Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 9


    ఇవన్నీ ముందే పసిగట్టగల భూపతిరావు తగుజాగ్రత్తలో ఉంటూవస్తున్నాడు.
    భూపతిరావుకి మరో విషయంకూడా తెలిసింది. తమ  కంపెనీ బోర్డులో ఉన్న డైరెక్టర్స్ లోనే  ఒకరొ, ఇద్దరొ సత్యరాజుని సపోర్ట్ చేస్తున్నట్లుకూడా ఇటీవలే రహస్య సమాచారం అందింది.
    ఆ రహస్య సమాచారంలో భాగంగా మరికొన్ని ప్రమాదకరమైన పధకాలు కూడా తెలిసాయి-ఏదో విధంగా కార్మికుల్లో అసంతృప్తిని రెచ్చగొట్టి, కంపెనీలో అస్థిరతను సృష్టించి భూపతిరావును చైర్ మెన్  పదవినుంచి దింపేవరకూ వెళ్ళే ప్రయత్నాలుతెరవెనుక బలం పుంజుకొంటున్నట్లు తెలిసింది.
    అందుకే హడావుడిగా బోర్డాఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కి కాల ఫర్  చేసాడు భూపతిరావు.
    కరక్టుగా తొమ్మిదవుతుండగా భూపతిరావు కారు ఆ ఆవరణలోకి ఎంటర్ అయింది.
    చైర్ మెన్  వచ్చాడని తెలిసి కంపెనీ స్టాఫ్ అలర్జ్ అయింది.
    అంత పెద్ద  ఆవరణలో, ఎంతోమంది సిబ్బంది పనులమీద  అటూ ఇటూ తిరుగుతున్నా స్మశాన నిశ్శబ్దం అలుముకుంది.
    భూపతిరావు కారుదిగి ఓక్షణం అక్కడే నిలబడి ఓసారి తలపైకెత్తి ఎత్తెయిన కంపెనీ భవనంవేపు తన  దృష్టిని సారించాడు.
    అలా అప్పుడప్పుడు భూపతిరావుకి చూసుకోవటం గొప్పసంతృప్తినిస్తుంది. అలా చూపులు ఆ బిల్డింగ్ పై ఉంటే ఆలోచనలు రెండు శతాబ్దాల వెనక్కు వెళ్ళి వస్తాయి.
    భూపతిరావు అక్కడి నుండి కదిలి వడివడిగా  బోర్డ్ రూమ్  వేపు నడిచాడు.
    బోర్డ్ రూమ్ లోకి భూపతిరావు ఎంటర్ కావటం చూసి అదే  ఆఫీసులో పనిచేసే ఓ అండర్ ఆఫీసర్ బోర్డ్ హల్ పక్కనే ఉన్న రూమ్ లోకి నడిచి సత్యరాజుకి నేమబార్ డైల్ చేశాడు.
    

