Previous Page Next Page 
40 వసంతాల తెలుగుదేశం పేజి 10

 

                              కొత్త ఆలోచనల రూపకర్త


        
    చంద్రబాబు నాయుడి నాయకత్వం లో తెలుగు సమాజం ఉన్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం అనేక సరికొత్త ఆలోచనలను క్షేత్ర స్థాయిలో అమలు చేసింది. అయన హయాం లో స్వయం సహాయక సంఘాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి, మహిళల సహకారంతో కింది వర్గాల సామాజిక, ఆర్ధిక పేదరికాన్ని తొలగించడానికి విశేష కృషి జరిగింది. 2004 నాటికి 60 లక్షల మంది మహిళా సభ్యులతో దాదాపు అయిదు లక్షల గ్రూపులు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేవి. దేశంలోని స్వయం సహాయక సంఘాల్లో సగం తెలుగు రాష్ట్రంలోనే ఉండే వంటే ఏ స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సాహం అందించేదో అర్ధం చేసుకోవచ్చు. ఈసంఘాల ద్వారా ఆర్ధిక పరపతిని పెంచడమే కాకుండా కుటుంబ నియంత్రణ, పరిశుభ్రత వంటి సామాజిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళారు. అలాగే వివిధ వర్గాలను అభివృద్ధి లో భాగస్వామ్యులను చేయడానికి జన్మభూమి కమిటీలను, వాటర్ యూజర్ అసోషియేషన్లను , వాటర్ షెడ్ అభివృద్ధి కమిటీలను, వన సంరక్షణ సమితులను , తల్లుల కమిటీలను గ్రామీణ విద్యా కమిటీలను ఏర్పాటు చేశారు.
    వివిధ వర్గాలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి కొత్త పధకాలను ప్రవేశపెట్టారు. చర్మకారుల కోసం మలుపు పధకాన్ని , నేతపని వారల కోసం నేత బజార్లను, కూరగాయల రైతులు మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా పంటను వినియోగదారులకు అమ్ముకునేందుకు రైతు బజార్లను ప్రవేశ పెట్టారు. తర్వాత కాలంలో రైతు బజార్లు, ఎంత ప్రాచుర్యం పొందాయో అందరికి తెలుసు. పేద మహిళల కోసం దీపం పధకాన్ని ప్రవేశపెట్టి, ఉచితంగా గ్యాస్ కనక్షన్లు ఇప్పించారు. చెట్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. రెండు దశాబ్దాల క్రితమే ఉద్యమ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 1997 -98 లో 4.6 కోట్ల మొక్కలను నాటడమే కాకుండా , పచ్చదనం పరిశుభ్రత కార్యక్రామాన్ని రూపిందించి , స్వచ్చ ఆంధ్రప్రదేశ్ ను ప్రజా ఉద్యమంగా చంద్రబాబు మలిచారు. నీటి సంరక్షణ సక్రమ వినియోగం కోసం నీరు- మీరు కార్యక్రమాన్ని చేపట్టారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కు ప్రాచుర్యం కల్పించారు. హైదరాబాద్ లో ఫ్లి ఓవర్ల

    (చంద్రబాటు ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాలను పెద్ద
    ఎత్తున ప్రోత్సహించి, మహిళల సహకారంతో కింది వర్గాల సామాజిక,
     ఆర్ధిక పేదరికాన్ని తొలగించడానికి విశేష కృషి జరిగింది.)

      

నిర్మాణాన్ని మొదలుపెట్టడమే కాకుండా, రోడ్ల పక్కన చెట్లు, ట్రాఫిక్ లేన్స్, రోడ్డు డివైడర్లు మొదలైన పద్దతులను పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. పార్టీలతో సంబంధం లేకుండా కీర్తి శేషులైన మాజీ ముఖ్యమంత్రుల స్మారకంగా బ్రహ్మానందరెడ్డి పార్కు వెంగళరావు పార్కుల నిర్మాణంతో పాటు , మానవ వనరుల సంస్థకు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టారు. మధ్యతరగతికి మెరుగైన గృహవసతి కల్పించేందుకు హైదరాబాద్ లో సింగపూర్ టౌన్ షిప్ , మలేషియా టౌన్ షిప్పులను నిర్మించారు.
    గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగువారి క్రీడా సామర్ధ్యాన్ని పెంచడానికి చంద్రబాబు చేసిన కృషి ఫలితాలు ఈనాటికి కనిపిస్తున్నాయి. అయన హయాంలో ప్రతిష్టాత్మక నేషనల్ గేమ్స్ 2002 లో, ఆఫ్రో- ఏషియన్ గేమ్స్ 2003 లో హైదరాబాద్ లో విజయవంతంగా జరిగాయి. ఈ జాతీయ , అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల కోసం హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి సదుపాయాలను ఏర్పరిచారు. జిఎంసి బాలయోగి పేరు మీద గచ్చిబౌలి అధ్లేటిక్ స్టేడియం ఈ విధంగా నిర్మించిందే. అత్యంత ఆధునిక వసతులతో, 30 వేల మంది ప్రేక్షకులు కూర్చోడానికి వీలుగా, ఎనిమిది లేన్ల అధ్లేటిక్ ట్రాక్ లతో దీనిని 2002 లో నిర్మించారు. ఇక్కడే అయిదు వేల మంది ప్రేక్షకుల సామర్ధ్యం గల ఎయిర్- కండిషన్డ్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం చంద్రబాబు హయాంలోనే జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం పేరుతొ మరొక క్రీడా సౌకర్యాన్ని 2003 లో చంద్రబాబు ఏర్పాటు చేశారు. వీటన్నిటి మూలంగా రాష్ట్రంలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడానికి , స్పోర్ట్స్ ఫ్రోఫేషనల్స్ గా యువత ఎదగడానికి అవకాశాలు లభించాయి. ఆలిండియా బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపీ చంద్ కు 2003 లో గచ్చి బౌలీలో అయిదెకరాల ప్రభుత్వ భూమిని ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడెమి ఏర్పాటుకు సహకరించడం వల్ల బ్యాడ్మింటన్ లో భారత్ ప్రపంచ స్థాయి ఆటగాళ్ళను ఈనాడు తయారు చేయగల్గుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS