దానిమీద పవన్, "కొంచెం యిటువేపుకూడా దృష్టి నిలుపు. ప్రపంచంలో యెటువంటి మార్పులు వస్తున్నాయో గమనించు. ఈ రోజులలో భర్త కోటూ పంట్లాం ధరించి బయటకు వెళుతుంటే భార్య చీర ధరించి కూడా వెళుతోంది. ఒక మహాపురుషుడు విదేశీ దుస్తులను ప్రశంసిస్తూంటే పత్ని దేశీయ దుస్తుల సంయమనంతో విరాజిల్లుతోంది. కేవలం దుస్తుల విషయంలోనే కాదు, అభిప్రాయాలలో కూడా వారిద్దరికీ బేధం వుంది. ఒకరు నూతన విద్యాగర్వంతో విరాజిల్లుతుంటే అతని బార్య తన విద్యను తనకు భూషణంగా తయారు చేసుకోవడంలో సమర్దత చూపుతుంది. వారు తమ విద్యను తమ కర్తవ్యంతో, తమ హృదయంతో, నలువేపుల వస్తువులతో మేళవిస్తారు. భర్త యెక్కడ తన యాజమాన్య దర్పం చూపి యితరులమీద తన ప్రబావం చూపి జయించాలని అభిలషిస్తాడు. స్త్రీ తన కోమల భావనతో యిరుగు పొరుగు వారితో మైత్రిని పెంపొందించుకునే పనులు చేస్తుంటుంది. ఈ బేధం కు కేవలం స్త్రీ జాతి కోలమతే కారణం. మన స్త్రీలలో ఒక స్వాభావిక మనయిన సుగుణం వుంది. భారరతీయ సాహిత్యంలో స్త్రీల చరిత్రకు ప్రాధాన్యం యిచ్చారు. దీనికి అసలు కారణం హిందూ సమాజంలో స్త్రీకి ప్రాధాన్యం వుండడమే" అని అన్నాడు.
"భారతదేశంలో భర్తలకు యే పనీ లేకపోవడమే దీనికి అసలు కారణం. ఈ దేశంలో గృహస్థాశ్రమానికి మించింది లేదు. ఆ గృహస్థాశ్రమాన్ని సంభాళించేది స్త్రీ. గృహ భారమంతా ఆమె మీదనే వుంటుంది. ఆ స్త్రీలు సరా యీ భారమును వహిస్తుంటారు. చిన్న స్టీమరు పెద్ద బరువుకు ప్రవాహం వెంట పడిపోయినట్టే మన దేశంలోని స్త్రీలు తమ భర్తపేర ఒక అనావశ్యక బారమును యీడ్చుకుంటూ సాగిపోతున్నారు. ఇతర దేశీయులలో పురుషులు సంధి విగ్రహం రాజతం త్రాది పెద్ద పెద్ద పనులలో చాలాకాలం నిమగ్నులై స్త్రీలకు దూరమై వేరు ప్రకృతిని సృష్టించుకుంటారు. కాని మన దేశంలోని స్త్రీలకు పురుషోచిత కార్యం చేయడానికి వీలులేదు. పైగా నానా విధాలయిన అవమానాలను వహించాలి, స్త్రీలు బయటకు వెళ్లి కర్తవ్యాన్వేషణ చేయడానికి వీలులేదు. ప్రేమించడం, ప్రారంభించడంతో వారి కర్తవ్యం ప్రారంభమౌతుంది. వారి చితనం, యుక్తులు మేల్కొంటాయి. బయటదేశ విప్లవం వారి పనులకు ఆటంకం కాదు. వారి భారమును తగ్గించదు. జాతి బానిసత్వంలో కూడా ఆమె తేజస్సు మరినం కాదు" అని అన్నాను.
ఆ తరువాత నిర్ఘరిణి వేపు తిరిగి, "మేము విదేశీ యితిహాసంతో నూతన జ్ఞానజ్యోతిని తీసుకుని కర్తవ్య క్షేత్రంలో ముందుకు సాగిపోవాలని వాంఛిస్తున్నాం. కాని తడికట్టెలు మండవు. వెలిగిస్తే పొగ బయలుదేరుతుంది. ఓటి రూపాయి చెలామణి కాదు చెలామణీ అయ్యే రూపాయి బాగామోగుతుంది. నేను మీ ఉజ్వలత, మీ ఆదరణ చూసి మేము సిగ్గుపడుతున్నాం. మేము రాత్రింబవళ్ళూ పనిపాటలు లేకుండా వ్యర్ద విషయాలలో నిమగ్నమయి వున్నాం. అంతేకాకుండా మా కార్య నిష్టతో మీ మీద అధికారం చెలాయిస్తున్నాం. అందువల్ల యెంత సులభంగా మీరు విద్య నేర్చుకుంటే మీకు అధికారం అంతగా సమకూరుతుంది. మీరు మీ జీవిత ప్రవాహంలో కొట్టుకుపోతుంటే మేమేమీ చేయలేం. అది మాకు చాలా కష్టమైన పని. మీకు చరిత్ర వుంది. దానిని కోల్పోతే మరేమీ లభ్యంకాదు. లభ్యమైనది దక్కకుండా పోతుంది. అందుచేత చదవను వ్రాయను నేర్చిన మన స్త్రీలకు చదవను వ్రాయను నేర్చిన అనురూప భర్తలు దొరకడం లేదు. మేము కర్తవ్యం వేపు మొగ్గవలసి వుంది. అహంకారాన్ని చూర్ణం చేయాలి. విశ్వాసాలకు జీవం పోయాలి. అంటే యీ మహాబారంతో బరువెక్కిన నౌక చుక్కానిని మీరు మీ శక్తి సామర్ద్యాలతో చేపట్టాలి. తెరచాప తాడును పట్టుకోవడం మాత్రమే మేము కొద్దిగా నేర్చుకున్నాం. అందువల్ల మీరు దీనిని తెలుసు కోకపోబట్టే మేము నేర్పుగల సరంగులమయాం. ఇపుడు మేము అత్యాసక్తి చూపవలసిన అవసరం వుంది. మీరు గట్టిగా గద్దిస్తూ, తియ్యగా బుజ్జగిస్తూ మంచి సలహా లివ్వకపోతే మేము భూమికి భారంగా తయారవుతాం" అన్నాను.
నిర్ఘరిణి చాలాసేపు మౌనం వహించింది. తిరిగి హఠాత్తుగా మౌనం విసర్జించి, "ఏ ఉపాయం వల్ల యే పని చేయగలమో మాకు తెలుసు. అందువల్ల ఆవశ్యకమయిన పనులు చేయాలని చూస్తాం" అని అన్నది.
"మీరు ఎలా వున్నారో అలానే వుండండి. ఇపుడు మీరు చేయవలసిందేమీ లేదు. సత్యసరళ సంపదలతో రూపవతి యింటికి వస్తే యెంత సుందరంగా వుంటుందో ప్రపంచానికి తెలుసు. లక్ష్మి నివసించే గృహంలో కురూపతకు స్థానం వుండదు. నేను మా కార్యకలాపంలో లక్ష్మి తప్ప మరేమీ లేదు. అందుకనే అందులో అంత గొప్పదనం వుంది. కాని సుశిక్షితమైన మీ మహిళామండలి తమ హృదయ సౌందర్యంతో మన సమాజం మధ్య స్థిరపడ్డారు. లక్ష్మిని ప్రతిష్టించారు. సులభంగా మా జీవితాలు నియమబద్దం, సమాజస్థపూర్ణమూ అయినాయి" అని అన్నాను నేను.
నిర్ఘరిణి ఇదంతా విని ఏమీ మాట్టాడలేదు. కృతజ్ఞతా పూర్వకంగా నా లలాటం తాకి ఇంటి పనులలో నిమగ్నురాలయింది.
పల్లెటూరు
ఈ కాలంలో నేను నివసిస్తున్న ప్రాంతానికి సమీపంలో పోలీసు ఠాణాగాని, న్యాయస్థానంగానీ లేదు. రైలు స్టేషన్ కూడా దూరమే క్రయవిక్రయదారులతో కోర్టుపనుల వారితో, ఆత్మగౌరవ ప్రచారకులతో సంబంధం పెట్టుకునే సంస్థ ఒక్కటీ లేదు. ఎక్కడినుంచో ఒకచిన్న నది వచ్చి ఆ పల్లెమీదుగా ప్రవహిస్తోంది. ఆ నది ఆ గ్రామంలోని డెల్టా జిల్లాలలో కూడా ప్రవహిస్తోందా అనిపిస్తుంది. ఆ నది వారి సంపత్తి. పెద్ద నదులను గురించి సుదూర సముద్రం గురించి, నదికీ, గ్రామాలకు, నగరాలకు గల సంబంధం గురించీ అక్కడి వారెవ్వరికీ తెలియదు. ఆ గ్రామవాసులు ఆ నదితో పెనవేసుకుపోయారు. దానికి చక్కనిపేరు పెట్టుకుని తమదిగా చేసుకున్నారు.
వర్షాకాలం ఆకాశంలో మేఘాలు వాయురూప అశ్వాలమీద ఎక్కిదౌడు తీస్తున్నాయి. నాలుగు వేపులా నీటి సముద్రం. విత్తులు జల్లిన పొలాల గట్లు మాత్రం కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాయి. ఎక్కడో దూరాన చెట్లచాటుగా ఎత్తున ద్వీపంలాగా ఒక గ్రామం పొడగడుతోంది.
అచ్చటి గ్రామీణ కోమలత, సరళత, భక్తి భావ ప్రపూర్ణత స్వభావసిద్దమయినవి. అదం, అవ్య జ్ఞాన వృక్షఫలం రుచి చూడకముందే బ్రహ్మ ఈ గ్రామంలో పూర్ణపురుషులను సృష్టించాడని ప్రతీతి. అందుకనే శనేశ్వరుడు కూడా వాటిలోని పూరిగుడిసెలలో ప్రవేశిస్తూంటాడు. వారు పసిపిల్లలలాగా అతనిని విశ్వసించి అతిధి సత్కారాలు అందచేస్తూంటారు.
కల్లాకపటం యెరగని ఇలాంటి శ్రద్దాళువులు హృదయ క్షేత్రంలో నేను నివశిస్తూన్న కాలంలో పంచభూత సభ సభ్యుడొకరు నాకు పత్రిక "కటింగ్" ఒకటి పంపాడు. ఫృధ్వికి ఉత్పాతం సంభవించిందని జ్ఞాపకం చేయడమే అతని ఉద్దేశ్యం. లండన్, పారిస్ నగరాలలోని వార్తా సంచయమును జలమయమయిన యీ శ్యామల ధాన్యక్షేత్రం మధ్యకు తపాలాలో పంపించాడు. ఒక విధంగా మంచిపనే చేశాడు. పత్రిక 'కటింగ్' చదివిన తరువాత నా మెదడులో అనేక ఆలోచనలు బయలుదేరినాయి. కలకత్తా లాంటి విశాలనగరంలో నివసించేటపుడు ఆలోచనలు యింత బాగా వచ్చేవి కావు.
నేను ఆలోచించసాగాను. నేటి రైతులు, కార్మికులు విద్యా విహీనులు అసభ్యులు, నీచులు, పామరులు అనియెంతగా అసహ్యించుకున్నా వారు దగ్గరకు వచ్చేసరికి మనవారే అనిపిస్తుంది. స్నేహభావం పెంపొందుతుంది. నా మనసు మెల్లమెల్లగా వారి విషయంలో శ్రద్ద ప్రకటించ సాగుతోంది.
కానీ వీరు లండన్, పారిస్ నగరాలలోని రైతులతో తులతూగలేరు. ఆ దేశాల సాహిత్య, సమాజ, రాజనీతుల వికాసం చరమసీమకు చేరుకుంది. ఆ రైతులు మోహాంధకార యవనిక చాటున మరుగుపడి పోతున్నారు. దేశం కోసం ప్రాణరొడ్డ వలసినప్పుడు దూరంగా వుంటారు. దేశం అంటే యేమిటో కూడా వీరికి తెలియదు. ఈ విషయంలో బాగా ఆలోచించిన తరువాత కూడా నా మనసులో ఒక దైవవాణి వినిపించింది. కల్లాకపట మెరుగక అంధకార కూపంలో పడిపోయిన మనుష్యులు కేవలం ప్రేమపాత్రులు మాత్రమే కాదు; శ్రద్ద తీసుకోదగిన యోగ్యులు కూడా.
వీరి ఎడ నా హృదయంలో యింత శ్రద్ద యెందుకు నించిందీ యని తీవ్రంగా ఆలోచించారు. అలా ఆలోచించిన తరువాత వారి మనసు లోని సరళ విశ్వాసభావం అమూల్య మయినదని నా హృదయ తంతి నుంచి శబ్దం వెలువడింది. ఇది మానవుల చిరకాల సాధన సంపత్తి. నాకు తెలిసినంతలో వారి ఈ సరళ భావం కంటె మనోహరమైన దేదీలేదు. ఈ విషయం నేను దాచలేను.
