Previous Page Next Page 
పంచభూతాలు పేజి 8

    పృధ్వీరాజ్, "మీరు  మీ మాటలతో కవిత్వం బాగా పరిచయం చేశారు. మీ మాటలు వినడం ప్రియంగా వుంది. కాని స్వీకరించడానికి స్త్రీల కార్య ప్రసారం అత్యంత సంకీర్ణమయింది.  ఈ విశాల ప్రపంచంతో వారికి స్థానంలేదు. వారి అస్తిత్వం వారి కార్యక్షేత్రానికి పరిమితమయింది. యజమాని, పుత్రుడు, స్వజనం ఇరుగు పొరుగు, మొదలైన వారికి మేలు చేయడంలోనే వారి వర్తమాన కర్తవ్యం సమాప్తమవుతుంది.  ఎవరి జీవన కార్యక్షేత్రం వాస్తవ మయిందో వారి కార్య ఫలా ఫలాలు ఎపుడూ శీఘ్రంగా కనిపించవు. అటువంటి వాటికి ప్రభావం వుండదు. లోకనిందవల్ల  లోకస్తుతివల్ల స్త్రీల మనస్సు బాగా విచలిత మవుతుంది. దీనికి ముఖ్యకారణం జీవితం నుంచి వారు అరువుయిచ్చి పుచ్చుకోవడం వేరు. లాభనష్టాలు ముందుగానే వస్తాయి. తక్షణలాభం వారి చేతికి వస్తుంది. కాబట్టి వారు వసూలు సక్రమంగా అయ్యేటట్లు చూస్తారు," అని ఆనాడు పృధ్వీరాజ్.
     ప్రకాశవతి విరక్తయయి విదేశీ విశ్వహితైషిణిలాగా జాడలు తీయడం ప్రారంభించింది.
    ఇక నిర్ఘరిణి, "వృహత్వ మహత్వాల ఐక్యత యెల్లపుడూ వుండదు. గమనం విశాలక్షేత్రంలో పనిచేయడం లేదు. అందువల్ల మన పనులకు గౌరవం తగ్గుతుంది. వాదనను నేను అంగీకరించడానికి సిద్దంగా లేను. ఆస్తి, చర్మం, మాంసపేశి, స్నాయువులు అధికస్థానం ఆక్రమిస్తాయి. కాని మర్మస్థానం గుప్తంగా వుంటుంది. మనం ఆ మానవ సమాజ బిందువుమీద విరాజిల్లుతున్నాం. పురుషుడు, దేవతలు, ఎద్దు, బర్రె మొదలయిన వాహనాలమీద నుండి విచారణ చేస్తారు. లక్ష్మీదేవి కమలం మీద నివసిస్తుంది. ఆమె వికసిత ధృవ సౌందర్యం నడుమ తన పూర్తి మహిమను చూపుతుంది. ఈ ప్రపంచంలో తిరిగి జన్మిస్తే స్త్రీ గర్బమందే జన్మించాలని, బికారిని కాకుండా విపుల ధనరాశితో పుట్టాలని ప్రార్దిస్తున్నాను. సమస్త మానవ జగత్తులో రోగాలకు, చింతలకు, ఆకలికి శాంతికి యెంత ప్రాధాన్యం వుందో కొంచెం ఆలోచించు. ప్రతిక్షణం కర్మక్షేత్రం నుంచి యెగిరి వచ్చి కుప్పగా పడుతుంది. ప్రతిగృహ నిర్వహణ యెంతో  కష్టమవుతుంటుంది. లోకవత్సలదేవి ప్రతి దినం తల వైపు కూర్చుని రోగికి ధైర్యం చెపుతుంది. తన చేతులతో ప్రతిక్షణం రోగి నిరాశను దూరం చేస్తుంటుంది. ఇంటింటికి వెళ్లి స్నేహంతో శుభం చేకూరుస్తుంది. స్త్రీల కార్య క్షేత్రం అత్యంత సంకర  మయిందని ఎవరి నోటి నుంచి వెలువడుతుంది? ఆ లక్ష్మీమూర్తిలో ఆదర్శ హృదయానికి పవిత్రత చేకూరుతుంది. నారీజీవనం వుదాసీనంగా ఎవరు లెక్కిస్తారు?" అని అన్నది.
     ఆ తరువాత మేము కొద్ది క్షణాలపాటు మౌనం వహించాం. హఠాత్తుగా శాంతి మౌనాల కారణంవల్ల నిర్ఘరిణి సిగ్గుపడి, "మీరు మన దేశ స్త్రీల సంబంధం గురించి యేదో మాట్లాడారు. కాని మధ్యలో యింకో విషయం వచ్చి కారణం వల్ల ఆగిపోయింది యేమిటి? చెప్పండి." అని అన్నది.
     "మన దేశ స్త్రీలు మా పురుషులకంటే గొప్పవారు. అని నేను చెప్పాను." అని అన్నాను నేను.
    పృధ్వీరాజ్, "దీనికి ప్రమాణం యేమిటి?" అని అడిగాడు.
    "ప్రత్యక్ష ప్రమాణం - ప్రమాణం యింటింటా కనిపిస్తుంది. మనలో కనిపిస్తుంది. పశ్చిమదేశాలలో పర్యటించే సమయంలో  అనేక నదులు కనిపిస్తాయి. వాటిలో చాలా భాగం  యిసకదిబ్బలు. ఒక నదీ తీరాన  ఒకే ఒక తెల్లని నీటితో కూడిన సన్నని సెలయేరు మందగమనంతో ప్రవహిస్తూంటుంది. ఆ దృశ్యం మన పురుష సమాజమును జ్ఞప్తికి తెస్తుంది. మన పురుష సమాజం సోమారి నిష్పల నిశ్చల యిసకదిబ్బలాగా వుంటుంది. గాలివేగం వల్ల లేచి ఆకాశానికి చేరుకుంటుంది. మనం కీర్తి స్తంభ నిర్మాణ కార్యకలాపం సాగిస్తే అది యిసకలాగా మూతపడి వుంటుంది. స్త్రీ జాతి వినమ్ర సేవికలలాగా తమను తాము సంకుచిత పర్చుకోవడానికి కూడా తీరిక వుండదు. వారి జీవితం ఒక ధృవలక్ష్యం వేపు సాగిపోతుంది. మనకి లక్ష్యం లేకపోవడం వల్ల పరుల  కాలికిందపడి పొడియయిపోయి  కలుసుకునే అసమర్దులం కాలేము. జలధార ప్రవహించేవేపున  మన స్త్జీ జాతి వుంటుంది. అక్కడే శోభ సఫల తల భాండారం తెరవబడి వుంటుంది. మనం ఎక్కడ వుంటే అక్కడే ఎడారి శుష్కత, నిస్తబ్దత, హీనదాసవృత్తి వుంటాయి. ఏమిటి పవన్! నీ అభిప్రాయం?" అని నేను అడిగాను.
     పవన్ దేవ్ నిర్ఘరిణిని, ప్రకాశవతిని దెప్పపొడవడానికి  మొండిగా, "నేటి సమావేశంలో తమ హీనత అంగీకారించడానికి రెండు పెద్ద పెద్ద అడ్డంకులు వున్నాయి. నేను వాటిని చర్చించదలచుకోలేదు. ప్రపంచ మంతటిలో హిందూస్థానీ అధికారం కేవలం అంతఃపురంలోనే ఆదరం పొందుతూంది. అక్కడివారు కేవలం యజమానులు మాత్రమే కాదు, పైగా దేవతలు. తమ వుపాశాసకులకు  ప్రత్యక్షమవడానికి మనం దేవతలం కాము. మట్టిబొమ్మలం, గట్టిబొమ్మలం. మహాశ్రద్ద వహించే భక్తులు తమ వికసిత హృదయకుంజ పుష్పాలతో పళ్లెరం అలంకరించి ఆదరంతో  మన పాదాలముందు సమర్పించితే దానిని నిరాకరించమెందుకు? దేవతా సింహాసనం మీద మనం కూర్చుని  వుండగా ఈ చిరద్రతిసేవిక  తన దీప్తితో సాయంకాలంపూట మనకు హారతియిస్తే మహదానందం పొందుతాం.  ఆమె ముందు తలెత్తి కూర్చొనకపోతే మెదలకుండా ఆమె భక్తిని స్వీకరించకపోతే ఆమెను సుఖం యెలా దక్కుతుంది. మన ఆదరం ఏమవుతుంది?  చిన్నతనంలో మట్టిబొమ్మతో ఆడుకున్నట్లే పెద్ద అయిన  తరువాత  మనుష్యరూప ప్రతిమలతో  ఆడుకోసాగుతాడు. ఆ సమయంలో బొమ్మలను ఎవరైనా పగలకొట్టితే  ఆ పిల్ల పెద్దపెట్టున ఏడ్వడం మొదలుపెట్టదూ?  ఆ విధంగానే ఈ సమయంలో తాను పూజించే మూర్తిని ఎవరైనా పొడి పొడి చేస్తే ఆమె మనసు దుఃఖించదూ?  మనుష్యులకు  నిజంగా గౌరవం వున్న చోట వేషం మార్చుకోవలసిన అవసరం ఏముంది? మానవత్వం కొరవయినచోట దేవతలు కావడానికి కపట నాటకం ఆడవలసి వుంటుంది. ఈ భూమికి దానికి ఎక్కడా ప్రభావం లేదు;  మామూలు మానవుని సామర్ద్యం స్త్రీ ఆదరణమీదే ఎందుకు ఆధారపడి వుంటుంది? మనం ఒక్కొక్కరం ఒక్కొక్క దేవతలం.  అందుకని యిక్కడి స్త్రీల కోమల హృదయాలను నిస్సంకోచ భావంతో మన చరణ దాసినులుగా తయారు చేస్తున్నాం." అని అన్నాడు.
     అందుమీదట ప్రకాశవతి అందుకుని, "నిజమయిన అర్దంలో మనిషి దేవతలాగా పూజలనందు కొనడానికి సిగ్గుపడతాడు. కాని పూజల నందుకుంటూనే వుంటాడు. పూజల నందుకోవడానికి  తగిన యోగ్యతను  సంపాదించుకోవాలని కృషిచేస్తాడు. కానిభారతదేశంలో యిది తలకిందులయింది. ఇక్కడ మనిషి కపటనాటక మాడి స్వార్దం సాధించుకోవడంలో ఏ అడ్డంకినీ లెక్కచేయడు. అటువంటి మనుష్యుల విషయంలో "పుల్లిస్తరి ఎగిరిపడుతుంద" నే సామెతసార్దక మవుతుంది. ఇటీవల కాలంలో భర్తలు తమ భార్యలకు పతిపూజలో శిక్షణ మనసారా యిస్తున్నారు. దీనిని చూచి దేవతలు కూడా జంకుతున్నారు. స్త్రీలకు పూజ నేర్పడానికి బదులు పురుషులకు దేవతలుకావడానికి శిక్షణ యిస్తే ఎక్కువ లాభం వుంటుంది. పతిపూజ నానాటి తగ్గిపోతోందనికీ నేటి మహిళా సమాజాన్ని పరిహసించేవారు కూడా కొద్దిగా తన్మయులవుతారు. కాని పరిహాసం ఎదురుతిరిగి  వారికే తగులుతుంది. భారతస్త్రీలు ధన్యురాండ్రు. వారు క్రిందటి జన్మలో చేసుకొన్న సుకృతం వల్ల యీ జన్మలో మంచి దేవతను పొందగలిగారు. దేవతది యెంత సుందరాకారం! ఎంత  అపూర్వ మహిమ!"
    ఈ మాటలకు నిర్ఘరిణి సహనశక్తిని కోల్పోయింది. తల ఆడించి గంభీరభావంతో, "మీరు వుత్తరోత్తరా దేవతలు కావడానికి మేము చేసే స్త్రోత్రగానాలలోని మాధుర్యం నశించిపోతుంది. మీరు చెప్పినట్లు మేము యోగ్యతలేని భర్తలనుకూడా ఆదరిస్తున్నామని అంగీకరిస్తారు.  కాని మీరు మనల్ని మనసారా గొప్పవారినిగా భావిస్తున్నారా? లేదనేదే నిజం. మీరు దేవతలు కాకపోతే మేము దేవేరులం కాము. కాని స్త్రీ సమూహం భర్తలను ఆ విధంగానే భావిస్తోంది. అందువల్ల భర్త దేవతగా, బార్య దేవిగా తయారయారు. కానిరాబోయే రోజులను గురించిన  వితండవాదం శాశ్వతంగా ముగిసిపోయింది. మనరెండు జాతులలో ఏదో ఒకటి పెంపొందవలసిన అవసరం వుంది" అని అన్నది.
     "మృదుమధురంగా మాట్లాడి నువ్వు మంచిపని చేశావు. లేకపోతే ప్రకాశవతి దెప్పిపొడుపు మాటల తరవాత సత్యవాక్కుల మీద తెర వాలేది. మీ కవిత్వంలో మాత్రమే దేవేరులు; మందిరంలో మేం దేవతలం. దేవతల సమస్త భోగాలూ మాకే. మీ విషయంలో మనుసంహితలో రెండు మంత్రాలు వున్నాయి. మీరు మాకు అటువంటి దేవేరులు కాని మేము మిమ్మల్ని  సుఖస్వాస్థ్యాలకు అధికారిణులు అనడానికి సిగ్గుపడతాం. సమస్త ప్రపంచం మాది. దానిని మించినది మీది. బోజనం చేసేవంతు మాది. యెంగిలి తినేవంతు మీది. మేము స్వంతంత్రంగా ఆలోచిస్తాం. మానవజన్మ యెత్తి ప్రకృతి  క్షోభ దుర్లభమయిన యింటి మూలలో రోగిష్టిలా పడివుండడం మీ వంతు.  మేము దేవతలమయి సమస్తమయిన వారిచే పాదపూజ లందుకుంటాం.  యిక మీరు దేవేరులలో సమస్తమయిన వారిచేత యెదురు దెబ్బను తింటారు. కాని దీనిమీద ఆలోచిస్తే యీ రెండు రకాల దేవతలలో భేదం గోచరిస్తుంది. ఇది దేవీదేవతల విషయం. నా అభిప్రాయంలో భారతదేశ స్త్రీలు భర్తల కంటే ఎక్కువ బుద్దిమంతులు.  మనదేశంలో చదవను వ్రాయను నేర్చిన స్త్రీలు చదవమ వ్రాయను నేర్చిన పురుషుల కంటే చాకచక్యం గలవారు, నేర్పరులు, జ్ఞానులు. వ్యవహారాలలో లోకానుభవంలో వారు వెనకపడి పోయారు! ఇక్కడ చదవను, వ్రాయను నేర్చిన పురుషులలో వ్యవహార జ్ఞానం, లోకానుభవం లేనివారు తక్కువ. అందమైన నెమలిపురిని తగిలించుకుని నెమలిలా కనిపించాలని వ్యర్ద ప్రయత్నం చేసే కాకిగూడా సుశిక్షితుడైన భర్త తన అసలు రూపాన్ని మరుగుపరచి కృత్రిమ  రూపం ధరించి సిగ్గుపడేటంతగా అందమైన  నెమలిపురిని తగిలించుకుని  నెమలిలా తయారు కావాలని వ్యర్ద ప్రయత్నం చేసే కాకికూడా  సిగ్గుపడదు. కానీ చదవను వ్రాయను నేర్చిన స్త్రీలు తమ గౌరవం మీదనే ఎప్పుడూ ధ్యాస  పెట్టుకుంటారు. చక్కని వుపాయంతో దుష్కృత్యాలను పరిత్యజిస్తారు" అని నేను అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS