Previous Page Next Page 
పంచభూతాలు పేజి 10

     ఇది అనుపమ సరళత. ఇది నష్టమైతే సభ్యతా సౌందర్యం బూడిదలో కలిసిపోతుంది. ఇదిలేకపోతే స్వాస్థ్యత అడుగంటిపోతుంది. మానవ ప్రకృతి యొక్క స్వాస్థ్యం  సరళమయింది. అది లేకుంటే మానవుడు మానవుడుగా మనలేడు!
     ఎంత భోజనం చేసినా జీర్ణశక్తి బాగా వుంటే ఆరోగ్యం బాగా వుంటుంది. ఘాటు పదార్దాలు మసాలా పదార్దాలు, చల్లారిన పదార్దాలు స్వస్థత చేకూర్చవంటారు.
     హృదయ సరళత, మనోస్వాస్త్యం అంటే  ఏమిటి? సమస్తజ్ఞానం, విశ్వాసం సంపూర్ణ రూపంతో జీర్ణం కావడమే. రకరకాల జ్ఞానం, దిక్కు లేని వారి మనసుకు స్వస్థత చేకూర్చదు.
     నేను గ్రామస్థులు యే జ్ఞానంతో విశ్వాసంతో తమ తమ జీవితాలను గడుపుతున్నారో ఆ జ్ఞానం ఆ విశ్వాసం ప్రకృతితోపాటే వారికి సిద్దిస్తోంది. శ్వాసరక్తాల సంచారం మన యిచ్చ మీద పూర్తిగా ఆధారపడనట్లే సకల విషయాలు తెలుసుకోవడం వారి పని కాదు. వారు సరళతతో యే విషయాలను తెలుసుకోవాలని యత్నిస్తారో లేక ఏ విషయంలో సులభంగా విశ్వాసం వుంచగలరో అందులోనే విశ్వాసం వుంచుతారు. దానికి కారణంవారి జ్ఞానం, వారి విశ్వాసం, వారి పనిలో సామంజస్యం జనించడమే.
     ఇది బాగా అర్దం కావడానికి ఒక లోకోక్తి చెపుతాను. అతిధి వస్తే ఎవరూ పంపివేయరు. యధాశక్తి సత్కరించి పంపుతారు. అందువల్ల వారికి హానిగాని నష్టంగాని వస్తుందని భావించరు. నే నిపుడు యే అంశంలో ఆతిధ్య ధర్మం వుందని భావిస్తానో దానిమీద జ్ఞానదృష్టిని వుంచలేను. జ్ఞానదృష్టితో  భావించగలిగినది విశ్వాసదృష్టితో భావించలేను. అతిధిని చూడగానే అతనిని సత్కరించడానికి నా రోమ రోమం పులకించిపోతుంది. మనసులో రకరకాల తర్కాలు, ఆలోచనలు బయలుదేరుతాయి. ఈ విషయంలో విశ్వాసంతోపాటు నా మనసు సామంజస్యం పొందదు.
    మానవ స్వబావంలోని విభిన్న అంశాలలో అఖండయేకతను పొందడం మానవుని ఏకైక లక్ష్యం. చిన్న చిన్న పాములను ముక్కలు ముక్కలుగా కోసినా వాటిలో ప్రాణం వుంటుంది. నష్టం వాటిల్లదు. కాని పెరిగే జీవుల అంగ ప్రత్యంగాలలో అధికాధిక యేకత యేర్పడుతుంది. మానవ స్వభావంలో విశ్వాసం, జ్ఞానం పనిలో విచిత్రోన్నతి  పొందటం కిందిమెట్టు. ఈ మూడింటి దృఢసంబంధం మానవుని ఉత్తమోత్తమము వున్నది కాని విశ్వాసం, జ్ఞానం, పనిలో విచిలితలలో విభిన్నత లేనపుడు శీఘ్రగతిని మేళవిస్తాయి.  పువ్వులు సౌందర్యం పొందినంత సులభంగా జీవధారి పొందలేడు జీవధారి విభిన్న విచిత్ర కార్య కలాపంలో సంపూర్ణ సంయోగం పొందటం చాలా కష్టం. జంతువులలో  లాగా గాక మానవునిలో దీని సంపూర్ణత మరింత కష్టం. దుర్లభం. ఈ విషయం మానసిక ప్రకృతి సంబంధానికి కూడా అన్వయిస్తుంది.
     నేను ఈ చిన్న గ్రామంలోని రైతులలోని ఏకతను చూడాలని వచ్చాను దానిలో గొప్పదనం గాని జటిలతగాని కనిపించలేదు.
     కల్లాకపట మెరుగని రైతులకు ఒకటి రెండు సాధారణ లోట్లను మినహాయిస్తే సాదా జీవనం గడపడానికి అధిక సమాజతత్వం, జ్ఞాన విజ్ఞానాలు అవసరం లేదు. వారి జీవితంలో మనసును ఆకర్షించే సౌందర్యము వుంది. ఆ సౌందర్యం క్షుద్ర కార్యకలాపంలో నుంచి కమలం  లాగా  చిత్రితమై గర్విత సభ్య సమాజానికి ఆదర్శంగా తయారవుతుంది. లండన్, పారిస్ ల సభ్య కలకలనాదం వినిపించినా నా మనసుమీద గ్రామాలే అధికారం చెలాయిస్తున్నాయి.
     పల్లెటూరు నుంచి ఆలోచించినకొలదీ తీయని తంబురా శబ్దంలాగా కొత్తకొత్త ఆదర్శాలు పొటమరిస్తాయి. ఎల్లప్పుడు పల్లెటూరు నన్ను సమ్మోహితుని చేస్తుంది. దాని కాంతి నా కనులలో మెలుగుతూంటుంది.  "నేను చిన్న గ్రామాన్ని. నా దగ్గర  ఆకర్షించే వస్తువేదీ  లేదు. కాని నేను చిన్న గ్రామాన్ని. నా దగ్గర ఆకర్షించే  వస్తువేదీ లేదు. కాని నేను చిన్న  దానినయినా సంపూర్ణమైనదానిని.  అందువల్ల యింకా కొన్ని లోట్లువున్నా నా దగ్గర ఒక విశేష మధురత మోహకత వున్నాయి. వీటిని ఎవరూ నిషేధించలేదు. నేను చిన్న గ్రామాన్నని లోకులు నన్ను   తుచ్చమైన వానినిగా భావిస్తారు. కాని సంపూర్ణతకు కారణం సౌందర్యం. ఆ సౌందర్యం మీ ఆదర్శం," అని పల్లెటూరి నుంచివినవస్తుంది.
     నా మాట విని నవ్వి ఊరుకునేవారు ఈ ప్రపంచంలో చాలామంది వున్నారు. రైతుల మలిన ముఖాలమీద నా కొక రమణీయ సులభ సరళ సౌందర్య అనుభవం గోచరిస్తుంది. అందుకని నేను మాట్లాడడానికి సాహసిస్తాను. నేను ఆశ్చర్యపోయి ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అని యోచిస్తాను. యోచించాను. దీనికి జవాబు దొరికింది. ప్రకృతి యెవరిని  విశేష భావంతో తన దానినిగా చేసుకుంటుందో అతని ముఖంమీద మెల్లమెల్లగా మలినమయిన భాగానికి శోభను అంకితం చేస్తుంది.
     ఆ గ్రామస్తులు పుట్టినప్పటి నుంచి ఈ భావం వేపు స్థిరదృష్టిని ప్రసరిస్తారు. అందుకని ఈ భావం వీరి దృష్టిలో తమకు అంకితం కావలసిన అవసరం వుంది. ఈ కారణం వల్ల వారి దృష్టి నుంచి కరుణా పూర్వక మధురత జాలువారుతుంది.  వారి ముఖంమీద యెల్లప్పుడూ సంతోషరేఖ గోచరిస్తుంది.
     ధర్మ విశ్వాసాలను సందేహించేవాని ముఖంమీద బుద్ది తీక్షణత ప్రకాశిస్తుంది. గాని ఆ భావ గంబీర స్నిగ్ద సౌందర్యానికి వేరవుతుంది.
     నేను  నావను తీసుకుని వెళ్లిన నదిలో ప్రవాహం లేదు .దానికి కారణం అందులో కమలాలు, నాచు మొదలయిన రకరకాల పూలు వికసించడమే. ఈ సాధారణ సత్యాన్ని గురించి ఆలోచించగా నా భావధారలో స్థిరతలేనప్పుడు అందులో రకరకాల సుందర కుముదాలు వికసించనవసరం లేదని విశ్వాసం కలిగింది.
     పురాతన ఐరోపా ఖండంతో నవ అమెరికా ఖండాన్ని పోల్చి  చూస్తే నవ అమెరికాలో అన్నిటికంటే  ఈ భావం తక్కువగా వున్నట్లు కనిపిస్తుంది. అమెరికాలో చంచలత, ఉజ్వలత, కఠినత మొదలయిన సకల విషయాలు  గోచరిస్తాయి.  కాని భావగంభీరతా నామ రూపాలు కూడా కనిపించవు. దాని మనసులోనే నవ్యత భావ వికాసానికి పుట్టిల్లు  కాదు.  ఇప్పుడు అక్కడ సభ్యత మానవ హృదయాలలో  కలిసి తనకు తాను  అనురంజింప చేసుకోలేకపోతోంది. ఇందులో సత్యం ఎంతవుందో నేను చెప్పలేను. కాని అలా వింటున్నాను. ఈ దేశ సాహిత్య  సరళత చూడగా నాకూ అదే అభిప్రాయం కలుగుతోంది. పురాతన ఐరోపాలో అనేక పురాతన భావాలు  అంకురించి విలక్షణ నమ్రశోభతో కదం తొక్కాయి. అమెరికాలో మాధుర్యం, లావణ్యం మొలకెత్తలేదు.
     ఈ నా రైతుల హృదయంలో అంతరాకృతి అంకురం మొలకెత్తింది. వారు పురాతన సరళతా శోభను సర్వులూ చూడాలని చాలా ఉవ్విళ్లూరుతారు.  కాని ఆ శోభ యెంతో కోమలమయింది. ఎంత కోమలమో చెప్పడం నాతరం కాదు. ఎవరయినా ఆశోభను చూడకుండా పరిహసించితే నేను వివశుడ నవుతాను.
      నేను పత్రిక 'కటింగ్' చదువుతూ, "నమ్రతగల వారికే ఈ భూమిమీద అధికారం వుంటుంది." అని క్రైస్తవులు చెప్పే ధర్మయుగం గురించీ బైబిలులో లభించిన మాటలను గురించి యోచించాను. అలా అయితే నేను చూసిన నమ్రతకు స్వర్గాధికారం కూడా లభించడం సంభవమవుతుంది. పృద్వి మీద     సౌందర్యం మినహా మరి దేనికీ నమ్రత లేదు. పశుబలం వల్ల ఏదీ సిద్దించదు. ముందు ముందు ఈ ప్రపంచంలో దీని అంధకారం ప్రబలుతుంది. ఇప్పుడు ఈ గ్రామంలో నివసించేవారు, సుందరసరళ నగరంలో నివసించేవారు. నవ్యసభ్యతగల పిల్లవాని మనసును మెల్లమెల్లగా హరిస్తారు, అటువంటి సమయం వస్తుంది. ఈ సమస్య సభ్యతకు రాశీలాగా తయారవుతుంది. ఇప్పుడు అలా తయారు కావడం ఆలస్యమవుతుంది. కాని చివరకు సభ్యత సరళతతో పాటు ఏదీ పాలుపంచుకోదు. ఇది తన ప్రపూర్ణ ఆదర్శంతో రాలి పోతుంది.
     భావ సౌందర్యం స్థాయినిమించి అతిశయిస్తుందని ముందే  చెప్పాను. ప్రాచీన స్మృతులు శోభస్కరంగా కనిపించడానికి కారణం అప్రాప్యత కాదు. హృదయంలో అవి చాలా వరకు మెసలుతూనే వుంటాయి.  అందువల్ల కల్పనలోని వేయిసూత్రాలు పెంపొంది దానిని తనలో కలుపుకుంటాయి. దాని మాధుర్యం పెరుగుతుంది. చాలారోజుల వరకు స్థాయికి కారణం వారికి చాలా లాభించడమే. అందువల్ల పురాతన భూమి, పురాతన దేవాలయాలు రమణీయంగా వున్నాయి. పనిలో నిమగ్నత మానవ హృదయానుమతితో వారి అంగప్రత్యంగాలలో చైతన్యంతో సంచరిస్తుంది. సమాజ విచ్చేదకుల నందరినీ పారదోలి సమాజాన్ని ఏకం చేస్తుంది. ఈ మేళనమే దాని సౌందర్యం. స్త్రీ జాతియే మానవ సమాజంలో అతి ప్రాచీనమయినది. మానవులు వివిధ రకాల పనులు,  వివిధావస్థలు, వివిధ పరివర్తనలలో నుంచి చపలభావం నుంచి వైదొలగుతున్నారు. స్త్రీలు స్థాయీ భావంతో మాతా పత్నీ రూపాలలో మాత్రమే  విరాజిల్లుతున్నారు. ఏ ఆందోళనా , అశాంతి  వారిని చలింపజేయలేవు. సమాజ హృదయంలో త్వరగా కళాపూర్ణ శీలంతో స్త్రీ నిమగ్నమయి అసమర్దురాలయింది. ఇంతేకాదు, మీదు మిక్కిలి - సమాజ కార్యకలాపం భావ శక్తులతో ఆమె బహు నేర్పుతో ఐక్యమయింది. దీనికి కారణం ఐక్యం కాని వారిని ఐక్యత పొందించడానికి  తగినంత వ్యవధి లేకపోవడమే. ఈ విధంగా దీర్ఘకాల స్థాయీ సహాయంతో తర్కం, జ్ఞానం, యుక్తులతో సంస్కార విశ్వాస రూపంతో  పరిణితి చెందుతుంది, ఆమె సౌందర్యం వికసించినపుడు  వారు దృఢ నిశ్చయంతో నిలబడతారు. వారిలో లెక్కకు మించిన జీవాణువులు సిద్దంగా వుండి చాలా కాలం తరువాత , ఆనంద, ప్రకాశ, అంశువర్ణంతో అంకురించి మరుగుపడి పోతాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS