నాలెడ్జ్ ఎకానమిగా ఆంధ్రప్రదేశ్
ప్రధానంగా వ్యవసాయిక రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఒంటి చేత్తో సాంకేతిక, సేవా రంగాల వైపు మళ్లించిన ఘనత చంద్రబాబు నాయుడిదే. కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టిన నేపధ్యంలో లభించిన కొత్త అవకాశాలను వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చడానికి అయన చేసిన కృషి చారిత్రాత్మకం. భవిష్యత్ ప్రపంచాన్ని శాసించగల ఇన్ఫర్మేషన్ రంగం ప్రాధాన్యతను ముందుగానే పసిగట్టి ఆ రంగంలో ఆంధ్రప్రదేశ్ కు గల అవకాశాలను గుర్తించి , హైదరాబాద్ ను ఐటి కేంద్రంగా తీర్చిదిద్దడానికి అయన చేసిన ప్రయత్నాలకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
మౌలిక సౌకర్యాలను ఏర్పరచి ప్రోత్సాహకాలను అందించి, ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించడం ద్వారా అయన ఐటి రంగాన్ని హైదరాబాద్ కు తీసుకురాగలిగారు. భవిష్యత్తు అంతా నాలెడ్జ్ ఎకానమిదే నని గ్రహించి, ఈ రంగంలో ప్రయత్నం మొదలు పెడితే రాష్ట్రాన్ని ఒక కొత్త మలుపు తిప్పడం సాధ్యమవుతుందని భావించానని చంద్రబాబు అంటారు. దేశంలో తొలిసారిగా ఐటి పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశే. హైటెక్ సిటి పేరుతొ నగర శివార్లులో 1998 లో నిర్మించిన ఐటి భవనంలో సాప్ట్ వేర్ విప్లవం మొదలైంది. సిలిండర్ రూపంలో ఉన్న సైబర్ టవర్స్ భవనానికి డిజైన్ ని తానే సూచించి , పది అంతస్తుల్లో అయిదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో 14 నెలల తక్కువ సమయంలో ఎల్& టి ద్వారా సిద్దం చేయించారు. ఇదే రాష్ట్రంలో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ పద్దతిలో నిర్మించిన తొలి ప్రాజెక్టు. ప్రభుత్వ - ప్రవైటు భాగస్వామ్యంతో ప్రాజెక్టు ల నిర్మాణానికి దేశంలో ఇదే మోడల్ గా నిలిచింది.
ఆ తర్వాత అంతకుముందే ఐటి నగరంగా పేరు తెచ్చుకున్న బెంగుళూరు తో పోటీ పడి , ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ కంపెనీ తొలి విదేశీ కార్యాలయాన్ని హైదరాబాద్ కు తీసుకురావడంతో చంద్రబాబు పేరు అంతర్జాతీయంగా మార్మోగింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భారత సందర్శన సందర్భంగా కలవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించినపుడు, రాజాకీయ నాయకులతో తనకు పనిలేదని, అయన స్పందించారు. అయినా పట్టు విడకకుండా ప్రయత్నించి, ఆయనతో సమావేశమై తన ఆలోచనలను మైక్రోసాఫ్ట్ పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి తర్వాత చంద్రబాబు నిబద్దతను, కార్యదక్షతను ప్రశంసించిన బిల్ గేట్స్ తమ డెవలప్ మెంట్ కార్యాలయాన్ని హైదరాబాద్ ;లో స్థాపించారు. ఆ తర్వాత ఒకదాని వెంట ఐబిఎం. డెల్, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు, ఇన్ఫోసిస్ , విప్రో వంటి జాతీయ కంపెనీలు హైదరాబాద్ తరలివచ్చాయి. సైబరాబాద్ అనే సరికొత్త అనుబంధ నగరం ఏర్పడింది.
ఆర్ధిక వ్యవస్థలో, సమాజంలో కీలక మార్పులు తీసుకురావడంతో ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ పాత్రను చంద్రబాబు నాయుడులాగా ముందే మరే ముఖ్యమంత్రి గ్రహించ లేకపోయారని అప్పటి ప్రధాని వాజపేయి
(భవిష్యత్ ప్రపంచాన్ని శాసించగల ఇన్ఫర్ మేషన్ రంగం ప్రాధాన్యతను
ముందుగానే పసిగట్టి హైదరాబాద్ ను ఐటి కేంద్రంగా తీర్చిదిద్దడానికి
చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.)

వ్యాఖ్యానించారు. చంద్రబాబు కృషి ఫలితంగాఇవాళ దక్షిణాదిలో బెంగుళూరు తర్వాత అతి పెద్ద సాఫ్ట్ వేర్ కేంద్రంగా హైదరాబాద్ పేరు గాంచింది. ఇంతితై వటుడింటై అన్నట్టుగా , అయిదు లక్షల మందకి పైగా ప్రత్యక్షంగా, మరో 20 లక్షల మంది పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది.
మూడవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఓటి, డేటా ఎనలటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ రియాలిటి మొదలైన అత్యాధునిక టెక్నాలజీలను అంది పుచ్చుకోడానికి అవసరమైన వాతావరణాన్ని నవ్యాంధ్రప్రదేశ్ లో సృష్టించడానికి చంద్రబాబు విశేషంగా కృషి చేశారు. విశాఖ లో మెడ్ టెక్ జోన్ ఇలా యేర్పాటయింది.

పాలనావ్యవస్థలో ఐటిని , సాంకేతికతను విస్తృతంగా ప్రవేశపెట్టి ప్రభుత్వ సేవల్లో వేగం పెంచడానికి, అవినీతికి అవకాశం లేకుండా పారదర్శకతను తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకొన్న చొరవ మూలంగా ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ఇప్పటికీ ముందుంది. కంప్యూటర్ల పట్ల సరైన అవగాహన లేని 1990 వ దశకం లోనే అయన ప్రభుత్వంలోని వివిధ శాఖలను కంప్యూటరీకరించారు. ఇవాళ అన్ లైన్ పాలనా వ్యవస్థ సర్వసాధారణమైనప్పటికీ ఆనాడు అవగాహన లేమిని, విమర్శలను ఎదుర్కొని చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని మెరుగు పరిచారు.
అందులో భాగంగా ఈ- సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి, వివిధ పౌర సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్డ్ (computer Aided Administration of Registration Department) పేరుతొ ఆస్తుల రిజిస్ట్రేషన్ ను కంప్యూటీకరించారు. వాణిజ్య పన్నుల విభాగంలో అన్ లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. సచివాలయంలో ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విధానాన్ని అమలు చేస్తూ స్కీమ్స్ (Secretariat Knowledge Information Systems)ని అమలు చేశారు. పోలీస్ వ్యవస్థను మెరుగుపరుస్తూ దేశంలోనే తొలిసారిగా అన్ని పోలీస్ స్టేషన్లను ఒకే నెట్ వర్క్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ని తయారుచేయించారు. ఈ- కాప్స్ (Computerized Operations for Poilice Services) పేరుతొ శాంతి భద్రతల విభాగంలో అన్ని రికార్డులను ఎలక్ట్రానిక్ గా భద్రపరిచే విధానాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారు. కంప్యూటర్ విద్యను స్కూళ్ళలో ప్రవేశ పెట్టడానికి ఇంటెల్ కంపెనీ ద్వారా పది వేల మంది టీచర్లకు శిక్షణ
(ప్రభుత్వ శాఖల్లో ఐటిని వినియోగించడం ద్వారా రకరకాల సేవలను ప్రజలకు
అందుబాటులోకి తీసుకు రావడానికి ఆద్యుడిగా చంద్రబాబు నాయుడుకు
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. )
ఇప్పించారు. 1999 లోనే మొత్త రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కంప్యూటరైజ్ చేయడానికి ఎపిస్వాన్ (Andhra pradesh state wide Area Network)ను దేశంలోనే తొలిసారిగా అమలుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఐటి ద్వారా ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి, టెక్నాలజీ ద్వారా రాష్ట్ర ఎదుర్కొంటున్న సమస్యలను ఎద్యుర్కోడానికి ఎపిస్వాన్ ఉపయోగపడాలని అయన ఆశించారు. దీని కింద ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలను రాజధాని హైదరాబాద్ తో 2 ఎంబి లైన్ల ద్వారా అనుసంధానించారు. తర్వాత మండల కార్యాలయాల వరకు ఈ సౌకర్యాన్ని కల్పించారు. సుదూరం ప్రయాణించకుండా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించడం అప్పటి నుంచే ప్రారంభమైంది. ప్రభుత్వంలో అన్ని స్థాయిల్లోను, వివిధ శాఖల నడుమ సమాచారాన్ని , ఆదేశాలను ఈ నెట్ వర్క్ ద్వారా సత్వరం బట్వాడా చేయడం ఆనాటి నుంచి మొదలైంది. 2004 నాటికి దాదాపు 200 ప్రభుత్వ శాఖల్లో కంప్యుటరైజేషన్ ను పూర్తి చేశారు. 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ టైమ్ గవర్నన్స్ లో సరికొత్త ఆవిష్కరణలు చేసి, మరోసారి ప్రశంశలు పొందారు. ప్రభుత్వ సేవలను సమర్ధంగా నిర్వహించడానికి సంస్థాగత యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ- గవర్నన్స్ సాధనాలను రియల్ టైమ్ గవర్నన్స్ వినియోగించుకుంటోంది.
ప్రభుత్వ శాఖల్లో ఐటిని వినియోగించడం ద్వారా రకరకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆద్యుడిగా చంద్రబాబు నాయుడుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఎకనామిక్ టైమ్స్ నుంచి న్యూయార్క్ టైమ్స్ వరకు అనేక జాతీయ , అంతర్జాతీయ పత్రికలూ అయన ముందు చూపును కార్యదక్షతను ప్రశంసించాయి. ఐటి ముఖ్యమంత్రిగా చంద్రబాబును, టెక్నాలజీని అందరి కంటే ముందు వినియోగించుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు కితాబు లభించింది.