                                      5


     భూపతిరావును చూడగానే డైరెక్టర్స్ సూచకంగా ఓసారి లేచి మరలా  కూర్చున్నారు. భూపతిరావు తాన్ సీట్లో కూర్చుని డైరెక్టర్స్ అందరివేపు ఓసారి కలియజూసి తన ముందున్న  పైల్ ని ఓపెన్ చేసి అందులోకి ఓసారి  చూసి మరలా తలపైకెత్తాడు.
    "డియర్ ఫ్రెండ్స్.....అత్యవసరంగా ఈ మీటింగ్  ఎందుకు ఏర్పాటు చేసానో మీకు తెలుసనుకుంటాను...___?" ప్రశ్నిస్తున్నట్లుగా చూశాడు.
    డైరెక్టర్స్ మౌనంగా తలూపారు.
    "దేశం మొత్తంమీదున్న కంపెనీల్లోకెల్లా మన కంపెనీకి సమర్థవంతంగా పని చేస్తున్నాయి ఉత్పాదక శక్తి పూర్తిగా  వినియోగించుకుంటున్నది కూడా మనమే.
    "మన ఫ్యాక్టరీలో లే ఆఫ్ లు గాని, లాకౌట్లుగాని, సమ్మెలుగాని ఎప్పుడూ జరగలేదు. అందుకు  కారణం మనకు, మన కార్మికులకు మధ్య సత్ సంబంధాలు ఉండటం..."
    భూపతిరావు ఓ క్షణం  ఆగాడు....
    ఆన్యాప్రదేశంగా చైర్  మెన్ చెప్పబోతున్నది చూచాయగా అర్థమయింది డైరెక్టర్స్ కి.
    "ప్రశాంతంగా, ఇతర పారిశ్రామిక సంస్థలకు  ఆదర్శంగా నడుస్తున్న మాన సంస్థలోకూడా అస్థిరతను తెచ్చే ప్రయత్నాలు తెరవెనుక వేగం పుంజుకుంటున్నట్లుగా తెలియవచ్చింది....." అని ఓ క్షణం  ఆగి, చూపుడువేలితో నుదురుని రాసుకుంటూ వుండిపోయాడు భూపతిరావు.
    అస్థిరతకు సంబంధించిన ఆలోచనల్ని సయితం భరించలేనట్లుగా వున్న చైర్ మెన్ ని చూసి డైరెక్టర్  అన్నాడు "మనం మన సిబ్బందికేం తక్కువ చేశాం?"
    "తక్కువయ్యే ఈ దేశంలో సమ్మెలు రావటంలేదు....." మరో డైరక్టర్ అన్నాడు.
    "సందట్లో సడేమియాగాళ్ళు కొంతమందుంటారు. వాళ్ళు యూనియన్ లీడర్స్ అనే  ముసుగులో ఏదో ఒక  అస్థరతను సృష్టించి మేనేజ్  మెంట్స్ తో బేరాలకు దిగుతారు...." మరో డైరెక్టర్ కాస్త కోపంగా అన్నాడు.
    భూపతిరావు మౌనంగా వింటున్నాడు. డైరెక్టర్స్ అభిప్రాయాలు తెల్సుకోవాలున్న ఆయన ఉద్దేశం.
    ఎనిమిదిమంది డైరెక్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.
    సరిగ్గా అదే సమయంలో బోర్డ్ హాల్ పక్కగదిలో ఫోన్ ముందున్న అండర్ ఆఫీసర్ రవి సత్యరాజ్ తో మాట్లాడుతున్నాడు.
    "బోర్డ్ మీటింగ్ మొదలయింది సార్. చైర్ మెన్ మీ కదలికల్ని పసిగట్టాడన్న విషయం ఆయనతొలి మాటల్లోనే స్పష్టంగా వ్యక్తమైంది."
    "భూపతిరావు సామాన్యుడు కాదన్నమాట.....!" సత్యరాజ్ ఇక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నాడు.
    "కేవలం ఐదు లక్షలతో ప్రారంభించి ఐదువందల కోట్లకు పెంచుకుంటూ వచ్చాడు తాన్ పారిశ్రామిక సామ్రాజాన్ని. సామాన్యుడయితే ఎలా  సాధ్యమవుతుంది సాబ్.....?"
    "దేశాన్ని బాగుచేద్దామనే____?!" పరిహాసిస్తున్నట్టుగా  అన్నాడు సత్యరాజ్.
    రవి ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు సత్యరాజ్ నవ్వువిని.
    సత్యరాజ్ పరిహాసంగా నవ్వాడంటే మారణ హొమానికి రంగం సిద్ధమవుతున్నట్లుగా భావించటానికి గతంలో ఎన్నో దృష్టాంతాలున్నాయి.
    కేవలం సత్యరాజ్ చేతిలో పావుగా మారిన రవి భవిష్యత్తు ఊహించతానికి గాని, అంచనావేయటానికిగాని భయపడ్డాడు.
    "బోర్డ్ హాల్లో చర్చలు జరుగుతున్నాయి___సాబ్"
    "చర్చల సారాంశం మనకు అవసరం. చైర్ మెన్ ఆలోచనలు తెలియాలి" సత్యరాజ్ కాస్త గట్టిగా అన్నాడు.
    "ఆ ప్రయత్నంలోనే వున్నాను  సాబ్" రవి వినయంగా అంటూ విండో అద్దాలోంచి ఓ క్షణం బయటకు చూసి ఉలిక్కిపడ్డాడు.
    భూపతి రెండో కొడుకు దినేష్ ఇటే వస్తూ కనిపించాడు.
    రవి ఠక్కున ఫోన్  పెట్టేసి ఆ రూమ్ లోంచి తప్పుకున్నాడు.
    భూపతిరావు ఎంత సౌమ్యుడో దినేష్ అంత ఆవేశపరుడని అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే.
    నమ్మకద్రోహానికి సంబంధించిన వ్యక్తులు దినేష్ దృష్టిలో పడ్డారంటే నరకమంటే ఏమిటో రుచి చూపిస్తాడని కొందరు అనుకుంటుండగా విని వున్నాడు రవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS