Previous Page Next Page 
నీ మీద మనసాయరా పేజి 9


    
    అతను ఓ క్షణం ఆగి మళ్ళీ చెప్పాడు.
    
    "ఈ కారణం చేతనే మీ గురించి అంతా తెలుసుకున్నాను. ఓ రేడియో స్టేషన్ కు ట్యూన్ చేసిన రేడియో రిసీఉ చేసుకున్నట్లు మీ ఆలోచనలు తప్ప మరేమీ రావు నాకు. నీటిమడుగులో మొసలి పట్టేసుకున్నప్పుడు గజేంద్రుడు అరిస్తే వైకుంఠములోని విష్ణువుకు ఎలా తెలిసిందనుకుంటున్నారు? ఇలానే అందుకే ఆయన గజేంద్రుడు అరిస్తే వైకుంఠములోని విష్ణువుకు ఎలా తెలిసిందనుకుంటున్నారు? ఇలానే అందుకే ఆయన గజేంద్రుడు కేక వినగానే "సిరికింజెప్పడు శంఖుచక్రగదమున్ చేదోయి సంధికిపడు"- అన్నట్లు పరుగెత్తాడు. ఇంతకు ముందు కూడా అదే జరిగింది. మీరు ఎగ్జిబిషన్ ను చూడడానికి రాకపోతే ఏదో అయిందనిపించింది. నా రక్తకణాలన్నీ మూలిగాయి. మీకేదో అయినట్లు తెలిసిపోయింది. ఏం జరిగుంటుందో ఊహించాను. అందుకే కారు తీసుకుని బయల్దేరాను. నా ఊహ నిజమైంది"
    
    ఆమె ఎంత డీప్ షాక్ కు గురైందంటే హోటల్ రావడం, కారును అతను పార్క్ చేయడం కూడా గమనించలేకపోయింది.
    
    "దిగండి హోటల్ కి వచ్చేశాం" డోర్ తెరిచి అన్నాడు అతను.
    
    కారు దిగి నిద్రలో నడిచినట్లు వసంత్ పక్కన నడిచింది సూర్యాదేవి.
    
    కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళగానే సుస్మిత ఎదురొచ్చి, "ఇప్పుడా రావడం! అంతా సర్దెయ్యడానికి ప్రిపేర్ అవుతున్నాము" అంటూ ఆమె రెండు చేతులు పట్టుకొని లోపలకు తీసుకెళ్ళింది.
    
    సూర్యాదేవికి మొత్తం జరిగిందంతా చెప్పాలనిపించింది. ఆ కోరికను బలవంతంగా అణుచుకుని, "మధ్యలో కారు ట్రబులిచ్చింది" అంది.
    
    "రారా! పెయింటింగ్స్ చూద్దువుగానీ"
    
    మొదటి నుంచి ఒక్కో పెయింటింగ్ చూపుతోంది సుస్మిత. పెయింటింగ్స్ ని చూస్తూ వసంత్ కోసం అప్పుడప్పుడు గమనిస్తూ వుంది గానీ అతడు కనిపించడం లేదు. ఏమైపోయాడు!
    
    చివరి చిత్రం చూసి, "అన్నీ బాగున్నాయి సుస్మితా కంగ్రాట్స్" అంది. గుండెలోతుల్నుంచి ఆ మాటలు రావడంతో బరువుగా తోచాయి.
    
    "థాంక్స్"
    
    "మరి నేనిక వెళ్ళొస్తాను" అని రెండు చేతులు జోడించి అక్కడి నుంచి బయటికి నడిచింది.
    
    "ఎలా వున్నాయి పెయింటింగ్సు?" ఎదురుగా వచ్చి అడుగుతున్న వసంత్ ను అలా చూస్తుండిపోయింది. అతను ఠక్కున ప్రత్యక్షమైనట్లు అనిపించింది.
    
    "ఇటు రండి. గుండెను కోటిముక్కలు చేసి మిమ్మల్ని అభిషేకం చేయాలన్న నా ఆవేశాన్ని  చూద్దురు గానీ" అని ప్రక్కనున్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ నోటుబుక్కులు చాలా వున్నాయి.
    
    "చూడండి" అంటూ ఓ బుక్కును ఆమె కందించాడు.
    
    వణుకుతున్న పలకమీద నీలాలు పొదిగినట్లు పేజీల నిండా ఆ పేరే. రక్తమంతా గుండెల్లోకి చేరిపోయి నట్లనిపించింది ఆమెకు. ఏవేవో భావాలు శరీరంలో ఇంద్రధనసుల్ని సృష్టిస్తున్నాయి. సప్తరంగుల వర్షంలో తడుస్తున్నట్లే వుంది.
    
    "ఈ నోట్ బుక్స్ లో అంతా మీ పేరే. కోటిసార్లు రాశాను. మీరు తప్ప మరేదీ గుర్తు రాకుండా వుండడం కోసమే రాశాను" అని ఆమె ముందుకి మరింత జరిగి "ఐ లవ్ యు" అన్నాడు.
    
    ఒకానొక అలౌకిక స్థితిలో - తుపానుకు ఊగుతున్న పడవలా అయి పోయింది ఆమె.  గుండెల్లో ఎగసిన ఉద్వేగం తన కళ్ళలో నీళ్ళులా ప్రవహిస్తోంది. తలవంచి కళ్ళను కర్చీఫ్ తో అద్దుకుని తల పైకెత్తింది.
    
    అప్పటికే అతను వెళ్ళిపోయాడు.
    
                                            6
    
    సూర్యాదేవి, మహిత భోజనాలు ముగించి బాల్కనీలోకి వచ్చి కూర్చున్నారు.
    
    అప్పుడు రాత్రి ఎనిమిది గంటలైంది. ఎవరో దేవకన్య పడుకునే ముందు తన పాపటిబిళ్ళను కొక్కానికి తగిలించినట్లు ఆకాశంలో చంద్రవంక వేలాడుతోంది. వడ్డాణాన్ని అలా విసిరేసినట్లు తెల్లటి మబ్బుల చారపట్టీలా కనిపిస్తోంది. కాలిగజ్జల్ని నిర్లక్ష్యంగా పారేసినట్లు నక్షత్రాలు మెరుస్తున్నాయి. ముత్యాలహారాన్ని పడకమీద నుంచే విసరడం వల్ల అది తెగి భూమి మీదకి జారి, చెల్లాచెదురైనట్లు కనిపిస్తున్నాయి.
    
    "చాలా రోజుల తరువాత వచ్చావ్. ఏమైపోయావ్ ఇంతకాలం నువ్వొచ్చి దాదాపు ఆరునెలలైందనుకుంటా" సూర్యాదేవి అడిగింది.    

    "అవును. ఈ మధ్య టౌన్ కి రావడం కుదరడం లేదు. ఎప్పుడేని వచ్చినా డాక్టర్, ఓ సినిమా, ఏదో బజార్లో కొనడం, సాయంకాలానికి యిల్లు చేరడము-ఈరోజు కూడా వెళ్ళిపోవాలనుకున్నాను డాక్టర్ లేదు. రేపు ఉదయం వస్తుందంటే వుండిపోయాను. నిన్ను చూసి చాలా రోజులయిందని ఇటొచ్చాను"
    
    "ఏమిటి ప్రాబ్లెమ్?" అడిగింది సూర్యాదేవి.
    
    "నడుంనొప్పి, మరీ సీరియస్ కాదనుకో డాక్టర్ కి చూపిస్తే బెటర్ కదా అని వచ్చాను"
    
    "మహిత ఇంటర్ లో సూర్యాదేవి క్లాస్ మేట్ పక్క ఊరే, టౌన్ కి వచ్చేటప్పుడు సూర్యాదేవి ఇంటికి వచ్చేది. దాంతో ఇద్దరి మధ్యా స్నేహము కుదిరింది.
    
    ఆమెకి సూర్యాదేవి వయసే. వివాహం అయి ఆరేళ్ళయింది. ఒక్కడే బాబు చాలా అందంగా వుంటుంది. ఛామనఛాయే అయినా అదో రకమయిన సెక్సీతనంతో వుంటుంది. ఆ సెక్సీతనం ఆమె మత్తుకళ్ళల్లో వుందో, తేనెపూత పూసినట్లుండే పెదవుల్లో వుందో, ఎట్టయినా వక్షస్థలంలో వుందో, రెండు కొండ శిఖరాలను కలుపుతూ వేసిన పూలవంతెనలా వుండే నడుంలో వుందో చెప్పడం కష్టం. ఛామనఛాయ రంగులో వుండే శరీరం- అంతగా మెరవడం అరుదు ఆ రంగువల్లే అంత సెక్సీతనం వచ్చిందేమో తెలియదు.
    
    "ఇంకేమిటి విశేషాలు?" సూర్యదేవికి ఎవరయిఅన గెస్ట్ లు వస్తే పండుగే జగదీష్ తో తప్ప ఎవరితోనూ ఫ్రీగా మాట్లాడే వీలులేదు ఆ ఇంట్లో వంటవాడితో పనిమనుషులతో మాట్లాడేందుకు ఏం వుంటాయి? కానీ జగదీష్ ఇంట్లో వుండడం బహు తక్కువ అందుకే ఎవరయినా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడడానికి మనిషి దొరికిందన్న ఆనందం ఎక్కువైపోతుంది.
    
    ఆరోజూ తను ఆలస్యంగా వస్తానని, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి సంబంధించైనా బిల్స్ తయారుచేసే పనివుందనీ జగదీష్ ఫోన్ చేసి చెప్పడంతో తీరిగ్గా మాట్లాడడానికి కూర్చుంది.
    
    "మాలాంటివాళ్ళకి విశేషాలు ఏం వుంటాయి సూర్యా! అంతా మామూలే ఏవేవో ఊపిరిసలపని సమస్యలు. ఎప్పుడూ కష్టాలే డబ్బు లేకపోవడము వల్ల వచ్చే ఇబ్బందులతోనే కాలం గడిచిపోతూంటుంది" నిరాసక్తంగా జవాబు చెప్పింది మహిత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS