లంచాలు ఎంత దైర్యంగా పుచ్చుకుంటున్నారో తలుచుకుంటే గుండెలు జారిపోతాయి. లంచం లేని పనే జరగడం లేదు. ఈ లంచాలని నిర్మూలించాలని మరో కొంతమందిని నియమిస్తే మాత్రం ఏం ప్రయోజనం? పూవం ఒకడు తిన్నది. యిప్పుడు మరో నలుగురు పంచుకుతినే అవకాశాన్ని కలిగిస్తున్నారు. అంతే గాని- ఆ అవినీతి మాత్రం పోలేదు. సరికదా - మరికొంత దైర్యంగా -బహుముఖంగా ఆ పని జరుగుతూంది. అయితే అందుకు వియోగించిన తర్వాత కొన్ని కేసులయినా పట్టి చూపకపోతే అసలు జీ (వి) తాలకే మోసం వస్తుందని-ఇచ్చి పుచ్చుకోడాల్లో పేచీలు వచ్చిన నిర్భాగ్యులని బయటపెడుతున్నారు.
ఇలా ఆలోచించుకుంటూ వుంటే ఇంకగిరికి నౌఖరి అంటూ దొరకదేమో అని నిరాశ కలుగుతూంది. రోజులూ నెలలూ కూడా గడిచిపోతున్నాయి, అతని జేబు ఖర్చుకి అయినా సరిపోయే ఉద్యోగం కూడా ఎక్కడా దొరకలేదు, కాళ్ళరి గేట్టు ప్రొద్దస్తమానం ఎన్ని ఆఫీసులకి తిరిగినా ఎన్ని అప్లికేషన్లు పెట్టినా లాభం లేకపోయింది. ఆఖరికి ఆ గుమస్తా ఆఖర్ని అన్నమాటల్లో ఎంత నిజం వుందో అనిపించింది. అమ్మ పంపుతూన్న డబ్బును వృధాగా ఖర్చుచేస్తూ ఎన్నాళ్ళు గడపడమా? అనుకుంటున్న గిరికి గిరిజ కాలక్షేపం కూడా లభించింది-
ఆ రోజు బిన్నీ కోటా వచ్చిందంటే బజారుకి బయలుదేరాడు గిరి. అసలు చిల్లరకొట్ల మీద కొనడం అతనికి ఎరువు తక్కువ దర్జాగా ఊరిలో అన్నిటికన్నా పెద్ద పెద్ద దుకాణాల్లోనే కొనడం అలవాటు - వెళ్ళేముందు ఆ కొట్లో ఎవరన్నా అమ్మాయిలు వున్నారో లేదో చూసుకుని - అలాటి సమయంలోనే వెళ్ళడం వాళ్ళ ఎదురుగుండా బేరం చేయకుండా కొట్టువాడు అన్నంత ధరాయిలా కౌంటర్ మీద విసిరేసి బిల్లేనా తీసుకోకుండా ఖాతరు చేయనట్లు - అమ్మాయిలవేపు చూస్తూ చిరునవ్వులు విసిరి రావడం అలవాటు మరి!
ఆ తర్వాత, అధరా, అధర మీద చక్రలాభం!
ఎస్టాబిపీమెంబు షోరూము ఛార్జీలు, యిలా వాడు పులిమినదంతా నెత్తికి రాసుకుని - ఆ అమ్మాయి లని తలుచుకుంటూ, విచారాన్ని అణచుకుని, గుటకలు మింగి, సమాధానపరచుకోవడమూ అలవాటే.
ఆనాడు కూడా అలాగే ఒక పెద్ద కొట్టులో, ఒక అమ్మాయి తాలూకు అందమయిన వెనక భాగం కనబడగానే లోపలికి జొరబడ్డాడు గిరి - తీరా లోపలికి పోయి చూసేసరికి ఆ అమ్మాయి ఎవరోకాదు గిరిజే? .... ఆ ప్రక్క బోరుగారు ... కాదు కాదు .... శ్రీ దాసుగారు కూడా! .... చల్లగా జారుకుందామా అని చూశాడు గాని....దాసుగారికి వెనకనికూడా కళ్ళున్నాయి!
"అరే! గిరి! మంచి టైముకి వచ్చేవ్ ? .... గుడ్ లక్? అరె....ఏదీ? ఒక్కడివే వచ్చావా?...వెరీ బాడ్ వెరీబాడ్ ! యిదిగో ఈ గుణమే నాకు నచ్చదోయ్! ..... ఎందుకన్నానంటే - సాధారణంగా, మనం సెలక్ట్ చేసినవి ఆడవాళ్ళకు నచ్చవోయ్? వాళ్ళకు నచ్చినవి మనకెలాగు నచ్చవనుకో ! - అయినా - కట్టుకున్నవాళ్ళు కాబట్టి ఆ బాధ్యత వాళ్ళకే వదిలివేస్తే తీరిపోతుంది! లేదా - ఆ చీరలు మళ్ళీ మోసుకుని రావాలి! కర్మవశాత్తూ వుంచుకున్నారో, ఆ చీరలు చిరిగి బొంతల రూపంలో కనబడ్డప్పుడు కూడా మన ప్రాణం తీస్తారు! ... ఈ బాధలన్నీ పడేకన్నా వాళ్ళ మీదే వదిలేసి మంచిదంటాను! యిలాటి కిటుకులు తెలుసుకోవాలోయ్ ! .... అయినా బాధలేదులే ... మా గిరిజ వుందిగా ఈ ఏడాది పండుక్కి మంచి సెలక్షన్ చేస్తుంది!" అని గడగడా అన్నాడు.
"చచ్చాం! పండుగ? అవును పండుగ కదూ! సంక్రాంతి! వాటే పిటి? ఆ సంగతే మరచి పోయాను? వీళ్ళకి దొరికిపోయాను భగవంతుడా యిప్పుడు ఏం దారి! చీరలూ జాకెట్ పీసులూ కొనాలి కామోను? పెనొకటి తలిస్తే మరోలా జరుగుతూందే? కొనే వుద్దేశ్యం లేకపోతే లోపలికి ఎందుకు వచ్చినట్టు? ఎలా తప్పించు కోవడం? ఇంక లాభంలేదు! వాళ్ళు చెప్పినట్టు చెయ్యాల్సిందే?" అని అనుకున్నాడు గిరి.
* * *

అప్పటికప్పుడే వాళ్ళ షాపింగ్ అయిపోయింది. బట్టలన్నీ ప్యాకింగ్ కి వెళ్ళిపోయినాయి అంచేత వాళ్ళిద్దరూ సావకాశంగా గిరి మీద పడ్డారు! - కొట్లో చీరలన్నీ యింతకుముందే గుట్ట గుట్టలుగా పడివున్నాయోమో! గిరిజ గబగబా నాలుగుచీరలూ వాటికి మేచ్ అయే బ్లౌజు పీసులూ తీసి అట్టిబెట్టింది!
"ఏం వోయ్! యివి బాగున్నాయా!" అని ఏదో అడగాలని కదా అని అడిగేడు.
"నాకు తెలీదండి! ... మీకు నచ్చితే నాకు వచ్చినట్టే -' అని గిరి అనేసి - కొట్టువాడి వేపు తిరిగి ... "ఎంతయింది?" అని అడిగేడు. వాడు కరెక్టుగా-
"నూట నలభైనాలుగు రూపాయల అరవై ఒక్క పైసలండి!" అని అన్నాడు-
వాడు చెప్పిన అంకె గిరి గుండెలు బద్దలు కొట్టినా యిహ అక్కడ వెనకతీస్తే బావుండదని. డబ్బుతీసి యివ్వబోయేడు. దానికి దాసు గారు వింతగా అతడివయిపు ఎర్రగా చూసి-
"బావుందబ్బాయీ బావుంది! నీకు నచ్చాయా అని అడిగానుగాని - డబ్బు యిమ్మన్నానా! యింక చాలుగాని వూరుకో!" అన్నాడు.
"అయితే మీ యిష్టం మీరే ఎంచితీయండి! బిల్లు యిచ్చేస్తాను ! అని వూరుకున్నాడు.
ఆ తర్వాత ఆయనని చూడాలి! ఆయన బేరం చేయడం ఆశ్చర్యం వేస్తుంది! ఈ నవ నాగరికులకి నవ్వు వస్తుంది! ... ఆ బట్టలు అటూ యిటూ త్రిప్పేడు. ఓల్డు స్టాకు అన్నాడు! ఏ వే వో లోపాలున్నా యన్నాడు! గట్టిగా ఆరిచేడు! మీ రెంతంటే అంతేనా? అలాగంటే ఎలాగన్నాడు? ఒకటి రెండుసార్లు వీధి గుమ్మం వరకూ వెళ్ళిపోతున్నట్టు నటించి, మళ్ళీ వచ్చాడు. అలా ఎన్నోవిధాల బేరం ఆడి ఆఖరికి నూట యిరవై రూపాయిలకి సెటిల్ చేశాడు! ఆశ్చర్యం, ఆ దుకాణదారు మహామహులకే తగ్గించడం అలవాటు లేనివాడు- అంతకే ఒప్పుగున్నాడు?
బిల్లు చెల్లిస్తూ గిరి అనుకోకుండానే అబ్బ! అన్నాడు! పాపం? కళ్ళు జిగేలు మని వుంటాయి! దాసుగారు అది విని- "ఫరవాలేదు లేవోయ్! ఏడాది కోసారి! అన్నట్టు యింకా నీకు బట్టలు తీసుకొనే లేదు! మంచి సూటింగ్ ఏదయినా తీస్తావా?" అని అడిగాడు.
ఇక్కడి కయిన తిరుక్షవరం చాలదన్నట్టు యింక గిరి దగ్గర మిగిలింది పాతికో ముఫ్ఫైయ్యో? నెల్లాళ్ళూ గడవాలి! అంచేత.
"మరోసారి తీసుకుంటాలెండి?" అని నసిగే సేడు - ఎంచేతో అతనూ సరే అని వూరుకున్నాడు! ఎలాగయితేనేం - ఆ తండ్రి కూతుళ్ళు నవ్వుతూనూ, గిరి లోలోన ఏడుస్తూ యివతల పడ్డారు!
ఏ రిక్షానో చేయించుకుని ఈ ఆడసామాను యింట్లో ఓ మూలపడేసి తీరిగ్గా ఏడుద్దామని అనుకున్నాడు గిరి రిక్షాకోసం చూస్తూంటే దాసుగారు వద్దన్నారు?
"నడిచే పోదాం? సాయంత్రం కదా!" అని నడవడం మొదలెట్టారు. అలా వూరికనే నడుస్తాడా? ప్రారంభించాడు-
"గిరీ? ఈ కాలపువాళ్ళకు బేరం అడ్డం అంటే ఎందుకంత చిన్నతనమో తెలియదు! చూడూ నువ్వు వాడు చెప్పినంతా యివ్వడానికి సిద్ధమయ్యేవు! కాస్త బేరం ఆడేసరికి వాడేమో ఎంత తగ్గించి యిచ్చాడు? అటువంటప్పుడు బేరం ఆడ్డంలో నష్టమేముంది?
నీలాటివాళ్ళు ఎక్కువ అవబట్టే యివాళ గానంచాలు అమ్ముకున్నవాడు- రేపు ఉదయాని కల్లా పెద్ద క్లాత్ ఎంపోరియం పెట్టేస్తున్నాడు! బేరం ఆడితే అనాగరికత అనుకుంటున్నారు గాని బేరం లేనిదే ఎకానమీ లేదు!.... పల్లెటూర్లలో చార్జర్ ఎకానమీ దగ్గర్నుండి- పెద్ద పెద్ద దేశాలమధ్య అంతర్జాతీయ వ్యవహారాలు కూడా బేరం లేకుండా సాగటం లేదు!
పెద్ద పెద్ద సంస్థలుకూడా టెండర్లు ప్రకటించి ఎవరు తక్కువకి చేస్తే వారిచేత చేయించుకోడం బేరం కాదా? - ప్రపంచంలో దేశాల మధ్య, ఎగుమతి దిగుమతులకూ బేరాలు లేందే జరుగుతున్నాయా? అలాంటిది మనలాటివాళ్ళ కేమొచ్చింది. అందులోనూ మనదేశంలో మొదటినుండీ బేరం లేనిదే వ్యాపారం లేదు, నువ్వు బేరం చేసినా చేయకపోయినా - తాను తగ్గించవలసినది ముందుగానే నెలకు కలిసి వ్యాపారస్తుడు చెబుతాడు.
మరో విషయం, బేరం లేనిదే కాంపిటీషన్ తగ్గిపోతుంది. వస్తువ ధరలు పెరిగిపోతాయి. ఎవరిష్ట మొచ్చినట్టు వారు హెచ్చించి చెబుతారు ఇంక బ్రతకగలమా? నీ లాటి వాళ్ళ దగ్గిర కొందరి దగ్గర డబ్బుంటే ఎంతయినా యిచ్చి కొనేస్తారు గాని - బీదవాళ్ళగతి ఏం కావాలి. ఇది కూడా మనం ఆలోచించాలంటావా? అక్కర్లేదా" అని ప్రశ్నించారు దాసుగారు.
గిరిజ అప్పుడప్పుడు గిరి వయిపు చూస్తూ వయ్యారంగా నడుస్తూంది. చిన్నపిల్లాడికి మల్లే అతను చెబుతున్నవి వింటూ నడుస్తూంటే ఆమె కేదో నిర్లక్ష్యంలా వుంది!- అంత బేరం ఆడిన దాసుగారూ నూట యిరవై రూపాయలకు తాత గారి సొమ్ములా ఖర్చుపెట్టించేశాడు. ఆఖరికి గిరికి బట్టలూ లేవు గిట్టలూ లేవు!
ఆ పేకెట్ పట్టుగొని గిరి తిన్నగా ఇంట్లోకి వెళ్ళేడు. అవన్నీ ఏం చేయడమో బోధపడలేదు. అక్కలూ చెల్లెళ్ళూ వున్నారా అంటే - లేరు - పోని. అమ్మ....ఏనాడో రంగుచీరలు కట్టుకునే భాగ్యం పోగొట్టుగుంది!.... మూలా నక్షత్రం బున తండ్రి,గండంబున పుట్టినవాడయ్యే? యింక ఎవరికిస్తే ఎవరూరుకుంటారు? ఆ విధంగా ఆలోచించగా ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది, పెట్లో అడుగున అట్టిపెట్టి, పెళ్ళీ గిళ్ళీ ఎప్పుడయిన అయితే గియితే కాబోయే భార్యా మణికే యివ్వవచ్చు అనుకుని, నిర్ధారణ చేసుకున్నాడు.
6
గిరి సంగతి జనం విడిచి లోటల్లో పడినట్టయింది. ఒకందుకని వస్తే లేనిపోని లంపటాలూ పిడకల వేటలూ పట్టుగున్నాయి! ప్రతి మిషం ఏం విషమిస్తుందో నన్న భయం కూడా పట్టుకుంది - యింత వరకూ వచ్చాక తప్పిం చుకుందామన్నా తప్పలేని స్థితికి వచ్చింది.
ఇన్నాళ్ళయింది! ఇంత నాటకం జరిగిపోతూంది. పోనీ ముచ్చటకయినా ఆ గిరిజతో మూడు ముక్కలు మాట్లాడిన పాపాన్ని పోలేదు! యిహ ముందు మాత్రం ఏం ఆశ మిగిలింది?- ఎన్నెన్నో సంఘటనలు చుట్టూ అల్లుకుపోతున్నాయి. ఈ పద్మవ్యూహంలో చిక్కుకుని గిరి నలిగిపోతున్నాడు!
ఒక నాడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో - దాసు గారింట్లోచాలా సందడిగా వుంది. ఒకళ్ళ మాట ఒకళ్ళకి బోధపడకుండా స్త్రీల గొంతుకలు వినబడుతున్నాయి. "యివాళ వీళ్ళింటో ఏమిటా?" అని అనుకుంటూ గిరి యివతలకు వచ్చి- దాసుగారి కడపారపు అమ్మాయిని ఎనిమిదేళ్ళ పిల్లని పిలిచి - "ఏమిటి సంగతి" అని అడిగేడు.
"వీధిలో వాళ్ళందరూ పేరంటానికి వచ్చారు. మీ యింటికి వస్తారుట!" అని చెప్పి తుర్రుమంది.
గిరి గుండెల్లో పర్వతాలు బద్దలవడం మొదలెట్టాయి - యిప్పుడేం చేయడానికీ, ఎలా తప్పుకుందికీ దారి కనపడ్డం లేదు - ఈ ఆడ మళయాళం అంతా పడతారు కామోసు !........ఇంట్లో ఎవళ్ళున్నారు? ఏదీ నీ భార్యా? అంటే ఏం చెబితే నమ్ముతారు ? తాళం వేసుకు ఎక్కడి కయినా పోతే ! వచ్చిన తర్వాత ఏం చెప్పడం లేక వచ్చేవరకు గుమ్మంలోనే కూర్చుంటారేమో-ఎక్కడి కయినా పంపించానని చెబితే అసలు నమ్మరు! యిహ దీనితో సరి, యిది ఆఖరి ఘట్టం , తప్పదు - ఏమొచ్చినా భరించాలి! అని రాబోయే విపత్తును ఆలోచించుకుంటూ తలుపులు బిడాయించి, బెంగతో ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకయినా మంచిదని హరి నామస్మరణ కూడా చేస్తూ .....
ఏ నిమిషాన్ని వీధి తలుపు పిలుస్తారో అని అనుకున్నంతలోనే తలుపు తట్టిన శబ్దం అయింది-
గుండె చేత్తో పట్టుకుని తలుపు తీశాడు! ఆశ్చర్యం! ఎదురుగుండా కమల నిలబడివుంది!
"మా అన్నయ్య ఈ ఉత్తరంయిమ్మన్నాడు. మిమ్మల్నో కసారి ఇంటికి రమ్మన్నాడు!" అంది.
కమల ఎవరో కాదు! మణి చెల్లెయి- మణితో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎంతో చనువుగా వుంటుంది. ఎప్పుడూ లేనిది ఇలా వచ్చింది!.... అని అనుకుంటూ ఉత్తరం తీసుకుంటుండే సరికి చిన్న అయిడియా తట్టింది గిరికి.
కాని తన స్నేహితుడు. మణి చెల్లెలు తోనా? అని అనుకునే సరికి భయం, వణుకూ పట్టుకుంది, కాని - తను చిక్కుకున్న పరిస్థితుల్లో ఏం జరిగినా తప్పదు ....
