముడు.
    "ఛీ ఎలాంటివాళ్ళు వీళ్ళందరూ. గదిలో ఇద్దరినీ వదిలి దూరంగా వెళ్ళిపోయారనే అనుకుంది తను, అమ్మయ్యో బ్రతికిపోయాను. మరేం ప్రశ్నలూ వెయ్యలేదు. ఈవిడని చూసే కాబోలు అతను అంత త్వరగా వెళ్ళిపోయింది, ఏం మాట్లాడకుండా అలా హాల్లోకి వెళ్ళిపోతున్న వాసు మీద ఆ క్షణంలో చాలా కోపమే వచ్చింది తనకి. నయమే." అనుకుంది ప్రసన్న.
    "అప్పుడే అంత పరాకా తల్లీ. నీ మనస్సుని అప్పుడే దొంగిలించేశాడా" వదిన కుదిపి అడిగింది.
    "అబ్బ ఏమిటి వదినా" విసుక్కుంది ప్రసన్న.
    "తల్లీ నిన్ను మరి ప్రశ్నించను. నాకు జవాబు ఇవ్వు.... అతని ప్రశ్నలకి గొర్రెపొట్టేలు లా తల వూపినట్లు వూపితే నేను వూరుకోను.
    "పో వదినా" అంటూ ఆ గదిలోంచి పారిపోయింది ప్రసన్న.
    "వాళ్ళుకూడా "సరే" అని ఆమోదం తెలియచేస్తే లగ్నాలు పెట్టేసుకుందాం" అనుకున్నారు తాసీల్దారుగారు.
    "మరో రెండువేలు యెక్కువైనా సరే ఈ సంబంధమే ఖాయం చెయ్యండి. పిల్లవాడు బంగారు తండ్రిలాగా వున్నాడు." మురిసిపోయింది ప్రసన్న తల్లి కామాక్షమ్మ.

                                  *    *    *
    "కళ్ళలో పెళ్ళి పందిరి కనబడసాగేపల్లకిలోనే వూరేగే ముహూర్తం...." వాసు కూనిరాగాలు తీస్తూ స్కూటర్ తుడిచి స్నానం పూర్తి చేసుకుని బట్టలు వేసుకుంటూ పాట పాడుతున్నాడు. "టిఫిన్ కు రావయ్యా" అంటూ మూడుసార్లు పిల్చింది. విన్పించుకోలేదు వాసు.
    నాలుగోసారి బిగ్గరగా చెప్పింది.
    "వస్తున్నా నమ్మా" అంటూ పీట వాల్చుకు కూర్చున్నాడు.
    వీణ తనూ ఓ ప్లేటు ముందు పెట్టుకు చిన్నాన్న ప్రక్కన చేరింది.
    వేడివేడి ఇడ్లీ పెట్టి వెయ్యి వేస్తూంటే
    "నెయ్యి కాస్తే వేశావు ఇంకాస్త వెయ్యి "వాలి" అంటూ పేచీకి దిగింది.
    అసలే పని తొందర్లో విసుగ్గా వుంది శ్రీలక్ష్మి మరో గరిట వేసినా వీణ పేచీ మానలేదు. గట్టిగా కేకలేస్తే తండ్రి దగ్గరికి పితూరీ తీసుకు వెడుతుంది వళ్ళు మండిపోతోంది శ్రీలక్ష్మికి.
    "ఇదిగో తల్లీ మీ చిన్నాన్న పెళ్ళిలో నిన్ను వెయ్యి గంగాళంలో కూర్చోపెడతా. కావలసినంత తాగేద్దువుగాని... ఇప్పటికి తిను" అంటూ పళ్ళు కొరుక్కుంది.
    వాసు పగలబడి నవ్వుతున్నాడు.
    "అమ్మా.....అయితే చిన్నాన్న పెళ్ళేప్పుడూ. యెంచక్కా పెళ్ళికూతురుతో నే బొమ్మలాడు కుంటా.... అమాయకంగా అడిగింది వీణ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS