Previous Page Next Page 
40 వసంతాల తెలుగుదేశం పేజి 9


                                       వ్యవస్థల నిర్మాత
    
    ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల మేధోసంపత్తిని ఉద్దీపింపజేయడానికి , తెలుగు యువతకు సరికొత్త అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో తెలుగుదేశం చేసిన సేవ అపారం. ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ రంగంలో రాబోయే ఉద్యోగాలకు తెలుగు విద్యార్ధులను సంసిద్ధం చేయడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతంగా ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటును ప్రోత్సహించారు. వీటికి ఎఐసిటిఈ అనుమతులను ఇప్పించేందుకు కేంద్రం లోని వాజ్ పేయి ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించారు. ఫలితంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ఒక్కసారే 40 నుంచి 200 వరకు పెరిగింది. వేలాది మంది విద్యార్ధినీ విద్యార్ధులు ఈ కాలేజీల్లో శిక్షణ పొంది సాఫ్ట్ వేర్ కంపెనీల్లో అవకాశాలను పొందారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు మహిళలకు అనుకూలం కావడంతో పెద్ద ఎత్తున ఆడపిల్లలు ఇంజనీరింగ్ కోర్సులను ఎంచుకుని, ఉద్యోగాలు సంపాదించుకున్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడ గలిగే శక్తి రావడంతో మహిళలకు ఆర్ధిక, సామాజిక స్వాతంత్రం లభించింది. ఈ ఖ్యాతి తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడిదే.
    కర్నాటక, మహారాష్ట్ర వంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడి , ఇండియాలో ప్రముఖ పారిశ్రామికవేత్తల అధ్వర్యంలో ప్రారంభమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను హైదరాబాద్ కు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు చూపిన చొరవ, పట్టుదల గురించి ఇప్పటికీ ప్రశంశలు వింటుంటాము. మేనేజ్ మెంట్ విద్యలో ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఈ సంస్థను ఇండియాలో నెలకొల్పాలని రిలయన్స్, గోద్రెజ్ , మహేంద్ర & మహేంద్ర బజాజ్ వంటి కంపెనీలు ప్రతిపాదిస్తే వారిని స్వయంగా కలిసి 2001 లో హైదరాబాద్ లో పెట్టేందుకు ఒప్పించిన ఘనత ఆయనది. అంతర్జాతీయ సమావేశాలకు, ఎగ్జిబిషన్లకు అనువైన వసతి హైదరాబాద్ లో లేదని గ్రహించిన చంద్రబాబు ఈ లోటును పూడ్చడానికి హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ ను 2003 లో నిర్మించారు. ఈ సదుపాయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వ్యాపార అవకాశాలు పెరగడంతో పాటు, సేవా రంగంలో ఉపాధి పెరిగింది. హైటెక్ సిటి సమీపంలో వంద ఎకరాల్లో నిర్మించిన హైటెక్స్ లో ఇండోర్, అవుట్ డోర్ ఈవెంట్స్ నిర్వహించుకోవడంతో పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రేడ్ షోలు, కార్పోరేట్ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే వెలుసుబాటు ఉంది. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో , 900 వాహనాలకు పార్కింగ్

    (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ , హైటెక్స్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వంటి అంతర్జాతీయ స్థాయి వ్యవస్థల నిర్మాణంతో హైదరాబాద్ అభివృద్ధి లో దూసుకుపోయింది. ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ రంగంలో రాబోయే ఉద్యోగాలకు తెలుగు విద్యార్ధులను సంసిద్ధం చేయడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతంగా ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటును చంద్రబాబు ప్రోత్సహించారు.)

సౌకర్యంతో, అన్ని రకాల వ్యాపార సేవలతో జర్మనీ టెక్నాలజీ తో నిర్మితమైన హైటెక్స్ ఇప్పుడు దేశంలోనే ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ గా పేరు పొందింది.
    హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రాణం

    ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలను తెలుగు విద్యార్ధులను
    సంసిద్ధం చేయడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతంగా ఇంజనీరింగ్
    కళాశాలల ఏర్పాటును ప్రోత్సహించారు.)

                       

పోసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఐటి రంగంలో గ్లోబల్ కంపెనీలకు చెందిన ఉన్నతోద్యోగులతో పాటు గ్లోబలైజేషన్ లో భాగంగా పెరుగుతున్న వ్యాపార వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయం ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. అప్పటి బేగం పేట ఎయిర్ పోర్టు రక్షణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఉండటంతో, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు వీలుగా సరికొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను కట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం నిశ్చయించింది. ఇందుకు అనుగుణంగా శంషాబాద్ ప్రవైటు భాగస్వామ్యంతో ఎయిర్ పోర్టు నిర్మాణానికి 2000 సంవత్సరంలో ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రబాబు చొరవతో 5,000 ఎకరాల్లో నిర్మించిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఈనాడు అత్యాధునిక వసతులతో ప్రపంచంలోనే బిజీగా ఉండే అత్యుత్తమ పది ఎయిర్ పోర్టుల్లో ఒకటిగా ఎంపికయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS